అమెరికా అబద్ధాలకు నిలువెత్తు సాక్ష్యాలు: జెస్సికా లించ్, పేట్ టిల్‌మేన్, లిండా నార్గ్రోవ్


ఒసామా బిన్ లాడెన్ హత్య విషయంలో పొంతనలేని కధనాలు చెబుతున్న అమెరికాకి అబద్ధాలు చెప్పడం కొత్త కాదు. ఇరాక్‌పై దాడి చేయడానికి కారణంగా ఆ దేశంలో సామూహిక విధ్వంసక మారణాయుధాలు ఉన్నాయనీ, వాటి వలన అమెరికా భద్రతకు ముప్పు అనీ అబద్ధాలు చెప్పింది. దానితో పాటు ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌కీ, ఒసామా బిన్ లాడెన్‌కీ సంబంధాలున్నాయని పచ్చి అబద్ధాన్ని ప్రచారం చేసింది. కానీ లాడెన్‌ను చంపానని చెప్పిన తర్వాత అమెరికా అధ్యక్షుడు గానీ, అధికారులు గానీ అతనితో సంబంధం ఉందని చెప్పిన సద్దాం హుస్సేన్ గురించి ఒక్క మాటా మాట్లాడ లేదు. ఇరాన్‌పై యుద్ధం చేయడానికి సద్దాం హుస్సేన్‌కి తానే మారణాయుధాలను సమకూర్చిన సంగతిని నిస్సిగ్గుగా మరిచినట్లు నటించింది.

ఏ లాడెన్‌నైతే పట్టుకోవాలని ఆఫ్ఘనిస్ధాన్‌పై అమెరికా దాడి చేసిందో ఆ లాడెన్‌ని పెంచి పోషించి టెర్రరిజం కోరలు తొడిగింది అమెరికాయే అన్న సంగతిని లాడెన్‌ హత్య పట్ల సంబరాలు జరుపుకుంటున్నవారు సానుకూలంగా మరిచిపోతున్నారు. లేదా మరిచినట్లు నటిస్తున్నారు. లాడెన్‌పై ఉన్న నేరాన్ని నిరూపించి శిక్ష వేయమంటుంటే అంత క్రూరుడిపై విచారణా అని ప్రశ్నిస్తున్నారే గానీ, టవర్లపై దాడి తాను చేయలేదని లాడెన్ ప్రకటించిన సంగతిని ఎత్తి చూపుతున్నా పట్టించుకునే పరిస్ధితిలో లేరు. అనేక అనాగరిక, నాగరిక దశలను దాటి ప్రజాస్వామ్య దశకు చేరిన సమాజంలో నేర నిరూపణ జరగకుండా శిక్షలు వేయడానికి అనుమతి ఇస్తే అంతిమంగా అది ప్రజల ప్రజాస్వామిక హక్కులనే హరించడానికే దారి తీస్తుందన్న విషయాన్ని విస్మరిస్తున్నారు. ఓ పక్క లిబియా పౌరులను రక్షించడానికే లిబియాపై దాడులని చెబుతున్న నాటో దాడుల్లో లిబియా పౌరులే చనిపోతుంటే కనీసం క్షమాపణ చెప్పడానికి కూడా నిరాకరిస్తున్న నాటో దళాల అనాగరిక న్యాయాన్ని మౌనంగా ఆమోదిస్తున్నారు.

కండ బలం గల దేశాల అనాగరిక చర్యలకు మౌనంగా ఇస్తున్న ఆమోదంతో అమెరికా లాంటి దేశాలు అరాచకాలు చేస్తూ వాటిని దుష్ప్రచారాలతో కప్పిపెడుతున్న దానికి రుజువుగా అనేక సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. వాటిలో జెస్సికా లించ్, పాట్ టిల్‌మేన్, లిండా నార్గోవ్ లు కేవలం మూడు ఉదాహరణలు మాత్రమే. కార్పొరేట్ పత్రికలు తప్పుడు కధనాలతో దురాక్రమణ యుద్ధాలకు మద్దతు కూడగట్టానికి ఎలా కృషి చేసిందీ అనేక మంది వెల్లడించారు. కొన్ని అబద్ధాలను కార్పొరేట్ పత్రికలే అనివార్యంగా సవరించుకున్నాయి.

jessica lynch

జెస్సికా లించ్ ఇప్పుడో సెలబ్రిటీ

జెస్సికా లించ్

ఈమె పశ్చిమ వర్జీనియాలోని 19 సంవత్సరాల యువతి. అర్మీ క్లర్కుగా ఇరాక్ దురాక్రమణ యుద్ధంలో పని చేసింది. అమెరికా ప్రభుత్వం తొలుత వినిపించిన కధనం ప్రకారం ఈమె పనిచేస్తున్న ఆర్మీ కంపెనీ 2003, మార్చి నెలలో నసీరియా వద్ద తీవ్ర స్ధాయిలో దాడికి గురయ్యింది. తీవ్ర స్ధాయిలో గాయపడినప్పటికీ జెస్సికా తన తుపాకిలో మందుగుండు పూర్తిగా వినియోగం అయ్యే వరకూ ట్రిగ్గర్‌పై నుండి వేలు తీయలేదు. మందుగుండు నిండుకోవడంతోటే జెస్సికా ధైర్య సాహసాలు ముగియలేదు. స్ధానిక ఆసుపత్రిలోని సిబ్బంది చేతుల్లో ఆమె హింసాత్మక విచారణను ఎదుర్కొంది. వారి దుర్మార్గ చేష్టలకు ఎదురొడ్డి నిలిచింది. అమెరికా ప్రత్యేక దళాలు ఆసుపత్రిపై దాడి చేసి తీవ్రంగా పోరాడి అమెను రక్షించేదాక ఆమే ఇరాకీయుల చేతుల్లో చిత్రహింసలను ఎదుర్కొని నిలిచింది. ఇది అమెరికా ప్రభుత్వం, పత్రికలు ప్రచారంలో పెట్టిన కధనం.

ఈ కధనంలో ఉన్న ఒకే ఒక సమస్య ఏంటంటే అది పూర్తిగా అబద్ధం. నిజానికి జెస్సికా తుపాకి జామ్ అవడం వలన ఆమె ఒక్క గుండు కూడా పేల్చలేక పోయింది. ఇరాకీ ఆసుపత్రి సిబ్బంది ఆమెను చాలా దయతో ట్రీట్‌మెంట్ ఇచ్చారు. జెస్సికాను అమెరికా బలగాలకు తిరిగి అప్పగించడానికి వారు ప్రయత్నించారు. అమెరికా బలగాల దాడికి ముందే ఆ ప్రాంతం నుండి ఇరాక్ సైన్యం వెళ్ళిపోవడం వలన అమెరికా ప్రత్యేక దళాలైన అర్మీ రేంజర్లు, నేవీ సీల్సు దాడి చేయాల్సిన అవసరమే తలెత్తలేదు. మొదటి నివేదికలు చెప్పినట్లు ఆమె కాల్పులకుగానీ, కత్తిపోట్లకు గానీ గురికాలేదు. అమెను తీసుకెళుతున్న ట్రక్కు మరో వాహనంతో ఢీకొట్టి బోల్తా పడడం వలన ఆమెకు గాయాలయ్యాయి.

ఈ కధలో హైలైట్ అమెరికా చెప్పిన రెస్క్యూ ఆపరేషన్. దీన్ని చిత్రీకరించారు కూడా. డాక్టరు మాటల్లో చెప్పాలంటే “అది ఓ హాలీవుడ్ సినిమాలాగే ఉంది. సైనికులు ‘గో… గో… గో’ అని అరుస్తూ ఉంటారు. తుపాకులు, బ్లాంకుల (గన్ పౌడర్ ఉంటుంది గానీ గుండు ఉండదు) మోత, పేలుళ్ళ శబ్దాలు మారు మోగుతుంటాయి. ఎగురుతూ, గెంతుతూ, అరుస్తూ, తలుపుల మీద దబ దబా బాదుతూ వారు ఒక సిల్వెస్టర్ స్టాలిన్ సినిమానీ, ఒక జాకీ ఛాన్ సినిమాని తలపించే విధంగా గొప్ప ప్రదర్శన ఇచ్చారు”

నాలుగు సంవత్సరాల తర్వాత జెస్సికా లించ్ కాంగ్రెషనల్ కమిటీ ముందు సాక్ష్యం ఇచ్చింది. “ఆ రోజు నాతోటి సైనికులకు ఖ్యాతి దక్కాల్సి ఉంది. వాళ్ళను వదిలేసి నన్ను లెజెండ్ గా చేస్తూ ఎందుకు చెప్పారో నాకు ఇప్పటికీ అయోమయంగా ఉంది. … ఇందులో ముఖ్యాంశం (బాటమ్‌ లైన్) ఏంటంటే అమెరికా ప్రజలు తమకు ఆదర్శమైన హీరోలను ఎంపిక చేసుకోవడంలొ సమర్ధులే. వాళ్ళకి వివరణాత్మక కధలేవీ వినిపించనవసరం లేదు” అని జెస్సికా లించ్ కమీటీ ముందు చెప్పింది.

pat_tillman

పేట్ టిల్‌మేన్ త్యాగం వృధా

పేట్ టిల్‌మేన్

సెప్టెంబర్ 11 దాడులతో కదిలిపోయిన టిల్‌మేన్ విపరీతమైన ఖ్యాతీ, డబ్బూ ఆర్జించి పెట్టే అమెరికన్ ఫుట్‌బాల్ కెరీర్‌ను వదిలేసి అమెరికా ఆర్మీలో చేరడానికి పేరిచ్చాడు. టిల్‌మెన్ తీసుకున్న స్వార్ధ రహిత నిర్ణయాన్ని అధ్యక్షుడు బుష్ కీర్తించాడు. 2004 సంవత్సరం ఏప్రిల్‌లో ఆఫ్ఘనిస్ధాన్ దురాక్రమణ యుద్ధంలో టిల్‌మేన్ చనిపోయాక అమెరికన్ హీరోయిజానికి అతను ఒక సంకేతంగా మారిపోయాడు. అమెరికా సైనిక విభాగం అతన్ని యుద్ధ హీరో గా ప్రకటించి మరణానంతరం సిల్వర్ స్టార్‌నూ, పర్పుల్ హార్ట్‌నూ బహుకరించింది. వినాశకరమైన శతృవు కాల్పుల్లో టిల్‌మేన్ అసువులు బాసాడని మొదట చెప్పారు. వాస్తవంలో అతను అమెరికా సైనికుల సైనికుల కాల్పుల్లో చనిపోయాడని తర్వాత తేలింది. అతని స్మృత్యర్ధం నేషనల్ టెలివిజన్‌లో ఓ కార్యక్రమం ప్రసారం అయ్యే వరకూ అతని తల్లిదండ్రులకు నిజం చెప్పలేదు.

టిల్‌మెన్ చనిపోయిన రెండు సంవత్సరాలకు అతని బయోగ్రఫీ ప్రచురితమైంది. అమెరికా అధ్యక్షుడు బుష్‌ను కౌబాయ్‌గా టిల్‌మెన్ పరిగణించినట్లు బయోగ్రఫీలో రాశారు. ఇరాక్‌లో చట్ట విరుద్ధమైన, అన్యాయమైన యుద్ధానికి దేశాన్ని బుష్ నడిపించాడని టిల్‌మెన్ అభిప్రాయపడిన సంగతిని రాశారు. జెస్సికా లించ్‌ను రక్షించడంపై వెలువడిన కధనం కేవలం మీడియా ప్రచార హోరు మాత్రమేనని తన డైరీలో రాసుకున్న విషయాన్ని బయోగ్రఫీలో పొందుపరిచారు. అప్పటికింకా జెస్సికా కాంగ్రెస్ కమిటీ ముందు సాక్ష్యం ఇవ్వలేదు. అంతకుముందే జెస్సికా లించ్ విషయంలో ప్రచారంలో పెట్టిన కధనాన్ని మీడియా ప్రచారంగా టిల్‌మెన్ అర్ధం చేసుకున్నాడంటే ఆఫ్ఘన్ యుద్ధంలో అతనికి ఎదురైన అనుభవాల నేపధ్యమే అలా అర్ధం చేసుకోడానికి దోహదపడిందన్నది సుస్పష్టమే.

