ధనికులకు పన్ను తగ్గింపు, పేదలకు సంక్షేమ పధకాల కోత; అమెరికాలో దారుణం


అమెరికా ఆర్ధిక సంక్షోభం నుండి ఇంకా కోలుకోలేదు. దేశంలో ధనికుల వద్ద డబ్బు మూల్గుతుంటే పేదలు, మధ్య తరగతి ఆదాయాలు లేక ప్రభుత్వ సంక్షేమ పధకాల మీద ఆధారపడుతున్నారు. ఈ పరిస్ధితుల్లో సంక్షోభ పరిష్కారానికి వెంటనే తట్టే ఆలోచన: ధనికులకు పన్ను పెంచి తద్వారా ఆదాయం పెంచుకోవడం. కాని అమెరికా ప్రతినిధుల సభకు దీనికి పూర్తిగా వ్యతిరేకమైన ఐడియా తట్టింది. నిజానికి ఇది ఐడియా కాదు విధానం. అమెరికాలోని ప్రతినిధుల సభకు గత సంవత్సరం జరిగిన ఎన్నిల్లో మెజారిటి సీట్లు సాధించిన రిపబ్లికన్ పార్టీ విధానం. ఈ బడ్జెట్ కోతల బిల్లును తయారు చేసింది రిపబ్లికన్ పార్టీకి చెందిన పాల్ రేయాన్. ఆయన ప్రవేశపెడితే ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిఫ్రజెంటేటివ్స్) 235 – 193 ఓట్ల తేడాతో ఆమోదించింది. డెమొక్రట్ పార్టీ సభ్యులంతా బిల్లుని వ్యతిరేకించగా, రిపబ్లికన్ పార్టీనుండి ఐదుగురు వ్యతిరేక ఓటు వేశారు.

Philanthropist helping a disabled pensioner

లాభాల్ని చారిటీ సంస్ధలకు దానం చేస్తూ పేదలకు సహాయపడుతున్న ధనికుడు

పాల్ రేయాన్ తయారు చేసిన పొదుపు లేదా కోతల బిల్లు ప్రకారం రానున్న దశాబ్ధంలో అమెరికా ప్రజలపై పెట్టే ఖర్చులో 6.2 ట్రిలియన్ డాలర్లను తగ్గిస్తుంది. దీనిలో ప్రధాన అంశాలు ధనికులపై (బ్యాంకులు, ఫైనాన్స్ సంస్ధల యజమానులు, కంపెనీల యజమానులు లాంటి బిలియనీర్లు) పన్ను తగ్గించడం, ముసలి వారికి కల్పించే ఆరోగ్య బీమా కోసం ప్రభుత్వం బదులు వాళ్ళే ప్రీమియం చెల్లించడం, పేదవారికి అందిస్తున్న సంక్షేమ పధకాల్లో (నిరుద్యోగ భృతి, పెన్షన్, వికలాంగ పెన్షన్ సబ్సిడీలు, గర్భిణీ భృతి, విద్యారంగ సబ్సిడీలు మొదలైనవి) కోత విధించడం. ధనికులపై పన్నుల తగ్గించడం వలన ఆర్ధిక వృద్ధి రేటు పెరుగుతుందట! సంక్షేమ పధకాల్లో కోత పెట్టడం వలన ప్రభుత్వ ఖర్చు గణనీయంగా తగ్గించవచ్చునట!!

మరో ఘోరం ఏంటంటే బిల్లును నోటి మాట వ్యతిరేకిస్తున్నట్లు ఒబామా చెబుతున్నప్పటికీ, పాల్ రేయాన్ దృక్పధాన్ని ఆమోదం తెలియజేస్తున్నాడు. ప్రతినిధుల సభలో రిపబ్లికన్ లకే మెజారిటీ ఉండటం వలన వారితో రాజీకి రాక తప్పదనీ ప్రకటించాడు. అంతేకాక రానున్న అక్టోబరు 1 నుండి మొదలయ్యే కొత్త ఆర్ధిక (కోశాగార) సంవత్సరంలో కొత్త అప్పులు చేయడానికి ఒబామాకి వీల్లేకుండా పోయింది. కారణం అమెరికా చేయదగ్గ అప్పు పరిమితి దగ్గర పడింది. ఇపుడున్న అప్పుకు తోడు కొత్త సంవత్సరానికి అవసరమైన అప్పు చేయాలంటే అది ఆ పరిమితి 14.3 ట్రిలియన్లు దాటి పోతుంది. దానితో ఆ పరిమితిని పెంచాల్సిన అవసరం వచ్చింది. ప్రతినిధుల సభలో రిపబ్లికన్లది మెజారిటీ కనుక వారితో రాజీ పడితే తప్ప అప్పు పరిమితి పెంచే బిల్లు పాస్ కాదు. అందుకని ఒబామా రాజీ పడదాం అంటున్నాడు. ముసలోళ్ళ భీమా లాంటి కఠినమైన అంశాలను తొలగించి బడ్జెట్ కోతల బిల్లును ఆమోదించడానికి ఒబామా సిద్ధంగా ఉన్నాడు.

గత సంవత్సరం జరిగిన రాష్ట్రాల ఎన్నికల్లో కూడా అనేక రాష్ట్రాల్లో రిపబ్లికన్ పార్టీల గవర్నర్లు గెలిచారు. విస్కాన్సిన్ రాష్ట్ర గవర్నరు వస్తూనే కార్మిక సంఘాల హక్కులను బలహీన పరిచే బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింప చేసుకున్నాడు. బిల్లు ద్వారా కార్మికులు దశాబ్దాల తరబడి పోరాడి సాధించుకున్న “ఉమ్మడి బేరసారాల హక్కు”ను రద్ధు చేశాడు. ఉమ్మడి బేరసారాల హక్కు ద్వారానే కార్మికుల యూనియన్లు ఏర్పడి కార్మికుల ప్రయోజనాలను యజమానులతో బేరసారాలు జరిపి సాధించుకుంటాయి. ఆ హక్కు రద్దయితే యూనియన్లు ఉండీ లాభం లేకుండా పోతుంది. కార్మికుల పనివేళలపైనా, వేతనాలపైనా, వారి సదుపాయాలపైనా యాజమాన్యాలు యధేఛ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లభిస్తుంది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా అక్కడి కార్మికులు నెలన్నర రోజులు పైగా అసెంబ్లీ భవనంలో బైఠాయించి నిరసన తెలిపినా, గవర్నరు బిల్లును పాస్ చేయించాడు. ఇక ఇతర రాష్ట్రాల్లో కూడా అలాంటి చర్యలు ప్రారంభమయ్యాయి.

రాష్ట్రాల్లో ఆ పరిస్ధితి ఉంటే ఫెడరల్ స్ధాయిలో పాల్ రేయాన్ బిల్లు దేశంలోని పేదలకు, మధ్య తరగతి వర్గాలకు కష్టకాలం తెచ్చిపెట్టే పొదుపు బిల్లులు ఆమోదం పొందబోతున్నాయి. ప్రస్తుత కోశాగార సంవత్సరానికి గాను (సెప్టెంబరు 30 వరకు) ఇప్పటికే ప్రభుత్వ ఖర్చును తగ్గించే బిల్లును ఒబామా ప్రభుత్వం ఆమోదింప జేసుకుంది. ప్రభుత్వ ఖర్చు తగ్గించడం అంటే ప్రజలకు ఇచ్చే సంక్షేమ పధకాలను రద్దు చేయడం లేదా కోత పెట్టడం. ప్రజలు ఉద్యోగులపై పన్నులు కూడా పెంచుతారు. అయితే ధనికుల విషయంలో మాత్రం అది తిరగబడుతుంది. వారికి పన్నులు మరింత తగ్గిస్తారు. వ్యవసాయ సంష్దలకు, ఇతర సంస్ధలకు సబ్సిడీలు పెంచుతారు. బ్యాంకర్లకు బోనస్ లు పెంచుతారు. బ్యాంకర్ల జీతాలూ పెంచుతారు. ధనికులకు ఆ విధంగా సహయం చేయడం వలన వారికి ఉత్సాహం పెరిగి ఆర్ధిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొని, పెట్టుబడులు పెట్టి ఆర్ధిక వృద్ధి రేటు పెంచుతారని పెట్టుబడిదారీ సిద్ధాంతం చెబుతుంది మరి. అదే నయా ఉదారవాదం (నియో-లిబరలిజం) కూడాను.

