టిబెటన్లపై కొనసాగుతున్న చైనా ప్రభుత్వ అణచివేత చర్యలు


Tibetటిబెటన్లపై చైనా ప్రభుత్వ అణచివేత చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా పశ్చీమ్ చైనాలోని బౌద్దుల మొనాస్టరీపై చైనా పోలీసులు దాడి చేశారు. పోలీసుల దాడిలో ఇద్దరు టిబెట్ వృద్ధులు చనిపోయారు. కృతి మొనాస్టరీ పై దాడి చేసిన పోలీసులు అక్కడ ఉన్న బౌద్ధ మత గురువులను అరెస్టు చేయకుండా అడ్డుకున్న ఒక వృద్ధుడు, మరో వృద్ధురాలు పోలీసుల బలప్రయోగంలో చనిపోయారు. “ఇంటర్నేషనల్ కాంపెయిన్ ఫర్ టిబెటన్స్‌” (ఐ.సి.టి) సంస్ధ ఈ విషయం తెలియజేసింది.

మార్చి 16 న టిబెట్ స్వాతంత్ర్యాన్ని కాంక్షిస్తూ ఒక యువ బౌద్ద గురువు తనను తాను దహించుకున్నప్పటినుండీ సెచువాన్ రాష్ట్రంలోని కృతి మొనాస్టరీ వద్ద ఉద్రిక్తలు కొనసాగుతున్నాయి. సెచువాన్ టిబెట్ లో భాగం కానప్పటికీ టిబెట్ జాతీయులు అక్కడ పెద్ద సంఖ్యలో ఉన్నారు. ముఖ్యంగా అబా ప్రాంతంలొ వారి సంఖ్య అధికంగా ఉంది. బౌద్ధుల మతగురువు దలైలామా నాయకత్వంలొ అనేక సంవత్సరాలుగా టిబెటెన్లకు ప్రత్యేక దేశాన్ని డిమాండ్ చేస్తూ ఉద్యమిస్తున్నారు. అయితే చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వం వీరి ఉద్యమాన్ని తీవ్రంగా అణచివేస్తోంది.

1930 కి ముందే టిబెటన్ కమ్యూనిస్టు పార్టీ అధ్వర్యంలో టిబెట్ స్వాతంత్ర్యం కోసం ఆనాటి కొమింటాంగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చెలరేగాయి. చైనా కమ్యూనిస్టు పార్టీ ఈ ఉద్యమానికి మద్దతు నిచ్చింది. ఇరువురూ చైనాను ఆక్రమించిన జపాన్‌కీ, దానికి మద్దతు నిచ్చిన చైనా పాలకుడు చాంగై షేక్ కీ వ్యతిరేకంగా పోరాటం చేశాయి. ఉద్యమ క్రమంలొ టిబెట్ కమ్యూనిస్టు పార్టీ, చైనా కమ్యూనిస్టు పార్టీ లో విలీనమయ్యింది. టిబెట్ ప్రజలకు స్వయం నిర్ణయాధికారం ఉంటుందని చైనా కమ్యూనిస్టు పార్టీ గుర్తించడంతో ఈ విలీనం సాధ్యమయ్యింది.

చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకుడు మావో ఆధ్వర్యంలొ చైనాలో సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం ప్రారంభమైనా టిబెట్ లో మరో పది సంవత్సరాల పాటు భూస్వామ్య వ్యవస్ధ కొనసాగింది. 1950 ల చివరిలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆధ్వర్యంలో భూస్వామ్య వ్యవస్ధను టిబెటన్లు రద్దు చేసుకున్నారు. టిబెట్ కు చైనా ప్రభుత్వం స్వయం ప్రతిపత్తిని కల్పించింది. మావో మరణానంతరం డెంగ్-జియావో-పింగ్ ఆధ్వర్యంలో కమ్యూనిస్టు పార్టీ నీడలోనే పెట్టుబడిదారీ వ్యవస్ధ పునర్నిర్మాణం ప్రారంభమయ్యింది. దాన్ని వ్యతిరేకించిన అనేక మంది చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకులను, కార్యకర్తలనూ డెంగ్ నాయకత్వంలొని గ్రూపు పాశవికంగా చంపించింది. అప్పటినుండి చైనాలో పెట్టుబడిదారీ వ్యవస్ధ నిర్మాణం పుంజుకుని నేటికి పూర్తి స్ధాయిలో పెట్టుబడిదారీ దేశంగా చైనా మార్పు చెందింది. అయితే పెట్టుబడి ప్రధానంగా ప్రభుత్వాన్ని గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుల చేతిలో ఉండడంతో ప్రవేటు పెట్టుబడి పూర్తిగా అభివృద్ధి చెందలేదు. కాని ఆ వైపుగా ప్రయాణం వడిగా సాగుతోంది.