Linda_Norgrove

ఆఫ్ఘన్ నేలపై లిండా

లిండా నార్గ్రోవ్

లాడెన్‌ను చంపామని చేప్పేవరకూ లిండా నార్గ్రోవ్ ఉదంతం సంచలనాత్మకంగా నిలిచిందని చెప్పవచ్చు. ఓ ఎన్జీవో సంస్ధలో సహాయ కార్యక్రమాల వర్కర్‌గా పని చేసిన లిండా బ్రిటన్ దేశస్ధురాలు. గత సంవత్సరం అక్టోబరులో ఆఫ్ఘనిస్ధాన్‌లో ఈమె మరణం సంభవించింది. కిడ్నాప్‌కి గురైన లిండాను రక్షించే ఆపరేషన్‌లో ఆమె ఎలా చనిపోయిందన్న విషయంలో తప్పుడు కధనం వెలువడింది. సీల్ టిం 6 (లాడెన్‌ను చంపామంటున్న సీల్ టీం ఇదే) ను లిండాను రక్షించడానికి తూర్పు ఆఫ్ఘనిస్ధాన్‌కి పంపారు. లిండా రక్షణ తీసుకుంటున్న షెల్టర్ పైన సీల్ టైం సభ్యుడు విసిరిన గ్రేనేడ్ వలన లిండా ప్రమాదవశాత్తూ చనిపోయింది.

అయితే సీల్ టీం 6, జరిగిన పొరబాటును అంగీకరించడానికి బదులు ఒక ఆఫ్ఘన్ మిలిటెంటు ఆత్మాహుతి బాంబుగా తనను తాను పేల్చుకోవడం వలన లిండా మృతి చెందిందని మొదట కధ చెప్పారు. అయితే అ తర్వాత సీల్ టీం కమేండింగ్ ఆఫీసర్ తమ దాడిని సమీక్షిస్తూ సర్వైవలెన్సు వీడియోను చూస్తుండగా అసలు విషయం వెల్లడయ్యింది. సీల్స్ సభ్యుడొకరు ఏదో ఒక వస్తువును నార్గోవ్ ఉన్న వైపుకు విసిరాక ఆమె ఉన్న స్ధానంలో పేలుడు సంభవించడాన్ని కమేండర్ గమనించాడు. అప్పుడు మాత్రమే గ్రెనేడ్ పేలుడులో లిండా చనిపోయిన విషయాన్ని బ్రిటన్‌కి తెలియజేశారు. ఈ విషయం ప్రముఖంగా అన్ని వార్తా సంస్ధలూ ప్రకటించాయి. లిండా రక్షణలో విఫలమైన సిల్స్ టిం సభ్యులపై క్రమశిక్షణా చర్య తీసుకున్నట్లు జేమ్స్ పెట్రాస్ ప్రకటించాడు. లిండా మరణంపై బాధ్యుల నిర్ధారణకు ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నది.

లిండా మరణం విషయంలో అబద్ధం చెప్పిన సీల్స్ టీం 6 నే లాడెన్‌ హత్యకు వినియోగించారు. ఆ టీం ఇప్పుడు లాడెన్‌ను చంపామనీ, అరేబియా సముద్రంలో పాతిపెట్టామనీ చెబుతున్నది. అమెరికా కమేండోల దాడిలో లాడెన్ చనిపోవడం వాస్తవం కానట్లయితే వాస్తవం ఏమిటో ఎప్పటికైనా వెల్లడి కాక తప్పదు. అమెరికా ప్రజాస్వామిక వ్యవస్ధల స్ధాపనకు కంకణం కట్టుకున్న మాట పచ్చి అబద్ధమని ప్రపంచ వ్యాపితంగా ఉన్న నియంతలతో అది చేసే చెలిమి రుజువు చేస్తుంది. ఇండోనేషియా, పాకిస్ధాన్, చిలీ, ఈజిప్టు, ఉగాండా, ట్యునీషియా, పనామా లాంటి అనేక దేశాల్లో నియంతలకు అమెరికా అండగా నిలిచింది. ప్రజాస్వామిక ప్రభుత్వాలు తనకు వ్యతిరేకంగా ఉంటే సైనిక కుట్రలతో కూల్చి వేసింది. ఇండియాలాంటి దేశాలపై ఆర్దిక, వ్యాపార, మిలట్రీ ఒత్తిడులు తెచ్చి తనకు అనుకూలమైన విధానాలను అమలు చేయించుకుంటున్నది. అదే సమయంలో తన కార్పొరేట్ వార్తా సంస్ధల సాయంతో అనేక అబద్ధాలను ప్రచారంలోకి తెచ్చి ప్రపంచ ప్రజలందర్నీ మోసం చేస్తోంది. చదువు అందుబాటులో లేనివారికి ఎలాగూ ఈ విషయాలు తెలియవు. కానీ చదువుకున్నవారు, మేధావులుగా చెప్పబడుతున్నవారు సైతం గుడ్డిగా అబద్ద ప్రచారాలని నమ్ముతున్నారు.

“నిజం చెప్పులు తొడిగే లోపే అబద్ధం ఊరంతా చుట్టి వస్తుందన్న” నానుడి ని గుర్తుంచుకుంటే వాస్తవాలను పసిగట్టడం అంత కష్టమేమీ కాదు.

-మే 6 న “ది హిందూ” పత్రికలో వచ్చిన ఆర్టికల్‌కి స్వేచ్ఛానువాదం

38 thoughts on “అమెరికా అబద్ధాలకు నిలువెత్తు సాక్ష్యాలు: జెస్సికా లించ్, పేట్ టిల్‌మేన్, లిండా నార్గ్రోవ్

 1. ఛీ! ఛీ! అమెరికాది ఎంత నీఛమైన స్వభావమో కళ్లకి కట్టినట్టు తెలుస్తున్నా, డాలర్లకి అమ్ముడుబోయిన కొందరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు (అమెరికా డాలర్లకోసం వారి తరపున బూతులు తిట్టే వాళ్ళని అర్ధం కాబోలు!) ఎందుకు ఇలా తెలుగు బ్లాగర్లపైన రాస్తారో అర్ధం కావడం లేదు. బహుశా వీరు తాము ఇండియన్స్ అనీ, తెలుగు వాళ్ళమనీ మర్చి పోయారేమో! రక్త మాంసాలు ఇండియావి, బుర్ర మాత్రం అమెరికా వాడికి తాకట్టు.

 2. $విశేఖర్ గారు

  మీరు రాసిన టపాలన్నీ చదివాను. చాలా చక్కగా, విశేషసమాచారంతో రాస్తున్నారు. ఆదర్శవాదం పేరున కేవలం బాబాలను లేక దానికి సంబంధిన మతాన్ని రచ్చచేస్తూ పుంఖాలుపుంఖాలుగా రాస్తే వస్తే ఉపయోగం నాకు ఏరోజూ బోధపడలేదు. ఎందుకంటే నిజంగా పోరాడ్డానికి మనకు అంతకంటే పెద్దసమస్యలు ఎన్నో ఉన్నాయి. అలాంటి సమస్యలని మీరు ఇక్కడ విశ్లేషించే విధానం బాగుంది. కేవలం దూషణ కాకుండా వాస్తవాలను వివరిస్తూ పొతున్న మీ టపాలు ఆలోచనాత్మక౦గా ఉన్నాయి.

  ఇక టపాలోకి వస్తా 🙂

  నిజమే.. పక్కదేశాల్లో పెజస్వామ్యం అంటూ ఆదేశాల మీద యుద్ధం చేసే అధికారం ఈ పశ్చిమదేశాలకి ఎవరిచ్చారో అర్థం కాలేదు. ఖచ్చితంగా తిన్నదరక్క, ఒళ్ళు కొవ్వెక్కినోడు చేసేపని ఇది. నాకు ఒకటి ఖచ్చితంగా అర్థం అవుతుంది అది డబ్బు మతం కన్నా గొప్పది అని. కరడుగట్టిన ఇస్లామిక్ ఛాందసభావాలకు ఆలవాలమైన పాకిస్తాన్లో అమెరికా సైన్యాలు అడుగుపెట్టనిచ్చింది ఏమిటి?

  నిజమే.. లాడెన్ పెంచింది..పోషించింది..పక్కదేశాల మీదకి (భారత్లో కూడా) ఎగదోసింది ..ఈ అమెరికా యే. ఆనక తన కుతుక మీదికి వచ్చినప్పుడు చంపిందీ అమెరికాయే.. ఇక్కడ లాడెన్, అమెరికా అన్న బేరీజు వేసుకుంటే ఖచ్చితంగా మొదట అమెరికాయే తను చేసిన పాపాలకు శిక్ష అనుభవించాలి. చెప్పాకదా ముందు… డబ్బు కలవాడే ఈ రోజుల్లో రుజువులు సృష్టించగలడు..అనైతిక తీర్పులివ్వగలడు. అదే జరుగుతుంది అమెరికా దాని తోడు కేతిగాళ్ళు పశ్చిమదేశాలు!

  లిబ్యా మీద యుద్ద౦ మొదలైన సమయంలో నాఒళ్ళు గగుర్పొడిచిన వార్త ఒకటి :

  మొన్న 20 ఏళ్ళ బ్రిట్ ఒకడు(మిలిటరీ నుంచి కాదు!) లిబ్యాలో యుద్ద౦ చేయడానికి వెళ్ళేముందు తెగ ఉత్సాహం చూపిస్తుంటే, ఈడి సిగతరగ ఇదంతా దేశాభిమానమే అనుకున్నా! ఆనక అతని గురించి చదివిన వార్త ప్రకారం “తనకి వీడియో గేమ్స్ల లో యుద్ద(వార్) సంబ౦దిన్తమైనవి ఇష్టమని, వాటిని నిజజీవితంలో కూడా ఒకసారి ఆడాలని కోరిక” అని..పిల్లికి చెలగాటం-ఎలుకకి ప్రాణసంకటం అన్న రీతిలో చెప్పాడు. నేను ఔరా ఇలాంటివారు కూడా ఉంటారా అని బాధపడ్డా…! ప్చ్.. చావు క్రీడ అవ్వింది మరి 😦

  చూసారు కదా.. ఆడగలిగిన౦త సేపు మానవప్రాణాలతో ఆట ఒకవేళ చస్తే తమ దేశంలో హీరో కింద ఎలాగూ మిగ్లిపోతారు. ఈ విధంగా ఉంది ఇక్కడ యుద్దంలో చేరే యువత తీరు. అదో రోమాంచిత అనుభవం అంటారు చూడండి అది.!

  …………………………………………..

