పాక్, ఆఫ్ఘనిస్ధాన్ సరిహద్దులోని నార్త్ వజీరిస్తాన్ రాష్ట్రంలో అమెరికాకి చెందిన డ్రోన్ విమానం దాడిలో మరో పాతిక మంది దుర్మరణం చెందారు. డ్రోన్ విమానదాడులకు తాను భాధ్యురాలిగా అమెరికా సాధారణంగా ధృవీకరించదు. కాని ఈ ప్రాంతంలో డ్రోన్ విమానాలు ఒక్క అమెరికాకి తప్ప మరొక దేశానికి లేవు. ప్రారంభంలో డ్రోన్ దాడులు కొన్నింటికి భాధ్యత తనదిగా పేర్కొన్నప్పటికీ, ఇటీవల కాలంలో అటువంటి ప్రకటనలు రావడం లేదు. డ్రోన్ విమాన దాడుల్లో వందల కొద్దీ పాకిస్తాన్ పౌరులు చనిపోతుండడంతో ఈ దాడులకు పాకిస్ధాన్ అభ్యంతరం చెప్పిట్లు వార్తలు వచ్చాయి. కాని డ్రోన్ విమాన దాడులు మాత్రం ఆగలేదు.
మిలిటెంట్ల స్ధావరంగా భావించి డ్రోన్ విమానం నాలుగు క్షిపణులను పేల్చినట్లు బిబిసి తెలిపింది. సమీపంలో ఉన్న ఇంటిలో ఉన్న ఐదుగురు మహిళలు, నలుగురు చిన్నపిల్లలు మరణించారని తెలిపింది. అయితే మిలిటెంట్లు ఎంతమంది చనిపోయిందీ, అసలు చనిపోయరో లేదో ఆ సంస్ధ తెలపలేదు. స్ధానిక మిలిటెంట్ల కమాండర్ హఫీజ్ గుల్ బహదూర్ మద్దతుదారులు ఉన్నట్లుగా భావిస్తున్న పెద్ద కాంపౌండ్ మీదికి నాలుగు మిసైళ్ళను డ్రోన్ కురిపించింది. క్షిపణుల దాడుల్లో అనేకమంది పౌరులు గాయపడినట్లుగా స్ధానిక గూఢచారిని ఉటంకిస్తూ ఎ.ఎఫ్.పి వార్తా సంస్ధ తెలిపింది. ఒబామా అధ్యక్షుడుగా వచ్చినప్పటినుండీ డ్రోన్ దాడులు బాగా పెరిగాయి. గత సంవత్సర కాలంలోనే వందకు పైగా డ్రోన్ దాడులు జరిగాయి.
మార్చి 17 న జరిగిన డ్రోన్ విమాన దాడిలో 40 మంది చనిపోయారు. ఇద్దరు పాకిస్తాన్ గూఢచారులను కాల్చి చంపిన సి.ఐ.ఏ గూడచారి రేయాన్ డేవిస్ ను పాకిస్ధాన్ కోర్టు విడుదల చేసిన తర్వాత రోజే ఈ దాడి జరిగడం గమనార్హం. ఈ దాడి అనంతరం పాకిస్తాన్ మిలట్రీ అధిపతి జనరల్ కయానీ ఎన్నడూ లేని విధంగా డ్రోన్ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ప్రకటన జారీ చేశాడు. పాకిస్ధాన్ లో విధులు నిర్వర్తిస్తున్న సి.ఐ.ఏ గూడచారుల్లో చాలా మందిని వెనక్కి పిలవవలసిందిగా జనరల్ కయానీ అమెరికాని కోరుతూ ఐ.ఎస్.ఐ అధిపతిని దూతగా అమెరికాకి పంపించాడు. అమెరికా ఆర్మీ ఛీఫ్ ఆఫ్ స్టాఫ్ బుధవారం జనరల్ కయాని తో సమావేశమైన అనంతరం తీవ్రవాద సంస్ధలతో ఐ.ఎస్.ఐకి సంబంధాలున్నాయని ఆరోపించాడు. ఆరోపణలను పాక్ ఆర్మీ ఖండించింది.
సి.ఐ.ఏ గూడచారులను తగ్గించడం పై అమెరికాలో పాక్, అమెరికా అధికారుల మధ్య చర్చలు జరుగుతుండగానే ముల్లెన్ ఐ.ఎస్.ఐ పై ఆరోపణలు చేయడం గమనార్హం. భారత్ పై టెర్రరిస్టు చర్యలకు భాధ్యురాలుగ భావిస్తున్న లష్కర్-ఎ-తొయిబా తో కూడా ఐ.ఎస్.ఐ సంబంధాలు కలిగి ఉందనీ ముంబై తాజ్ హోటల్ పై దాడులు ఐ.ఎస్.ఐ ప్రోద్బలంతోనే జరిగాయనీ ఇండియా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అమెరికాలో పట్టుబడిన ముంబై దాడుల నిందితులు హేడ్లీ, రాణాలు తాము పాకిస్తాన్ ప్రభుత్వం, ఐ.ఎస్.ఐ ల ఆదేశాలతోనే ముంబై దాడులకు ముందు రెక్కీ నిర్వహించామని అమెరికా కోర్టులో వారం రోజుల క్రితం ప్రకటించి సంచలనం సృష్టించారు.
స్త్రీలు, పిల్లలకు టెర్రరిస్టులతో పాటు ఎందుకున్నారు? హోం మేడ్ బాంబులు చేస్తున్నారేమో.మిలిటెంట్లంతా మట్టికరుస్తున్నారు, మంచి పనైంది.
