అమెరికా జెట్‌ఫైటర్ల కొనుగోలుకు ఇండియా తిరస్కరణ, స్నేహం దెబ్బతినే అవకాశం


EADS Euro fighter Typhoon

ఇ.ఎ.డి.ఎస్ యూరోఫైటర్ "టైఫూన్"

అమెరికా, యూరప్ దేశాల మధ్య జరిగిన పోటీలో ఎట్టకేలకు అమెరికా ఓడిపోయింది. అమెరికాకి కాంట్రాక్టు ఇవ్వడానికి నిరాకరించడంతో అమెరికాతో ఇండియా సంబంధాలు దెబ్బతినే అవకాశాం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. 11 బిలియన్ డాలర్ల (రు.51,000 కోట్లు) విలువతో ఫైటర్ జెట్ విమానాల కొనుగోలుకు ఇండియా ఒకటిన్నర సంవత్సరాలనుండి ప్రయత్నిస్తున్నది. గత నవంబరు నెలలో ఒబామా ఇండియా సందర్శించినప్పుడు కూడా ఈ కాంట్రాక్టుపై చర్చలు జరిగాయి. ఒబామా సందర్శించినప్పుడు ఇండియా ఏమీ తేల్చి చెప్పలేదు. కాని అమెరికాకి చెందిన బోయింగ్ కంపెనీ నుండే ఇండియా జెట్ విమానాలు కొనుగోలు చేయడానికి అమెరికా అధ్యక్షుడుతో పాటు ఇండియాలోని అమెరికా రాయబారి కూడా తీవ్రంగా లాబీయింగ్ చేశారు. దాంతో అమెరికా జెట్ ఫైటర్లవైపే ఇండియా మొగ్గు చూపవచ్చని అంతా భావించారు.

అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఇండియా యూరప్‌కి చెందిన ఫైటర్ జెట్లను కొనుగోలు చేయడానికి నిర్ణయించుకుంది. అమెరికానుండి రెండు కంపెనీలు ఇండియా కాంట్రాక్టు కోసం పోటీపడ్డాయి. అవి, లాక్‌హీడ్ కంపెనీకి చెందిన “మార్టిన్స్” ఎఫ్-16 విమానాలు, బోయింగ్ కంపెనీకి చెందిన ఎఫ్/ఎ-18 సూపర్ హార్నేట్ విమానాలు. ఈ రెండు ఫైటర్ జెట్‌లు భారత వైమానిక దళాల సాంకేతిక అవసరాలను సంతృప్తి పరిచే విధంగా లేవని ఇండియా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధిని ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది. స్వీడన్‌లోని సాబ్ కంపెనీకి చెందిన జె.ఎ.ఎస్-35 ఫైటర్ జేట్, రష్యాకు చెందిన మిగ్-35 ఫైటర్ జెట్ లు కూడా పోటీ పడినప్పటికీ వాటిని కూడా ఇండియా తిరస్కరించింది. దాదాపు 125 ఫైటర్ జెట్ విమానాల కొనుగోలుకు ఇండియా ప్రయత్నిస్తున్నది. ఈ కాంట్రాక్టు కోసం బ్రిటన్ ప్రధాని కామెరూన్, ఫ్రాన్సు అధ్యక్షుడు నికొలస్ సర్కోజి, రష్యా అధ్యక్షుడు మెడ్వెడేవ్ లు కూడా లాభీయింగ్ జరిపారు.

అంతిమంగా ఇండియా రెండు కంపెనీలను షార్ట్ లిస్టు చేసింది. నాలుగు దేశాలు ఉమ్మడి కన్సార్టియంకి చెందిన యూరో ఫైటర్‌ కంపెనీ తయారు చేసే “టైఫూన్” ఫైటర్ జెట్లు, డస్సాల్ట్ కంపెనీ తయారు చేసే “రాఫేల్” ఫైటర్ జెట్ల లో ఒక దానిని ఇండియా కొనడానికి నిశ్చయించింది. జర్మనీ, స్పెయిన్ దేశాల ఇ.ఎ.డి.ఎస్ కంపెనీ, బ్రిటన్ కి చెందిన బి.ఎ.ఇ సిస్టమ్స్, ఇటలీకి చెందిన ఫిన మెక్కానికా కంపెనీలు “టైఫూన్” ను ఉత్పత్తి చేస్తున్నాయి. ఇది లిబియాపై “నిషిద్ద గగనతలం”ను అమలుచేయడంలో పాల్గొంటున్నది. టైఫూన్ గానీ రాఫేల్ గానీ ఇండియా కొనుగోలు చేయవచ్చు. అమెరికా, యూరప్ లమద్య సాగిన పోటిలో చివరికి యూరప్ పైచేయి సాధించింది. ఈ నిర్ణయం తర్వాత ఇండియా లోని అమెరికా రాయబారి రోమర్స్ తన పదవికి రాజీనామా చేశాడు. “వ్యక్తిగత, కుటుంబ కారణాల” వలన రాజీనామా చేసినట్లు రోమర్ ప్రకటించినప్పటికీ ఫైటర్ జెట్స్ కాంట్రాక్టుకు ఆమోదం పొందడంలొ విఫలమైనందుకు బాధ్యతవహిస్తూ రాజీనామా చేసాడన్నది బహిరంగ రహస్యం.

