ఆకలి, దరిద్రాలతో బడి మానేస్తున్న బ్రిటన్ విద్యార్ధులు


బడిమానేయడం ఇండియాలో సర్వ సాధారణం. పిల్లల్ని కూలికి పంపితే కుటుంబానికి కొంచెం ఆదాయం పెరుగుతుందనే ఆలోచనతో పల్లేల్లొ పేద రైతులు, కూలీలు తమ పిల్లలు చేతికందాక బడిమానిపిస్తారు. మూడు సంవత్సరాల క్రితం సంభవించిన ప్రపంచ ద్రవ్య, ఆర్ధిక సంక్షోభాల పుణ్యమాని ఇప్పుడు యూరప్ లోని ధనిక దేశాల్లో సైతం ఆ పరిస్ధితులు తలెత్తుతున్నాయి. ఆర్ధిక సంక్షోభం తర్వాత స్తంభించిపోయిన ఆర్ధిక కార్యకలాపాలను పునరుద్ధరించి వేగవంతం చేయడానికి అభివృద్ధి చెందిన దేశాలు ట్రిలియన్ల కొద్దీ డాలర్లను ప్రవేటు బహుళజాతి సంస్ధలకు బెయిలౌట్ ప్యాకేజీలుగా ధారపోశాయి. అప్పటికే ఉన్న అప్పుకు తోడు బెయిలౌట్లు కూడా తోడయ్యి అప్పు రెండు, మూడింతలవడంతో ప్రభుత్వాలు పొదుపు పెరుతో అమానుషమైన విధానాలను అమలు చేస్తున్నాయి.

పెన్షన్లో కోత విధించడం, పెన్షన్ కోసం ప్రభుత్వ వాటా తగ్గించి కార్మికులు, ఉద్యోగుల జీతాలకు మరింత కొత పెట్టడం, నిరుద్యోగ భృతి, కరువు భత్యం లాంటి సౌకర్యాలను రద్దు చేయడం అమలు చేస్తున్నాయి. అనేక ఉద్యోగాలను రద్దు చేశారు. వీటితొ వేతనాలు తగ్గిపోయాయి. నిరుద్యోగం ప్రబలింది. స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలకు ప్రభుత్వ మద్దతు రద్దు చేశారు. ఫీజులు అనేక రెట్లు పెంచారు. ఉద్యోగాలు లేక, ఉన్నా సరైన వేతనాలు లేక అనేకమంది బ్రిటన్ వాసులు తమ పిల్లల్ని స్కూళ్ళు మానిపిస్తున్నారు.

బ్రిటన్ లోని స్కూళ్లు, కాలేజీల్లో అసోసియేషన్ ఆఫ్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ (ఎ.టి.ఎల్) సర్వే జరిపింది. 2008లో ఆర్ధిక సంక్షోభం సంభవించిన తర్వాత రిసెషన్ ఫలితంగా తమ విద్యార్ధులకు వారి తల్లిదండ్రులు బ్రేక్ ఫాస్ట్ గా ఏమీ ఇవ్వలేక పోతున్నారని టీచర్లలో పదికి నలుగురు చెప్పారని ఏ.టి.ఎల్ తెలిపింది. పిల్లలు తక్కువ సైజు బూట్లు వేసుకు రావడం (వయసుతో పెరిగే సైజుకు తగిన బూట్లు కొనలేక పాత బూట్లే వేసుకురావడం), సరైన దుస్తులు ధరించకపోవడం, బస్సు ఛార్జీలకు డబ్బుల్లేక స్కూలు ఎగవేయడం పెరిగిందని టీచర్లు సర్వేలో తెలిపారు. సర్వే జరిపిన మొత్తం టీచర్లలొ 80 శాతం మంది తమ విద్యార్ధుల కుటుంబాలు దరిద్రంలో బతుకున్నాయని తెలియజేశారు. అటువంటి విద్యార్ధుల్లో అధికులు స్కూలుకి ఆకలితోనో, అలిసిపోయో వస్తున్నారని కూడ వారు తెలిపారు.

