నిరాయుధుడు లాడెన్‌ను హత్య చేయడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం


Has justice been done

నిజంగానే న్యాయం జరిగిందా?

కమెండోలు దిగుతుండగానే లాడెన్ భవంతి నుండి కాల్పులు ఎదురయ్యాయనీ, లాడెన్ సాయుధంగా ప్రతిఘటించడంతోనే కాల్చి చంపామనీ మొదట చెప్పిన అమెరికా అధికారులు మెల్ల మెల్లగా నిజాలను ఒక్కొక్కటీ వెల్లడిస్తున్నారు. లాడెన్ భార్య దాడి చేయడంతో అమెనూ కాల్చి చంపామని చెప్పినవారు ఇప్పుడు ఆమె లాడెన్‌కు అడ్డుగా రావడంతో కాలిపై కాల్చామనీ, అమె బతికే ఉందనీ ఇప్పుడు చెబుతున్నారు. హెలికాప్టర్లపై కాల్పులు జరిగాయన్నవారు ఇప్పుడు దానిగురించి మాట్లాడ్డం లేదు. లాడెన్ సాయుధంగా ప్రతిఘటించాడన్న వారు ఇప్పుడు అతను నిరాయుధంగానే ఉన్నాడనీ, ప్రమాదకరంగా కదులుతుండడంతో కంటిలో గుండెపై కాల్చి చంపామని ఇప్పుడు చెబుతున్నారు.

యూరప్ లో కొన్ని దేశాలు బేషరతుగా అమెరికా చర్యను ఆహ్వానించాయి. ఇతర ప్రాంతాల్లోని వివిధ దేశాలు అమెరికా చర్యకు తర్వాత ఏమన్నప్పటికీ మొదట లాడెన్ హత్యను ఆహ్వానించాయి. ఇపుడు మెల్లగా నిరసన స్వరాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా లాడెన్ హత్యకు ఉన్న చట్టబద్ధతపై పలు వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి.

పశ్చిమ జర్మనీ మాజీ వైస్ ఛాన్సలర్ హెల్మట్ స్మిత్ జర్మనీ టివితో మాట్లాడుతూ “ఇది స్పష్టంగా అంతర్జాతీయ చట్టాలని ఉల్లంఘించడమే” అన్నాడు. “అరబ్ దేశాల్లో ఇప్పుడు అశాంతి వ్యాపించి ఉన్న నేపధ్యంలో ఈ ఆపరేషన్ వలన ఊహించని పరిణామాలు జరిగే అవకాశం ఉంది” అని ఆయన వ్యాఖ్యానించాడు. లండన్ లోని ప్రఖ్యాత మానవ హక్కుల లాయర్ జెఫ్రీ రాబర్ట్సన్ “లాడెన్ హత్య కిరాతక హత్య అయి ఉండవచ్చు. లాడెన్ అమరవీరుడుగా మారే అవకాశం లేకపోలేదు” అన్నాడు. “ఇది న్యాయం కాదు. అది న్యాయమనే పదానికి వికృతార్ధం. న్యాయం అంటే ఎవరినైనా కోర్టు ముందుకు తీసుకెళ్ళడం, సాక్ష్యాధారాలతో దోషిగా నిరూపించడం, ఆ తర్వాత శిక్షించడం” అని ఆస్ట్రేలియన్ లాయర్ విశ్లేషించాడు.

లాడెన్ నిరాయుధంగా ఉన్నప్పటికీ, అరెస్టు చేసె అవకాశం ఉన్నప్పటికీ చంపడం ఒక ఎత్తైతే పాకిస్తాన్ ప్రభుత్వానికి చెప్పకుండానే నాలుగు హెలికాప్టర్లు పాకిస్ధాన్ గగన తలంలోకి ఎగరడం, లాడెన్‌ని చంపి అతని భార్యను కూడా తీసుకెళ్ళి శవాన్ని సముద్రంలో పారేయడం మరో ఎత్తు. పాకిస్ధాన్ ప్రభుత్వానికి చెబితే లాడెన్‌కి సమాచారం ఇచ్చి తప్పించవచ్చన్న అనుమానంతోనే చెప్పలేదని అమెరికా అధికారులు బహిరంగంగానే చెబుతున్నారు. “పాకిస్ధాన్‌తో ఏవిధంగా కలిసి పనిచేయాలని ప్రయత్నించినా మొత్తం ఆపరేషన్ విఫలమవుతుందని నిర్ణయించుకున్నాం. వారు టార్గెట్ ని హెచ్చరించే అవకాశం ఉంది” అని సీఐఏ అధిపతి పెనెట్టా టైమ్ మాగజైన్ తో వ్యాఖ్యానించాడు.