74 thoughts on “ధనికులకు పన్ను తగ్గింపు, పేదలకు సంక్షేమ పధకాల కోత; అమెరికాలో దారుణం

 1. ధనికులకి పన్ను తగ్గిస్తే వచ్చిన డబ్బులతోటి పరిశ్రమలు స్థాపించి బీదలకు ఉద్యోగావకాశాలు కలిపిస్తారని ఆశ .

 2. పన్నులు తగ్గించకపోయినా వాళ్ళనుకున్న ఆశల్ని సాధించగల ఆస్తులు వారి సొత్తు. కాని శతాబ్దాలు గడిచినా అది జరగడం లేదే?! పెట్టుబడిదారుడిగా మారాక కంటికి కనబడేది లాభాలే. అది కూడా లాభాల శాతం పెరుగుతూ పోవాలి. మానవత, బంధువులు, స్నేహితులు అంతా లాభాలకు అతీతులుగా మారిపోతారు. డబ్బుకి ఉన్న మహత్యం అది.

 3. ఇండియాలోనూ టాటాలూ, అంబానీల దగ్గర డబ్బు డక్ టేల్స్ కథలలోని అంకల్ స్క్రూజ్ ఖజానాలాగ ఉంది. కానీ ఇక్కడ వాళ్ళు వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు పెట్టడం లేదే.

 4. మనకే పన్నులు తగ్గిన్చినదనుకోండి మనమేమి చేస్తాము? బజారు కెళ్ళి ఏవో కొనుక్కుంటాము. కొనుగోలు ఎక్కువవుతుంది కాబట్టి ఆర్ధిక పరిస్థితి తాత్కాలికంగా పెరుగుతుంది. కానీ తాత్కాలికము నుండి అల్లా శాశ్వితం గా ఉండటానికి చేసే పరిస్థితి తీసుకు వచ్చే పరిశ్రమలు పెట్టె పరిస్థితి మన దగ్గరలేదు. ఆ పెట్టగలిగే శక్తి డబ్బున్న వాళ్ళకే ఉంటుంది.
  ఆర్ధిక పరిస్థితి పెరగాలంటే నాకు కనపడేవి రెండే పద్దతులు. ప్రభుత్వమయినా పెట్టాలి. లేక పెట్టగలిగే వాళ్ళని ప్రోత్సహించాలి. ఎవరినన్నా సంతోష పెట్టాలంటే మనం ఏమిచేస్తాము? బహుమతులిస్తాము. ప్రభుత్వం బహుమతులిచ్చే ఒక రూపం పన్నులు తగ్గించటం. కాకపోతే వీటికి కొన్ని conditions తగిలిస్తే వాళ్ళ చేత కావాల్సిన పరిశ్రమలు పెట్టిన్చోచ్చు. దీనిలో గమనించ వలసిన విషయం పరిశ్రమలు పెట్టేది వాటిని లాభాలతో నడిపేది ప్రభుత్వము లేక డబ్బున్న వాళ్ళే.
  నేనేమి expert ను కాను. నాకు తెలిసినది పంచు కున్నాను.

 5. మీరనుకుంటున్నట్లు ఇప్పుడు పన్నులు తగ్గించడం ద్వారా మిగిలే డబ్బు ఉద్యోగాలు సృష్టించే పెట్టుబడిగా మారడం లేదు. ఫైనాన్స్ పెట్టుబడులుగా మారి షేర్ మార్కెట్లు, రియల్ ఎస్టేట్ లాంటి వాటిలోకి వెళ్తోంది. ఉత్పత్తి చేసేవాడి సరుకుల్ని ప్రజలు కొనలేక పోతున్నారు. ఎందుకంటే ఉన్న డబ్బంతా ధనికుల దగ్గర పేరుకుపోయింది. అదేమో లాభాలు ఎక్కువ వచ్చే చోటికే పరుగులు పెడుతుంది. ఉద్యోగాలు సృష్టించే బాధ్యత పెట్టుబడి పెట్టుకోవడం లేదిప్పుడు. ప్రపంచ వ్యాపితంగా ఇదే ధోరణి పెరిగి సంక్షోభాలు మళ్ళీ మళ్ళీ బద్దలవుతున్నాయి. ఆర్ధిక వ్యవష్దలో మనం అనుకున్నంత సూటిగా పరిణామాలు జరగవు. “లాభం కోసమే పెట్టుబడి” ఈ సూత్రం చుట్టూ డబ్బు తిరుగుతూ ఉంటుంది.

  ప్రభుత్వ పెట్టుబడి సరైందా లేక ప్రవేటు పెట్టుబడా అన్నదే ఇప్పుడు వాదోపవాదాలు. నిజానికి ప్రవేటు పెట్టుబడి వలన సమస్యలూ సంక్షోభాలే తప్ప ప్రజలకు ప్రయోజనం లేదని ఎన్నడో రుజువైనా, ప్రభుత్వాలు నడుపుతోంది ధనికులే కనక ప్రవేటు రంగం వైపే మొగ్గు చూపుతున్నాయి ప్రభుత్వాలు.

 6. మీరనుకుంటున్నట్లు ఇప్పుడు పన్నులు తగ్గించడం ద్వారా మిగిలే డబ్బు ఉద్యోగాలు సృష్టించే పెట్టుబడిగా మారడం లేదు.
  ——-
  అది నిజమే అందుకే conditions పెట్టాలి. ఎవరికయినా డబ్బులు ఇచ్చే టప్పుడు ఏమి చేస్తావురా నాయనా అని అడుగుతాము కదా అల్లాగే.
  ప్రభుత్వము చేయచ్చు కానీ ఎన్నని చేస్తుంది. చూస్తున్నారుగా పనిచేస్తేనే జీతం ఇస్తామని జీవో వస్తే ఎంత గొడవ అయ్యిందో!. ఇంకా ప్రభుత్వ ఉద్యోగుల చేత పరిశ్రమలు కూడా నడిపిస్తే ప్రభుత్వం దివాలా. నా ఉద్దేశంలో ప్రభుత్వం ప్రజా ప్రతినిధులు ఆమోదించిన రూల్స్ ప్రకారం అన్నీ నడుస్తున్నయ్యో లేదో చూడటం వరకే. మీరన్నట్లు ప్రభుత్వమే పరిశ్రమలు స్థాపించి లాభసాటిగా నడప గలిగితే అంతా మన మంచికే.

 7. రెండు విషయాలు

  ఒకటి: జీవో గొడవకి సమాధానం చెప్పలేని ప్రభుత్వం ఉద్యోగుల కంటే శక్తివంతమైన ప్రవేటు పెట్టుబడిదారులపై షరతులు అమలు చేయగలదా? సాక్ష్యాత్తూ ప్రపంచ పోలీసైన అమెరికా ప్రభుత్వమే ఆర్ధిక సంక్షోభానికి కారణమైన వాల్ స్ట్రీట్ కంపెనీలను అదుపులో పెట్టడానికి ఇంతవరకు ఒక చిన్న చట్టం చేయలేక పోయింది. అది కూడా ప్రపంచ వేదికలమీద ప్రవేటు కంపెనీలను అదుపులో పెట్టాల్సిందే అని తీవ్రంగా ప్రతిజ్గ్నలు చేసి కూడా అమెరికా, యూరప్ దేశాలు చట్టం చేయబోయేసరికి తోక ముడిచాయి. కారణం ప్రభుత్వాల నియంత్రణలో ప్రవేటు సామ్రాట్టులు లేరు. వారి నియంత్రణలోనే ప్రభుత్వాలు ఉన్నాయి.