  పక్క దేశాలకి వెళ్లి సంపాయించుకుని రావడం అనేది మన పూర్వీకుల నుంచి వస్తున్నదే.. మనం ప్రపంచ౦లో ఏ దేశాన్ని, ప్రాంతాన్ని తీసుకున్నా అక్కడి ప్రజలు తమకు వీలైన, అభివృద్ధి చెంది ఆశాజనకంగా ఉన్న మరో ప్రాంతానికి వెళ్లి సంపాయిన్చుకోవడం రివాజు. దీన్ని ఎవరూ తప్పుపట్టకూడదు అనేది నా భావన (అంటే నేనూ అలానే చేస్తున్నా కాబట్టి చెప్పడం లేదు… రేపుదయం నేను భారత్లో ఉన్నా ఇదే చెప్తా 🙂 ) .

  అయితే ఆ దేశంలో సంపాదించుకోవడానికి ఆ దేశం మీద అభిమానం చూపించడానికి మధ్య ఉండాల్సిన సన్నని రేఖ పూర్తిగా మాయమవుతుంది. దీనివల్ల అవసరమైనప్పుడు వ్యతిరేకించాల్సినవారు గుడ్డిగా మద్దతిచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ఇచ్చుకో-పుచ్చుకో అన్న కిరాయివ్యాపార సూత్రం ఆధారంగా నడిచే ఇక్కడ పరాయిదేశం మీద అభిమానం తగినంత రీతిలో ఉండాలి అంటే ఆ దేశవ్యతిరేక గూడుపుటాణీ కి పాల్పడకుండా.. అట్లే ఆ దేశం మీద ఆకారాణ ద్వేషం పెంచకుండా ..

  ఇక్కడ చూడండి: లండన్లో ఉంటూ ఆ దేశం ఇచ్చే డబ్బుల మీద ఆధారపడి జీవిస్తూ అదే దేశాన్ని మట్టుపెడతామనే పైశాచిక హేల!
  http://saapaatusamagatulu.blogspot.com/2011/02/freedom-of-speech-or-freedom-of.html

  మరీ అతిగా కాకుండా, అసలుకి సున్నా కాకుండా ఆ పరాయిదేశం తప్పు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా గర్హించాలి. ఆ ప్రభుత్వానికి మనదైన అభిప్రాయాన్ని తెలియపరచాలీ కూడా అని నా అభిప్రాయం.

 3. రాజేష్ గారూ

  మీ అభిప్రాయాల్ని చక్కగా, వివరంగా రాశారు. ధన్యవాదాలు. పశ్చిమ దేశాల్లో ఉంటున్న తెలుగువారినుండి ఏ తిట్టూ లేకుండా వచ్చిన కామెంట్ బహుశా మీదే మొదటిదనుకుంటా. అందుకే ధన్యవాదాలు.

  మీరన్నట్లు మతం తక్షణ సమస్య కాదు. దానికంటే ముఖ్యమైన సమస్యలు చాలా ఉన్నాయి. అవన్నీ వదిలి మతం, నమ్మకాల మీద రాస్తే, అవి ఎంత శాస్త్రీయమైనా, నమ్ముతున్నవారిని గాయపరుస్తుంది. మానవజాతి పరిణామ క్రమంలో ప్రకృతిలో జరిగే మార్పులకు కారణం తెలియక మనిషి మతాన్ని, దేవుడినీ సృష్టించుకుని సమాధానపడ్డాడు. ఆ నమ్మకాలు అంత త్వరగా పోయేవికావు. మతంలో అశాస్త్రీయత ఏదైనా ఉంటే అది మానవజాతి ఇంకా అభివృద్ధి చెందే క్రమంలోనే పోవాలి తప్ప విమర్శలతో, వెటకారాలతో, నిందలతో పోదు. ఇది మతం, దేవుళ్ళపై నా అభిప్రాయం. అయితే కొన్ని సమస్యలను వివరించేటప్పుడు మతం గురించిన వివరాలను చెప్పుకోవాల్సి ఉంటుంది. అది అనివార్యం. ఆ వివరణ, వివరణ కోసం కాక గాయపరిచేదిగా ఉంటేనే అభ్యంతరకరం.

  లాడెన్‌ని అడ్డం పెట్టుకుని అమెరికా, యూరప్ దేశాలు ఇరాక్, ఆఫ్ఘన్ లపై దాడి చేయడానికి కారణం ఉంది. అది మీరన్నట్లు తిన్నది అరక్కో, ఇంకోదానికో కాదని నా అభిప్రాయం. వారికి స్పష్టమైన లక్ష్యం ఉంది. అమెరికా, యూరప్ లలోని మల్టినేషనల్ కంపెనీలు, వాటి వలన ఆ దేశాల పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్ధలు సంక్షోభంలో ఉన్నాయి. వారు చేసిన ఉత్పత్తులు మిగిలిపోయి అధిక ఉత్పత్తి సంక్షోభంలో ఉన్నాయి. వాటికి మార్కెట్ కావాలి. దాంతో పాటు తమ వద్ద పేరుకుపోయిన పెట్టుబడి రియలైజ్ కావడానికి ఇంకా కొత్త కంపెనీలు పెట్టడమో, ఉన్న కంపెనీల్ని విస్తరించడమో చేయాలి. దానికి ఇంకా సహజ వనరులు, చౌకగా దొరికె మానవ శ్రమ ఇవన్నీ కావాలి. సహజ వనరుల్లో ఆయిల్ (ఎనర్జీ) ముఖ్యమైంది. అది కంపెనీలు పనిచేయడానికీ, రవాణా ఇలా చాలా వాటికి కావాలి. ఆ ఆయిల్ ఉన్న దేశాల ప్రభుత్వాలు తమ కంట్రోల్ లో ఉండాలి. దాన్లో భాగమే యుద్ధాలు. మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాలు మార్కెట్ల పునహ్ పంపిణీ కోసమే జరిగాయని గుర్తుంచుకుంటే ఇరాక్, ఆఫ్ఘన్ యుద్ధాల ఉద్దేశ్యం అర్ధం అవుతుంది.

  కాని దాడులకు కారణం కావాలి కదా. టెర్రరిజాన్ని కారణంగా చూపారు. వారు చూపిన కారణాన్ని సృష్టించింది కూడా వారే. లాడెన్, సద్దాం, గడ్దాఫీ, తాలిబాన్ వీళ్ళంతా నిన్నటిదాకా అమెరికాకి మిత్రులే. ఇరాక్ ఆయిల్ మీద ఆధిపత్యానికి సద్దాం ఒప్పుకోలెదు. అందుకె ఇరాక్ పై దాడి. చైనా, ఇండియాలపై చెకింగ్ పెట్టడానికి ఆఫ్ఘన్ లో మిలట్రీ స్ధావరం కావాలి. అందుకే దానిపై దాడి.

  నిజానికి లాడెన్ డిసెంబర్ 2001 లోనే కిడ్నీ తదితర సమస్యలతో చనిపోయాడనీ, అతని శవాన్ని అతని భార్య అమెరికాకి అప్పగించిందనీ, అతని శవం అత్యంత కట్టుదిట్టమైన సెక్యూరిటీ మధ్య అమెరికాలోనె ఉందనీ ఆధారలతో సహా కొంతమంది నిరూపిస్తున్నారు. ఇంటర్నెట్ లోనె ఆ సమాచారం ఉంది. 2002 లోనే అప్పటి అమెరికా మిలట్రీ టాప్ ఆఫీసర్ ఒకరు ఇప్పటి పరిస్ధితిని ఊహించి చెప్పాడు, అమెరికాలో ఎన్నికల సమయంలో ఈ శవం అవసరం రావచ్చొని. ఇరాక్, ఆఫ్ఘన్ యుద్ధాలను కొనసాగించడానికే లాడెన్ ఇన్నాళ్ళూ బతికి ఉన్నాడని పశ్చిమ దేశాల ప్రభుత్వాల్లో ముఖ్యులందరికీ తెలుసు. కానీ వాటన్నిటికీ ఆ శవంతో పని ఉంది. బుష్ కి ఆ అవసరం రాలేదు. ఇప్పుడు ఒబామాకి వచ్చింది కనుక లాడెన్ ఇప్పుడు చనిపోయాడన్నది ఒక రహస్యం. లింక్ ఇవ్వడానికి నాకు కోడ్ రాదు. ఇది చూడండి. పేస్ట్ చేస్తున్నాను. అది లింక్ గా మారుతుందో లేదో తెలియదు.
  http://www.theaveragejoenewsblogg.com/osama-bin-laden-dead/

  పశ్చిమ దేశాల పధకాలకు ఇండియా మినహాయింపు కాదు. కాకుంటే అక్కడ జనం ఎక్కువ. రాజకీయంగా ఇతరులకంటే చైతన్యం ఎక్కువ. అందుకే ఇండియాలోని పాలకులను గుప్పిట్లో పెట్టుకుని తమకు అనుకూలమైన విధానాల్ని అమలు చేయించుకోడానికె అవి మొగ్గు చూపుతాయి. మన్మోహన్ వాళ్ళ మనిషే.

  సంపాదన కోసం ఇతర దేశాలకు వెళ్ళడం తప్పని నేనూ భావించను. ఆ మాటకొస్తే భారత సంపదతోనే బ్రిటన్ దేశం ఈ స్ధితిలో ఉంది. ఆ దేశంలో పని చేస్తున్నాం కాబట్టి వారికి ఎంతోకొంత కృతజ్ఞతతో ఉండాల్సిన అవసరం కూడా లేదేమో. ఎందుకంటే ఉద్యోగాలు ఇచ్చే కంపెనీ ఉద్ధరించడానికి ఇవ్వదు. తన లాభం కోసమే ఇస్తుంది. అదైనా ఇవ్వడమే కదా అనొచ్చు. కరెక్టే. పనిగట్టుకుని వారిపై యుద్ధం ప్రకటించాల్సీన అవసరం లేదు. అటువంటి సందర్భలు వేరే ఉంటాయి. జాతీయోద్యమంలో భారతీయులు ఇంగ్లండ్ వెళ్లి అక్కడి అధికారులను చంపిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడా పరిస్ధితి కాదుకనక అది అనవసరం. అమెరికాని ఇష్టపడటం ఒకరి ఇష్టాయిష్టాలకు సంబంధించిన విషయం. తమకు ఎదురైన అనుభవాలను బట్టీ, తాము సంపాదించిన నాలెడ్జిని బటీ అవి ఏర్పడతాయి. కాని ఎదుటివాడి ఇష్టాయిష్టాల్ని శాసించాలని చూడ్డం అభ్యంతరం, అవాంఛనీయం.

  నేను అమెరికా విధానాలపై రాస్తున్న పోస్ట్ లను కొంతమందికి నచ్చడం లేదు. అది వారి ఇష్టం. వారు భావిస్తున్నది కరెక్టు అనుకుంటే చర్చ పెట్టుకోవచ్చు. కాని వెటకారం చేస్తూ తిడుతుంటే ఆ కామెంట్లను డిలిట్ చేస్తున్నా. ఇప్పుడు వాళ్ళు నన్ను వ్యక్తిగతంగా తిడుతూ ఓ బ్లాగ్ పెట్టారు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. వారెవరో నాకు తెలియదు. తిట్టడానికే బ్లాగ్ పెట్టడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో అర్ధం కావడంలేదు. అందునా పరాయి దేశం తరపున సొంత రాష్ట్రం వారిని, సొంత మాతృ భాష మాట్లాడే వారిని తిట్టడానికి బ్లాగ్ పెట్టడం. ఇంత విపరీత బుద్ధి ఎక్కడి నుండి వస్తుంది? ఏదో బలమైన కారణం ఉండాలి. అదేంటో నాకైతే తట్టడం లేదు.

