ఆసియా దేశాల ఆర్ధికాభివృద్ధికి ఆహారధరలు ఆటంకం -ఏడిబి
ఇప్పటివరకు అధిక వృద్ధి రేటును నమోదు చేస్తున్న ఆసియా దేశాల్లో పెరుగుతున్న ఆహార ధరల కారణంగా ఆర్ధికాభివృద్ధికి పెను సవాళ్ళు ఎదురు కానున్నాయని ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎడిబి) హెచ్చరించింది. ఆహార ధరలు అంతకంతకూ పెరుగుతు పోతుండడం వలన ఇప్పటికే బలహీనమైన కోలుగోలు శక్తితో దరిద్రం అనుభవిస్తున్న పేదల పరిస్ధితి మరింతగా దిగజారుతుందని ఎడిబి తెలిపింది. ఆహారం, ఇంధనం ధరలు ఇలాగే పెరుగుతూ పోతే ఆసియా దేశాల జిడిపి కనీసం 1.5 శాతం మేర తగ్గే అవకాశం…