తూర్పు ఇంగ్లండులోని సఫ్లోక్ నగరంలొ ఓ టీచర్ ఇలా చెప్పారు. “తక్కువ ఆదాయం, మధ్య స్ధాయి ఆదాయం ఉన్న కుటుంబాలు పిల్లలు స్కూలు ట్రిప్పులకు రాలేక పోతున్నారు. ట్రిప్పులకయ్యే డబ్బులు పెట్టలేక మానేస్తున్నారు. జీవించడానికి అవసరమైన ప్రాధమిక ఖర్చుకూడా వారు భరించలేక పోతున్నారు” అని చెప్పారు. మధ్య ఇంగ్లండులోని నాటింగ్ హామ్ నగరంలొ పదకొండవ తరగతికి పాఠలు చెప్పే మరొ టీచర్ చెప్పిందాని ప్రకారం ఒక విద్యార్ధి తల్లికి వేతనం వచ్చే దాకా డబ్బులు లేకపోవడం వలన మూడు రోజులనుండి ఆ విద్యార్ధి పస్తులున్నాడు. బస్సు పాసులు కొనుగోలు చేయడానికీ, తిండికీ అవసరమైన డబ్బుకోసం అనేకమంది విద్యార్ధులు ఓవర్ టైం పని చేస్తున్నారని ఆ టీచర్ తెలిపారు. “ప్రతి రోజూ దరిద్రంతో బాధ పడుతున్న విద్యార్ధులు కనీసం ఒకరైనా నాకు తారస పడుతున్నారు. ఈ రోజు ఒక విద్యార్ధి తల్లిదండ్రుల్ని పిలవాల్సి వచ్చింది. ఎందుకంటే తక్కువ సైజు బూట్లవలన విద్యార్ధి కాలివేళ్ళు ఒత్తుకుపోయి ఇన్ఫెక్షన్ వచ్చింది” అని మరో టీచర్ వెల్లడించింది.

విద్యార్ధుల కుటుంబాల దరిద్రానికి ‘ఉద్యోగాలు కోల్పోవడం, ఆహార ధరలు విపరీతంగా పెరగడం ప్రధాన కారణం’ అని టీచర్లు ఆరోపించారు. ఉచిత బడి భోజన పధకం పరిధిలోకి మరింతమందిని తీసుకురావాలని సర్వేలో పాల్గొన్న వారిలో సగం మంది టీచర్లు అభిప్రాయపడ్డారు. అలాగే ఇ.ఎం.ఎ (ఎడ్యుకేషన్ మెయింటెనెన్స్ అలవెన్సు – విద్య మద్దతు అలవెన్సు) ను పునరుద్ధరించాలని 47 శాతం మంది టీచర్లు అభిప్రాయపడ్డారు. పొదుపు చర్యల పేరిట కన్సర్వేటివ్ పార్టీ చేతిలో ఉన్న బ్రిటన్ ప్రభుత్వం ఇ.ఎం.ఎ ని ఈ సంవత్సరం రద్దు చేసింది. సెకండరీ విద్యను ప్రోత్సహించడానికి ఇ.ఎం.ఎ ఇవ్వడం మళ్ళీ ప్రారంభించాలని ఒ.ఇ.సి.డి సంస్ధ ఇంగ్లండు ప్రభుత్వాన్ని కోరింది. నలభైకి పైగా అభివృద్ధి చెందీన దేశాల కూటమి ఒ.ఇ.సి.డి. దీని కేంద్రం పారిస్. యువ విద్యార్ధుల విద్య పెంపొందించడం ద్వారా ఆర్ధిక వృద్ధి సాధించి లోటును తగ్గించుకోవచ్చని ఈ సంస్ధ తెలిపింది.

“స్టార్ట్ సెంటర్లకు నిధులు కత్తిరించి, ఇ.ఎం.ఎ రద్దు చేసి, ట్యూషన్ ఫీజులు పెంచి, స్ధానిక ప్రభుత్వాలు ఆరోగ్య, సామాజిక సేవలు అందించకుండా చేయడం ద్వారా ఈ ప్రభుత్వం యువకులకూ, విద్యార్ధులకూ ఏ సందేశం ఇవ్వదలుచుకుంది? అని ఎ.టి.ఎల్ జనరల్ సెక్రటరీ డాక్టర్. మేరీ బోస్టెడ్ ప్రశ్నించింది. విద్యార్ధుల పరిస్ధితికి విద్యా విభాగధికారి చెప్పిన కారణం మరీ విచిత్రంగా ఉంది. “పని లేకపోవడం, కుటుంబాల విచ్ఛిన్నం, తక్కువ స్ధాయి విద్య, ఆర్ధిక అభద్రత మొదలైన సమస్యల్ని పరిష్కరించడం కోసమే సంక్షేమ, స్కూళ్ళ వ్యవస్ధలను మేము ప్రక్షాళన కావిస్తున్నాం” అని విద్యా విభాగం ప్రతినిధి చెప్పాడు. అంటే ఏ విధానాల వలనైతే విద్యార్ధులు సమస్యలను ఎదుర్కొంటున్నారో ఆ విధానాలతోటే విద్యార్ధుల సమస్యలను పరిష్కరించదలచామని ఆయన చెబుతున్నాడు.