  రెండు: మీరు చెబుతున్నది ప్రభుత్వాల పరిధిని కుదించమని. పరిపాలన వరకే కుదించుకుని ఆర్ధిక కార్యకలాపాలన్నీ ప్రవేటు కి అప్పజెప్పమని. అమెరికా, యూరప్ లలో దశాబ్దాలుగా జరిగిందదే. కాని క్రమం తప్పకుండా సంక్షోభాలు వస్తునే ఉన్నాయి. మూడు సంవత్సరాల క్రితం వచ్చిన సంక్షోభానికి కారణాలు తట్టక ఆర్ధికవేత్తలు “దాస్ కేపిటల్” ని తిరగేశారక్కడ. అంతటితో ఆగలేదు. కూలిపోయిన కంపెనీల్ని ప్రభుత్వం వశం చేసుకుంది. ప్రవేటు కంపినీలు బైట పడ్డానికి మూడు ట్రిలియన్ డాలర్లు ఒక్క అమెరికా లోనే ప్రభుత్వం కుమ్మరించింది. అంటే ప్రవేటు కంపెనీలు విఫలమయ్యేదాకా వారి అత్యాశని సంతృప్తి పరిచి విఫలమైనాక ప్రభుత్వం రంగం లోకి దిగాలి. ఇక ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించిందెక్కడ? పైగా ప్రభుత్వ జోక్యాన్ని కూడా ప్రజల కోసం కాకుండా ప్రవేటు కంపెనీలకే ధారపోయాలన్నమాట.

  ఇప్పటివరకు ప్రపంచంలొ అమలైంది కాస్త అటు ఇటుగా మీరు చెప్పే మర్కెట్ ఎకానమీ సూత్రాలే. జనాలకి మిగిలింది యుద్ధాలూ కాకుంటే ఆర్ధిక సంక్షోభాలూ. వారిని కుదురుగా బతకనిచ్చారా? ఓ పెద్దాయన అన్నట్లు రెండు యుద్ధాల మధ్య విరామమే శాంతి. ప్రభుత్వాలని ఎన్నుకోవడానికి ప్రజలు కావాలి, వారి ఓట్లు కావాలి. ఆర్ధిక వ్యవస్ధకి వచ్చే సరికి ప్రజల ఓట్లతో అధికారం చేపట్టిన ప్రభుత్వాలు జోక్యం చేసుకోకూడదు. ప్రభుత్వాలని కూడా ప్రవేటీకరిస్తే ఇన్ని చర్చలు అనవసరమేమో కదా. ఆఫ్ కోర్స్, ఇప్పుడు ఆచరణలొ అమలవుతున్నది ప్రవేటు వారి ప్రభుత్వాలే కదా!

  ప్రజలు, సంఘం, సంఘ జీవనం, సంస్కృతి, ఐకమత్యం, భాష, చరిత్ర ఇవన్నీ ఇక ఎందుకు? కొద్ది ధనికులందరికి శాశ్వతంగా అధికారం అప్పగించవచ్చు. ఎన్నికలు శుద్ధ దండగ. ప్రజాస్వామ్యం అనేదానికి ఇక అర్ధం ఉంటుందా?

  సమాజం జంతు దశను దాటి ప్రజాస్వామ్య భావనలకు సంబంధించిన నాగరిక దశకు చేరుకోవడానికి అనేక దశలను దాటింది. మానవ సమాజం బానిస వ్యవస్ధ, భూస్వామ్య వ్యవస్ధ లను దాటి ఇప్పటి పరిమిత ప్రజాస్వామిక వ్యవస్ధకి చేరుకుంది. ప్రజాస్వామిక సంస్కృతిని మరింతగా సంపద్వంతం చేసుకోవాల్సిన దశలో తిరిగి అధికార పగ్గాలని కొద్ది మంది ప్రవేటు ధనికుల చేతికి ఇవ్వడమంటే తిరిగి బానిస సమాజానికి ప్రయాణం కట్టడమే.

  ప్రవేటు సంస్ధలకు ఆర్ధిక వ్యవస్ధని అప్పజెప్పడమంటే ప్రజాస్వామ్యాన్ని అంతం చేసుకోవడమేనని గుర్తించకపోతే ప్రవేటు స్వాములు చేతిలో ఉన్న మీడియా ప్రచారానికి లొంగి మనల్ని మనం బానిసలుగా మార్చుకోవడమే నని గుర్తించాలి. సమాజంలోని వివిధ రంగాలన్నీ ఆర్ధిక వ్యవస్ధ పైనే ఆధారపడి ఉంటాయని గమనిస్తే, ప్రభుత్వ బాధ్యతలను కుదించి ఆర్ధిక కార్యకలాపాలని కొద్దిమందికి అప్పజెప్పడంలొ ఉన్న ప్రమాదం అర్ధమవుతుంది లక్కరాజు గారూ.

  జ్యోతి దినపత్రికలో ఎవరో రాస్తున్నారు ప్రతి ఆదివారం. (పేరు గుర్తు లేదు). చాలా ప్రమాదకరమైన ధోరణి అది. మనిషి సంపాదించుకున్న నాగరికత, ముఖ్యంగా ప్రజాస్వామిక నాగరికత ని సమాధి చేసే ధోరణి అది. దానికి మీ వాదన దగ్గరిగా ఉంది.

 8. జీవో గొడవకి సమాధానం చెప్పలేని ప్రభుత్వం ఉద్యోగుల కంటే శక్తివంతమైన ప్రవేటు పెట్టుబడిదారులపై షరతులు అమలు చేయగలదా?
  ———–
  మరి ప్రభుత్వమే పరిశ్రమలు పెట్టాలని కదా అంటున్నారు మీరు. అప్పుడెలా ఉంటుందో. నాకు తెలిసింది చాలా తక్కువ. మీరు చెప్పేదే కరెక్టు అవ్వచ్చు నాకు తెలియదు.

 9. జీవో అనేది నియంత్రణ సంబంధించిన అర్ధంలో వాడుతున్నాం. పరిశ్రమ పెట్టడం ప్రభుత్వ ఆర్ధిక సామర్ధ్యానికి సంబంధించింది. రెండూ ఒకదానికొకటి పోటీ కావు. మీవైపు నుండి వచ్చిన ఓ ప్రతిపాదనకు సమాధానంగా నేను పోలిక పెట్టాను. నేను ఎన్నుకున్న పోలిక కాదది. ఒకరిని లేదా ఓ గ్రూపును నియంత్రించడంతో సంబంధం లేకుండా ప్రభుత్వానికి ఆర్ధిక సామర్ధ్యం ఉంటుంది.

 10. పరిశ్రమ పెట్టడం ప్రభుత్వ ఆర్ధిక సామర్ధ్యానికి సంబంధించింది.
  ———–
  మీరు కరెక్టు. ఇప్పుడా ప్రభుత్వము పెట్టిన పరిశ్రమలలో పనిచేసేవారు ప్రభుత్వ ఉద్యోగాస్తులా లేక ప్రైవేటు వాళ్ళా? ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగాస్తులయితే మేము పనిచెయ్యటానికి రాము కానీ మా జీతాలు మాకిమ్మంటే ఇప్పుడన్నట్లు, ఉత్పత్తి ఉండదు రాబడి ఉండదు. అంతే కదా మరి..

 11. నేను ఇచ్చిన సమాధానంలో మీకు అనుకూలంగా ఉందనుకున్న (లేదా ఇంకేదైనా కారణం కావచ్చు) పార్ట్ ని ఎన్నుకుని దానికి స్పందిస్తున్నారు. అలాకాకుండా మొత్తాన్ని దృష్టిలో పెట్టుకుంటూ చర్చ కొనసాగిస్తే అది మరికొంత అర్ధవంతంగా ఉంటుందని నా అభిప్రాయం.