పాకిస్ధాన్ విదేశీ మంత్రిత్వ శాఖ ఆరోపణలను తిరస్కరిస్తోంది. 2009 నుండీ లాడెన్ కాంపౌడ్ గురించిన సమాచారాన్ని ఐ.ఎస్.ఐ, సి.ఐ.ఏతోనూ ఇతర స్నేహ పూర్వక దేశాల సంస్ధలతోనూ పంచుకుంటోంది. ఏప్రిల్ మధ్య వరకూ సమాచారం ఇస్తూనె ఉంది అని విదేశీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. “అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానంతో పరిస్ధితులను తనకు అనుకూలంగా మలచుకోవడాన్ని ప్రముఖమైన అంశంగా గుర్తించాలి. ఒసామా బిన్ లాడెన్ ఐడెంటిటీని గుర్తించి అతన్ని చేరడానికి, ఐ.ఎస్.ఐ ఇచ్చిన సమాచారాన్నే సి.ఐ.ఏ వినియోగించుకుంది” అని తన సుదీర్ఘ ప్రకటనలో పేర్కొన్నట్లు రాయిటర్స్ తెలిపింది.

తాలిబాన్, లాడెన్ చావుపై అమెరికా చేసిన ప్రకటనను సవాలు చేసింది. లాడెన్ చనిపోయాడని నిరూపించేందుకు ఆమోదయోగ్యమైన సాక్ష్యాన్ని అమెరికా చూపించలేక పోయిందని తాలిబాన్ పేర్కొంది. ఎప్పుడో ఒక సారి ఏదో ఒక ఫోటో విడుదల చేయడం తధ్యం అని పెనెట్టా చెప్పినా చనిపోయినప్పటి ఫోటోలు విడుదల చేయాలా వద్దా అన్న విషయంలొ కొన్ని సున్నిత సమస్యలున్నాయని మరో అధికారి తెలిపాడు. అయితే మొదట అమెరికా అధికారులు చెప్పిన దానికీ ఇప్పుడు చెబుతున్నదానికీ పొంతన లేకపోవడం అనేక అనుమానాలకు ఆస్కారం ఇస్తున్నది.

కమేండోలు హెలికాప్టర్ నుండి దిగుతున్నపుడే కాంపౌండ్ నుండి కాల్పుకు జరిగాయని అమెరికా భద్రతాధికారి ఒకరు తెలిపారు. ఫాగ్ ఆఫ్ వార్ అంటూ ఒక విలేఖరి రాయడం వలన అపార్ధాలు రావడానికి ఆస్కారం ఏర్పడిందని వైట్ హౌస్ ప్రతినిధి జే కార్నే అభిప్రాయపడుతున్నాడు. పాకిస్ధాన్ విదేశీ శాఖ అమెరికా ఆపరేషన్ ను పాకిస్ధాన్ ప్రభుత్వ అనుమతి లేకుండా చేసిన ఏకపక్ష చర్యగా నిరసించింది.

లాడెన్ ప్రతిఘటించడంపై స్పష్టమైన వివరాలను ఇవ్వడంలో అమెరికా అధికారులు తడబడుతున్నట్లుగా కనిపిస్తోంది. “బిన్ లాడెన్‌ను సజీవంగా పట్టుకోవడానికి ప్రతిఘటన ఎదురౌతుందని భావించాము. నిజంగానే లాడెన్ ప్రతిఘటించాడు కూడా” అని వైట్ హౌస్ ప్రతినిధి కార్నే మంగళవారం చెప్పాడు. “ఒక స్త్రీ… లాడెన్ భార్య అమెరికా కమాండో (assaulter) వైపుకి కొద్దిగా ఊపుతో వచ్చింది. అమె మోకాలిపై కాల్చారు తప్ప చంపలేదు. ఆ తర్వాత బిన్ లాడెన్‌ను కాల్చి చంపేశారు. అతని వద్ద ఏ ఆయుధమూ లేదు” అని కార్నే వివరించాడు. అయితే అధ్యక్ష భవనంలోని కౌంటర్ టెర్రరిజం ముఖ్య అధికారి జాన్ బ్రెన్నన్ సోమవారం చెప్పిన కధనం వేరే విధంగా ఉంది. “అతను కాల్పుల్లో (firefight) పాల్గొన్నాడు. అతని ఆయుధం నుండి కాల్చిందీ లేనిదీ మాత్రం నాకు తెలియదు” అని బ్రెన్నెన్ తెలిపాడు.