పొదుపు చర్యలు నిజానికి సంక్షోభంలో ఉన్న బహుళజాతి సంస్ధలకు మరిన్ని లాభాలు, పెట్టుబడులు అందుబాటులో ఉంచడానికి ఉద్దేశించి అమలు చేస్తున్నారు. ఆ విధానాల వలన ఉద్యోగాలు తగ్గిపోయి, సంక్షేమ విధానాలు రద్దవుతున్నాయి. ఆ విధానాలనే సమస్యలకు పరిష్కారంగా చెప్పడం వారి విడ్డూరం. బహుళజాతి సంస్ధల ఉత్పాత్తులకు కొనుగోలుదారులు లేక అవి సంక్షోభంలో ఉన్నాయి. ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడం వలన వాటిని కొనలేక పోతున్నారు. కనుక కొనుగోలు పెంచాలి. దానికి మరిన్ని ఉద్యోగాలు ఇవ్వాలి. మరింతగా సదుపాయాలు పెంచాలి. విద్యా ఖర్చులు ప్రభుత్వం భరిస్తే ప్రజలు ఆ డబ్బును సరుకుల కొనుగోలుకు వినియోగిస్తారు. తద్వారా బహుళజాతి సంస్ధలు సంక్షొభం నుండి బయడ పడతాయి. సంక్షోభానికి ఇదే పరిష్కారం. కానీ బహుళజాతి సంస్ధలకు తక్షణ పరిష్కారాలు, షార్ట్ కట్ పరిష్కారాలు కావాలి. వారి పెట్టుబడి కరగకుండా లాభాలు రావాలి. దానికోసమే ఉద్యోగాలు రద్దు చేసి దరిద్రం పెంచి తాము కూడా మరింత సంక్షోభంలో కూరుకుపొతున్నాయి. ప్రజల మూకుమ్మడి చర్యలే వారి దరిద్రానికి పరిష్కారం.

9 thoughts on “ఆకలి, దరిద్రాలతో బడి మానేస్తున్న బ్రిటన్ విద్యార్ధులు

 1. Here are few observations …..

  Colonial riches (actual word “loot” or “stealing”) fueled the engines of European Economies for the last 70-80 years. That wealth was exhausted now.

  So they have to create wealth (with in) to support their Socialist/Communist welfare societies. The illegal Muslim immigration from Africa and Arab world is putting burden on European economies. They produce 6-10 children for a pair and raise them with the help of first class welfare economies of Europe.

  1) With arms sales to 3rd world countries they supplant 10-20% of the budget.

  2) Another 20-40% they raise through Multinationals (most of their roots in colonialism) who control World economies with price controls and currency exchange manipulations and/or evading taxes.

  3) Another 10% they raise through Banking institutions that harbor 3rd World money, through Dictators who loot their peoples money and stash that wealth in European Banks.

  With above methods they can raise 70-80% of their budgets. Remaining 20-30% is the budget short fall.

  With decreasing productivity and growing aging population, those European economies are failing.

  Solutions…..

  1) Ban illegal immigration from Africa and Arab World.

  2) Cut Social spending

  3) No welfare for immigrants for the first 3 generations

  4) Build economy based on Capitalist principles. That means minimal welfare where ever it is necessary (children, poor women and elderly people).

  5) Encourage (provide incentives) local Whites to produce 2-3 babies for a pair

  and more ….

 2. Hi Ravi

  Your comment suggests the U.K. has Socialist/Communist economy, which is a mistaken assumption.

  They are implementing a few welfare measures for people. That does probably make it a welfare state but not Socialist or Communist.

  Those few welfare measures are drastically cut even withdrawn on the pretext of world economic crisis that occurred in 2008. Now there is no social spending now to cut back.

  Also, European states allow immigration to satisfy their need of skilled workers and casual labour. They do not allow indiscriminate immigration as you suggest. Even that is scaled down for the last one or two years as a result of rightist parties capturing the power in most of the EU countries.

 3. “Your comment suggests the U.K. has Socialist/Communist economy, which is a mistaken assumption”.