 12. ప్రభుత్వ పరంగా పరిశ్రమలు పెడితే పనిచేసేవారిని నియంత్రించలేక పోతే ఏమవుతుందో చెప్పాను. అంతకి తప్ప నాకు వేటితోటీ సంబంధం లేదు. Thanks for nice discussion.

 13. సంబంధం గురించి నేనేమీ అనడం లేదు లక్కరాజు గారూ. ఉన్నా తప్పుకాదు. చర్చ కొనసాగడానికి ఒక సూచన, అంతే. మనం అనుభవిస్తున్నదంతా మనతోనే పుట్టలేదు. మనతోనే అంతంకాదు. మనకు తెలియకుండానే ఏదో ఒక భావాజాలంతో మనం అలోచిస్తూ ఉంటామని నా పరిమిత పరిశీలనలో తెలిసిన విషయం. మీరు చేస్తున్న చర్చ నాకూ ఉపయోగమే. చర్చ కొనసాగించదలిస్తే నా సహకారం ఉంటుంది. అన్యధా భావించవలదు.

 14. మనము మామూలు ప్రజలుగా ఆలోచిద్దాము. నేననుకునేవి చెప్తాను. తప్పుంటే చెప్పండి. మనకు ఆలోచనా శక్తి ఉన్నప్పుడు ఆలోచించ వచ్చు కదా.

  1. మనము ఆర్ధికంగా వృద్ది అవాలి. వాటికి పరిశ్రమలు అవుసరం. పరిశ్రమలలో పనిచేసేవాళ్ళు కావాలి కాబట్టి ప్రజలకు ఉద్యోగాలు వస్తాయి. పరిశ్రమను లాభసాటిగా చేసుకుంటే వచ్చిన లాభం తోటి ఇంకొక పరిశ్రమ ప్రారంభించ వచ్చు. అలా మూడు పువ్వులు ఆరు కాయలు లాగా సాగి పోతూ హాయిగా ఉండచ్చు.

  2. ఎవరు పరిశ్రమలు ప్రారంభించాలి? ప్రభుత్వమా? లేక లాభా పేక్షతో పరిశ్రమలు ప్రారంభించే ధనవంతులా?

  3. లాభా పేక్షతో ప్రారంభించే వాళ్ళయితే పరిశ్రమ సంగతి తెలిసి ఉండి దానికి తగిన జాగర్తలు సమయానుకూలంగా తీసుకుంటారు. అని నా అభిప్రాయం. అది మీరు కాదన్నారు.

  4. ప్రభుత్వం ప్రారంభిస్తే మొదట పరిశ్రమ ల గురించి తెలిసిఉండాలి. తరువాత అవి లాభాలు కలిగిస్తూ సక్రమంగా నడవాలి.

  5. ప్రభుత్వం లో పనిచేసే మాకు మేము పనిచేసినా చెయ్యక పోయినా జీతాలు రావాలంటే పరిశ్రమ ఎల్లా నడుస్తుంది? ఎల్లా లాభాలు వస్తాయి?

  6. ప్రైవేటు వ్యాపారులు పరిశ్రమలు నడుపుతుంటే పనిచేసే వాళ్ళు మేము వచ్చినా రాకపోయినా జీతాలు ఇవ్వాలి అనగలరా?

  7. పై లెక్క ప్రకారం పరిశ్రమలు ఎవరు స్థాపించాలి? ప్రభుత్వమా లేక ప్రైవేటు వ్యాపారులా?

  మీరే ఆలోచించి చెప్పండి. నేను వప్పుకుంటాను.

 15. మా అమ్మగారు పని చేస్తున్నది ప్రభుత్వ రంగ బ్యాంక్‌లోనే. వాళ్ళ బ్యాంక్ ఏడాదికి ఇన్ని రోజులని కాజ్యువల్ లీవ్స్ మంజూరు చేస్తుంది. మంజూరు చేసినదాని కంటే ఎక్కువ రోజులు సెలవు పెడితే జీతం కట్ అవుతుంది. ప్రైవేట్ కంపెనీలలోనైనా ఇంతే. ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగులని ఎప్పుడు తీసేస్తారో తెలియదు. కొంచెం డబ్బున్నవాడు చిన్న వ్యాపారమైనా పెట్టుకుంటాడు కానీ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగానికి అంత సులభంగా వెళ్ళడు.

 16. లక్కరాజు గారూ

  మీరు చర్చ చేయడానికి ముందుకు వచ్చారు. దేశం గురించి మీరు ఆలోచిస్తున్నారనడానికి అది రుజువు. అత్యధికులు అది చేయడం లేదు. బతకడానికి నిరంతరం వెతుకులాటలో ఉండేవారికి దేశం గురించి ఆలోచించే టైం ఉండదనుకోండి!

  దేశాభివృద్ధి అంటే ప్రజల అభివృద్ధి. ప్రజాభివృద్ధి అంటే ప్రతి కుటుంబం సౌకర్యవంతంగా జీవించడం. సైన్సు సాధిస్తున్న ప్రతి అభివృద్ధీ సమాజంలొ అందరికీ అందుబాటులో ఉండటం. ఇంతవరకు భిన్నాభిప్రాయాలు ఉండకూడదు. (కానీ కొందరికి ఉంటుంది. దాన్నొదిలేద్దాం)

  పెట్టుబడి పెట్టగల ధనం ధనికులకు ఎక్కడినుండి వచ్చింది? ఆది మానవుడినుండి ఆలోచన మొదలు పెడితే కొంతమంది ధనికులు, ఎక్కువమంది పేదలుగా ఎలా మారారు? ఎవరైనా పనిచేస్తేనే కదా సంపద. కొంతమంది పనిచేస్తే ఎక్కువ సంపద, ఇంకొందరికి తక్కువ సంపద వచ్చే అవకాశం లేదు. అది కూడా ఇప్పుడున్నంత తేడాలు వచ్చే అవకాశాలు అసలు లేవు. పక్కవాడి సంపదను ఏదో ఒక పద్ధతిలొ అక్రమంగా స్వాధీనం చేసుకోవడం వలనే ఈ తేడాలు. ఒక్క పక్కవాడే కాకుండా ఒక గ్రూపు శ్రమజీవుల నుండి తలా కొంత శ్రమను అక్రమంగా స్వాధీనం చేసుకుంటే ఇంకా ఎక్కువ సంపద ఆయాచితంగా వస్తుంది. అక్రమంగా స్వాధీనం చేసుకున్నపుడు ఎవరూ ఊరుకోరు. తిరగబడతారు. కానీ తిరగబడకుండా ఉండడానికి ఏర్పాట్లు చేసుకుంటే!

  సమాజం అభివృద్ధి చెందే క్రమంలో ఉత్పత్తి సాధనాలు (భూమి, పనిముట్లు, టెక్నాలజీ, పరిశ్రమలు మొ.వి) కొద్దిమంది వద్ద కేంద్రీకృతమయ్యాయి. ఉదాహరణకి పారిశ్రామిక విప్లవం మొదట యూరప్ లో వచ్చింది. అంటే యంత్రాల లాంటి మెరుగైన ఉత్పత్తి సాధనాల్ని మొదట యూరప్ లో కనిపెట్టారు. యంత్రాల వాడకం వలన ఉత్పత్తి పెరిగింది. తమ దేశాల్లొ ఉన్న జనం వినియోగం పోగా ఇంకా ఉత్పత్తి మిగిలింది. మిగిలిన ఉత్పత్తి అమ్ముకోవడానికి యూరప్ వారికి మార్కెట్లు అవసరమయ్యాయి. వ్యాపారం పేరుతో ప్రపంచం మీదికి బయల్దేరి క్రమంగా ఇతర దేశాలను వలసలుగా మార్చు కున్నారు. వలస దేశాల్లోని ప్రజల శ్రమను కారుచౌకగా కొల్లగొట్టి మరింత ధనం పెంచుకున్నారు. యూరప్ వాళ్ళు వివిధ దేశాల్లో దోపిడిని సజావుగా సాగించడం కొసం స్ధానికంగా ఆధిక్యంలో ఉన్నవారికి తమదోపిడిలొ వాటా కల్పించారు. ఈ వాటా ఇవ్వడం అనేది సమాన ప్రాతిపదికన జరగలేదు. ఏదో కొద్దిగా విదిలించడం చేశారు. అలా విదిలించిందే కోట్లుగా ఉంది. ఇక యూరప్ వాళ్ళు పట్టుకెళ్ళింది ఎంత ఉంటుందో ఊహించుకోవచ్చు.

