నిరాయుధుడు లాడెన్‌ను హత్య చేయడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం

కమెండోలు దిగుతుండగానే లాడెన్ భవంతి నుండి కాల్పులు ఎదురయ్యాయనీ, లాడెన్ సాయుధంగా ప్రతిఘటించడంతోనే కాల్చి చంపామనీ మొదట చెప్పిన అమెరికా అధికారులు మెల్ల మెల్లగా నిజాలను ఒక్కొక్కటీ వెల్లడిస్తున్నారు. లాడెన్ భార్య దాడి చేయడంతో అమెనూ కాల్చి చంపామని చెప్పినవారు ఇప్పుడు ఆమె లాడెన్‌కు అడ్డుగా రావడంతో కాలిపై కాల్చామనీ, అమె బతికే ఉందనీ ఇప్పుడు చెబుతున్నారు. హెలికాప్టర్లపై కాల్పులు జరిగాయన్నవారు ఇప్పుడు దానిగురించి మాట్లాడ్డం లేదు. లాడెన్ సాయుధంగా ప్రతిఘటించాడన్న వారు ఇప్పుడు అతను నిరాయుధంగానే…

లాడెన్‌ని అమెరికా చంపినట్టే అమెరికాలో చొరబడి ముంబై దాడి నిందితుడు హేడ్లీని చంపేద్దామా!?

వరల్డ్ ట్రేడ్ సెంటర్ కి చెందిన జంట టవర్లను కూల్పించి మూడు వేల మంది అమెరికన్లను చంపాడన్న ఆరోపణపై ఒసామా-బిన్-లాడెన్ ను పాకిస్ధాన్‌కి చెప్పకుండా అతని ఇంటిపై దాడి చేసి చంపింది. “దాడి సంగతి మాకు తెలియదు” అని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. పాకిస్ధాన్ ప్రభుత్వానికి చెబితే ఒసామాను తప్పించవచ్చన్న అనుమానంతో వాళ్ళకి చెప్పలేదని సి.ఐ.ఏ డైరెక్టర్ టైమ్స్ మేగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టాడు. “మీ అబ్బాయిని చంపినవాడు మాయింట్లో దాచిపెడితే ఏం చేస్తావు? నా…

డేటా దొంగతనంలో గూగుల్‌, సౌత్ కొరియా పోలీసుల విచారణ

పశ్చిమ దేశాల్లో ఐదారు సంవత్సరాల నుండి యూజర్ల డేటా దొంగిలిస్తూ అడ్డంగా దొరికిపోయిన గూగుల్ సంస్ధ తాజాగా దక్షిణ కొరియాలో కూడా అదేపని చేస్తూ దొరికిపోయింది. మంగళ వారం దక్షిణ కొరియా రాజధాని సియోల్ లోని గూగుల్ ఆఫీసుపై పోలీసులు దాడి చేశారు. గూగుల్‌కి చెందిన మొబైల్ ప్రకటనల యూనిట్ ‘యాడ్‌మాబ్’, మొబైల్ వినియోగదారుల అనుమతి లేకుండా వారి లొకేషన్ వివరాలను సేకరించింది. యాడ్‌మాబ్ ను గూగుల్ గత సంవత్సరం కొనుగోలు చేసింది. ప్రపంచ సెర్చి మార్కెట్లో…