  ఆ ప్రభుత్వాలకి మన అభిప్రాయాలు చెప్పాల్సిన అవసరం కూడా లేదేమో. నేను కేవలం నాకు తెలిసిన విషయాలు పంచుకోవడానికి ఈ బ్లాగ్ ప్రారంభించాను. ఎవరో ప్రవీణ్ అనే వ్యక్తి కామెంట్ రాశాడు. అతనూ ఎవరో నాకు తెలియదు. అతని వెనకే కొంతమంది రాశారు. వాళ్ళ మధ్య తగాదా ఎందుకో నాకు తెలియదు. మొత్తం మీద నన్ను ఓ గ్రూపులోకి నెట్టినట్లు కనిపిస్తోంది. ఇదంతా చిల్లర వ్యవహారంగా కనిపిస్తోంది. అందుకే పట్టించుకోవడం లేదు. కాని కొన్ని సార్లు అనిపిస్తోంది ఏదో బలమైన కారణం ఉందేమోనని.

 4. $విశేఖర్ గారు

  మీ సవివిరమైన బదులు వ్యాఖ్యకు నా ధన్యవాదాలు కూడా 🙂

  #ఆ నమ్మకాలు అంత త్వరగా పోయేవికావు. మతంలో అశాస్త్రీయత ఏదైనా ఉంటే అది మానవజాతి ఇంకా అభివృద్ధి చెందే క్రమంలోనే పోవాలి తప్ప విమర్శలతో, వెటకారాలతో, నిందలతో పోదు.

  ఖచ్చితంగా అశాస్త్రీయత ఉంటే దాన్ని వదిలించుకోవాల్సిందే. అయితే అవతలివారి నమ్మకాన్ని గుడ్డిగా హేళన చేస్తే వారి నమ్మకం వాస్తవమైతే మరింత ఉధృత౦ అవుతుందే కానీ అది తరగదు అని నా అభిప్రాయం. మీరు అన్నదానితో నేనూ ఏకీభావిస్తాను.

  #..మతం.. అది అనివార్యం. ఆ వివరణ, వివరణ కోసం కాక గాయపరిచేదిగా ఉంటేనే అభ్యంతరకరం.

  చక్కగా చెప్పారు. మనం మీరు అలాంటి టపాలు రాసినప్పుడు మనం మాట్లాడుకుందాం 🙂

  #లాడెన్‌ని అడ్డం పెట్టుకుని అమెరికా, యూరప్ దేశాలు ఇరాక్, ఆఫ్ఘన్ లపై దాడి చేయడానికి కారణం ఉంది. అది మీరన్నట్లు తిన్నది అరక్కో, ఇంకోదానికో కాదని నా అభిప్రాయం.

  ఖచ్చితంగా మీరు చెప్పినదానితో ఏకీభవిస్తాను. అందులో ఎలాంటి సందేహం లేదు. అమెరికా తోడి కేతి దేశాలు తాము అగ్రదేశాలుగా కలకాలం ఉండటానికి పక్కదేశాలతో(బలహీన) కుదిరితే సామ౦ లేకపోతే దండోపాయాన్ని ప్రదర్శిస్తుంది. ఒకప్పుడు యుద్దాలు చేసి, ఆక్రమించి ప్రత్యక్ష పాలన.. ఇప్పుడు ప్రజాస్వామ్యం-ఉద్దరణ అనే కొంగొత్త పేరుతొ పరోక్షపాలన అదీ మట్టి అంటకుండా. ఎంతటి కుతర్కం! ఇక
  నేను తిన్నది-అరక్క అని చెప్పాలనుకుంది యుద్ద౦లో చేరే యువత గురించి. వారు దేనికోసం పక్కదేశం మీదకి యుద్దానికి పోతున్నారో తెలీదు..అదేదో విహారయాత్రకి.. అడవుల్లో జంతువులని వేటాడ్డానికి వెళ్లినట్లు. జంతువులని ఆ విధంగా వేట్టాడ్డం అనాగరిక౦ అని గుర్తించిన నాగారిక౦ అదే స్థానాన మనుషులని వేటాడడాన్ని మటుకు కబోదివలే వీక్షిస్తుంది. హతవిధి! 😦

  #నిజానికి లాడెన్ డిసెంబర్ 2001 లోనే కిడ్నీ..

  చాలా ఆసక్తికరమైన వార్త. ఈ పశ్చిమదేశాల ద్వందప్రమాణాలు, కుతర్కాలు చూస్తె నిజమే అయ్యుంటుందని అనిపిస్తుంది. గొలుసు(లింక్) చక్కగానే వచ్చింది.. చదువుతున్నా!

  #. ఆ దేశంలో పని చేస్తున్నాం కాబట్టి వారికి ఎంతోకొంత కృతజ్ఞతతో ఉండాల్సిన అవసరం కూడా లేదేమో.

  “అవసరం లేదు” అంటే ఏమీ చెప్పలేను కానీ సాయం చేసిన వారి మీద అభిమానం, కృతజ్ఞత చూపించడం మానవనైజం. మీరు అన్నట్లు ఇక్కడ జరిగేది పక్కా కిరాయివ్యాపారమే.. ఒప్పుకుంటున్నా..అయితే మనం వారిదేశంలో ఉండి సంపాయించుకుంటున్నాం కాబట్టి “కొంత” అభిమానం ఉండటంలో తప్పులేదేమో. అట్లే అవసరమైతే నిలదీయడం కూడా . మనదేశంలో పనిచేసే విదేశీయుల గురించి మన అలానే కోరుకుంటా౦ కదా!

  # ఆ ప్రభుత్వాలకి మన అభిప్రాయాలు చెప్పాల్సిన అవసరం కూడా లేదేమో.

  ఇది మీ గురించి కాదు. ఇక్కడ “చెప్పడమంటే” ఆ దేశంలో ఉండేవారు సదరు ప్రభుత్వానికి నిరసన తెలియజేయడం అని నా ఉద్దేశ్యం. లేకపోతె తప్పుచేసే దేశం తను చేసేదానికి ప్రజలు(సొంత/పరాయి) మద్దతు ఇస్తున్నారు అనే భావనకి వస్తుంది. నిరసన రూపంలో అభిప్రాయం తెలుపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

  కొన్ని ప్రశ్నలు(లాడెన్ ఇప్పుడే చచ్చాడు అనుకుని):

  ఒసామా చావు ఒబామా పదవికి ప్రేతకళ.. వీరో అవ్వాడు….దిక్కుమాలిన ప్రచారమిధ్యమాల గోల..;)

  ఇంతకూ మరో లాడెన్ లాంటి బకరా తయారి కోసం దద్దన్నకి పెద్దసమయం పడుతుంద౦టారా 😛

  ఒసామా పాకిస్తాన్ సైనిక స్తావరానికి కొద్ది దూరలోనే దొరికాదు కాబట్టి పశ్చిమదేశాలు పాకిస్తాన్ తో మాట్లాడ్డం, సాయం అందించడం మానేస్తాయా? లేక భారతదేశ౦లో మారణహోమ౦ సృష్టించదానికి పాక్ ని పావుగా వాడే ఆలోచనను కొనసాగిస్తూ స్నేహంతోనే ఉంటారా?
  …..

 5. విశేఖర్ గారు మీరు గ్రూప్ ఉన్నారు అని బావిస్తునట్లు అవతల వాళ్ళు కూడా అనుకోవచ్చు కదా ? మీ ముందు పోస్ట్లో మీ కామెంట్లు ఒకసారి చూసుకోండి , వాల్లెవరో మీకు తెలియకుండానే మీరు వాళ్ళందరిని ఒక గ్రూప్ గా కట్టి మాట్లాడటం తప్పు కాదా ? మీకు నచ్చని వాళ్ళని మీరు గ్రూప్ కట్టినట్లే అవతల వాళ్ళు కూడా అనుకునే ఆవకాశం ఉంది కాదంటారా ?

  ఇక లాడెన్ ని అది అమెరికా తయారు చేసినా , లేదు వేరే ఎవరు తయారు చేసినా ఆటను ఇప్పుడు ప్రమాదకరం , అందులోను ఏ దేశ ప్రయోజనాలు ఆ దేశానికి ముఖ్యం కాబట్టి చంపటం పెద్ద నేరం గా నేను భావించటం లేదు . ఇది నా పర్సనల్ ఒపీనియన్ అలాగే మీ అభిప్రాయం మీకుండవచ్చు. అమెరికా ఏదో అంతర్జాతీయ పోలీస్ గా వ్యవహరిస్తుంది అని చేసిన ప్రతి దాన్ని కుట్ర అనటం ఏమో నాకు జీర్ణం కావటం లేదు , అలాగే లాడెన్ ను వెనకేసుకు రావటం కూడా .

  (నిజానికి లాడెన్ డిసెంబర్ 2001 లోనే కిడ్నీ తదితర సమస్యలతో చనిపోయాడనీ, అతని శవాన్ని అతని భార్య అమెరికాకి అప్పగించిందనీ, అతని శవం అత్యంత కట్టుదిట్టమైన సెక్యూరిటీ మధ్య అమెరికాలోనె ఉందనీ ఆధారలతో సహా కొంతమంది నిరూపిస్తున్నారు) ఇక ఇది మీకు నమ్మశక్యం గా ఉందా మరీ అల్ జజీరా లో తరవాత కనపడింది ఎవరు ?

  (కాని కొన్ని సార్లు అనిపిస్తోంది ఏదో బలమైన కారణం ఉందేమోనని.) ఇంత కుట్రలు చేసే వాళ్ళు కాదు లెండి ఆ కామెంట్లు రాసిన వాళ్ళు !

 6. ఆ దేశంలో ఉంటున్నాం కాబట్టి కృతజ్ఞతగా ఉండటం విషయం అంత చర్చనీయాంశం కూడా కాదు. ఒక కోణంలో నేనలా రాశాను. నిజానికి మీ అభిప్రాయంలో అసంబద్ధత కానీ నిరాకరించాల్సిన విషయం గానీ ఏం లేదు. మంచి, మర్యాద ఉన్నవారు ఎవరైనా అలానే భావిస్తారు. బ్రిటన్ శతాబ్దం న్నర పాటు ఇండియా దోచుకోవడం, భారతీయుల్ని పెట్టిన కష్టాలు… ఈ నేపధ్యంలో నా అభిప్రాయం అలా ఉంది.

  లాడెన్‌ని చంపడంతోనే మన పని ముగియలేదు అని పశ్చిమ దేశాల ప్రభుత్వాలు అంటూనే ఉన్నాయి. తాలిబాన్, గడ్డాఫీ ఇలా చాలా బూచిలు ఉన్నాయి. పాకిస్ధాన్ మీద కోపం నాటకం. కోపం చూపకపోతే స్వదేశీ ఓటర్లనుండి వ్యతిరేకత వస్తుంది కనక ఆ కోపం. అమెరికా మిలట్రీ వ్యూహంలో పాక్ ఒక పావు. పాక్ పాలకులు వారికి బ్రోకర్లు. అంతే. బలవుతుంది మాత్రం పాకిస్ధాన్ ప్రజలు.

  టిల్‌మేన్ దేశ భక్తితోనే యుద్ధంలోకి వెళ్ళాడు. అతను నిజాలు గ్రహిస్తుండగానే ఫ్రెండ్లీ ఫైర్ లో చనిపోయాడు. ఆ విధంగా చూస్తే పశ్చిమ దేశాల యుద్ధోన్మాదంలో పాల్గొంటున్న వారి సైనికులంతా బకరాలే.

  మీ అభిప్రాయాల్లో మెచూరిటీ కనిపిస్తోంది.