  ప్రపంచంలో ఉన్న ధనికులందరికీ పెట్టుబడి కాస్త అటు ఇటుగా ఈ పద్ధతుల్లొనే సమకూరింది. తన స్వంత శ్రమతొ పెట్టుబడిదారుడిగా మారడం అసాధ్యం.

  పెట్టుబడిదారుడు పరిశ్రమ ఎలా ప్రారంభిస్తాడు? కొన్ని యంత్రాలు, వాటిని పని చేయించడానికి కొంతమంది కార్మికులు, లెక్కా పత్రం చూడడానికి ఇంకొందమంది ఉగ్యోగులు… ఇలా సమకూర్చి పరిశ్రమ ప్రారంభిస్తాడు. పెట్టుబడి మొత్తం వందతో మొదలెడితే రాబడిగా వందపోను లాభంగా మరో ఇరవై వచ్చిందనుకుందాం. ఈ ఇరవై ఎక్కడినుండి వచ్చింది?

  యంత్రాలనుండా, మనుషులనుండా? మనుషులనుండే వస్తుంది. ఎందుకంటే యంత్రాలను తయారు చేయడానికి ఎంత ఖర్చయ్యిందో అంత వరకే ఉత్పత్తినే యంత్రం ఇవ్వగలుగుతుంది. కానీ మనిషికి కడుపునిండా తిండి పెట్టి పనిలోకి తీసుకుంటే అతను తిన్నదానికంటే చాలా ఎక్కువ ఫలితాన్ని ఇస్తాడు. అంటె రెండు తింటే మూడు వచ్చే శ్రమని పెట్టుబడిదారుడికి ఇస్తాడు. ఇలా శ్రమ చేసే వారు ఇవ్వగల అదనపు విలువే పెట్టుబడిదారుడికి లాభంగా వస్తుంది. కానీ అదనపు విలువ వాస్తవంగా ఎవరిది? కార్మికుడిది. వాస్తవంగా శ్రమ చేసిన వాడి ఫలితాన్ని శ్రమ చేసినవాడికే చెందడం ప్రకృతి సహజ సూత్రం. కానీ పెట్టుబడి విషయంలో అలా జరగదు. పెట్టుబడిదారుడి డబ్బు అదనపు విలువ ఇవ్వదు. అతను కొనే యంత్రం అదనపు విలువ ఇవ్వదు. అతను నియమిమించుకొనే కార్మికుడు మాత్రమె అదనపు విలువ ఇస్తాడు. కానీ అదనపు విలువ కార్మికుడు బదులు పెట్టుబడిదారుడు సొంతం చేసుకుంటాడు. పెట్టుబడిదారుడు దోపిడీ చేయడమంటే ఇదే.

  శ్రమ చేసేవాడు ఇచ్చే అదనపు విలువే లాభాలుగా కూడి పెట్టుబడిగా పోగయ్యింది. ఆ పెట్టుబడితో మళ్ళీ మరిన్ని లాభాలు, ఇంకా పెట్టుబడి. మరింత లాభం… మానవ జాతి చరిత్రలొ పోగైన పెట్టుబడి అంతా ఇలా సమకూరిందే.

  టెక్నాలజీ అభివృద్ధి అయ్యే కొద్దీ మనుషుల అవసరం తగ్గుతూ వచ్చింది. ఆ సౌకర్యాన్ని అందరికీ సమానంగా పంచినట్లయితే ప్రతి కార్మికుడు గతంలొకంటే తక్కువ శ్రమను ఇచ్చి రోజులో మిగిలిన భాగాన్ని కళలు, సంస్కృతి అభివృద్ధి చేయడానికి దోహదడే వారు. కాని రాను రానూ కార్మికుడు ఇచ్చే అదనపు విలువ దోపిడీ చేయడమె కాకుండా అతని జీతంలో కూడా కోతపెట్టి దాన్నీ లాభంగా జమ చేసుకున్నారు దోపిడిదారులు. దానితో కార్మికుడు తనూ, తన కుటుంబాన్ని పోషించడానికి ఇంకా ఇంకా ఎక్కువ శ్రమ చేయాల్సి వస్తోంది.

  మిగులు ఉత్పత్తిని అమ్ముకోవడానికి మార్కెట్లను వెతుక్కునే క్రమంలోనే యుద్ధాలు. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలు మార్కెట్ల పునహ్ పంపిణీ కొసమే జరిగాయి. (ఇంకా రాస్తాను)

 17. పరిశ్రమలు ఎవరు ప్రారంబించాలి అని కాకుండా అందరికీ పెట్టుబడి పెట్టే అవకాశం ఎందుకు లేదు? అనే ప్రశ్న ముందు వేసుకోవాలి. మనం పుట్టడంతోటే పెట్టుబడిదారులు, కార్మికులు ఉండటం వలన అదే సహజం అనుకుంటున్నాం. కానీ సమాజం అలా విభజింపబడటానికి వందల సంవత్సరాల పాటు ఆర్ధిక వ్యవస్ధ మార్పులకు లోనయ్యింది. ప్రస్తుతం ఉన్న వ్యవస్ధ భవిష్యత్తులో ఇలానె ఉండాల్సిన అవసరం లేదు. శ్రమ చేస్తున్నవారు తమ బతుకులు మెరుగుచుకోవడానికి రాజకీయ చర్యకు దిగుతారు. అలా శ్రమజీవులు మూకుమ్మడిగా రాజకీయ చర్యకు దిగితే వచ్చేవే విప్లవాలు. వివిధ దేశాల్లో వివిధ దశల్లొ జరిగిన విప్లవాల వల్లనె సమాజం అభివృద్ధి చెందుతూ వచ్చింది.

  ఇప్పుడున్న పెట్టుబడిదారి సమాజం మార్పు చెంది మరింత మెరుగైన సమాజం ఏర్పడుతుంది. ఏర్పడుతుందా లేదా అన్నది సమస్య కాదు. ఎప్పుడన్నదే సమస్య. దోపిడీ చేస్తున్నవారు తమ దోపిడీ కొనసాగడానికి ఆధునికమైన ఎత్తుగడలు వేస్తున్నారు. ఉదాహరణకి రష్యా, చైనాలో సోషలిస్టు విప్లవాలు వచ్చాక అమెరికా, యూరప్ దేశాల్లొ కూడా సోషలిస్టు విప్లవాలు వచ్చే పరిస్ధితి తలెత్తింది. దానితో ప్రజల్లో అసంతృప్తి తలెత్తకుండా ఉండటానికి సంక్షేమ రాజ్యాలు అనే కాన్సెప్టును అభువృద్ధి చేశారు. దానికింద ప్రజలకు నిరుద్యోగ భృతి, పెన్షన్, ప్రసూతి సెలవులు, సబ్సిడీలు, ప్రభుత్వ విద్య, ప్రభుత్వమె పరిశ్రమలు స్ధాపించి ఉద్యోగాలు ఇవ్వడం. ప్రభుత్వోద్యోగులకు గ్యారంటీ పని, భత్యం ఇవ్వడం వీటిని అమలు చేశారు.