బిన్ లాడెన్ గానీ ఇతరులు గానీ ఆత్మహత్యా బెల్టులను ధరించి ఉన్నదీ లేనిదీ కమేండోలకు తెలియదని అమెరికా అధికారులను ఉటంకిస్తూ న్యూయార్క్ద్ టైమ్స్ కూడా రాసింది. సి.ఐ.ఏ అధిపతి వివరన లాడెన్ హత్యను సమర్ధించుకునే రీతిలో సాగింది. “కమేండోలు మూడో అంతస్ధులో ఉన్న లాడెన్ రూంకి చేరడంతోటే లాడెన్ ప్రమాదకరంగా కదలడంతో వారు కాల్పులు ప్రారంబించారు” అని ఆయన పిబిస్ టివీ తో మాట్లాడుతూ తెలిపినట్లుగా రాయిటర్స్ రాసింది. “బిన్ లాడెన్ ను చంపమనే (కమేండోలకు) అక్కడ ఉన్న అధారిటీ. ఎంగేజ్‌మెంట్ నిబంధనల ప్రకారం ఎదుటి వ్యక్తి చేతులు గాల్లొకి లేపి లొంగిపోయినట్లయితే, ఎటువంటి ప్రమాదం అతనినుండి ఎదురౌతున్నట్లు సూచనలు కనిపించకపోతే అతనిని పట్టుకోవడమే సరైనది. కాని అతన్ని చంపడానికి వారికి పూర్తి అధికారం ఉంది” అని సీఐఏ డైరెక్టర్ పనెట్టా వివరించాడు.

పనెట్టా మాటల్లో స్పష్టంగా తెలుస్తోంది. చేతులెత్తి లొంగిపోవడానికి సిద్దపడినా, ఎటువంటి ప్రమాద సూచనలు కనపడకపోయినా లాడెన్ ని సజీవంగా పట్టుకోవడమే నిబంధనల ప్రకారం సరైందని పనెట్టా అంగీకరిస్తున్నాడు. కానీ కమెండోలకు చంపే అధికారం ఇచ్చేశారు కదా, అందుకే చంపేశారు. వాళ్ళకి (ఎట్టి పరిస్ధితుల్లోనైనా) చంపే అధికారం ఇచ్చాం కాబట్టే చంపారని పెనెట్టా అంగీకరిస్తున్నాడు. లాడెన్ లొంగిపోతే పట్టుకుని ఉండేవారనీ వాస్తవానికి ఆ ఆపరేషనే చంపే ఆపరేషన్ అని అమెరికా భద్రతాధికారి సోమవారం చెప్పినట్లు రాయిటర్స్ రాసింది.

ఇదే కాదు. లాడెన్ ఓ మహిళను మానవ నిరోధంగా (human shield) ఉపయోగించుకున్నాడని సోమవారం చెప్పిన అధికారులు ఇప్పుడు ఆ ప్రకటన నుండి వెనక్కు తగ్గారు. లాడెన్‌ని సజీవంగా పట్టుకునే అవకాశం దొరికినా కాల్చి చంపారనేది సుస్పష్టం. “చంపేశాం” అని ప్రకటించిన వెంటనే కార్పొరేట్ పత్రికల ప్రచారంలో మునిగి తేలుతున్న ప్రజలు మొదట సానుకూలంగా స్పందించి ఉండొచ్చు. కానీ ఆ తర్వాత వెలువడే విశ్లేషణలకు కూడా ప్రజలు స్పందించక పోరు.