డెంగ్ ఆధ్వర్యంలొ పెట్టుబడిదారీ వ్యవస్ధ నిర్మాణం ప్రారంభమయ్యాక రాజ్యాంగంలో కూడ మార్పులు చేశారు. అప్పటివరకు ప్రత్యేక దేశంగా విడిపోయే హక్కును కలిగి ఉన్న జాతులకు ఆ హక్కును రద్దు చేశారు. టిబెట్ కి స్వయం ప్రతిపత్తిని రద్దు చేశారు. టిబెటన్ల సంస్కృతి అణచివేతకు గురికావడం, ఆర్ధిక అభివృద్ధి చైనాలోని మెజారిటీ జాతి ఐన హాన్ జాతీయుల వరకే కేంద్రీకృతం కావడంతో టిబెటన్లలో అసంతృప్తి బయలుదేరింది. అది క్రమంగా బలపడి బౌద్ధ మతగురువు దలైలామా నాయకత్వంలో సమీకృతమయ్యింది. చైనా పెట్టుబడిదారీ వర్గం వీరి స్వతంత్ర దేశ కాంక్షను పూర్తిగా మిలట్రీ, పోలీసులతో అణచివేసింది. క్రూర నిర్బంధం ఫలితంగా దలైలామా ఇండియాలో ప్రవాసం గడుపుతూ ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. అప్పటినుండీ ఇండియా, చైనా ల మధ్య ఉద్రిక్తలకు దారితీసిన కారణాల్లో ఇది ఒకటిగా నిలిచింది.

ప్రపంచంలొ జాతుల పోరాటాన్ని సమర్ధించిన చరిత్ర ఒక్క సోషలిస్టు ప్రభుత్వాలకు మాత్రమే ఉంది. రష్యాలో స్టాలిన్ మరణానంతరం, చైనాలో మావో మరణానంతరం సోషలిస్టు వ్యవస్ధల నిర్మాణం ఆగిపోయి పెట్టుబడీదారీ వ్యవస్ధల నిర్మాణం ప్రారంభమైన విషయాన్ని చాలామంది గుర్తించరు. పెట్టుబడిదారీ వ్యవస్ధ పునర్నిర్మాణం కూడా కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలొనే జరగడంతో అక్కడి కమ్యూనిస్టు పార్టీల నిజ స్వరూపాన్ని ఇతరులు గుర్తించలేక పోయారు. అమెరికా, యూరప్ ల నాయకత్వంలోని పెట్టుబడిదారీ ప్రపంచం చైనాలోని ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానాన్ని సోషలిస్టుగానే ప్రచారం చేయడం, చైనా పార్టీ కూడా ఇప్పటికీ తాను సోషలిస్టు వ్యవస్ధను నిర్మిస్తున్నానని చెప్పుకోవడం వలన అసలు విషయం గుర్తించే వీలు లేకుండా పోయింది.

లెనిన్ నాయకత్వంలో రష్యాలోని సోషలిస్టు ప్రభుత్వం జాతుల స్వయం నిర్ణయాధికారాన్ని గుర్తించింది. జాతుల స్వయం నిర్ణయాధికార హక్కును రాజ్యాంగంలో పొందుపరిచింది. ఆ హక్కుమేరకు యు.ఎస్.ఎస్.ఆర్ లో ఉన్న బాల్టిక్ రిపబ్లిక్కులు లాత్వియా, లిధువేనియా, ఎస్తోనియా లు యు.ఎస్.ఎస్.ఆర్ నుండి విడిపోయి స్వతంత్ర దేశాలుగా మారాయి. కాని మూడు సంవత్సరాల లోపే యూరప్ లో ఉన్న యుద్ధ పరిస్ధుతుల నేపద్యంలో యు.ఎస్.ఎస్.ఆర్ లోనే తమకు రక్షణ ఉందని భావించిన బాల్టిక్ రిపబ్లిక్కులు మళ్ళీ యు.ఎస్.ఎస్.ఆర్ లో కలిసిపోయాయి.

కానీ స్టాలిన్ మరణానంతరం కృశ్చేవ్ నాయకత్వంలోని రష్యా కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలొ పెట్టుబడిదారీ వ్యవస్ధ పునర్నిర్మాణం ప్రారంబమయ్యాక యు.ఎస్.ఎస్.ఆర్ జాతుల బందిఖానాగా తయారయ్యించి. అనేక జాతులు యు.ఎస్.ఎస్.ఆర్ నుండి బైటకు రావడానికి జరిపిన పోరాటాలను రష్యా ప్రభుత్వం అణిచివేసింది. యెల్ట్సిన్ అధికారం వచ్చాక పెట్టుబడిదారీ వ్యవస్ధ ప్రత్యక్షంగా ముందుకు వచ్చింది. కానీ రష్యాతో పాటు, యు.ఎస్.ఎస్.ఆర్ నుండి విడిపోయిన వివిధ జాతుల దేశాలు మాఫియాల చేతుల్లోకి వెళ్ళి పోవడంతో ప్రజల జీవనం నరకంగా మారింది. రష్యాలో మాఫియా గ్రూపులే ప్రభుత్వాన్ని వెనకుండి నడుపుతున్న విషయాన్ని అక్కడి అమెరికా రాయబారి తమ ప్రభుత్వానికి కేబుల్ లో రాశాడు. వికీలీక్స్ వెల్లడించిన డిప్లొమాటిక్స్ కేబుల్స్ ద్వారా ఈ సంగతి బయటపడింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s