సిరియా అధ్యక్షుడు రాజీనామా చేయాలంటూ జరుగుతున్న హింసాత్మక ఆందోళనలకు అమెరికా 5 సంవత్సరాలనుండీ రహస్యంగా నిధులు అందజేస్తూ వచ్చిన విషయాన్ని వికీలీక్స్ ద్వారా వెల్లడి అయ్యింది. 2006లో జార్జి బుష్ అధికారంలో ఉన్నప్పటినుండి ప్రారంభమైన ఈ సహాయం ఒబామా అధ్యక్షుడు అయ్యాక కూడా కొనసాగిన విషయం వికీలీక్స్ వెల్లడించిన డిప్లొమేటిక్ కేబుల్స్ ద్వారా స్పష్టమయ్యింది. సిరియా అధ్యక్షుడు అస్సద్ 2000 సంవత్సరంలో తన తండ్రి చనిపోయినప్పటినుండీ అధికారంలో ఉన్నాడు. ఇరాక్ మాజీ అద్యక్షుడు సద్దాం హుస్సేన్ లాగానే అస్సద్ బాత్ పార్టీ నాయకుడు. అరబ్ దేశాల్లో బాత్ పార్టీ ప్రగతిశీల విధానాలను అమలు చేసింది. సౌదీ అరేబియా ఆధ్వర్యంలో ముస్లిం ఛాందస విధానాలు అమలు చేయడానికి వ్యతిరేకంగా బాత్ పార్టీ కృషి చేసింది.
సద్దాం హుస్సేన్ కాలంలో ఇరాక్ మహిళలు అనేక అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా విద్యా సౌకర్యాలు పోందిన చరిత్ర ఉంది. ముస్లిం టెర్రరిజం పై ప్రపంచ యుద్ధం ప్రకటించి, “నాగరికతల యుద్ధ్జం” పేరుతో ముస్లిం ప్రపంచంపై దుష్ప్రచారం ప్రారంభించిన అమెరికా, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, యెమెన్ లాంటి ఛాందసవాద నియంతృత్వ ప్రభుత్వాలను మిత్ర దేశాలుగా చేసుకోడానికి వెనకాడలేదు. అదే సమయంలో సెక్యులరిస్టు భావజాలంతో బాత్ పార్టీ ఆధ్వర్యంలో నడిచిన ఇరాక్ ప్రభుత్వాన్ని దురాక్రమణ దాడి చేసి కూల్చివేయడమే కాక సిరియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసంతృప్తి పెంచి పోషించడానికి సిద్ధమయ్యింది. అంతర్జాతీయ చట్టాలను, నియమాలను తరచూ వల్లించే అమెరికాకి ఆ చట్టాల పట్ల ఏ మాత్రం గౌరవం లేదనడానికి ఇది మరో ఉదాహరణ. అమెరికా నిధులతో పెరిగిన ప్రతిపక్షాలే ఇప్పుడు సిరియాలో అధ్యక్షుడు అస్సద్ గద్దె దిగాలంటూ ఆందోళనలు చేయడం గమనార్హం.
ప్రతిపక్ష గ్రూపులకు రహస్యంగా నిధులు అందించడమే కాక సిరియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా “బరాదా టివి” పేరుతో ఒక చానెల్ ను లండన్ కేంద్రంగా నడిపినట్లు కేబుల్ ద్వారా వెల్లడయ్యింది. ఏప్రిల్ 2009 లో ప్రారంభమైన ఈ టివి సిరియా ప్రభుత్వం, అధ్యక్ధుడికి వ్యతిరేక ప్రచారం చేయడమే కార్యక్రమం. అరబ్ దేశాల్లొ చెలరేగిన ప్రజాందోళనలు సిరియాకు వ్యాపించడం వెనుక అమెరికా పోషించిన ప్రతిపక్ష గ్రూపులు తీవ్రంగా కృషి చేశాయి. ఇప్పుడు ఈ ఆందోళనలు ప్రచారం చేయడంలో బరాదా టివి ప్రముఖ పాత్ర పోషిస్తోంది. సిరియా అధ్యక్షుడు బషర్ ఆల్-అస్సద్ ప్రభుత్వాన్ని కూల్చి వేయడమే లక్ష్యంగా బరాదా టివి పని చేస్తూ వచ్చింది. మార్చి 18 న సిరియాలో ప్రారంభమైన ఆందోళనల్లో పోలీసులు జరిన కాల్పుల్లో అనేక మంది చనిపోయారు. ప్రభుత్వం సాయుధ గ్యాంగులు ఆందోళనల వెనక పనిచేస్తున్నాయని ఆరోపించింది. ముస్లింలతో సాన్నిహిత్యం పెంచుతానన్న వాగ్దానం మేరకు ఒబామా సిరియాతో కూడా సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి కృషి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించినా రహస్య సహాయం కొనసాగడం గమనార్హం.