 • అరెస్టు చేసి కోర్టుల్లో విచారించి సాక్షాలతో నిరూపించి శిక్షించే అవకాశం ఉన్నా ఎందుకు లాడెన్‌ను కాల్చి చంపారు?
 • నేర నిర్ధారణ జరగకుండా, నేరారోపణతోనే నేరం నిర్ధారించి చంపడం ప్రజాస్వామిక నాగరికతా సూత్రమా?
 • ఈ ఆటవి న్యాయంతోనేనా లిబియా అధ్యక్షుడిని ఏ నేరం చేయకుండానే చంపబోతున్నది?
 • లాడెన్‌ది మత మౌఢ్యం, గడ్డాఫీ నియంత కాబట్టి చంపడానికి అర్హులు అయితే ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ దేశాల్లో మిలియన్ల మంది పౌరులను, పిల్లలను, స్త్రీలను చంపిన, ఇంకా చంపుతున్న అమెరికా అధికారులకు, ప్రభుత్వానికి, రాజకీయ నాయకులకు ఏది శిక్ష?

15 thoughts on “నిరాయుధుడు లాడెన్‌ను హత్య చేయడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం

 1. వాహ్! ఏం చెప్పారండి. మీకు నోబుల్ శాంతి బహుమతి, మీ బ్లాగుకు పులిట్జర్ ఇవ్వాలి. నే రెకమండ్ చేస్తున్నా. మీది టి.వి9 బ్లాగా?

 2. మీ పేరు పలకడం నావల్ల కాలేదు.

  మీ వెటకారాలూ, సర్టిఫికెట్లూ మాని విషయం ఏమన్నా ఉంటే చర్చించండి. చర్చిందుకుందాం. ఇంతకు ముందొకరిలాగె రాస్తే బదులు రాశాను. మీకూ రాస్తున్నా. అభివృద్ధి అవుతున్న టెక్నాలజీని ఉపయోగించుకుని సామాజిక సంబంధాల్ని మరింత మెరుగుపరుచుకోవాలే తప్ప ఇలా మొదలు కాకుండానే నాశనం చేసుకోవడానికి పూనుకోవడం కరెక్టు కాదు. దూరంగా ఉన్నాం కాబట్టి ఎలా రాసినా చెల్లుబాటవుతుందని మీరు భావించవచ్చు. కాని అది సభ్యత అనిపించుకోదు.

  నేను రాసిందాంట్లొ ఫలానాది అభ్యంతరకరం. దానికి కారణం ఇది. అందుకని వ్యతిరేకిస్తున్నా అనండి, పద్దతి. ఇంతవరకూ మనం ఎక్కడా తటస్ధ పడింది లేదు. అయినా వెటకారం చేయడానికి లైసెన్సు దొరికినట్టేనా, ఎదురుబొదురుగా లేనందుకు?

 3. ట్విన్ టవర్స్ లో నిరాయుధులైన 3000 మందిని చంపినప్పుడు అంతర్జాతీయ చట్టాలు ఒప్పుకున్నయ్యా?

 4. మీ ప్రశ్న సరిగా లేదు.

  మూడువేల మందిని చంపడం నేరం. దానికి చట్టాలు ఒప్పుకునే ప్రశ్నే ఉదయించదు. మీ ప్రశ్నకు జవాబేమీ లేదు. జవాబు లేనిది ప్రశ్న కాదు.

  నేను అడుగుతున్న విషయం లాడెన్ మూడువేల మందిని చంపినా అతన్ని చంపడం తప్పని కాదు. ఆ చంపిన విషయాన్ని విచారించి, నిర్ధారించి, శిక్షవేసి, శిక్షించమని. ఆరోపణలు ఒక్క లాడెన్ మీదే కాదు. అమెరికా ప్రభుత్వం లోని వారిపైన కూడా ఉన్నాయి. అన్నీ విచారించి శిక్షించడం నాగరిక సమాజాల లక్షణం.

  అమెరికాలో ఉన్నది నాగరిక సమాజమనీ, అధ్యక్షుడూ, అధికారులూ, సైన్యం తదితరులూ నాగరికులే అన్న అంచనాతో విచారించి శిక్షించండి అనంటున్నా. నాగరీకులు కాకపోతే వేరే సంగతి.

 5. తలతిక్కతో కళ్ళు కనిపించడంలేదు లాగుంది తమరికి. రాసింది సరిగా చదవకపోతే ఇట్లాంటి దరిద్రాలే ఏడుస్తాయి. పోస్టుని సరిగ పూర్తిగా చదవండి. తెలుస్తుంది. మళ్ళీ ఇటువైపు రాకండేం. అమెరికా న్యాయమే కావాలిగా తమరికి. అదే చేస్తా. ఏం రాసిందీ చూడను.