  అలా వచ్చిందే ప్రభుత్వ రంగం లేదా పబ్లిక్ సెక్టార్. అంటే పెట్టుబడిదారీ వర్గం సొషలిస్టు విప్లవాలను నిరోధించి తద్వారా తమ దోపిడీ సజావుగా కొనసాగడానికి తాము దోపిడీ చేస్తున్న లాభాల్లో కొంత భాగాన్ని (కేవలం కొంత భాగం మాత్రమే) కార్మికులకు, ఉద్యోగులకు పంచడానికి సిద్ధపడ్డారు. అలా సిద్ధపడిన ఫలితమే ప్రభుత్వ రంగం అభివృద్ధి చెందటానికి దారితీసింది.

  సోషలిస్టు విప్లవాలు సంభవించిన రష్యా, చైనాల్లొ ఉత్పత్తి సాధనాలనన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని తానే నడపడం మొదలు పెట్టింది. అక్కడ మీరు వాదిస్తున్నట్లు పని చేయకపోయినా జీతాలివ్వాలి అని ప్రజలు అనలేదు. ఇప్పుడు రష్యాలో సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణాన్ని వెనక్కి తిప్పి పెట్టుబడిదారీ వ్యవస్ధను తిరిగి స్ధాపించారు. అదొక పెద్ద కధ. పెట్టుబడిదారి వ్యవస్ధ ఏర్పడినా ఇప్పటికీ రష్యాలో ఉద్యోగులు, కార్మికులు పని ఎగ్గొట్టరు. ఇక్కడ జరుగుతున్నట్లు మున్సిపల్ ఉద్యోగులు, ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు లాగా పిలిస్తే రాకపోవడం జరగదు. ఉద్యోగులంతా ఠంచనుగా తమపని తాము చేసుకుపోతుంటారు. అది ఎలా సంభవించింది.

  సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం రష్యాలో 1917 నుండి 1954 వరకు జరిగింది. ఆ కాలంలో ప్రభుత్వం ప్రజలకు అలవాటు చేసిన పని సంస్కృతి అది. ఆ పని సంస్కృతి ఇంకా మిగిలి ఉందక్కడ. సోషలిస్టు వ్యవస్ధలో ధనవంతుడు కావడం ఆదర్శం కాదు. పని చేయడం ఆదర్శం. పని చేసిన వాడికి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచారు. శ్రమ ద్వారా సమకూడిన సంపదని ప్రభుత్వం స్వాధీనం శ్రమజీవులందరికీ పంచింది. “శక్తిమేరకు పని చెయ్యి. శ్రమచేసినంత తీసుకో” అన్న సూత్రం అమలు చేశారు. రష్యాలో సోషలిస్టు నిర్మాణం కొనసాగినట్లయితే “శక్తి మేరకు పని చెయ్యి, అవసరం కొద్దీ తీసుకొ” అన్న సూత్రాని వచ్చేవాళ్ళు. కానీ పెట్టుబడిదారీ శక్తులు విప్లవం తర్వాత కూడా కొనసాగి మెల్లమెల్లగా ఆధిక్యం సంపాదించి, సమాజాన్ని మళ్ళీ పెట్టుబడిదారీ వ్యవస్ధవైపుకి మళ్ళించారు.

  1990ల ప్రారంభంలో క్యూబాపైన అమెరికా పెట్రోలు ఆంక్షలు విధించింది. అధ్యక్షుడు కాస్ట్రో “పెట్రోలు అందడం లేదు కనక పెట్రోలు వాహనాల వినియోగం నిలిపివేసి సైకిళ్ళు వాడండి అని ప్రకటించాడు. ప్రకటన తర్వాత రోజే లక్ష సైకిళ్ళు అమ్ముడుపోయాయక్కడ. అదెలా సంభవించింది? ప్రభుత్వం (రాజ్యం) తన ప్రజలకు అటువంటి సంస్కృతిని నేర్పించింది. పొద్దున లేచి నిద్రపోయేదాకా మనిషి తన చుట్టూ ఉన్న సంస్కృతికె అలవాటు పడతాడు. దాన్నే సహజంగా తీసుకుంటాడు. సోమరిగా ఉంటూ, పని చేయకుండా తినడానికి అలవాటు పడటాన్ని ఒక నేరంగా, పరువు తక్కువగా భావించే విధంగా సంస్కృతి అభివృద్ధి చెందితే అదే అమలవుతుంది.

  ఇక్కడ చూడండి. ఆడవారి సంపాదన మీద ఆధారపడి ఉండటం పరువు తక్కువగా భావిస్తారు. భార్య ఉద్యోగం చేస్తూ, భర్త ఉద్యోగం దొరక్క ఇంట్లో ఉండి వంట చేస్తే చాలా పరువు తక్కువ గా భావిస్తారు. (మెట్రో నగరాల్ని వదిలేస్తే) నేను స్వయంగా అనుభవించాను. మాది ప్రేమ వివాహం. పెళ్ళి చేసుకున్న తర్వాత రోజే మా ఆవిడకు లెక్చరర్ ఉద్యోగం నెల్లూరులో వచ్చింది. నేను నిరుచ్యోగిని. ఇంట్లో పనును చూసే వాడ్ని. ఉదయం కూరగాయలు తేవడం, సరుకులు తేవడం, వంట చేయడం. చాకలికి బట్టలు వేయడం చేసే వాడ్ని. నెల్లూరు మా సొంతూరు కాదు. ఉచ్యోగం వల్లనే నెల్లూరు వెళ్ళి అద్దె ఇంట్లో ఉన్నాం. వారం రోజులకే ఇంటి ఓనరు మీ ఉద్యోగం ఎప్పుడు సార్ అనడగడం మొదలు పెట్టాడు. రెండుమూడు రోజులకి అడగడం చేసే వాడు. కూరగాయలకి వెళ్తే అక్కడ ఆడవాళ్ళు అడిగేవాళ్ళు మీ ఉద్యోగం సంగతేంటని? చాకలికి బట్టలు వేస్తుంటే ఆవిడా అడిగేది మీకు ఉద్యోగం రానట్టేనా అని. బడ్డీ కొట్టుకి వెళ్తే అక్కడా అదే. చివరికి “నేను ఉద్యోగం చేయదలచుకోలేదు. జీవితాంతం ఇంతే” అన్నా ఎవరూ అడగడం మానలేదు, అలా అనడం వలన అదనపు ప్రశ్నలు అడగడం తప్ప.

  ఇదంతా ఎందుకని? జనాల తప్పు కాదది వారి చుట్టూ అలాంటి సమాజం ఉన్నపుడు దానికి భిన్నంగా అభ్యుదకరంగా ప్రవర్తించమని ఆశించలేం. కాని ప్రభుత్వం చేతిలో సర్వాధికారాలు ఉంటాయి. అది తలచుకుంటే మీడియా, విద్య, కళలు, సంసృతి మొదలైన వాటి ద్వారా అభ్యుదయ సంస్కృతిని ప్రవేశపెట్టగలుగుతుంది. సమాజంలొ ఉండే ధనిక పేద అన్న తేడా లేకుండా అందర్నీ సమానంగ చూసే సంస్కృతిని స్ధాపించ గలుగుతుంది. కానీ ప్రభుత్వంలో ఉన్నవారికి అందుకు అనుగుణమైన ప్రయోజనాలు ఉండాలి. అధికారంలో ఉన్నవారు పరిశ్రమలు, రియల్ ఎస్టేట్, బ్యాంకులు, కంపెనీలకు సొంతదారులైతే, తమ ఆస్తులు తగ్గించుకునే చర్యలు తీసుకోరు. ప్రభుత్వ హోదాలో వారికి కార్మిక చట్టాలను అమలు చేసే ఆసక్తి ఉండదు. ఉంటే తామే అవి అమలు చేయాల్సి ఉంటుంది. అమలు చేస్తే లాభాలు తగ్గిపోతాయి. వారే ఐ.ఏ.ఎస్, ఐ.పి.ఎస్ లు. పేదవారెవరైనా అధికార స్ధానాల్లోకి వచ్చినా వారి భావాజాలం కూడా ధనికులను ఆరాధించేదే కదా. కనుక వారూ పదవినో, ఉద్యోగాన్నో అడ్డమ్ పెట్టుకుని డబ్బు సంపాదించి ధనికుడిగా మారతారు. (ఇంకా ఉంది)