బ్రిటన్ లో ప్రవాసం ఉంటున్న సిరియా దేశస్ధులు “మూవ్ మెంట్ ఫర్ జస్టిస్ అండ్ డెవలప్ మెంట్” అనే సంస్ధను ఏర్పాటు చేసి దాని అధ్వర్యంలో బరాదా టివి చానెల్ నడుపుతున్నారు. 2006 నుండి కనీసం 6 మిలియన్ డాలర్లు బరాదా టివీ కోసం సిరియాలో కార్యకలాపాల కోసం అమెరికా ఖర్చు చేసినట్లు కేబుల్ ద్వారా వెల్లడయ్యింది. 2005 నుండి జార్జి బుష్ సిరియాతో రాయబార సంబంధాలను తెంచుకున్నాడు. ఒబామా వచ్చాక గత జనవరిలో రాయబారి నియమించేంత వరకు అమెరికా, సిరియాల మధ్య సంబంధాలు లేవు. సిరియాలో అమెరికా కార్యకలాపాల పట్ల సిరియా గూఢచారులు అనుమానాలు వ్యక్తం చేయడం ప్రారంభించడంతో సిరియా రాజధాని డమాస్కస్ లొ ఉన్న అమెరికా రాయబార కార్యాలయం కలవరపడ్డారని కేబుల్ ద్వారా తెలుస్తోంది. సిరియాలో అమెరికా జోక్యం చేసుకోవడాన్ని ఇక కట్టిపెడితే మంచిదని ఎంబసీ అధికారులు కొంతమంది సలహా ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. ఒబామా ప్రతిపాదించిన “సంబంధాల పునరుద్ధరణ” విధానానికి అమెరికా రహస్య సాయం అడ్డంకిగా మారగలదని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
“సిరియాలో చట్టవ్యతిరేక సంస్ధలకు అమెరికా నిధులు అందుతున్నట్లు ప్రభుత్వానికి తెలిసినట్లయితే సిరియా అధ్యక్షుడిని తొలగంచే ప్రయత్నాలను అమెరికా చేస్తున్న విషయాన్ని ఖచ్చితంగా పసి కడతారు. సిరియాకు లోపలా, బయటా ఉన్న ప్రభుత్వ వ్యతిరేక గ్రూపులకు సహాయం అందించే కార్యక్రమాన్ని పునహ్ సమీక్షించాల్సిన అవసరం ఉంది” అని డమాస్కస్ లో ఉన్న అత్యన్నత రాయబార కార్యాలయ అధికారి అమెరికా ప్రభుత్వానికి కేబుల్ రాశాడు. సెప్టెంబరు 2010 వరకు సిరియా గ్రూపులకు సహాయాన్ని కేటాయించిన విషయం కేబుల్ లో ప్రస్తావించారు. సహాయం ఇంకా కొనసాగుతున్నదీ లేనిదీ తెలియరాలేదు. వికీలీక్స్ ద్వారా వెల్లడయిన కేబుల్ సమాచారాన్ని “వాషింగ్ టన్ పోస్టు” వెల్లడించింది. అయితే అమెరికా సిరియాలో ఏ గ్రూపులకు సహాయం చేసిందీ వాషింగ్టన్ పోస్టు వెల్లడించలేదు. వారి పేర్లను ప్రచురించవద్దని అమెరికా స్టేట్ డిపార్టుమెంటు కోరినందున ప్రచురించలేక పోతున్నామని వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది.