పౌరుల నివాస ప్రాంతాల్లో డ్రోన్ బాంబులు వేయడం వలన స్త్రీలు, పిల్లలు చనిపోయారు. బాంబులు వేస్తున్నవారు సైతం పౌరుల మరణానికి మర్యాదకి విచారం వ్యక్తం చేస్తారు. పొరుగు దేశంపై దురాక్రమణ దాడి చేసి ఆక్రమించుకున్న అమెరికా బాంబు దాడుల్లో పౌరులు చనిపోతే దానికి ఆనందిస్తున్న మిమ్మల్ని ఎలా అర్ధం చేసుకోవాలి జీరో సార్? నార్త్ వజీరిస్ధాన్ పాకిస్ధాన్లో ఒక రాష్ట్రం. ఆ రాష్ట్రంలో ఆంధ్ర ప్రదేశ్ లో మీరూ నేనూ నివసిస్తున్నట్లే పౌరులు నివసిస్తున్నారు.
బ్రిటిష్ వాడు ఇండియా ఆక్రమించడానికి వ్యతిరేకంగా జరిగిన జాతీయ పోరాటంలొ లక్షల భారతీయులు మరణించారు. భగత్ సింగ్ ని తీవ్రవాది అనే బ్రిటిష్ వాళ్ళు ముద్ర వేశారు. ఒక స్వతంత్ర దేశంపై దాడి చేసి ఆక్రమించడానికి ప్రపంచం వ్యతిరేకిస్తుంది గనక ఆఫ్ఘన్ దేశీయులపై టెర్రరిస్టులని ముద్ర వేసి యధేచ్ఛగా చంపుతున్నారు. వాటిని వ్యతిరేకించనట్లయితే రేపు మనమూ అదే పరిస్ధితిలో ఉండవచ్చు జీరోగారూ.
అమెరికా అంటే అంత తెలియక పోయినా, పాకీస్థాన్ లోని వజీరిస్థాన్ అనే ప్రాంతం తాలిబాన్ల స్థావరం. అసలు పాకీస్థానే మన శత్రుదేశం. అలాంటి పాకీస్థానును ప్రేమించే మీరు దేశభక్తి శంకించ తగ్గది. మీరు చైనా తరపున పాకిస్థాన్ వైపు పనిచేస్తున్న ప్రాపగాండ ప్రచారకులేమో అనిపిస్తోంది.
ఒక దేశపు జనం మీద మరొక దేశం విమానాలతో దాడి చేసి టెర్రరిస్టులు అనే పేరుతో చంపుతుంటే ఖండించడం మానేసి అడ్డదిడ్డంగా కామెంటు చెయ్యడం లోనే మీరు ఎవరి ప్రాపగాండిస్టులో తెలుస్తోంది. ముందు అమెరికా తన దాడుల్ని ఆపాలి. స్వేచ్ఛను నమ్మే ప్రతి పౌరుడూ లిబియా ప్రజల స్వేచ్ఛను హరిస్తున్న అమెరికా దాడుల్ని ఖండించాలి. మరో దేశం మీద దాడి చేసే హక్కు అమెరికాకి ఎవరిచ్చారు? ప్రపంచ పోలీసు అమెరికా గూండాయిజానికి కొమ్ము కాసే మీలాంటోళ్ళు ఉండబట్టే అమెరికా బరితెగించింది.
అమెరికా దుర్బుద్ధికి కొమ్ము కాస్తూ సాటి తెలుగోడి మీదికి దూకడం, అందుకు చైనా మానవ హక్కులు అంటూ మొసలి కన్నీరు కార్చడం, అమెరికా మోచేతి నీళ్ళు తాగడం… ఇదేగా మీరు చేసేది.
అది సరే, మీకు తగ్గ పేరు పెట్టుకున్న మీ ధైర్యానికి అభినందనలు.
మీరు ముద్రలు వేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి దయచేసి. నేను ప్రత్యారోపణలు చేస్తే చర్చ ఖంగాళీ అవుతుంది గదా సార్!?
పాకిస్ధాన్ రాజ్యం ఇండియా రాజ్యానికి శత్రు సంబంధాలున్నమాట వాస్తవం. కానీ పాకిస్ధాన్ ప్రజలకూ, ఇండియా ప్రజలకూ శత్రు సంబంధాలు ఉండాల్సిన అవసరం లేదు. రాజ్యాలు ప్రజల ప్రయోజనాల కోసం పని చేయనందునే రాజ్యాలనూ, ప్రజలను వేరుగా చూడాల్సిన అవసరం తలెత్తింది. పాకిస్ధానే కాదు, ఏ దేశ ప్రజలైనా ద్వేషించదగ్గ వారు కాదు. ప్రజలు రాజ్యం తమదే అని పొరబడినప్పుడు దాని ప్రయోజనాలను తమ ప్రయోజనాలను ఒకటిగానె భావిస్తారు. ప్రజల ప్రయోజనాలు కాపాడే పాలకులను ప్రజలు సమర్ధించాలి. కానీ పొరుగు దేశంపై ద్వేషాన్ని పెంచేవారు ప్రజల ప్రయోజనాలను కాపాడలేరు.
ఇది చదివి మీరు వ్యంగ్యంగా వ్యాఖ్యానించడానికి బదులు నాకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే తెలియజేయడానికి ప్రయత్నించండి.