లిబియా తిరుగుబాటు ప్రభుత్వానికి మరిన్ని దేశాల గుర్తింపు, మొదలైన ఆయిల్ ఎగుమతులు

లిబియా తూర్పు ప్రాంతంలో పెద్ద పట్టణమైన బెంఘాజీ కేంద్రంగా ఏర్పదిన తాత్కాలిక తిరుగుబాటు ప్రభుత్వం (లిబియా జాతీయ కౌన్సిల్) మరిన్ని దేశాల గుర్తింపును పొందింది. కౌన్సిల్ ఏర్పడడంతోనే ఫ్రాన్సు గుర్తించిన సంగతి విదితమే. ఫ్రాన్సు, బ్రిటన్ లు కాలికి బలపం కట్టుకుని మరీ యూరోపియన్ దేశాలను కోరినప్పటికీ అవి తిరుగుబాటు ప్రభుత్వాన్ని గుర్తించడానికి ముందుకు రాలేదు. యూరోపియన్ యూనియన్ కు ఆర్ధికంగా నాయకత్వం వహిస్తున్న జర్మనీ తిరుగుబాటు ప్రభుత్వాన్ని గుర్తించడానికి గట్టిగా నిరాకరించింది. పశ్చిమ దేశాలు లిబియాపై…

పౌరుల రక్షణ పేరుతో ఐవరీకోస్ట్ అధ్యక్షుడి నివాసంపై దాడి చేసిన సమితి, ఫ్రాన్సు సైన్యాలు

ప్రతి సభ్య దేశం పట్ల నిష్పాక్షింగా వ్యవహరించాల్సిన ఐక్యరాజ్యసమితి నిజానికి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు తదితర పశ్చిమ దేశాల జేబు సంస్ధ అని మరో సారి రుజువయ్యింది. ఐవరీ కోస్టు దేశ అధ్యక్షుడి భవనంపై ఐక్యరాజ్యసమితికి చెందిన శాంతి స్ధాపనా సైనికులు, ఫ్రాన్సుకి చెందిన సైనికులు సోమవారం బాంబు దాడులు నిర్వహించాయి. అధ్యక్షుడు లారెంట్ జిబాగ్బో నివాస భవనం, ప్రభుత్వ టెలివిజన్ ప్రధాన కార్యాలయం, రిపబ్లికన్ గార్డుల భవనం, పారామిలిటరీ కార్యాలయం లపై ఫ్రాన్సు, సమితి సైన్యాలు…

ప్రమాదకర రేడియేషన్ నీటిని సముద్రంలోకి వదులుతున్న జపాన్

శక్తివంతమైన భూకంపం, సునామీ ల తాకిడితో దెబ్బతిన్న ఫుకుషిమా దైచి అణు రియాక్టర్లవద్ద వెలువడుతున్న రేడియేషన్ సంక్షోభాన్ని జపాన్ ప్రభుత్వం ప్రపంచ సమస్యగా మారుస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. రెండో రియాక్టరు వద్ద తీవ్రంగా కలుషితమైన నీటిని తోడివేసేందుకు ఖాళీ లేనందున, తక్కువ స్ధాయిలో కలుషితమైన నీటిని సముద్రంలో కలిపి ఖాళీ సృష్టించడానికి జపాన్ నడుం కట్టింది. రెండో రియాక్టర్ 20 సెంటీ మీటర్ల మేరకు పగుళ్ళిచ్చిందని అణు కర్మాగారం ఆపరేటర్ టెప్కో (టోక్యో ఎలెక్ట్రిక్ పవర్ కంపెనీ)…