ప్రపంచ వ్యాపితంగా తనకు నచ్చని ప్రభుత్వాలను కూల్చడానికి అమెరికా కుట్రలు చేయడం, నిధులు అందించడం ఎప్పటినుండో అమలు చేస్తున్న కార్యక్రమం. ప్రపంచ దేశాల్లొ ప్రజాస్వామ్యం స్ధాపించడానికీ, మానవహక్కులను కాపాడడానికి తాను సాయం చేస్తానని అమెరికా ప్రభుత్వం చెప్పుకుంటుంది. కానీ లాటిన్ అమెరికా లోని చిలీ దేశం నుండి ఆఫ్రికా లోని అనేక దేశాలు, ఆసియా లోని ఇండోనేషియా వరకూ నియంతల ప్రభుత్వాలతోనే అమెరికా మిత్రత్వం నెరిపింది. నియంతలకు వ్యతిరేకంగా వచ్చిన తిరుగుబాట్లను అణచివేయడానికి కూడా సహాయ సహకారాలను అందించింది. ప్రజాస్వామిక ఎన్నికల్లో గెలిచిన వారిని మాత్రం తనకు అనుకూలంగా లేనట్లయితే కుట్ర, కుతంత్రాలు పన్ని గద్దె దింపేదాక నిద్రపోలేదు. పనామా నుండి నిన్నమొన్నటి హోండురాస్ వరకూ అనేక ఉదాహరణలు అమెరికా దాష్టికానికీ, దుర్బుద్ధికి సాక్షీభూతాలుగా నిలిచాయి. పనామా అధ్యక్షుడు నోరిగాపై డ్రగ్ వ్యాపారం నేరాన్ని మోపి, బూటకపు విచారణ జరిపి జైలు పాలు చేసింది. ఇప్పటికీ అతను అమెరికా జైలులోనె ఉన్నాడు. 2006 లో “సిరియాలో సంస్కరణలను వేగవంతం చేసేవారికి 5 మిలియన్ డాలర్లు ఇస్తాన”ని ప్రకటించిన నీచ చరిత్ర జార్జి బుష్ ది. దేశద్రోహం నేరం కింద జైలుపాలవుతామన్న భయంతో ఎవరూ ఆ నిధిని తీసుకోవడానికి ముందుకు రావడం లేదని అమెరికా రాయబారి 2006 లో రాసిన కేబుల్ వెల్లడించింది.
మీరెక్కడ నుంచి ఈ వార్తలు పట్టుకొస్తున్నారో నాకు తెలియదుగాని, ఇన్ని దేశాలలో అటువంటి పనులు చేసె అమేరికా మన దేశం లో ఎమీ చేయకుండా చేతులు కట్టుకొని కూచోందా? ముందర మనదేశం లో ఎమీ చేస్తున్నాదో రాయండి. తరువాత మీరు ప్రపంచ దేశాలను కవర్ చెద్దురు కాని.
శ్రీనివాస్ గారూ,
మన దేశంపై కూడా అమెరికా చాలా చేస్తోంది. వికీలీక్స్ లీక్ చేసిన కేబుల్స్ ద్వారా బైట పడిన విషయాలను నేను రాశాను కూడా. అమెరికా దుర్మార్గాలు అన్ని చోట్లా కొనసాగుతున్నాయి. ప్రపంచం నిండా వందల మిలట్రీ స్ధావరాలు అమెరీకా ఏర్పాటు చేసుకుంది. మన హిందూ మహా సముద్రంలో డిగోగార్షియా ద్వీపంలో దాని స్ధావరం ఉంది. మన విదేశాంగ విధానాన్ని అమెరికా అనుకూలంగా ఉండడానికి ఎలా మన్మోహన్ ప్రభుత్వం మార్చుకుందీ, అమెరికా కోసం ఇరాన్ తో శతృత్వం ఎలా తెచ్చుకుందీ ఈ బ్లాగ్ లోనే రాశాను. కేటగిరీస్ లో వికీలీక్స్ కేటగిరీని క్లిక్ చేస్తే అవన్నీ చూడవచ్చు.
సిరియా విషయం కూడా వికీలీక్స్ ద్వారానే బైట పడింది. వాషింగ్టన్ పోస్టు పత్రిక ఆ వార్తను ప్రచురించింది.
వాషింగ్టన్ పోస్టు పత్రిక ఆ వార్తను ప్రచురించింది.
Is there any such instance of freedom of press in China, Russia or any communist country?
Why China and Russia are shelving their ideologies and turning towards capitalism? Is it not true that only after capitalisation, China started growing economically?