 18. కనుక ప్రభుత్వాలు తలచుకుంటే పని సంస్కృతిని మార్చ గలవు. పని సంస్కృతి అనేది వ్యవస్ధ స్వరూప స్వభావాలతో సంబంధం ఉన్న సమస్య. ప్రభుత్వం లో ఉన్నవారు ఏ తరగతికి చెందితే ఆ తరగతి ప్రయోజలే నెరవేరుతాయి. ధనికులు నిర్వహించే ప్రభుత్వాలు ధనికుల ప్రయోజనాలె చూస్తాయి. ధనికులుగా మారడానికి అవినీతికి అవినావ సంబంధం ఉంది. తమ అవినీతి కొనసాగడానికి కింది స్ధాయినుండి అవినీతిని ఒక సంస్కృతిగా పెంచి పోషిస్తారు. లేకుంటే వారి అవినీతిని ప్రశ్నించడం మొదలు పెడతారు ప్రజలు. ప్రశ్నించడంతొ ఆగరు. అది ఒక సామూహిక శక్తిగా మారి రాజకీయ చర్యలకు దిగుతుంది. ఇది ఎటువంటి భావాజాలంతొ సంబంధం లేకుండా జరిగే విషయం. గోడకు కొట్టిన బంతిని తిరిగి అదే వేగంతో వెనక్కి రమ్మని చెప్పక్కర్లేదు. అది ప్రకృతి సహజం. అలాగే ప్రజలను బలంతో తొక్కి పెట్టినపుడు తిరగబడటం కూడ ప్రకృతి నియమం. అలా తిరగబడకుండా ఉండటానికి ప్రజలు కూడా అవినీతిలో ముంచుతారు. అవినీతిని సహజంగా మారుస్తారు. రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు లాంటి వారు సైద్ధాంతికంగానే అటువంటి విధానాలను అమలు చేయగల సమర్ధులు. తన చుట్టూ ఉన్నవారిని కూడా తమలాగా ఆలోచించేలా చేయగల సమర్ధులు. వారొక ఒరవడిని ప్రవేశపెడితే అది అలా కొనసాగుతుంది. వై.ఎస్.ఆర్ అధికారంలోకి వచ్చాక భూములు, రైతుల పొలాల్ని అభివృద్ధి పేరుతొ బలవంతంగా స్వాధీనం చేసుకుని, రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకు ఇవ్వడం ఎంత తీవ్రంగా జరిగించో గమనించారా? సెజ్ (స్పెషల్ ఎకనమిక్ జోన్) పేరుతో ఆ పని చేశాడు. సెజ్ లు ఎక్కడినుండి వచ్చాయి. నూతన ఆర్ధిక విధానాల ఫలితం. నూతన ఆర్ధీక్ విధానాలను పశ్చిమ దేశాల ప్రవేటు గుత్త సంస్ధల ప్రయోజనం కోసం ప్రవేశపెట్టినవి.

  ఎక్కడినుండి ఎక్కడకు వచ్చామో గమనించారా? అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు తదితర ధనిక దేశాలు తమ ప్రవేటు కంపెనీల మార్కెట్టు కోసం స్వేఛ్ఛగా ఇండియాలాంటి దేశాల్లో జొరబడటానికి నూతన ఆర్ధిక విధానాల్ని మూడో ప్రపంచ దేశాలపై రుద్దాయి. వాటిలో భాగమే సెజ్ లు. సెజ్ చట్టంలో “దేశీయ సరిహద్దుల్లో విదేశీ భాగం” గా ఉండాలని రాశారు. సెజ్ లు అభివృద్ధికోసం అన్నారు. అభివృద్ధి కావాలంటే భూములు కావాలన్నారు. ప్రభుత్వ భూముల్ని అప్పనంగా అప్పగించారు. చాలక రైతుల భూముల్ని లాక్కున్నారు. మూడు పంటల్ని పండే భూముల్ని కూడా లాక్కున్నారు. కమిషన్ పుచ్చుకుని వాటిని ప్రవేటు వారికి అప్పజెప్పారు. ప్రవేటోడు సెజ్ లలో పరిశ్రమలు ఏవీ పెట్టలేదు. ప్లాట్లుగా విభజించి రియల్ ఎస్టే ట్ వ్యాపారం చేశారు. కాకుంటే ఎక్కువ ధరకి మరొకడికి అమ్ముకున్నారు.

  చిత్రం ఏమంటే అభివృద్ధీ లేదూ, భూములూ లేవు. పైగా రైతు కూలిగా మారిపోయాడు. కొంతమంది ఇళ్ళు పోగొట్టుకుంటే మరి కొందరు పొలాలు పోగొట్టుకుని బికారు లయ్యారు. నష్టపరిహారం రెండుమూడు లక్షలు ఏ మూలకు? అమెరికా తొ మొదలు పెట్టి ఇక్కడ రైతు దాకా వచ్చాం. అంటే మన దేశంలో చాలా చిన్నవిగా ఒక్కో సారి కనిపించే మార్పులు అమెరికాలో ధనవంతుడి ప్రయోజనాలతో ముడిపడి ఉంది. గ్లోబలైజేషన్ యుగంలో ఈ ప్రక్రియ మరింత వేగం అయ్యింది.

  లక్కరాజు గారూ, ఇప్పుడు చెప్పండి. మీరు వేసిన ప్రశ్నలు, అసలు ప్రశ్నలుగా మిగిలాయా? ప్రభుత్వమే ప్రవేటు వాడి చేతిలో ఉన్నపుడు ప్రవేటువాడికి అనుకూలంగా, తమ అవినీతికి అనుకూలంగా ప్రజల్లో చెడు సంస్కృతిని అలవాటు చేసినపుడు నేరం ఎవరిది? పని చేయకుండా జీతం అడిగేవాడి దగ్గర తప్పు నిలబడి లేదు. అది పైనుండి రుద్దబడిన సంస్కృతిలో భాగంగా నిలబడి ఉంది.

  ఐనా, “పని చేయకుండా జీతం అడిగే” పద్దతి మీరు ప్రస్తావించిన స్ధాయిలో లేదా అది స్ఫురించే స్ధాయిలో లేదు. ఒకానొక ఉద్యమం సందర్భంగా, ప్రభుత్వం ఎదుర్కొన్న పరిస్ధితిని మళ్ళీ ఎదురుకాకుండా ఉండటానికీ, ఆ వంకతో ఉద్యోగుల, కార్మికుల హాక్కులని ఏదో మేరకు తగ్గించడానికీ రాష్ట్ర ప్రభుత్వం జీవో తెచ్చింది. అటువంటి జీవొ అంతిమ ఫలితాలు అనివార్యంగా ప్రజాస్వామిక హక్కులను కుదించి వేస్తాయి. ఈరోజు ఆ జీవొ తెచ్చినవాళ్ళు రేపు మరింత కఠినమైన జీవొ తెస్తారు. ఇది ప్రభుత్వాన్ని నడిపే ధనికులకూ, కేవలం ఉద్యోగాలపై ఆధారపడి ఉన్న మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి, కొండొకచొ ధనిక మద్యతరగతి వారికీ మధ్య జరిగే నిరంతర ఘర్షణలొ ఒకానొక రూపం. జీవొ చదివినప్పుడు మంచిదే అనిపిస్తుంది. కానీ అమలులో అది ఉచ్యోగుల ప్రజాస్వామిక హక్కులను హరించివేసేదిగా తయారవుతుంది. అందువలనే అటువంటి జీవోలు వచ్చే అవకాశం ఇవ్వకూదు. ప్రభుత్వాలకు అటువంటి అధికారం ఇవ్వడం అంటే ఇప్పటి పరిస్ధితిలో ప్రభుత్వాలను నియంత్రణ చెస్తున్న ధనికులకి ఆ అధికారం ఇవ్వడమే.