  మీలాగే మీకిష్టమైన బురదలో దొర్లే పందులు ఇంకా చాలా ఉన్నట్లు కనిపిస్తోంది. వారితో కలిసి తృప్తితీరా దొర్లండి. ఇక్కడ బురదలేదు. ఊపిరాడక చచ్చే ప్రమాదం ఉంది.

 6. *పిల్లలను, స్త్రీలను చంపిన, ఇంకా చంపుతున్న అమెరికా అధికారులకు, ప్రభుత్వానికి, రాజకీయ నాయకులకు ఏది శిక్ష? *

  మీరేమైనా అమెరికా…ఎడిట్

 7. ఈ కామెంట్ తో ఈ మంద ఎక్కడితో అర్ధమైంది. అంత తలనొప్పెందుకు? మీ అగ్రిగేటర్ నుండి నాబ్లాగు తీసెయ్. సంతోషిస్తాను. అమెరికా ఎంగిలి మెతుకులు తిని దాని పనులకి ఏజెంట్లుగా దిగి తెలుగు ఇంటర్నెట్ ని ఇంతలా ఖరాబు చేయడానికి రెడీ అయ్యారన్నమాట.

 8. ఒసామాను చంపడం అమెరికా ప్రపంచ ఆధిపత్యంలో ఒక భాగం. తమకు ఎదురు తిరిగిన వారిని టెర్రరిస్టులుగా ప్రచారం చేయడం అమెరికా సహజ బుద్ధి. ఒబామా ఛాందస భావాలు కలవాడైనా నేడు అమెరికాకి వ్యతిరేకంగా పోరాడుతున్నవారికి, ముస్లిం ప్రపంచానికి హీరో. అమెరికా, పాక్ ప్రభుత్వాలు కలిసి చేసిన హత్య ఇది. పాకిస్ధాన్ ని ప్రొటెక్ట్ చెయ్యడానికి అమెరికా ఆ వాదన చేస్తున్నది. పాక్ భూభాగంలోకి హెలికాప్టర్లు రావడం తెలియదనడం పచ్చి బూటకం. కొందరు గుడ్డిగా అమెరికా చెప్పింది నమ్ముతున్నారు. ..పి.ఆర్

 9. నిర్ధారణ జరగకుండా, నేరారోపణతోనే నేరం నిర్ధారించి చంపడం
  _____________________________________

  Laden openly declared in 2004 that he was behind the attacks .. right?

 10. ఎవరినండీ విచారించాలి? ఎందుకండీ విచారించాలి? తామే ఒక ఆయుధంగా తయారై మానవ జాతినే నిర్మూలించాలనుకున్న వాళ్ళకు మానవ హక్కులుండాలా? వాడసలు మనిషా?

  కసబ్ లాగా అరెస్టు చేసి రాచమర్యాదలతో కొత్తల్లుడిని మేపినట్లు కోట్లు ఖర్చుపెట్టాలా వీడికి కూడా!ముక్కో మొహం కూడా తెలియని మనుషుల ప్రాణాలను పూచిక పుల్లలతో సమానంగా భావించి పిల్లా పాప అని లేకుండా హరించి వేసిన వాడికి మానవ హక్కులుండాలని వాదించడం న్యాయమా? కత్తిని విసిరే వాడిని కత్తి తో కాక, పూలదండలేసి మర్యాదలు చేసి ఆ తర్వాత విచారిస్తామా?

 11. టవర్లపై దాడి వెనక తానున్నానని లాడెన్ చెప్పలేదు. ‘టవర్లపై దాడిలో నా పాత్ర లేదు. కాని ఉండి ఉంటే బాగుండేదని కోరుకుంటున్నాన”న్నాడు.