 7. శ్రావ్య గారూ,

  గ్రూపు గురించి… గ్రూపు అన్నది తిట్టేమీ కాదు. ఒకరి తర్వాత ఒకరు అదే పద్దతిలో, రాస్తే గ్రూపు అన్నాను. గ్రూపు కాకపోతే ఫ్రెండ్స్ అనుకోండి.

  నాకు నచ్చకపోవడం అసలు సమస్య కానే కాదు. వెటకారంగా రాస్తే అలా రాయకండి, చర్చించుకుందాం అని రాసినా దాన్ని కొనసాగించడానికి కారణం ఏమై ఉంటుంది? నాకు వాళ్ళు, వాళ్ళకి నేను పూర్తిగా అపరిచితులం. అలాంటిది మొదలు పెట్టడంతోనే వెటకారం, హేళన ఎలా చేయగలరు? కొన్ని దేశాలు కలిసి చేస్తున్న అరాచకాల కంటే లాడెన్ అరాచకాలే ప్రమాదకరం అని మీరు భావిస్తున్నారు. దానికి సరిగ్గా వ్యతిరేకంగా నా అభిప్రాయం ఉంది. అందుకని మనం తిట్టుకుని, హేళన చేసుకోవాలా? ఆ అవసరమే లేదు. నేను నా అభిప్రాయాలకి సమర్ధనగా కొన్ని రుజువులు చూపించడానికి ప్రయత్నిస్తాను. అలాగే మీరు కూడా. ఆ క్రమంలో ఒకరినుండి మరొకరు అభిప్రాయాలు, వాస్తవాలు తెలుసుకోవచ్చు. అలా కాకుండా నేరుగా తిట్లకు దిగడంలో మీకు తప్పేమీ కనిపించడం లేదా శ్రావ్య గారూ.

  అమెరికా చేస్తున్న పనుల గురించి రాయడంలో నేను మొదటి వాడ్ని కాదండీ శ్రావ్యగారూ. అనేక పుస్తకాలు ఉన్నాయి. అమెరికన్ మేధావులే రాశారు. నోం ఛోమ్‌స్కీ ఎం.ఐ.టిలో లింగ్విస్టిక్స్ లో ప్రొఫెసర్. ఆయన అమెరికా కుట్రలమీద విస్తృతంగా పరిశోధన చేశారు. ఆయన పుస్తకాలు, వ్యాసాలు, ఉపన్యాసాలు ఇలా చాలా ఉన్నాయి. ఆయన కమ్యూనిస్టు కాదు. సోషలిస్టు కాదు. కేవలం ప్రజాస్వామ్య ప్రియుడు. సామ్రాజ్యవాద వ్యతిరేకి. ఆయనతో పాటు చాలా మంది ఉన్నారు. ఇంటర్నెట్ లో ఆ సమాచారం చాలా ఉంది.

  నేనిచ్చిన లింక్‌ని ఫాలో అయ్యారా? అది ఊహించి రాసింది కాదు. సాక్ష్యాలు అవీ ఇచ్చారు. ఒక సారి చూడండి. అమెరికాలో ఉంటున్నవారు అమెరికాకి వ్యతిరేకంగా ఆలోచించడానికి బహుశా కష్టంగా ఉంటుందేమో. వ్యతిరేకంగానో అనుకూలంగానో కాకుండా కేవలం పరిశీలనకు మాత్రమే అన్నట్లుగా చదివినా నిజం తెలియకపోదు. నేను చెప్పింది నిజమని మీరు నమ్మవలసిన అవసరమైతే లేదు. నా వాదన చూడండి. నేను చూపుతున్న దృష్టాంతాలు చూడండి. వాటిలో వాస్తవ విరుద్ధం ఉంటే ఎత్తి చూపండి. మీకు తెలిసిన వాస్తవాలు చూపండి. అది నేనూ తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒక వేళ నా అభిప్రాయాలు తప్పైతే సవరించుకోవడానికైనా ఉపయోగపడుతుంది. నేను చాలా సంవత్సరాల నుండి చదువుతున్న పుస్తకాల ద్వారానే కొన్ని విషయాలు తెలుసుకున్నా. అలాగే మీరూను. అవి పరస్పరం తెలియజేసుకుంటే ఉపయోగం. ఉపయోగం లేకనూ పోవచ్చు. కాని తిట్టుకోవాల్సిన, హేళన చేసుకోవాల్సిన అవసరం మాత్రం లేదు.

  ఆల్ జజీరా కనపడింది ఎవరనే గదా! అలాంటి వీడియోలు, ఆడియోలు సృష్టించడం అంత కష్టమైన పని కాదేమో ఓ సారి ఆలోచించండి. అయినా లాడెన్ బ్రతికున్నా, చనిపోయినా మీకూ నాకు మధ్య వెటకారం చేసుకునేంతగా వాతావరణం చెడిపోవల్సిన అవసరం ఏంటన్నదే నా ప్రశ్న. నే రాసింది నిజమూ కావచ్చు. అబద్దమూ కావచ్చు. నాకు నమ్మశక్యంగా అనిపించినవి మీకు అనిపించకపోవచ్చు. అది వ్యక్తిగత అనుభవాలు, చుట్టూ ఉన్న పరిసరాలు, పెరిగిన వాతావరణం, ఉంటున్న వాతావరణం వీటన్నింటిపైన ఆధారపడి ఉంటుంది. కాదంటారా?

  ఇంత కుట్రలు చేసే వాళ్ళు కాకుంటే ఎంత కుట్రలు చేసేవాళ్ళని? ఎంతో కొంత అలాంటిది ఉందనా? అసలలా రాయవలసిన అవసరం ఏంటనేదే నా ప్రశ్న. నాకు వాళ్ళెవరో తెలియదు. వాళ్ళకి నేనెవరో తెలియదు. తెలియకుండానే వ్యక్తిగతంగా తిట్టడానికె బ్లాగ్ పెట్టడం ఏ కోవలోకి వస్తుంది చెప్పండి? విషయం ఏంటంటే, నాకిప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది. ఇంత త్వరగా, పరిచయం లేని వారి మధ్య ఎనిమిటీ డెవలప్ కావాలా? అందుకే బలమైన కారణం అంటున్నా. ఒకవేళ నా అభిప్రాయం తప్పు కావచ్చు కూడా. మరి కారణం ఏంటి?

 8. అభిప్రాయాలు వేరైతే తిట్టుకోవాల్సిన అవసరం కచ్చితం గా లేదండి . కాకపొతే నేను చెప్పేది అది ఇద్దరికీ వర్తిస్తుంది అని ! వాళ్ళు అందరూ ఒకే అభిప్రాయం చెప్తే గ్రూప్ లేదా ఫ్రెండ్స్ అని మీ అనుమానమా బావుంది 🙂

  ఇక లాడెన్ గురించి ఐతే ఏమోనండి ఈ కాన్పరెంసీ థియరీలు నేను అంత గా నమ్మను , ఇక ఒక మనిషిని చంపి 11 ఏళ్ళు శవాన్ని దాచారంటే అసలే నమ్మను !

  అందుకే బలమైన కారణం అంటున్నా. ఒకవేళ నా అభిప్రాయం తప్పు కావచ్చు కూడా. మరి కారణం ఏంటి?

  —————–

  మీ అభిప్రాయం తప్పేలెండి 🙂 ఇక కారణం పెద్ద విషయం కాదేమో ఇంతకు ముందు మీ అభిప్రాయాలు రాసిన వాళ్ళు చేసిన పనులు అయ్యిండచ్చు . btw వాళ్ళే ఆ బ్లాగు పెట్టారా , ఇది నిజం గా నాకు తెలియకే అడుగుతున్నాను !

 9. శ్రావ్య గారు,

  నాకు వాళ్ళు, వాళ్ళకి నేను తెలిసి దాని వలన వెటకారాలు మొదలైతే మీరన్నట్లు ఇద్దరికీ వర్తిసుంది. వాళ్ళు రావడంతోనే వెటకారంతో కామెంట్లు ఎలా చేయగలరు నేనెవరో తెలియకుండా? అభిప్రాయాలు చెప్పండి అని నేను తెలియని వాళ్ళను ఎలా అడగ్గలనండీ? వాళ్ళె హేళన కామెంట్లు మొదలు పెడితే నేను పొలైట్ గా చెప్పాను, అది బాగాలేదని. వెటకారం రెట్టింపయ్యింది. కామెంట్ డిలిట్ చేశాను. పేర్లు మారుస్తూ అవే కామెంట్లు. పేరు ఒకటి కాదు గనక వాళ్ళే బ్లాగ్ పెట్టలేదేమో అని మీరు చెప్పాలనుకుంటున్నారా? నాకు వ్యతిరేకంగా పర్సనల్ గా బ్లాగు పెట్టేటంతటి చరిత్రేమీ నాకు లేదు ఇంటర్నెట్ లో.

  నా అభిప్రాయం తప్పంటున్నారు. తప్పని ఖచ్చితంగా చెప్పగలినప్పుడు కారణం చెప్పగలగాలి కదా. కారణం నా అభిప్రాయాలు రాసినవాళ్ళు చేసిన పనులా? ఎవరు వాళ్ళు? వాళ్ళ పనులకీ నాకూ సంబంధం ఏంటసలు? ఎక్కడినుండి ఎక్కడికి కలుపుతున్నారు? నా అభిప్రాయం నేనే రాశాను. ఇంకెవరూ రాయలేదు. మొదటినుండి ఇప్పటివరకూ నాపేరుతోనే రాస్తున్నా. నాకున్న ఒకే ఒక్క కంప్యూటర్ నుండే అవి రాస్తున్నా.

  పెద్ద విషయం ఏమీ లేకుండానె తిడుతూ బ్లాగు పెట్టడం ఏంటండీ! మీరు రాస్తున్నదాంట్లో కొన్ని అర్ధం కావడం లేదు. ఆ స్మైలీలు లేకుండా రాయండి కన్ఫ్యూజన్ గా ఉంది, వాటి భావం తెలియక. వాటిని నేనెప్పుడూ వాడలేదు.

 10. కామెంట్స్ రాస్తూ కొన్ని లింక్స్ ఇచ్చారు. ప్రమాద, ప్రమోద వనాలని అవన్నీ చూశాను. చివరిదాకా చూళ్ళేదు లెండి. కొంత చూశాక సిల్లీగా కనబడి మానేశాను. ఆ వనాలు చూసి ఫ్రెండ్స్ అని అంటున్నా. నాపై బ్లాగ్ పెట్టిన సంగతి వాళ్ళుంచిన కామెంట్ ద్వారానే తెలిసింది. అంతవరకూ తెలీదు. వాళ్ళిచ్చిన లింక్ తోనే బ్లాగ్ విషయం తెలిసినపుడు బ్లాగ్ ఎవరో పెట్టిందని అనుకోమంటారా? నాకున్నదే చిన్న ప్రపంచం. ఇద్దరో ముగ్గురో. వారికి మీరు తోడు. అంత వరకే నా ప్రపంచం. కాకుంటే బుక్స్ ఎక్కువగా చదువుతా.

