లిబియాలో పశ్చిమ ప్రాంతంలో తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న ఏకైక పట్టణం మిస్రాటాలో నాటో విమానాలు గడ్డాఫీ బలగాలపై దాడులు కొనసాగుతున్నాయి. అయితే గడ్డాఫీ బలగాలు అనుసరిస్తున్న గెరిల్లా ఎత్తుగడల వలన నాటో వైమానిక దాడులు పెద్దగా ఫలితాలను సాధించలేక పోతున్నాయి. కాల్పులు జరిపి చెట్ల కిందో, భవనాల మధ్యనో దాక్కుంటూ గడ్దాఫీ బలగాల ట్యాంకులు తదితర యుద్ద ఆయుధాలు పని చేస్తుండడంతో వాటిపై బాంబు దాడులు చేసి నాశనం చేయడం నాటో దళాలకు కష్ట సాధ్యంగా మారింది.
దానితో నాటో యుద్ద విమానాలు మళ్ళీ మళ్ళీ బాంబింగ్ జరిపినా గడ్డాఫీ బలగాలకు నష్టం చేయలేక పొతున్నారననీ, మిస్రాటా నగరం నుండి గడ్డాఫీ బలగాలను వెళ్లగొట్టలేక పోతున్నారనీ రాయిటర్స్ విశ్లేషించింది. అయితే నగర కేంద్రాన్ని పది రోజుల క్రితం గడ్డాఫీ బలగాలు తిరుగుబాటు బలగాలకు వదిలేశాయి. నగరం బైట ప్రభుత్వ బలగాలు కేంద్రీకరించాయి. అక్కడి నుండి మిస్రాటా పోర్టును వశం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మిస్రాటాలొ పౌరులపైన గడ్డాఫీ బలగాలు దాడులు చేస్తున్నాయని చెపడం మాత్రం నాటో మరిచిపోవడం లేదు.
ఇక్కడ ఒక కిటుకు ఉంది. తిరుగుబాటు బలగాలుగా చెబుతున్నవారు వాలంటరీగా వచ్చీన యువకులని వార్తా సంస్ధలు చెబుతున్నాయి. వీరికి పెద్దగా యుద్ద విద్యలు తెలియవనీ చెబుతున్నారు. ప్రభుత్వ దళాలనుండి తిరుగుబాటువైపుకి దూకారని చెప్పినా, వారు బ్యారక్ ల వరకే పరిమితమయ్యారనీ చెప్పాయి. అంటే చాలా వరకు ఉత్సహవంతులైన యువకులను గడ్డాఫీ తెగకు వ్యతిరేకంగా తూర్పు ప్రాంతంలొ ఉండే తెగలనుంది సేకరించిన యువకులే. వీరు అటు బలగాలుగా చెప్పవచ్చు. ఇటు పౌరులుగానూ పేర్కొనవచ్చు. గడ్డాఫీ బలగాలు చంపితే పౌరుల్ని చంపారని చెప్పొచ్చు. గడ్డాఫీ బలగాలను వెనక్కి నెడితే తిరుగుబాటు బలగాలు ముందడుగు వేశాయని చెప్పవచ్చు. ఇది నాటో బలగాలకు బాగా ఉపయోగపడుతున్న అంశం.
గడ్డాఫీ బలగాలు మిస్రాటాలో ఉన్న ప్రాంతాలగురించి చెబుతూ నాటో సీనియర్ మిలట్రీ అధికారి అడ్మిరల్ గ్యాంపవోలో డి పౌలా “అక్కడ ఇళ్ళు ఉన్నాయి. మిస్రాటా డౌన్ టౌన్ అంత జనాభా సాంద్రత లేదు కానీ అదీ నగరమే” అని చెప్పాడు. అందువలన బాంబింగ్ జరపలేమని ఆయన చెప్పాడు. అందువలన కాల్పులు జరిపి దాక్కొవడం లాంటి ఎత్తుగడలు పాటిస్తున్నారు. ఈ వారం ప్రారంభంలో ఒక సారి నాటో రెండు రోజులు వరసగా బాంబింగ్ జరిపి విశ్రాంతి ఇవ్వగా, ఆ సమయంలో గడ్డాఫీ బలగాలు ఫిరంగులు పేల్చారట. వాటివలన ఆఫ్రికా వలస కార్మికులను ఖాళీ చేయడానికి లంగరు వేసిన నౌక కొంత ధ్వంసం అయిందని నాటో చెప్పింది. ఐదుగురు పౌరులు చనిపోయారని తిరుగుబాటు బలగాలు చెప్పాయని రాయిటర్స్ తెలిపింది. వందల మంది పోర్టులో చిక్కుకుపోయారని ఆ సంస్ధ తెలిపింది.
లిబియాలో జరుగుతున్నది యుద్దం. యుద్దంలో ప్రభుత్వ బలగాల మీద రెండు రోజులు వరసగా నాటో విమానాలు బాంబులు వేశాయి. వారిని నాశనం చేశామని భావించి, వలస కార్మికుల రవాణాకి విరామం ఇచ్చాయి. అయితే పోర్టులో ఏం జరుగుతున్నదీ తెలిసే అవకాశం గడ్డాఫీ బలగాలకు లేదు. అవి యుద్దంలో ఉన్నందున తమకు అవకాశం దొరికినపుడు తిరుగుబాటు బలగాలపై ప్రభుత్వ బలగాలు ఫిరంగి గుళ్ళ వర్షం కురిపిస్తాయి. అవి ఆఫ్రికా వర్కర్లను తీసుకెళ్ళడానికి సిద్దంగా ఉన్న నౌకను ద్వంసం చేశాయి. ఐదుగురు పౌరులు చనిపోయారు. అనె చెప్పగానే, గడ్డాఫీ బలగాలు పౌరులను కాల్చి చంపాయని చెప్పడానికి ఆస్కారం దొరుకుతుంది. నిజానికి ఆఐదుగురు పౌరులు చనిపోయిన విషయం తిరుగుబాటు బలగాలు చెప్పడమే తప్ప ఆ వార్తను ధృవ పర్చుకునే సౌకర్యం లేదని వార్తా సంస్ధలే రోజూ రాస్తున్నాయి.
శనివారం ప్రభుత్వ బలగాల దాడిలో నాలుగు ఇంధన ట్యాంకులు ధ్వంసం ఐనట్లు తిరుగుబాటు బలగాలు తెలిపాయి. దానివలన మిస్రాటా పౌరులకు ఇంధన కొరత ఏర్పడిందనీ వారే చెప్పారు. మిస్రాటాలో ని తిరుగుబాటుదారుల ప్రతినిధి “నాటో దళాలు శ్రమిస్తున్నాయి. ప్రభుత్వ బలగాలు కూడా శ్రమిస్తున్నాయి” అని చెప్పాడని రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. ప్రభుత్వ బలగాలు కదులుతున్నప్పుడే నాటో వారిని ఎక్కువ మందిని చంపగలిగింది. స్ధిరంగా ఉన్నపుడు ఏమీ చేయలేకపోతున్నాయని రెబెల్స్ తెలిపారు. నాటో నాశనం చేసిన కొద్ది సేపటికే వేరే ట్యాంకు వస్తోందని వారు తెలిపారు. లిబియా దాడులు కొసావొ దాడులను గుర్తుకు తెస్తున్నాయని నాటో అధికారులు అభిప్రాయపడుతున్నారు.