అమెరికాలో ఖురాన్ తగలబెట్టడంపై ఆఫ్ఘనిస్తాన్ లో విస్తరిస్తున్న హింసాత్మక నిరసనలు

మార్చి 20 తేదీన అమెరికాలోని ఫ్లోరిడాలో క్రైస్తవ మత మూర్ఖుడు పాస్టర్ ‘టెర్రీ జోన్స్ ‘ ముస్లిం మత పవిత్ర గ్రంధం “ఖురాన్”ను తగలబెట్టడాన్ని నిరసిస్తూ ఆఫ్ఘనిస్తాన్లో హింసాత్మక నిరసనలు దేశమంతటా విస్తరిస్తున్నాయి. కాందహార్, జలాలాబాద్ పట్టణాల్లో వందలమంది ఆఫ్ఘన్లు నిరసన ప్రదర్శనలు జరిపారు. ఉత్తర ఆఫ్గనిస్తాన్ లోని మజార్-ఎ-షరీఫ్ పట్టణంలో గత శుక్రవారం జరిగిన నిరసన ప్రదర్శనల అనంతరం జరిగిన హింసలొ 14 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. వీరిలో ఏడుగురు ఐక్యరాజ్యసమితి ఉద్యోగులు. కాందహార్…

ఆఫ్రికా దేశం ‘ఐవరీ కోస్ట్’ను ఆక్రమించుకున్న ఫ్రెంచి సేనలు

ఆఫ్రికా ఖండంలో బుల్లి దేశమైన ఐవరీ కోస్ట్ లో ఫ్రాన్సు పన్నాగాలు కొనసాగుతున్నాయి. తాజాగా 800 మంది ఫ్రెంచి సైనికులను ఐవరీ కోస్ట్ కి పంపింది. అక్కడి ప్రధాన నగరం అబిద్ జాన్ లోని ప్రధాన విమానాశ్రాయాన్ని తాజాగా పంపిన ఫ్రెంచి సేనలు ఆక్రమించుకున్నాయి. ఆఫ్రికా ఖండానికి పశ్చిమ తీరంలో ఉన్న ఐవరీ కోస్ట్ లో గత సంవత్సరం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధికారంలో ఉన్న అధ్యక్షుడు లారెంట్ జిబాగ్బో ను అలస్సానే ఒట్టోరా ఓడించాడని…

పగుళ్ళిచ్చిన జపాన్ అణు రియాక్టర్, అణు ధార్మికత కట్టడికి చర్యలకై వెతుకులాట

భూకంపం, సునామీలతో దెబ్బతిన్న ఫుకుషిమా దైచి అణు కర్మాగారంలో ఒక రియాక్టర్ పగుళ్ళిచ్చి ఉండడాన్ని శనివారం కనుగొన్నారు. చీలిక 20 సెంటీ మీటర్ల మేర ఉందని కర్మాగారం ఆపరేటర్ టెప్కో (టోక్యో ఎలెక్ట్రిక్ పవర్ కంపెనీ) తెలిపింది. ఇప్పటికి కనుగొన్నది ఒక్క పగులేననీ ఇంకా ఉండే అవకాశాలను తోసిపుచ్చలేమని తెలిపింది. గత వారం రోజులుగా కర్మాగారం వద్ద సముద్రపు నీరు బాగా కలుషితమై, చుట్టుపక్కల వాతావరణంలో కూడా అణు ధార్మికత అధిక స్ధాయిలో ఉండడంతో దానికి కారణం…

పశ్చిమదేశాల విమాన దాడుల్లో లిబియా పౌరుల దుర్మరణం

పశ్చిమ దేశాల రక్తదాహానికి అంతులేకుండా పోతోంది. ఇరాక్ పై దాడికి ముందుగానే ఆంక్షల పేరుతో లక్షలాది ఇరాకీ పసిపిల్లల ఉసురు పోసుకున్నాయి. పసిపిల్లల పాల డబ్బాల రవాణాపై కూడా ఆంక్షలు విధించడంతో పోషకార లోపంవలన లక్షలాదిమంది ఇరాకీ పిల్లలు చనిపోయారు. సంవత్సరాల తరబడి విచక్షణా రహితంగా బాంబు దాడులు చేసి లక్షలమంది రక్తమాంసాల్ని ఆరగించాయి. ఆఫ్ఘనిస్తాన్ పై దురాక్రమణ దాడి చేసి మిలియన్లమంది పౌరులను చంపిన సంగతి వికీలీక్స్ బైట పెట్టిన ఆఫ్ఘన్ యుద్ధ పత్రాల ద్వారా…