 11. నేను చెప్పేది మీకు అర్ధం కాలేదు అంటున్నారు కాబట్టి ఇది నా రెస్పాన్స్ :
  1 . మీరు అమెరికాకి , ఒబామాకి వ్యతిరేకం గా రాస్తున్నారు కాబట్టి ఒబామా కి , అమెరికాకి ఉన్న వ్యతిరేక సంఘలాలో మీరు ఒక సభ్యులా .
  2 . మీరు అమెరికాకి , ఒబామాకి వ్యతిరేకం గా రాస్తున్నారు కాబట్టి అమెరికాకి , ఒబామాకి వ్యతిరేకం గా రాసి తిట్టే వాళ్ళో లో మీరు ఒకరా ?
  3 . కొన్ని కోట్ల మంది అభిమానించే వారిని , లేదా వారి చర్యలని అంగీకరించే వారిని మీరు విమర్చిస్తున్నారు , మీరు చాలా సాధారణ వ్యక్తి అని మీరే చెప్పుకుంటున్నారు అలాంటి మిమ్మల్ని వేరే వాళ్ళు విమర్శిస్తే ఎందుకు తట్టుకోలేకపోతున్నారు .

  నేను ఆ పై ప్రశ్నలు ఎందుకు రాసానో మీకు ఇంకా అర్ధం కాకపొతే ఇది నా ఉద్దేశ్యం “మీరు వేరే వాళ్ళని విమర్చిన్నట్లే , మిమ్మల్ని కూడా వేరే వాళ్ళు విమర్శించవచ్చు ” అలా అని వాళ్ళంతా ఒక గ్రూప లేదా ఒక బలమైన కారణం తో చేయనక్కర్లేదు .

  ఇక నేను smilees పెట్టిన ఉద్దేశ్యం నేను ఈ కామెంట్లు ఈ కుట్ర తో ను రాయటం లేదు మీరు ఈజీ గా తీసుకోండి అన్న ఉద్దేశ్యం తో .

 12. వేరే దగ్గర మీ కామెంట్లు ఇప్పుడే చూసా ! ఇప్పుడు అర్ధం అయ్యింది మీలాంటే వారే ఈలాంటి అనాలసిస్లు వగైరా చేయగలరు .
  All the very best ! Please go ahead !

 13. ముందు తమరెవరో చెప్పండి. శ్రావ్య వట్టికూటి అని ఎక్కడో బ్లాగర్ గా చదివాను. ఇక్కడ మహా మహా వీరులం అనుకుంటున్న వారు ధైర్యం లేక ఫేక్ పేర్లు వాడుతున్నారు. ఇంతకు ముందు మీకు నేనిచ్చిన సమాధానాలను రీ ప్రొడ్యుస్ చేసి తిక్క తిక్క గా హేళనగా నన్ను తిడుతూ రాసిన బ్లాగ్లో పెట్టారు. నా చేత ఏదొకటి రాపించి వాళ్ళ చేత తిట్టించాలని ఎందుకు కంకణం కట్టుకున్నారు?

  I don’t know who you are. You are extracting some responses to you thorough you are enabling the derogatory blogger on me to post further abuses and humiliating posts. Why are you doing this to me when you don’t know me?

 14. వేరే చోట ఎక్కడండీ? మీరెవరు? వట్టికూటి శ్రావ్య గారా లేక ఇంపర్సనేషనా? చాలా పేర్లతో చాలా రకాలగా చాలా అసహ్యంగా రాస్తున్నారు. వారిలో మీరు లేరా? అయితే మీతో నా సంభాషణలు ఎందుకలా మిస్ యూజ్ చేస్తున్నారు?

 15. నా అభిప్రాయం తప్పంటున్నారు. తప్పని ఖచ్చితంగా చెప్పగలినప్పుడు కారణం చెప్పగలగాలి కదా. కారణం నా అభిప్రాయాలు రాసినవాళ్ళు చేసిన పనులా? ఎవరు వాళ్ళు? వాళ్ళ పనులకీ నాకూ సంబంధం ఏంటసలు? ఎక్కడినుండి ఎక్కడికి కలుపుతున్నారు? నా అభిప్రాయం నేనే రాశాను. ఇంకెవరూ రాయలేదు. మొదటినుండి ఇప్పటివరకూ నాపేరుతోనే రాస్తున్నా. నాకున్న ఒకే ఒక్క కంప్యూటర్ నుండే అవి రాస్తున్నా.

  దీనికి సమాధానం ఇవ్వలేదు మీరు. ఎందుకని ఎవాయిడ్ చేస్తున్నారు.

 16. ఏంటండీ మీకు ఎలా చెబితే అర్ధం అవుతుంది ? మిమ్మల్ని ఎవరో ఏదో అంటుంటే వాళ్ళని క్లియర్ గా ఎందుకు రాస్తున్నారు అని అడగటం ఇక పద్దతి . మీ ఇష్టం వచ్చిన రీతిలో మీ అభిప్రాయాలను వ్యతిరేకించిన వాళ్ళని గ్రూప్ గా గట్టి మీకు మీరే ఉహించుకోవటం , అందరిని శత్రువులని చేసుకోవటం ఏమి పద్దతి . నేను శ్రావ్య వట్టికూటి నే , ఇంతవరకు మీ అభిప్రాయాలు ఏదో మీరు రాసుకుంటున్నారు అన్న గౌరవం తోనే ఇక్కడ కామెంట్లు రాసాను . ఏదో గ్రూప్ లో ఉండటం ఇలాంటివి ఏమిటి ఇదంతా ? మీరు అందరిని కలిపి మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎదుటి వాళ్ళు ఊరుకుంటారా ? అయినా మీరు వర్డుప్రెస్సు వాడుతున్నారు , ఈ కామెంట్ ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదా ? ఈ పై కామెంట్లు కాక ఇంకా వేరే కామెంట్లు ఏమన్నా నేను రాసానా ?

  ముందర మీకు వ్యతిరేకం గా ఏదో కుట్ర జరుగుతుంది అన్న ఆలోచన మానండి, మీ అభిప్రాయాన్ని వ్యతిరేకించిన అందరిని ఒక గ్రూప్ గా చూడటం ఆపేయండి !

 17. శ్రావ్య గారూ,

  ఇప్పటి వరకూ వెటకారం చేస్తూ, హెరాస్ చేస్తూనే తప్ప ఫలనాది నేను వ్యతిరేకిస్తున్నా. దానికి కారణం ఇది. అందువలన మీ అభిప్రాయం కరెక్టు గాదు. అని చెప్పిన వారికి నేను పొలైట్ గానే సమాధానం ఇచ్చాను. మీరన్నట్టు క్లియర్ గా అడిగాను. వాళ్ళు వెటకారం రెట్టింపు చేశారు. పేర్లు మార్చి అవే కామెంట్లు రాశారు. జీరో, శూన్య, ఏవో కొన్ని రేండం అక్షరాలు, ఇలా. నా అభిప్రాయాలను వ్యతిరేకించడం అంటే నన్ను వెటకారం చెయ్యడమా? తిట్టడమా? తిడుతూ బ్లాగు పెట్టడమా? తిడుతూ బ్లాగు పెట్టడాన్ని సమర్ధిస్తుంటే మీరసలు శ్రావ్య కాదేమో అనుకున్నా. ఇప్పటికి కొద్ది మంది వ్యక్తులు పేర్లు మార్చి వెటకారం చేస్తూనే ఉన్నారు.

  మీరు, రాజేష్ గార్లతో సంభాషణ బాగానె జరిపాను. నేను మీకిచ్చిన సమాధానల్లో కొంత భాగాల్ని ఎత్తి రాసి మళ్ళీ వెటకారం చేశారు. ఈ లోపు మీ నుంచి సమాధానం ఆగి వారి పోస్టులు ప్రత్యక్షమైతే మీ పేరును వాడుతున్నారేమో అనిపించి మీ బ్లాగ్ లో కూడా రాశాను ఇలా జరుగుతోందని. ఫేక్ నేమ్ ల వలన మీరు శ్రావ్య అని నాకు అర్ధం చేసుకోవడమే నాకు కష్టంగా ఉంది.

  నేనేం రాశాను చెప్పండి. నేను మాట్లాడితే ఎదుటివాళ్ళు ఊరుకున్నారాండీ. నేను మూడు వారాలనుండి వెటకారం, తిట్లు ఎదుర్కొంటున్నాను. వ్యక్తిగతంగా తిడుతూ బ్లాగ్ పెట్టారు. ఇవన్నీ వదిలేసి నన్ను నిందించడం ఏం బాగాలేదు. వర్డప్రెస్ వాడితే కామెంట్ ఎక్కడి నుంఛొ తెలుస్తుందా? నాకది తెలియదు. అందుకే అయోమయం. నాపైన బ్లాగు పెట్టడాన్ని కుట్ర గాదు. సరే ఏమనాలి? దయచేసి ఓ సారి అక్కడ నాపైన రాసినవి చదవండి. అదీ కాక నేను అడిగిన ప్రశ్నలకు మీనుంచి సమాధానం లేక కన్ఫూజ్ అయ్యా. మీ కోపం ఏమిటో నాకర్ధం కాలే. అసలీ ఇంటర్నెట్ సంభాషణే నాకు పూర్తిగా అర్ధం కాలేదు. అర్ధం చేసుకోవడంలో మీలాంటి వాళ్ళు సాయం చేస్తారేమోనని అక్కడక్కడా అడుగుతున్నా.

  ఎలా ఆపమంటారండీ గ్రూపుగా చూడ్డం (మీరిందులో లేరు)? ఒక మందలాగా మీద పడి ‘నెను మీలా వెటకారం చేయలేనండి’ అంటే ‘సారీయా అయితే మీ సోదంతా వినాల్సిందేనా. అయితే చెప్పు మీ అధృష్టమ్ మా ఖర్మ’ అని ఒకరూ, నీ మొఖానికి వెటకారం కాక ప్రశంసలా? అని ఇంకొకరు, వరుసగా మూడు నాలుగు వారాల పాటు వివిధ పేర్లతో రాస్తే గ్రూపు కాక ఒక్కడే అనుకోమంటారా? పొలైట్ గా అడిగితే ఒక్కడంటే ఒక్కడైనా వీళ్ళలో సరిగ్గా రాయలెదు. ఇదెక్కడి ఖర్మ? ఈ శాసనాలు ఆర్డర్లెంటండీ (మీరు కాదండీ బాబూ).

 18. విశేఖర్ గారు మీ దగ్గర IP అడ్రస్ ఉంటుంది కాబట్టి ఒకసారి కామెంట్ రాసాక వాళ్ళు నిజమో అబద్దమో ఈజీ గా గుర్తు పట్టచ్చు . మీరు ఎదుటు వాళ్ళని గ్రూప్ చూడొద్దు అని మాత్రమె నేను చెబుతున్నా . మీకు నచ్చని కామెంట్లు పబ్లిష్ చేయకండి , అలాగే వాళ్ళ పేరు ఉదాహరించి గట్టి గా చెప్పండి . ఒకవేళ రకరకాల పేర్లు వాడినా మీరి ip అడ్రస్ తో గుర్తు పట్టొచ్చు .

  పేకాట ఆడుకుంటూ సరదా గా మొదలైన వాదనతో కోర్టు కెళ్ళే జాతి అట తెలుగువారిది సో ఇలాంటివి ఎక్కడకేల్లినా మీకు తగులుతాయి . మీరు సాధ్యమైన వరకు శత్రువులని తయారు కోకండి అని నా సలహా అంతే . ఇక పొతే ఇదే సందు కదా అని మీరు ఎవర్ని తిడున్నారో వాళ్ళంటే పడని వాళ్ళు కూడా ఈ టైం లో politics ప్లే చేసి మీకు , వాళ్లకు గొడవ పెంచటానికి చూస్తారు అక్కడ జాగ్రత్త పండండి . మీ రాసిన పోస్టు మీద కాక వేరే కామెంట్లు మీరు చేసి , వేరే వాళ్ళని చేయనిచ్చి ఎక్కువ తలనొప్పులు తెచ్చుకోకండి . ఇదే నేను చెప్పగలిగింది మీకు .