  Answer/clarification: Please re-read my comment. I did not mention U.K at all. I used European Countries or European Economies. Every one knows Welfare Socialism rules in Europe. Many of the Eastern European countries have Communist legacies until recently.

  “They are implementing a few welfare measures for people. That does probably make it a welfare state but not Socialist or Communist”.

  Answer/clarification: What do you mean by “few welfare measures”? Can you quantify it by giving sources or examples?

  “Those few welfare measures are drastically cut even withdrawn on the pretext of world economic crisis that occurred in 2008. Now there is no social spending now to cut back”.

  answer/clarification: you wrote “Now there is no social spending now to cut back”. ha.. ha.. what a joke. Please provide the statistics to support your views.

  “Also, European states allow immigration to satisfy their need of skilled workers and casual labor. They do not allow indiscriminate immigration as you suggest. Even that is scaled down for the last one or two years as a result of rightist parties capturing the power in most of the EU countries”.

  Answer/clarification: You use the term “rightist parties”. What do you mean by rightist? Who are they? did they have any identity?

  Looks like you are afraid of using the correct word “Christian Nationalists”. For example the Western media (BBC, CNN etc) refers BJP as Hindutwa party, instead of “rightist party”.

  Apply the same standards every where. Else educated people on internet can easily expose any biases.

 4. Hi Ravi

  Regarding U.K, It’s my mistake. I don’t know how I misread you. It’s totally my mistake.

  Not only European, there is no socialist/ communist societies in the entire world as I view.

  Yes, some parties are there in the name of Socialist or Communist, even in India. Mere name cannot confirm that they are socialist or communist.

  There may be a few are many welfare measures. We can not confirm a political party or a society as Socialist or Communist only because of welfare measures. There should be a planned construction of Socialist society through proper economic and cultural means. Most important thing is the state should be run by a Communist party as happened in USSR under the leadership of Lenin and Stalin and in China under the leadership of Mao. Socialist construction was interrupted and stopped after the death of Stalin in USSR and Mao in China. Afterwards Capitalist society was reinstated under the banner of Communist party and red flag.

  Why I wrote a few welfare measures? Because, after the economic crisis European countries began to cut back welfare measures in the name of austerity measures and fiscal discipline. While paying enormous amounts as bail-outs to multi-national companies and thereby increasing the sovereign debts, European countries and the US are denying to finance welfare measures because of which purchasing capacity of people is being reduced. In that situation, crisis will more be deepened as a result of unsold production and ‘realization of capital’ crisis.

  The ruling parties in countries such as the UK, France, Germany are considered rightist by mainstream news agencies. Even the parties named by Socialist are following the same policies naming them as austerity measures. There is certain ideology and a set of economic principles that are considered rightist economically as well as political. If you do not recognize them that is up to you.

  As you said, there are many educated and well-knowledged people with whom I cannot compete. I am still learning and what I know is very very minute. Categorization of issues may differ among individuals depending upon the knowledge they come across, essence being the same.

  I’m not good at English. Let us discuss to know something from each other rather than challenging each others’ knowledge.

  Thank you.

 5. Hi Ravi

  Thank you for providing me information. I will certainly read them. I think my above response would suffice even after reading the information provided by you as the difference lies in seeing things between us. Even then I’m anxious to discuss with you.

  Thanks.

 6. Thank you for the response.

  In blogs one should only discuss about issues by providing reliable facts and sources.

  You stated: “Not only European, there is no socialist/ communist societies in the entire world as I view. ”

  Looks like our thinking/knowledge is at two different planes/levels.

  I encourage you to give some credence to other peoples perspective (point of view) also.

  You are a nice person. Wish you all the best. Bye.

 7. Hi Ravi

  The criterion for deciding whether a system is a Socialist, is nothing but Marxism. Marxism is a set of three main theories. 1. Dialectical materialism (Philosophy) 2. Historical materialism (Evolution of society) 3. Marxian political economy (Economy and Politics).

  These three topics did not stop developing with only Karl Marx. It was further developed by Lenin, with more light on the development of imperialism. After Lenin, Mao tackled the application of Marxism and Leninism in agricultural dominated societies. Third world countries are mostly agricultural rather than industrial.

  If I say you to refer Marxism, I think you would become furious. Only thing I can tell you is I’ve acquired what I possess now, through years of study and observation. I may not be able to provide any link or reference to a site to prove my case, due to complexity of the issue in question.

  If you are interested, please refer monthlyreview.org for a view on the present world economic system, in Marxian line. One visit may not be enough to provide the insight.

  Thank you.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s