ఆమెరికా ఏ పాకిస్తాన్ మీదొ ఇలాంటివి చేస్తే మన దరిద్రం వదిలిపొతుంది కదా…పాకిస్తాన్ వదిలేసి మిగతా ముస్లిం దేశాల మీద ఎందుకు పడ్డట్టు. ఆయిల్ కోసం అని రొటీన్ కధలు విని విసుగొచ్చింది…అది వద్దు. అక్కడ ఆయిల్ మీద సంపాదించేది ఎలా ఉన్నా…పాకిస్తాన్ స్థావరం గా చెలరేగుతున్న టెర్రరిస్ట్ కార్యకలాపాల నుండి కాపాడుకొవడానికి అమెరికా ఎక్కువ ఖర్చుపెడుతుంది. అన్నీ తెలిసినా పాకిస్తాన్ ని ఎందుకు ఒక చూపు చూడటం లేదొ అర్ధం కావడం లేదు. మీ వికీలీక్స్ లొ ఎమయినా రాసుందా దీని గురించి
హాయ్ జీరో గారూ,
ఇప్పటి చైనా లో పత్రికా స్వేచ్ఛ లేదు. ఇప్పుడక్కడున్నది పెట్టుబడిదారీ నియంతృత్వం.
చైనాలో మావో చనిపోయాక చైనా కమ్యూనిస్టు పార్టీలో డెంగ్-జియావో-పింగ్ నేతృత్వంలో పెట్టుబడిదారీ శక్తులు ఆధిపత్యం వహించి సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణాన్ని ఆపి, పెట్టుబడిదారీ వ్యవస్ధను పునర్నిర్మించడం ప్రారంభించారు. ఆ విధంగా పెట్టుబడీదారి విధానం తిరిగి స్ధాపించబడింది.
చైనాయే కాదు. ఇండియా, రష్యా, బ్రెజిల్ లాంటి దేశాలు వేగంగా అభివృద్ది చెందుతున్న దేశాలుగా చెబుతున్నారు. చైనా జిడిపి వృద్ధి రేటు పది శాతనికి దగ్గరగా ఉంటే ఇండియా జిడిపు వృద్ధి రేటు తొమ్మిది శాతంగా ఉంది. చైనా తర్వాత ఇండియయే ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. కానీ ఇండియాలో అరవై శాతం పైగా జనం పేదరికం, నిరుద్యోగం, ఆకలి, దారిద్రం, నీటి కొరత లాంటి సమస్యలతో బతుకులీడుస్తున్నారు. పెట్టుబడిదారీ వ్యవస్ధలో అభివృద్ధి అలాగే ఉంటుంది. అభివృద్ధి ఫలాలు పెట్టుబడిదారులకే అందుబాటులో ఉన్నాయి. ఉంటాయి. అమెరికా, యూరప్ దేశాల్లో కూడా పరిస్దితి అదే. ఆర్ధిక సంక్షోభం తర్వాత అక్కడ ఇంకా దిగజారింది. చైనాలో కూడా ప్రస్తుతం పరిస్ధితి అలాగే ఉంది. పెట్టుబడిదారులు ఉత్పత్తి ఎంత ఎక్కువ చేస్తే అంత అభివృద్ధి కాదు. వారి ఉత్పత్తులను ప్రజలు కొని వినియోగం జరిపె స్ధాయిలో ఉండాలి. ఉత్పత్తి మిగిలితే అది మిగులు సంక్షోభంగా మారుతుంది. అమెరికా, యూరప్ లలో ప్రస్తుతమ్ మిగులు సంక్షోభం కొనసాగుతోంది.
చైనలో సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం జరిగినంతవరకు ప్రజల ఆర్ధిక స్ధాయి, కొనుగోలు శక్తి పెరిగింది. చైనా పెట్టుబడిదారీ దేశంగా సాధించిన అభివృద్ధి, సోషలిస్టు వ్యవస్ధ సాధించిన అభివృద్ధి పునాదులపైనే ఇంతవరకూ లాభం పొందింది. కానీ క్రమంగా ప్రజల ఆర్ధిక స్ధాయి పడిపోతున్నది. దానికి కారణం పెట్టుబడిదారీ వ్యవస్ధ పునరుద్ధరణ ఫలితంగా సంపద ప్రజలకు అందుబాటులో ఉండటానికి బదులు కొద్ది మంది పెట్టుబడిదారుల వద్ద కేంద్రీకరించబడడం మొదలైంది.
Pakistan is semi-colony of USA. How can USA attack it’s own semi-colony?