 19. విశేఖర్ గారు నేను రాసిన కామెంట్లు , మీకు వ్యతిరేకం గా రాసిన వాళ్లకి అనుకూలం గా ఉన్నాయి అనుకుంటే మన్నించండి . నా ఉద్దేశ్యం అది కాదు . మిమ్మల్ని తిట్టినా వార్కి సమాధానం చెప్పొద్దూ అని కూడా కాదు. ఆ సమాధానం చెప్పేటప్పుడు మరంత చెత్త రాసేందుకు ఎదుటి వాళ్లకి అవకాశం ఇవ్వకండి అని చెప్పటం మాత్రమే. అదే విధం గా ఎదుటి వాళ్ళు చెప్పేది కూడా వినండి అంటే మీరు వినటం లేదు అని కాదు కొంచెం సంయమనం వహించండి . వాళ్ళు మిమల్ని పర్సనల్ గా abuse చేస్తే భరించవలసిన పని లేదు , దానికి సరైన సమాధానం చెప్పండి అది వాళ్ళు వాడే భాష కాకుండా అప్పుడే మీకు సపోర్ట్ ఉంటింది .

  ఇక మీరు వాడేది వర్డుప్రెస్సు కాబట్టి ఎవరైనా కామెంట్ వేరే పేరుతొ రాసిన ip మాత్రం మారదు అది చూసుకోండి . మీకు టెక్నికల్ గా ఏదన్నా సహాయం అవసరం ఐతే తప్పక అడగండి .

  ముందు గా పశ్చిమ దేశాల వాళ్ళందరిని ఒక గ్రూప్ గా చూడకుండా మీ టపా మీదనే చర్చ జరిగే కామెంట్లు ప్రచురిస్తే మీకు సగం తలనొప్పి తగ్గుతుంది .

 20. వాళ్ళకు నచ్చని అభిప్రాయాలు ఎవరు రాసినా ఇలాగే నాలుగు వైపుల నుంచీ దాడి చేస్తారు.
  వెటకారాలు, తిట్లు,ఇవన్నీ మామూలే వాళ్ళకి. చాలామంది వీళ్ళ గోల పడలేక రాయడం కూడా మానుకున్నారు. మీరు ఎవరి రాతలనీ పట్టించుకోనక్కర్లేదు. మీ మానాన మీరు రాయండి. వాళ్ళని కూడా ఎవరూ ఇక్కడ పట్టించుకోరు. మీరే పట్టించుకుని సీరియస్ గా తీసుకుంటున్నారు.

 21. శేఖర్‌ గారూ
  Just take it easy.
  మీకు ఓపికున్నంతకాలం మిన్నకుండండి . ఇంకా ఎక్కువౌతోంది అనిపించిందనుకోండి. వర్రీ లేదు. వీళ్ళని డీల్‌ చేయడానికి వేరేపద్ధతి ఉంది,
  ఆట అప్పుడే మొదలౌతుంది.

 22. మంచి సలాహా ఇచ్చారండీ. ధాంక్స్. అయితే ఏ మూలో అంతరాత్మ ఉంటుందేమోనని సమాధానలు ఇస్తూ వచ్చా. అదేమీ లేదని అర్ధమైంది. అవేం బతుకులండీ ఛీదరగా. ఛీ పాడు.

 23. కుమార్ గారూ, మీక్కూడా ద్యాంక్స్. వీళ్లన్నదానికి రెండింతలు రాయొచ్చు. కానీ ఆ బురద నేనెందుకు అంటించుకోవడం?

  వీళ్ళల్లొ ఒకడు “పిల్లలకూ అమాయకులకి చెబుతారా? (నేనున్నాగా వీరుడ్ని అని) మీ టెక్నిక్కులన్నీ నాకు తెలుసు. మిమ్మల్ని మొగ్గలోనే తుంచాలి. నేనూ రాడికల్‌ని నక్సలైటుని” అని చాలా ఆవేశపడి పోయాడు. ఈయన తలుచుకుని నన్ను నాలాంటివారినీ మొగ్గలోనే తుంచుతాడట! వీ_ అసాధ్యం కూలా. ఈయన తుంచగానే తునగడానికి పెరట్లో తూనీగ తలకాయనుకున్నాడు కామోసు.

  నక్సలైటు అంటే అర్ధం తెలుసో లేదో ఈయనగారికి. కొంతమంది అంటారు “ఎవర్నైనా బాగు చెయ్యొచ్చు కాని చెడిపోయిన కమ్యూనిస్టుని బాగు చేయ్యలేర”ని ఆ బాపతే ఇది. వీళ్ళకి దేవుడి భయం ఎలాగూ ఉండదు. ఉన్నా అదేం లెక్క కాదు. నేను వీళ్ళ చేత వాగించాలనే ఇంతవరకూ రాశా. వాగాల్సిందంతా వాగారు. వీళ్ళ బ్లాగు, తిట్లు, బలుపు కామెంట్లు అన్నీ స్క్రీన్ సేవ్ చేశా. వీళ్ళ అరాచకమంతా ఓ స్టారీ రాసి ఈ బ్లాగ్ లోనే పోస్ట్ చేస్తా, సాక్ష్యాధారలతో సహా. వీళ్ళ చచ్చు తెలివితేటలకి ఓ మురిసి పోతున్నారు. వీళ్ళ దుంపదెగ ఆడోళ్ళ పేరూ అరువు తెచ్చుకోవడమే! కరెక్టుగా అమెరికా బుద్ధులేనండీ అదేం చిత్రమో. తాము సీఐఏ ఏజెంట్లమని కూడా ఒప్పేసుకున్నారండీ. అందుకే అమెరికా మీద ఈగ కూడా వాలనివ్వరట? ఎలాగండీ? భయంగా ఉందండీ.

  ఎక్కడో ఓ మూల ఆశ ఏడ్చింది నాకు. మనిషిపై అంత త్వరగా నమ్మకం వదులుకోలేనండీ నేను. కారణం అతను మనిషి అని నమ్మడమే. అయితే పశు ప్రవృత్తే డామినేట్ చేస్తే ఎవరు మాత్రం ఏం చేయగలరు? కొన్ని జన్మలంతే.

 24. అగ్నిహోత్రావధానుల కాలంలోలాగ భర్త చనిపోయిన స్త్రీలని కించపరిచే భాష మాట్లాడేవాళ్ళకి మర్యాద ఏమిటి? ఈ లింక్ చూడండి: http://maalikaasalurangu.info

 25. అగ్నిహోత్రావధానుల కాలంలోలాగ భర్త చనిపోయిన స్త్రీలని కించపరిచే భాష మాట్లాడేవాళ్ళకి మర్యాద ఏమిటి? ఈ లింక్ చూడండి: http://maalikaasalurangu.info

 26. మీ ఇష్టం వచ్చినట్లు ఊహించుకొని ఏవో కథలు అల్లుకుంటే నేను ఏమి చేయలేనండి . మీ సమాధానాలతో మిమ్మల్ని తిట్టించవలసిన దౌర్భాగ్యం నాకు పట్టలేదు !

  నేను చెప్పేది ఒకటే మీరు వేరే వాళ్ళని విమర్శిస్తే మిమ్మలిని వేరే వాళ్ళు అదే చేయటం లో తప్పు లేదు అని .

  ——————-

  ఈ పై రెస్పాన్స్ మీరు నా బ్లాగులో పెట్టిన కామెంట్ కి, అది నేను ఇప్పుడే చూసాను . ఇన్ని చెబుతున్న మీకు నేను పెట్టిన కామెంట్ తో వేరేవరిదో అని వీళ్ళంతా ఒకటే అని అనటం లో తప్పు కనపడటం లేదా ఫ్రాన్సిస్ గారు ?

 27. మీ ఇష్టం వచ్చినట్లు ఊహించుకొని ఏవో కథలు అల్లుకుంటే నేను ఏమి చేయలేనండి . మీ సమాధానాలతో మిమ్మల్ని తిట్టించవలసిన దౌర్భాగ్యం నాకు పట్టలేదు !

  ——————-

  ఈ పై రెస్పాన్స్ మీరు నా బ్లాగులో పెట్టిన కామెంట్ కి, అది నేను ఇప్పుడే చూసాను .

 28. శ్రావ్యగారూ, మీ విషయంలో నేను పొరబడి ఉండవచ్చు. నేను నెల రోజుల పాటు నేను ఎదుర్కొన్న కామెంట్స్ మీరు చూడలేదు. అందువలన మీరు మీ ఇష్టం వచ్చినట్లు రాయవద్దు దయచేసి. నేనెవర్ని విమర్శించాను? ఏం రాస్తున్నారు మీరు? నేను ఎవర్నీ రండి కామెంట్లు చెయ్యండి అని పిలవలేదు. అరె ఎన్ని సార్లు రాసినా అర్ధం చేసుకోరేంటండీ? నేను నా పోస్టులపైన వెటకారం కామెంట్లు రాస్తే వాటికి నేను రాసిన సమాధానాలను చూసి అక్కడ మొదలు పెడతారేంటి మీరు? మీరు చూసిన దానికంటే ముందు చాలా చెత్త రాశారు. అవన్నీ స్పాం లో ఉన్నాయి. సగం నుండి చూసి తీర్పులివ్వకంది దయచేసి.

  వేరెవరిదో అని అభిప్రాయాలకి కూడా నేను నెలరోజుల తర్వాత వచ్చాను. అవి కూడా నిర్ధారించుకోలేదు. మిమ్మల్ని ఇలా జరుగుతుందండీ అని చెప్పింది మీ ద్వారా ఏమన్నా తెలుస్తాయేమో అని. రక రకాల పేర్లు మార్చి రాసారంటే అర్ధం కాదా మీకు? నా బ్లాగ్ లో పెట్టిన వెటకారం కామెంట్లన్నీ నేను ఎగ్జిబెషన్ కి పెట్టలేదు నేను. ఎంత సేపటికీ నా దగ్గర ఏదో తప్పు వెతకాలని చూడడం నాకస్సలు బోధపడ్డం లేదు. మీతో జరిగిన సంభాషణ ఒక అయోమయ పరిస్ధితిలొ జరిగిందని రాస్తుంటే అర్ధం చేసుకోరేంటి? మీరెవరో నాకు తెలియదు. నన్ను తిడుతూ బ్లాగ్ పెడితే దానికి నేనేదో తప్పు చేస్తేనే పెట్టారని చెప్పదలుచు కుంటె. నమస్తే. నన్నిలా వదిలేయండి. నేను పొరబాటున మీ బ్లాగ్లొ రాశాను.

  నేను విమర్శిందింది అమెరికాని. ఎవర్నీ పేర్లు పెట్టి తిట్టలే. అమెరికాని తిడితే వాళ్ళొచ్చి నన్ను తిడతారా? ఏం న్యాయమండీ మీరు చెప్పేది.

 29. ఈ బ్లాగ్ లో నాపేరు విశేఖర్. ఫ్రాన్సిస్ అని ఈ బ్లాగ్ లో నాది కాని పేరు రాయడంలో తప్పేమీ కనపడలేదా శ్రావ్య గారూ?