ప్రఛ్ఛన్న యుద్దానికి ముందు ఇండియా ఆయుధాల కోసం రష్యాపైన అధికంగా ఆధారపడింది. ఆ తర్వాత ఇండియా అమెరికాకి సన్నిహితం కావడం ప్రారంభమయ్యింది. నూతన ఆర్ధిక విధానాల అమలు ఇందుకు దోహదం చేసింది. 2007లో కుదిరిన పౌర అణు ఒప్పందం ఇండియా, అమెరికా లమద్య సంబంధాల అభివృద్ధికి మైలు రాయిగా పేర్కొంటారు. గత నవంబరులో ఇండియాను సందర్శిస్తూ ఒబామా దాదాపు 200 మంది వ్యాపారులను వెంట తెచ్చాడు. ఒబామా సందర్శనలో 10 బిలియన్ డాలర్ల వ్యాపార ఒప్పందాలు కుదిరాయని ఒబామా ప్రకటించాడు. ఒబామా ఇండియాలో మూడు రోజులు గడపడం కూదా ఒక రికార్డే. అమెరికా అధ్యక్షుడు అన్ని రోజులు ఇతర దేశంలో గడపడం అరుదుగా జరిగే విషయమని వార్తా సంస్ధలు అభిప్రాయపడ్డాయి. అమెరికా, ఇండియాల బంధం గట్టిపడుతున్నదని భావిస్తున్న నేపధ్యంలో ఫైటర్ జెట్స్ కాంట్రాక్టు అమెరికా కోల్పోవడం సంబంధాలపై ఖచ్చితంగా ప్రభావం పడుతుందని చెబుతున్నారు.

స్ధానికంగా ఇండియాకి చైనా, పాకిస్ధాన్ లనుండి భద్రతా పరమైన సవాలు ఎదురవుతున్నదని ఇండియా పాలకులు భావిస్తున్నారు. చైనా తన మిలట్రీ శక్తిని అంతకంతకూ పెంచుకుంటూ పోవడంతో ఇండియాకు సహజంగానే అభద్రతా భావం కలుగుతోంది. పాకిస్ధాన్ వద్ద ఇప్పటికే ఎఫ్-16 విమానాలున్నాయి. ఇండియా వద్ద ప్రధానంగా రష్యాకి చెందిన పాత యుద్ధ పరికారలే ఉన్నాయి. అందుకనే ఇండియా తన మిలట్రీ బలగాన్ని ఆధునీకరించడానికి తలపెట్టింది. ప్రపంచంలో ఇండియాయే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారు అని స్వీడన్ కి చెందిన ఒక అధ్యయన సంస్ధ తెలిపీంది. 2006-10 సం.ల మధ్య ప్రపంచంలోని ఆయుధ దిగుమతుల్లో ఇండియా దిగుమతులు 9 శాతం ఉన్నాయని ఆ సంస్ధ తెలిపింది. గత మార్చిలో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో ఇండియా రక్షణ రంగానికి 36.28 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. ఇది అంతకుముందరి సంవత్సరంతో పోలిస్తే 11.6 శాతం అధికం. ఇంత ఖర్చు పెట్టినా అది చైనా పెడుతున్న ఖర్చులో సగం కంటే తక్కువని రాయిటర్స్ తెలిపింది.

రానున్న ఐదు సంవత్సరాల్లో కేవలం మిలట్రీ ఆధునికీకరణకోసం 50 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాలని ఇండియా నిర్ణయించింది. ఈ విధంగా పొరుగు దేశాలతో పోల్చుకుని రక్షణ బడ్జేట్‌ను పెంచుకుంటూ పోవడం ద్వారా ప్రజలకు పెట్టాల్సిన ఖర్చులో కోత పడుతోంది. రక్షణ రంగానికి ఇచ్చే ప్రాధాన్యం ప్రజల సంక్షేమానికి ఇవ్వకపోవడం మన పాలకుల ముఖ్య లక్షణాల్లో ఒకటి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s