లాడెన్ ఇంటిలో రక్తపు మడుగులో ముగ్గురు నిరాయుధుల శవాలు, ఫోటోలు సంపాదించిన రాయిటర్స్


ఒసామా బిన్ లాడెన్‌ స్ధావరంగా చెప్పబడుతున్న ఇంటిలో రక్తపు మడుగులో పడి ఉన్న ముగ్గురు యువకుల శవాల ఫోటోలను రాయిటర్స్ వార్తా సంస్ధ సంపాదించింది. వీరి వద్ద ఎటువంటి ఆయుధాలు లేవని రాయిటర్స్ సంస్ధ తెలిపింది. అమెరికా కమేండోలు దాడి చేసి వెళ్ళిన గంట తర్వాత ఈ ఫోటోలు తీశారని ఆ సంస్ధ తెలిపింది. పాకిస్ధాన్ భద్రతా అధికారి ఒకరు ఒసామా స్ధావరంగా చెబుతున్న ఇంటిలోకి అమెరికన్ కమెండోలు వెళ్ళిన గంట తర్వాత వెళ్ళి తీసిన ఫోటోలను తమకు అమ్మాడని రాయిటర్స్ తెలిపింది. ముగ్గురు యువకులను కూడా కాల్చి చంపిన విషయం అమెరికా అధ్యక్షుడు ఒబామా గానీ, అధికారులుగానీ వెల్లడించకపోవడం గమనార్హం.

ముగ్గురిలో ఎవరూ బిన్ లాడెన్‌లా లేరు. ముగ్గురు యువకుల శవాలు భీతావహంగా పడి ఉండటాన్ని కింది ఫోటోల్లో చూడవచ్చు. లాడెన్ శవానికి సంబంధించిన ఫోటోలు విడుదల చేస్తే అమెరికా జాతీయ భద్రతకు భంగకరంగా పరిణమించవచ్చని ఒబామా పేర్కొన్న సంగతి విదితమే. లాడెన్ శవానికి సంబంధించీన్ ఫోటోలు చూస్తే టెర్రరిస్టు సంస్ధలు మరిన్ని ప్రతీకార చర్యలకు దిగవచ్చని ఒబామా ప్రభుత్వం భావిస్తోంది. ఫోటోల్లో అవి తీసిన సమయం నమోదై ఉండటంతో అమెరికా కమెండోలు కాంపౌండ్‌ని విడిచి వెళ్ళిన గంట తర్వాత తీసిన ఫోటోలుగా రాయిటర్స్ సంస్ధ గుర్తించింది. కాంపౌండ్‌తో ఫోటోలను సరిపోల్చిన రాయిటర్స్ అవి నిజమైనవేనని నిర్ధారించింది.

ఫోటోల మేటా డేటాలో నమోదైన వివరాలు, అవి తీయబడ్డ సమయంతో సరిపోయాయని రాయిటర్స్ తెలిపింది. ఒక యువకుడి శవం కింద కంప్యూటర్ కేబుల్‌తో పాటు పిల్లలు ఆడుకునే వాటర్ పిస్టల్ (ఆకుపచ్చ, ఆరెంజ్ రంగుల్లో) ఉందని తెలిపింది. మరొక యువకుడి ముక్కునుండి రక్తం కారిందని ఛాతీపై ధారాళంగా రక్తం వెలువడి ఉందనీ తెలిపింది. మూడో వ్యక్తి టీషర్ట్ వేసుకుని ఉన్నాడని తలకి తగిలిన గాయంనుండి కారినట్లుగా తలకింద అధికంగా రక్తం కారి ఉందని తెలిపింది. ఇద్దరు యువకులు పాకిస్ధాన్ సాంప్రదాయ దుస్తులు ధరించి ఉన్నారని తెలిపింది.

One thought on “లాడెన్ ఇంటిలో రక్తపు మడుగులో ముగ్గురు నిరాయుధుల శవాలు, ఫోటోలు సంపాదించిన రాయిటర్స్

  1. samrajya vadulu swathatrya veerulanu chusi vanakadam mamule kada ? nadu bhagath singh nu kuda vri teesi mukkalaga nariki satlage nadi lo vasaru….nedu osama bin laden nu kuda donga chatuga champi arebiya samudram lo vesaru….bhagath ki na joharlu……

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s