లిబియాపై యుద్ధానికి హంతక డ్రోన్ విమానాలను పంపిన అమెరికా


Drone

వందలకొద్దీ ఆఫ్ఘన్ పౌరుల్ని చంపిన డ్రోన్ విమానం

వందలకొద్దీ పాకిస్తాన్ పౌరులను చంపిన డ్రోన్ విమానాలను లిబియా పౌరులను రక్షించడానికి(!) పంపేందుకు ఒబామా ఆమోదముద్ర వేశాడు. ఇప్పటికే ఒక సారి దాడికి వెళ్ళిన డ్రోన్ విమానం వాతావరణం అనుకూలించక వెనుదిరిగినట్లు అమెరికా సైనిక దళాలా జాయింట్ ఛీఫ్ తెలిపాడు. తక్కువ ఎత్తులో ప్రయాణించే మానవరహిత డ్రోన్ విమానాలను అమెరికా, ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్తాన్ సరిహద్దుల్లో పాకిస్తాన్ భూభాగంలో ఉన్న తాలిబాన్ నాయకులను, మిలిటెంట్లను చంపడానికి విస్తృతంగా వినియోగిస్తోంది. వాటిబారిన పడి పాకిస్ధాన్ పౌరులు అనేకమంది చనిపోయారు. డ్రోన్ విమాన దాడులవలను అమెరికాతో పాటు పాకిస్ధాన్ ప్రభుత్వం కూడా అప్రతిష్టపాలై ప్రజా వ్యతిరేకతన కొని తెచ్చుకుంది.

పౌరుల పాలిట హంతక యంత్రాలుగా మారిన డ్రోన్ విమానాలను లిబియా పౌరులను రక్షించే పేరుతో వినియోగించడానికి అమెరికా సిద్ధమయ్యింది. తక్కువ ఎత్తులో ఎగరడం వలన ట్యాంకులు, ప్రభుత్వ సైనికులను గుర్తించి దాడి చేయడానికి వీలవుతుందని అమెరికా డిఫెన్సు సెక్రటరీ ఆశాభావం వెలిబుచ్చాడు. పౌరులను చంపడంలో పేరెన్నిక గన్న డ్రోన్ విమానాలను పౌరులను రక్షించడానికి ఎలా వినియోగిస్తారో అర్ధం కాని విషయం. వాస్తవంలో లిబియా పౌరుల రక్షణకు పశ్చిమ దేశాలు కట్టుబడి లేవు. గడ్డాఫీని కూలదోయడమే వారి లక్ష్యం. పశ్చిమ దేశాల మూకుమ్మడి దాడులవలన గడ్డాఫీని వ్యతిరేకిస్తున్నవారు సైతం పశ్చిమ దేశాల హంతక దాడులకు వ్యతిరేకంగా గడ్దాఫీ వెనుక సమీకృతులవుతున్నారు.

డ్రోన్ విమానాల వలన మరింతమంది పౌరులు చనిపోవడం మినహా గడ్డాఫీ ప్రభుత్వ బలగాలకు అవి నష్టం చేయజాలవని లిబియా ఉప విదేశాంగ మంత్రి ఖలేద్ ఖైమ్ హెచ్చరించాడు. “లిబియా ప్రజలు వారి లక్ష్యాన్ని నిర్ధారించుకుంటారు. మరిన్ని ఆయుధాలను, డబ్బును తిరుగుబాటుదారులకు అందించడం ద్వారానొ లేదా లిబియాపై మరిన్ని వైమానిక దాడులు చేయడం ద్వారానో ఆ లక్ష్యం నిర్ధారించబడదు” అని ఖలేద్ చెప్పినట్లుగా బిబిసి తెలిపింది. ప్రభుత్వ, తిరుగుబాటు బలగాలు తీవ్రంగా తలపడుతున్న మిస్రాటా పట్టణంలోకి విదేశీ సైనికులు అడుగు పెట్టినట్లయితే నరకాన్ని చవి చూడాల్సి ఉంటుందని లిబియా ప్రభుత్వ ప్రతినిధి మౌసా ఇబ్రహీం హెచ్చరించాడు. “మేం అగ్నిగోళాలుగా మారుతాం. ఇరాక్ లో చవిచూసిన దానికంటే పదింతలు ప్రతిఘటనను మీరు ఎదుర్కుంటారు” అని ఇబ్రహీం హెచ్చరించాడు. త్వరలో మిస్రాటా పౌరులు ఆయుధాలు చేపడతారని ఆయన తెలిపాడు.

అమెరికా సెనెటర్ కి 50 మందే ఆహ్వానంం

ఒబామాపై పోటీ చేసి ఓడిపోయిన సెనేటర్ మెక్ కెయిన్ తిరుగుబాటుదారుల రాజధానిగా చెప్పబడుతున్న బెంఘాజీని సందర్శించాడు. లిబియా ఘర్షణలు ప్రారంభమైనాక అమెరికా అత్యున్నత అధికారి లిబియా సందర్శించడం ఇదే మొదటిసారి. తిరుగుబాటుదారులకు గట్టిపట్టు ఉన్నట్టు

చెప్పబడుతున్న బెంఘాజీలో అమెరికా సెనేటర్ ను ఆహ్వానించడానికి కేవలం 50 మంది పౌరులే హాజరయ్యారు. వారు “దుర్మార్గ గడ్దాఫీ పొయ్యాడు, మెక్ కెయిన వచ్చాడు” అని నినాదాలిచ్చినట్లు ఎ.ఎఫ్.పి వార్తా సంస్ధ తెలిపింది. గడ్డాఫీ స్ధానంలో మరో లిబియన్ అధికారం చేపట్టినట్లయితే అటువంటి నినాదం ఇవ్వడంలో అర్ధం ఉంది. కానీ ఒక విదేశీ పార్లమెంటు సభ్యుడు తమ దేశానికి వచ్చినపుడు ఆయనను తమ దేశ పాలకుడికి ప్రత్యామ్నాయంగా పేర్కొంటూ నినాదాలివ్వడాన్ని బట్టి తిరుగుబాటుదారుల దేశభక్తి ఎంత స్వచ్ఛమో బహుళా అర్ధం చేసుకోవచ్చేమో.

మిస్రాటా పట్టణంలో వెయ్యిమంది వరకు చనిపోయారనీ, ట్యునీషియా తో ఉన్న సరిహద్ధులో ఒక పోస్టును తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుక్కున్నారనీ, అక్కడ ఉన్న వందమంది ప్రభుత్వ సైనికులు పారిపోయారనీ తిరుగుబాటుదారులు చెప్పినట్లుగా బిబిసి నిఫేదించింది. అయితే ఆ వార్తను ధృవీకరించగల స్వతంత్ర వనరులు లేవని బిబిసి తెలిపింది. విలేఖరుల ప్రవేశానికి అవకాశాలు లేవని వార్తా సంస్ధలు చెబుతున్నాయి. లిబియా పౌరులపై విషదాడులను హిల్లరీ క్లింటన్ ఖండించింది. ప్రభుత్వ దాడిలో చనిపోయిన లిబియా పౌరుడి ఫొటోను ఇంతవరకు చూపని అమెరికా ప్రభుత్వం పౌరుల మరణాన్ని ఖండించడం హాస్యాస్పదం. లిబియా యుద్ధంపై వాస్తవాలు ప్రపంచ ప్రజలకు అందకుండా తప్పుడు వార్తలు ప్రచారం చేయడంలో నిమగ్నమైన కార్పొరేట్ వార్తా సంస్ధల తీరు గర్హనీయం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s