 12. సుజాత గారూ, మానవ జాతిని నిర్మూలించాలని అనుకున్నాడు అనడంలో వాస్తవం లేదనుకుంటా. అమెరికా టవర్ల దాడిని అడ్డం పెట్టుకుని లాడెన్‌ని పట్టుకునే పేరుతో ఆఫ్ఘనిస్ధాన్‌ని సర్వనాశనం చేసింది. లాడెన్ సౌదీ అరేబియా దేశస్ధుడు. దాక్కుంది పాకిస్ధాన్‌లో. కాని అమెరికా దాని మిత్ర దేశాలు దాడి చేసింది ఆఫ్ఘనిస్ధాన్‌పైన. అమెరికా చేసిన పనిలో ఏమైనా అర్ధం ఉందంటారా?

  అర్ధం ఉంది. కాని అది లాడెన్‌ని పట్టుకోడానికి కాదు. పోటీగా ఎదుగుతున్న చైనా, ఇండియాలకి సమీపంలో సైనిక స్ధావరం ఏర్పాటు చేసుకుని ఈ రెండు దేశాలపై మిలట్రీ కన్నేసి ఉంచడానికి. దాన్ని ప్రతిఘటిస్తున్న వారిపై యుద్ధం చేస్తోందది. ఆఫ్ఘన్ యుద్ధంలో ఇప్పటికే లక్షల మంది ప్రజలు చనిపోయిన సంగతి అమెరికావాళ్ళ అంతర్గత డాక్యుమెంట్లలో రాసుకున్న విషయం వెల్లడయ్యింది. పౌరులు చనిపోయిన విషయం దాచిపెట్టిన విషయం కూడా వెల్లడయ్యింది. లాడెన్ ఎంచుకున్న మార్గం టెర్రరిజమే. దాన్ని ఎవరూ సమర్ధించరు. కానీ ఎక్కడునుండో వచ్చి తన స్వార్ధం కొసం పరాయిదేశంపై దాడి చేసి లక్షల మందిని చంపడం అంతకంటే పెద్ద టెర్రరిజం అని గుర్తించాలి.

  మీరు గమనించారో లేదో, ఆఫ్ఘనిస్ధాన్‌పై అత్యాధుని ఆయుధాలతో దాడి చేసినపుడు లాడెన్ దొరకలేదు. పది సంవత్సరాలనుండి చేస్తున్న ఆఫ్ఘన్ యుద్ధంలో లాడెన్ దొరకలేదు. ఇరాక్‌పైన పది సంవత్సరాలకు పైగా చిన్నపిల్లల పాలడబ్బాలు కూడా అందకుండా ఆంక్షలు విధించి లక్షల మంది పిల్లలు చనిపోవడానికి కారణమైనప్పుడూ లాడెన్ దొరకలేదు. ఇరాక్‌లో సామూహిక విధ్వంసక ఆయుధాలు లేవని ఐక్యరాజ్య సమితి సర్టిఫై చేసినా ఉన్నాయని అబద్ధాలు చెప్పి మూకుమ్మడి దాడి చేసినప్పుడూ లాడెన్ దొరకలేదు. సద్దాం హుస్సేన్‌ని పట్టుకుని ఉరితీసి అమెరికా అనుకూల ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నా లాడెన్ దొరకలెదు. చివరికి కేవలం 69 మంది కమాండోలూ, నాలుగు హెలికాప్టర్లతో మాత్రమే వెళ్తే నిరాయుధుడుగా, సాయుధ ప్రతిఘటన లేకుండా లాడెన్ దొరికాడు (అని చెబుతున్నారు). ఎక్కడో కొండల్లో గుహల్లో ఉన్నాడని కధలు చెప్పి ఆఫ్ఘనిస్ధాన్ని సర్వనాశనం చేసిందే అమెరికా, మరి దానికిప్పుడు సమాధానం ఎవరు చెప్తారు? చనిపోయిన లక్షలాది మంది ప్రజల ప్రాణాలకు జవాబుదారీ ఎవరు? యుద్ధ దాడుల్లో అవయువాలు కోల్పోయిన మరిన్ని లక్షలమందికి ఎవరు భాధ్యత?

  లాడెన్ టర్రరిజం అమెరికా తదితర పశ్చిమ దేశాల ప్రభుత్వాల టెర్రరిజాలకు స్పందనగా మాత్రమే తలెత్తింది తప్ప కేవలం చంపడానికి తలెత్తలేదు. అలా ఎక్కడా ఎప్పుడూ జరగలేదు. అసలు లాడెన్‌ని అమెరికా ఎందుకు పెంచి పోషించింది? అది ఆలోచించారా?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s