గడ్డాఫీ నివాస భవనాలపై శక్తివంతమైన మిసైళ్ళతో దాడులు చేయడం వలన గడ్డాఫీ కొడుకుతో పాటు ముగ్గురు మనవళ్ళు చనిపోవడంతో లిబియా రాజధాని ట్రిపోలి ప్రజలు అగ్రహోదగ్రులయ్యారు. నాటో హంతక దాడులను వ్యతిరేకిస్తూ పశ్చిమ దేశాల రాయబార కార్యాలయాల ముందు ట్రిపోలి ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. పశ్చిమ దేశాల హంతకదాడులకు కొమ్ము కాస్తున్న ఐక్యరాజ్య సమితి కార్యాలయాల మీద కూడా దాడులు చేయడంతో సమితి తన కార్యాలయాల్ని మూసుకుని తమ సిబ్బందిని వెనక్కి పిలిపించుకుంది.
బ్రిటన్ లోని విదేశాంగ కార్యాలయం ఓ ప్రకటన జారీ చేసింది. “ట్రిపోలీలోబ్రిటిష్ నివాసాన్ని నాశనం చేశారని వార్తలు మా దృష్టిలో ఉన్నాయి. ఈ విషయం పరిశోధిస్తున్నాం. ఇతర దేశాల రాయబార కార్యాలయాలపై కూడా దాడులు జరిగాయని తెలుస్తోంది. ఆ వార్తలు రూఢి అయితే గనక ఖండనార్హం. రాయబార కార్యాలయాలను సంరక్షించాల్సిన భాధ్యత గడ్డాఫీ ప్రభుత్వం పై ఉంది. అంతర్జాతీయ సూత్రాలను గడ్డాఫీ ఉల్లంఘిస్తున్న దానికి ఇది మరో రుజువు” అని ఆ ప్రకటనలో తెలిపారు. అదీ సంగతి! వీళ్ళు బరితెగించి ఓ స్వతంత్ర దేశానికి చెందిన అధ్యక్షుడి ఇంటిపై బాంబులేసి చంపొచ్చు. అందుకు కోపం వచ్చిన ఆ దేశ ప్రజలు తమ రాయబార కార్యాలయాలను ఏమీ చేయకుండా ఆ అధ్యక్షుడే కాపలా కాయాలి. ఆటవిక నీతి అంటే ఇదే కదా! పశ్చిమ దేశాల రాజ్యాలు ఇంకా రాచరికపు కంపులోనే ఇంకా ఉన్న సంగతి వీరి ఆటవిక న్యాయమే రుజువు చేస్తున్నది.
శనివారం రాత్రి నాటో యుద్ధ విమానాలు గడ్డాఫీ అధికారిక నివాస భవనాలపై శక్తివంతమైన మిసైళ్ళతో దాడులు చేశాయి. ఆ భవనాల్లో ఉన్న గడ్డాఫీ చివరి కొడుకు సైఫ్ ఆల్-అరబ్ చనిపోయాడు. 29 సంవత్సరాల సైఫ్, జర్మనీలో విద్యాభ్యాసం చేస్తున్నాడనీ, ఇటీవలే లిబియా వచ్చాడనీ లిబియా ప్రభుత్వ ప్రతినిధి మౌసా ఇబ్రహీం తెలిపాడు. సైఫ్ కి రాజకీయాలతో పరిచయం లేదనీ, ప్రముఖుడు కూడా కాడనీ అతన్నీ, ముగ్గురు గడ్డాఫీ మనవళ్ళనూ చంపి నాటో దళాలు ఏ పౌరుల్ని రక్షించదలుచుకున్నాయో అర్ధం కావడం లేదని ఇబ్రహీం ఆగ్రహం వ్యక్తం చేశాడు.
నాటో దాడుల్లో నాశనమయిన బాబ్ అల్-అజీజియా కాంపౌండ్‌లోని భవన శిధిలాలను విదేశీ విలేఖరులకు లిబియా అధికారులు చూపించారు. భవనం పూర్తిగా ధ్వంసం అయిందని విలేఖరులు తెలిపారు. లిబియా ప్రభుత్వ కమాండ్ అండ్ కంట్రోల్ పైనే తాము దాడి చేశామని నాటొ అధికారులు వివరణ ఇస్తున్నారు. నాటో టారెట్లన్నీ స్వభావ రీత్యా మిలట్రీవే నని వారు సెలవిచ్చారు. నాటో బాంబు దాడుల్లో నివాస భవనాలు కూలినా, మరింకేమి కూలినా అవి ఆటోమేటిగ్గా మిలట్రీ టార్గెట్లే అవుతాయని నాటో చెబితే సరిపోతుంది.