మంచు గారూ,
పాకిస్తాన్ తో మిత్రత్వం నెరుపుతూనే అది దాచిపెట్టుకున్న యురేనియం నిల్వలను దొంగిలించడానికి అణు సదుపాయాలు నిర్వీర్యం చేయడానికీ అమెరికా ప్రయత్నిస్తోంది. దానికోసం సి.ఐ.ఏ ని దించింది. ఇది గమనించి అమెరికా సైనిక అధ్యక్షుడు కొన్ని రోజుల క్రితం ‘మీ సి ఐ ఏ సిబ్బందిని బాగా తగ్గించాల’ న్న సందేశంతో అమెరికా డిఫెన్స్ శాఖకు సందేశం పంపింది. ఐ.ఎస్.ఐ ఛీఫ్ ఆ సందేశాన్ని మోసుకెళ్ళాడు. ఈ కారణంతో పాక్, అమెరికా ల మద్య సంబంధాలు కొంత దెబ్బతిన్నాయి. కాని అమెరికా పాక్ కి నిధులిచ్చి మేపడం మానదు. దక్షిణాసియాలో యు.ఎస్ నమ్మకమైన మిత్రుడు పాకిస్ధానే. చైనా, ఇండియా లను కనిపెట్టుకుని ఉండటానికి దానికి పాకిస్ధాన్, ఆఫ్ఘనిస్ధాన్ లు కావాలి.
ఆయిల్ కోసమే బ్రిటన్ అరబ్ దేశాల్లో ఇజ్రాయెల్ కి భూభాగాన్ని సృష్టించింది. అరబ్ ప్రజల ఇష్టాలకు వ్యతిరేకంగా పాలస్తీనా భూభాగంలో ఉండే అరబ్బులందర్నీ తరిమేసి ఇజ్రాయెల్ దేశాన్ని ఏర్పరిచాయి. ఇజ్రాయెల్ అరబ్ దేశాల మధ్య రౌడీయిజం చెలాయిస్తోంది. ఇజ్రాయెల్ ద్వారా టెన్షన్ సృష్టించి అరబ్ దేశాలకు రక్షణ పేరుతో మిలట్రీ బేస్ లు పెట్టి, వాటిని తమవైపుకి తిప్పుకుంది అమెరికా. అమెరికా దాష్టీకాన్ని ఒప్పుకోనందునే ఇరాక్ పై, లిబియా పై దాడి. ఇరాన్ పై కూదా ఒక సమయంలో దాడి జరుగుతుందని భావించారు.
మంచు గారు ఆయిల్, గ్యాస్ లు శక్తిని సృష్టించేవి. అవి లేకుండా ఒక్క సారి ప్రపంచాన్ని ఊహించండి. ఊహించలేరు. వాయు, భూతల, జల వాహనలకు అవి కావాలి. పరిశ్రమలకు అవి కావాలి. ఫిద్యుత్ కి అవి కావాలి. ఆయిల్ రేట్లు పెరిగితే సరుకులన్నింటి రేట్లు పెరుగుతాయి. కారణం వాటి ఉత్పత్తికి, రవాణాకు ఆయిల్ (శక్తి -ఎనర్జీ) కావాలి. అందుకే అయిల్, గ్యాస్ లకోసం దురాక్రమణ దాడులు.
ఆయిల్ కోసం అని వినీ వినీ మనకు విసుగొచ్చినా అమెరికా, యూరప్ లకు విసుగు రాదు. మన విసుగు వారికే లాభం.
మరొక విషయం. పాకిస్తాన్ పై ఇలాంటివి చేస్తే… అని మనం భావిస్తే పరోష్కంగా అమెరికా, యూరప్ ల దాడుల్ని, దుర్నీతిని సమర్ధించినట్లె అవుతుంది. వాస్తవానికి ఇండియా పై టెర్రరిస్టుల దాడి పాకిస్తాన్ పాలకుల పని. అక్కడి ప్రజలకు సంబంధం లేదు. సామాన్య ప్రజలకు ప్రతిరోజూ కూడు, గుడ్డ, నీడ లకోసం వెతుకులాడడమే పని. అంతకు మించి ఆలోచింఛే సమయం వారికి ఉండదు. భారతీయులు ఎలాగో, ఇతర దేశస్ధులు, ఇతర మతస్ధులు అందరిదీ ఒకే పరిస్ధితి. ఆకలి, దరిద్రం…… మీకు తెలిసినవే.
చైనలో సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం జరిగినంతవరకు ప్రజల ఆర్ధిక స్ధాయి, కొనుగోలు శక్తి పెరిగింది.
______________________________________________
Do you have any statistics to prove this?