లాడెన్ పాకిస్ధాన్లోని తన స్ధావరంలో ఉండగా తీసిన వీడియో అని చెబుతూ 66 సెకన్ల వీడియో ని అమెరికా ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 66 సెకన్ల నిడివిలో లాడెన్గా చెప్పబడుతున్న వ్యక్తి కనిపీంచేది 12 సెకన్లు మాత్రమే. మిగిలిన భాగమంతా పాత వీడియోల అతుకులు. మంచం మీద కూర్చున్నట్లు కనిపిస్తున్న లాడెన్ వీపు ఒక పక్కనుండి కనిపిస్తోంది. మొఖంలో సగం కంటే తక్కువ భాగం కనిపిస్తోంది.లాడెన్ అని గుర్తించడానికి అనువుగా వీడియో లేదు. లాడెన్ అని చెబుతున్నారు గనక అది లాడెన్ అని మనం అర్ధం చేసుకోవాలి. అంతే తప్ప వీడియో చూడగానే లాడెనే అని నమ్మకం కలగడం లేదు (ఈ బ్లాగర్ కంటికి మాత్రమె. ఇతరులకు దృష్టి బాగుంటే పూర్తిగా కనపడవచ్చు. దృష్టి నాకంటే మందగిస్తే అసలు కనపడకపోవచ్చు. కొంత అస్పష్టత ఉంది).
రాయిటర్స్ వార్తా సంస్ధ ఈ వీడియోను తన వెబ్ సైట్ లో ఉంచిది. వీడియో లింక్ ఇది:
http://in.reuters.com/news/video/story?videoId=207441657&videoChannel=101