ఒక దేశ అధ్యక్షుడు నివాసం ఉండే భవనంపై దాడి చేసి చంపాలని ప్రయత్నించడం వీరికి కొత్త కాదు. ఇదే గడ్డాఫీ భవంతిపై రీగన్ కాలంలో బాంబులేసి చంపబోయారు. అప్పుడూ గడ్డాఫీ తప్పించుకున్నాడు. గ్రెనెడా అనే చిన్న దేశం స్వతంత్ర నిర్ణయం తీసుకున్నందుకు డెబ్భైల్లో దానిమీద బాంబు దాడి జరిపించి అమెరికా. పనామా అధ్యక్షుడి పైన తప్పుడు విచారణ జరిపి ఏకంగా అమెరికా జైల్లోనే కుక్కారు. దక్షిణ అమెరికాలో అనేక దేశాలు అమెరికా ఆటవిక న్యాయానికి బలయ్యాయి. ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ ల సంగతి చెప్పనవసరం లేదు. తాజాగా లిబియా.
That’s …. (Edited)
Just stop your nonsense here. This is not the place for spitting out the garbage from a self proclaimed intellectuals like you, who does not know the basic principles of the conversation. I am deleting your abusive comments and still you are keeping on posting your senseless rant.
మీతో పాటు బురదలో దొర్లడానికి ఇంకా చాలా …..లు దొరకొచ్చు. వాళ్ళతో కలిసి దొర్లండి. సైన్సు, టెక్నాలజీల అభివృద్ధి సామాజిక సంబంధాలు మరింత మెరుగుపరుచుకోచడానికి ఉపయోగించుకోవాలి గాని ఇలా మొదలు కాకముందే సంబంధాల్ని నాశనం చేసుకోవడానికి కాదు. ఇంటర్నెట్‌లో ఒకరినొకరు చూసుకోలేనంత మాత్రాన, ఎంతో దూరంలో ఉన్నంత మాత్రాన ముక్కు, మొహం తెలియని వాళ్ళతో కూడా ఉత్తి పుణ్యానికి తగాదాలు పెట్టుకుని ద్వేషాలు, ఈగోలు వెళ్ళగక్కడానికి లైసెన్సు దొరికినట్లు భావిస్తున్నారా?
అమెరికా మీద రాస్తే ద్వేషం వెల్ళగక్కి, చైనా మీద రాస్తే గుడ్ అని మెచ్చుకోవడం… ఇదంతా మీకు గొప్పగా ఉందేమోగాని, నాకు పరమ రోతగా ఉంది మీ రాతలు చూస్తుంటే. ఎదురుబొదురుగా మాట్లాడలేని పరిస్ధితుల్లో రాతతో కూడా మెప్పించడం సంస్కార వంతుల లక్షణం. కదిలిచ్చి మరీ కుసంస్కారాన్ని ఆరబోసుకోవడం తమరికి గొప్పేమో గాని నాకిక్కడ డోకొస్తున్నట్టుంది.
ఈ బ్లాగు మొదలు పెట్టి మూడు నెలలు కూడా కాలేదు. పోలోమని వచ్చిపడి ఎగతాళి చేస్తూ రాయడం, అకారణంగా ద్వేషం వెళ్ళగక్కడం… ఏంటివన్నీ? నీ ఆత్మ సంతృప్తికి ఇంకా చాలా మార్గాలున్నాయి. ఒక వైపు అమెరికా స్వేఛ్ఛా సమాజం అంటారు, మరోవైపు చైనాలో స్వేఛ్ఛ లేదు అంటారు. తమకు నచ్చిన అభిప్రాయాలు రాసుకోవడానికి బ్లాగర్లకు ఉన్న స్వేఛ్ఛా హక్కుని గుర్తించాలన్న కనీస జ్ఞానం మాత్రం ఉండదు.
బాగా చెప్పారు.