 30. తప్పుచేస్తున్నారు అండీ. వాళ్ళని పట్టించుకోవద్దు. ఈ వట్టికూటి అమ్మాయి కూడా వీళ్ళలో ఒక మెంబరే.
  వీళ్ళు ముఖ్యంగా మూడు రకాలుగా ఉంటారు.
  1. సాటి బ్లాగర్లని మానసికంగా హింసించడమే పనిగా పెట్టుకున్న గుంపులుకట్టి కిరాతకదాడికి దిగే కొంతమంది మానసిక వికలాంగులు, వీళ్ళపేర్లు బ్లాగుల్లో బజ్జుల్లో జగద్విదితం.
  2. వాళ్ళ గుంపులో సభ్యులు కాకపోయినా బయట ఉండి మాఱుపేర్లతో, ప్రొఫైల్‌ లేని రకరకాల ఐడీ లతో వీరికి వంతపాడే తైనాతీ గాళ్ళు. ఈ కుమార్‌, రాజేష్‌,మంచు వంటివారు ఈ కోవలోకి వస్తారు.
  3. మూడోరకం బ్లాగర్లు స్వతహాహా మితవాదులైనా వారి బ్లాగు కరీర్‌ మొత్తం వీరి చుట్టూ అల్లుకొనబడి ఉంటుంది, వాళ్ళు బాగుంటే వీళ్ళు బాగుంటారు, వాళ్ళ మాట బ్లాగుల్లో చెల్లుబడి అయ్యేవరకూ వీళ్ళందరూ కూడా ప్రముఖ ప్రఖ్యాత బ్లాగర్లుగా చెలామణీ అవుతారు. ఇదిగో ఈ వట్టికూటి, రామరాజు, లక్కరాజు, మాగంటి మున్నగువాఱంతా ఈ కేటగిరీ క్రిందికి వస్తారు.

  మొదటిరకం బ్లాగర్లు బయట పడతారు, లొంగకపోతే రెండోరకం, లొంగకపోతే మూడో రకం.
  ఇంకా ఎన్నాళ్ళు పడాలో ఈ ఘోరాలు, ఈ ఆగడాలకి అంతుఎప్పుడు ఉంటుందో, తెలుగుబ్లాగుల స్థితీ గతీ తీవ్ర ఆందోళనకఱంగా ఉన్నది. సీనియర్‌ బ్లాగర్లు కలగజేసుకుని పైస్థితి సరిదిద్దకపోతే సాటి బ్లాగర్లు బ్లాగుల్లో సుఖంగా రాసుకునే రోజులు పోతాయి.

 31. నేను, అమెరికాకీ, ఒబామాకీ వ్యతిరేకంగా రాయడం లేదు. ఒకటి దేశం అయితే మరొకటి ఓ వ్యక్తి. అమెరికా ప్రజలపై నాకు వ్యతిరేకత లేదు. అమెరికాలోని పాలక వ్యవస్ధ అనుసరిస్తున్న సామ్రాజ్యవాద విధానాలకు నేను వ్యతిరేకం. వాటిని విమర్శిస్తాను. అనుకూలించినవారు ఆ విధానాల్లొ మంచిని చూపి నాతో వాదించాలి. దానికి బదులు అమెరికా చేసే మంచి నీకేమీ కనబడలేదా? ఎలా కనబడుతుంది అని చైనా ని తెస్తారు. అతి తెలివితేటలు.

  మీరు చెప్పే సంఘాలేవిటొ నాకు తెలియదు. నాకు తెలిసి ఒబామా, అమెరికా వ్యతిరేక సంఘాలేవీ ఉండవు. వర్గ సంఘాలుంటాయి. కార్మిక, విద్యార్ధి, రైతు, మహిళా తదితర సంఘాలుంటాయి. వారికి జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులపైన ఒక అవగాహన ఉంటుంది. అవగాహనల్లో వివిధ సంఘాల మధ్య అభిప్రాయభేదాలుండవచ్చు. ఆ భేదాలు వారు ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తున్నారో వారి ప్రయొజనాలమీద ఆధారపడి ఉంటాయి.

  కొన్ని కోట్ల మంది అభిమానిస్తున్నది ఒబామానా? ఒబామా రేటిం లాడెన్ని చంపకముందు నలభై శాతమే ఉంది. చంపాక యాభై దాటింది. పత్రికల దృష్టికి రాకుండా వ్యతిరేకిస్తున్నవారు చాలామంది ఉన్నారు. ఇవన్నీ అనవసరం లేండి. నన్ను వ్యక్తిగతంగా ఎందుకు విమర్శిస్తారు? ఆ హక్కెవరికీ లేదు. నేనే బ్లాగర్నీ వ్యక్తిగతంగా విమర్శించడం లేదు కదా. నేను రాసినదానిని విమర్శించడం పద్దతి. అది కూడా “నువ్వు రాసిందంతా అబద్ధం. సోదంతా వినాలా?” ఇలా రాస్తే చాలామందికి స్పందించలేదు. ఎక్కువగా అలా రాసిన ఇద్దరికి గట్టిగా బదులిచ్చాను. మిగిలినవాటిని స్పాంలో పెట్టాను. విషయాన్ని చర్చించే హక్కు ఉంటుంది తప్ప వ్యక్తిగతంగా విమర్శ చేసే హక్కు ఎవరికీ ఉండదు.

  గ్రూపు, బలమైన కారణం.. వీటిపై నాకు కొంత అవగాహన ఉంది. వెటకారం చేస్తున్న వారికి స్పష్టమైన లక్ష్యం ఉంది. అది నన్ను తిడుతూ పెట్టిన బ్లాగ్ లో వ్యక్తం చేశారు. నా స్పందన కూడా అలాగే ఉంటుంది. బలమైన కారణం లేదని మీరంటున్నారు కానీ వారు బలమైన లక్ష్యాన్నే చెప్పారు. నాలాంటి వాళ్లను మొగ్గలోనే తుంచడం అట. అవున్నిజమే కదా అనిపించేలా అబద్ధాలని ఎక్కిస్తామట. కొన్ని టెక్నిక్కులను (పొలైట్ గా రాయడం, స్పందించడం, మాట్లాడడం ఇవి టెక్నిక్కులట) ఉపయోగించి పిల్లలనూ, అమాయకులనూ నమ్మింస్తామట! అదీ ఇతరుల శక్తి పట్ల వారికున్న అవగాహన. నేను రాసింది ఎవరికైనా నిజమే కదా అనిపిస్తే వారు పిల్లో పిల్లోడో, లేదా అమాయకుడు. నన్ను తుంచే పద్దతి నా వాదనలలో తప్పు నిరూపించి తెలియజేయడం కాదు. వెటకారం చెయ్యడం, తిట్టడం, తిట్టుడు బ్లాగు పెట్టడం, వగైరా. ఆ బ్లాగు ఓ సారి చూడండి. నేనే ఆ బ్లాగులో ఎందుకిలా చేస్తున్నారని అడిగి కొన్ని సమాధానాలు రాబట్టాను. అవన్నీ ఇదిగో ఇలా ఉన్నాయి.

  కనుక వారిగురించి మీకు తెలియకుండా కొన్ని విషయాలున్నాయని అర్ధం అవుతోంది. స్మైలీలను వెటకారాల వాళ్ళు విస్తృతంగా వాడారు. అందుకని అవి చూస్తేనే అదో రకంగా ఉంది.

 32. విశేఖర్ గారూ! మీ బ్లాగు చాలా టావుంది. అభినందనలు! టపాలన్నీ సమాచారంతో, విశ్లేషణతో చక్కగా ఉంటున్నాయి. మీ వ్యాఖ్యల్లో కూడా విజ్ఞత, వివేకం కనపడుతున్నాయి.

  మీపై దూషణలతో రాసే వ్యతిరేక వ్యాఖ్యలను పబ్లిష్ చేయనప్పుడు
  వాటికి మీ ప్రతిస్పందనలు రాయటం అనవసరమే కదా? సమయం వృథా మీకూ, మాకూ. పనికిమాలిన రాతలను మనసుకు పట్టించుకోకండి. మీ రాతలు చదివేవాళ్ళు చాలామంది ఉంటారని గ్రహించి మీ దారిలో మీరు సాగిపొండి.

 33. మీపేరు ఫ్రాన్సిస్ గారని ఇంతకు ముందు ఒక వెబ్సైటు లో చూసానండి అందుకే వాడాను, అంటే మీరు ఈ బ్లాగులో ఈ పేరు తో ఉండాలి అనుకుంటున్నారు అని తెలియక వాడాను , అందుకు క్షమించండి .

 34. అజ్ఞాత గారు మీరు నా దినాన్ని చేసారు అంటే You made my day !

  అబ్బా నిజం గా ఎంత సంతోషం గా ఉందో నాకు , మరీ ముఖ్యం వీరి సరసన నన్ను చేర్చినందుకు నన్నొక ప్రముఖ బ్లాగరు గా గుర్తించినందుకు , ఇన్ని రోజులు నేనేదో నేనేమో ఒక line కు పది స్పెల్లింగ్ మిస్తేకులతో కాలం గడుపుతున్నాను అనుకున్నా కాదన్నా మాట ! నా సంగతి నాకే తెలియలేదు .

  btw ఏంటి సడన్ గా నాకు fake నుంచి ప్రముఖ బ్లాగరు పోస్టు ఇచ్చారు 🙂

 35. విశేఖర్ గారు మీరు నాపేరు వేరే వాళ్లకి అంటగట్టే వరకు నేను చాల మర్యాదగా స్పందించాను , infact మీరు కొత్తేమో బ్లాగుల్లో కంగారు పడుతున్నారు అని కొంచెం వివరం గా కామెంట్లు పెట్టాను . ఇక మీరు confuse ఐతే వేరే వాళ్ళని అనేస్తారా ? మరి మీకు ఇది తప్పు అనిపించటం , పైగా పొరపాటు పడ్డానేమో అని చెప్పే మీరు తరవాత కూడా అదే దోరణి లో మాట్లాడితే ఎలా ?

 36. అమెరికా నీతి అదే. జెస్సికా లించ్, లిండా, టిల్‌మేన్ ఉదంతాలు మరో చక్కని ఉదంతాలు. మన దేశంలోని ఎన్‌కౌంటర్స్ లాగా, విస్తరణవాద పాలకుల లక్షణమే అబద్ధాలు, కట్టు కధలు, రివర్స్ స్టోరీలు చెప్పడం. అమెరికా ఇంపీరియలిజం, మార్కెట్ కేపిటలిజం, క్రోనీ కేపిటలిజం, డెమొక్రసీ ముసుగులో ఫాసిజం, అనుసరిస్తాయి. మీడియాని ఫాసిస్టీకరణ చేస్తాయి. …పి.ఆర్

 37. మీరు చెప్పింది నిజమే. స్పాం కామెంట్లు తొలగించినపుడు వాటి సమాధానాలు కూడా తీసేయాలి. తీసేస్తాను.

 38. శ్రావ్యగారు, నేను తెలుగు బ్లాగులకు కొత్తన్న విషయాన్ని మీరు గమనించి రాసిన రెండు వ్యాఖ్యానాలను నేను మొదట చూళ్ళేదు. అవి స్పాంలో ఉన్నాయి. లేక నేనే స్పాం చేసేనేమో గుర్తు లేదు. వాటిని రాత్రి చూసి స్పాం నుండి తొలగించి వాటికి సమాధానాలు రాశాను. కాని ఈ లోపు మీ తర్వాతి వ్యాఖ్యానాలు చూసి వాటికి కొంత కటువుగా స్పందించాను.

  మీ పేరు అంటగట్టటం ఉద్దేశ్యపూర్వకంగా జరగలేదు. కన్ఫ్యూజన్‌లో అలా జరిగింది. వేరే వాళ్ళని తెలియకేగా అన్నది. అర్ధం చేసుకుంటే సరే. అర్ధం చేసుకోవడానికి కష్టంగా ఉంటే నా అపాలజీ స్వీకరించండి. మీ మద్దతుకు, సహాయానికి ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s