  ఉద్యోగులు అసలు పనిచేయరు అనెది కరెక్టు కాదు. వారు పని చేయకుండా ప్రభుత్వం నడవదు. కాకుంటే లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు కేవలం ఉద్యోగుల లోపం కాదు. వారి చుట్టూ ఉన్న వ్యవస్ధనుండి సంక్రమించిన లోపం. అన్ని లోపాలతొ కూడా కార్మికులు, ఉద్యోగులు శ్రమ చేస్తేనే ప్రభుత్వాలూ, పరిశ్రమలూ నడుస్తున్నాయి. పెట్టుబడిదారుడు ఎంత డబ్బు కుమ్మరించినా కార్మికుడు లేకుండా ఏదీ నడవదు. మరీ ముఖ్యంగా సజీవ శ్రమ (మనిషి శ్రమ) లేకుండా పెట్టుబడిదారుడికి లాభాలు లావు. ఏ లాభం కోసం ఐతే పెట్టుబడిదారుడు ఆర్ధిక కార్యకలాపం లోకి దిగుతాడొ ఆ లాభం ఇచ్చేది కార్మికుడూ, ఉద్యోగీ. దీన్ని కప్పి పుచ్చడానికి అర్ధం కాని సిద్ధాంతాలు చాలా చెబుతారు. చాలా ఈక్వేషన్లూ చూపుతారు. అవన్నీ అంతిమంగా పెట్టుబడి దారుడి లాభాన్ని మరింత పెంచడానికే. (అయిపోయింది)

  (అడుగుతూ ఉండండి. నాకు తెలిస్తే చెబుతాను. మీగురించి మీరన్నట్లు నేనూ మేధావిని కాను. అందరు ఉబుసుపోకకు కబుర్లు చెప్పుకుంటే నాకవి రాక పుస్తకాలు చదువుతాను. తద్వారా సంపాదించిందే ఈ పరిమిత సమాచారం)

 19. మొదటి సంగతి చెప్పనివ్వండి. చాలా బాగా వ్రాయగలరు. వ్రాశారు. మీలాగా వ్రాసే నిపుణత నా దగ్గర లేదు. ప్రశంసల సంగతి పక్కనపెడితే, generic గ fundamental సంగతి ఆలోచిద్దాము.

  1. “ప్రపంచంలో ఉన్న ధనికులందరికీ పెట్టుబడి కాస్త అటు ఇటుగా ఈ పద్ధతుల్లొనే సమకూరింది. తన స్వంత శ్రమతొ పెట్టుబడిదారుడిగా మారడం అసాధ్యం.” దీనికి నేను వప్పుకోను. ఉదా:
  మొదట గాస్ స్టేషన్ లో పనిచేసిన అంబానీ, మొదట కాలెజీ గదిలో కూర్చుని కంపూటర్లు కూర్చిన డెల్. ఇంకా ఎందఱో.

  2. “శ్రమ చేసేవాడు ఇచ్చే అదనపు విలువే లాభాలుగా కూడి పెట్టుబడిగా పోగయ్యింది. ఆ పెట్టుబడితో మళ్ళీ మరిన్ని లాభాలు, ఇంకా పెట్టుబడి. మరింత లాభం… మానవ జాతి చరిత్రలొ పోగైన పెట్టుబడి అంతా ఇలా సమకూరిందే”. మీరు చెప్పింది నిజం. మొదట స్వంతంగా శ్రమిస్తాడు. వచ్చిన లాభాలతో భాగస్వాములను(నా ఉద్దేశంలో పనిచేసే వాళ్ళంతా భాగస్వాములే) చేర్చుకుని ఇంకా పరిశ్రమలని అభివృద్ధి చేస్తారు.
  మీరు గమనించారో లేదో మొదట స్వంతంగా శ్రమించి అన్నిటికీ తెగించి పరిశ్రమ పెట్టినప్పుడు/పనిచేసినప్పుడు, తను గెలుస్తాడని లేదు. ఓడిపోయిన వాళ్ళు కోకొల్లలు. అనిస్తితిలో ఉండి సాధించారని గెలిచిన వాళ్ళనే మనం పొగడతాం. వాళ్ళనే చాలా పెద్ద వాళ్ళయిన తరువాత ఈర్స్యించు కుంటాము. మొదట చిన్నగా ఉండే, పెద్దవాళ్ళు అవుతారు, ఆస్తులు అప్పనంగా ఎవరో ఇస్తే తప్ప.

  ఈ విధంగా పెద్దవాళ్ళు అయిన వాళ్ళందరూ చాలా మంచి వాళ్లవుతారని నేను అనటల్లేదు. కొందరు తమ సంపదని దానం చేస్తూ ఉంటారు, బిల్ గేట్స్ వగైరా లాగా. కొందరు మీరు ఉదాహరించిన వారి లాగా ఇంకా ఇంకా సమకూర్చు కుంటారు. ఏది అంతో ఎలా చెప్పటం. ఎలా ఆపటం.

  మనకున్న సమస్య ఏమిటంటే, అనిస్తితిలో కష్టాలకోర్చి పరిశ్రమలని పెద్ద స్థాయి చేర్చిన వారి ఆర్జన ఎంతవరకూ తరువాత భాగస్వాములుగా చేరిన (శ్రామికులందరూ దీనిలోకి వస్తారు) వారికి పంచాలి. అన్నీ త్యాగించి ప్రారంభించిన వారి భాగమెంత? అంతా చక్కగా ఉన్నప్పుడు దగ్గర చేరిన వారి భాగమెంత ?

  నా ఉద్దేశంలో పైన చెప్పినవి పరిష్కరించ గలిగిన శక్తి ఉంటే అన్ని కష్టాలు గట్టేక్కుతాయి. నా కింత కన్న ఎనలైజ్ చేసే నైపుణ్యము లేదు.

 20. అంబానీ, రామోజీ రావు లాంటి వారి గురించి ప్రచారంలో ఉన్న సమాచారం వాస్తవం కాదు లక్కరాజు గారూ. కష్టపడితే బిలియనీర్లు కావచ్చని నమ్మించడానికే ఇలాంటి కధలు.

  నేను చెప్పదలుచుకున్న విషయాలను సమర్ధవంతంగా చెప్పలేక పోయానని మీ సమాధానం ద్వారా నాకర్ధమయ్యింది. నిజానికి ఇది చాలా పెద్ద సబ్జెక్టు. పైగా డ్రై సబ్జక్టు. సామాజిక వాస్తవాలతో సరిపోల్చుకుంటూ అధ్యయనం చేయాల్సిన సబ్జెక్టు. నాకున్న నాలెడ్జి అత్యల్పం.

  మీకు తీరిక ఓపిక ఉంటే రంగనాయకమ్మ గారు రాసిన “పెట్టుబడి పరిచయం” చదవగలరు. ఆర్ధిక వ్యవస్ధ గురించిన చాలా విషయాలు అర్ధమవుతాయి. కనీసం ఒక ఐడియా వస్తుంది. అది ఫలాన ఐడియాలజీ కదా అని వదిలేయకండి. ఏ ఐడియాలజీ ఐనా వాస్తవమా కాదా అనేదే మనక్కావాలి. ఆ దృష్టితో దాన్ని అద్యయనం చేయడానికి ప్రయత్నిస్తే చాలా విషయాలు తెలుస్తాయి.

  నేను వాస్తవానికి ఆర్ధిక శాస్త్రం సబ్జెక్టుగా డిగ్రీ, పిజీలు చదవలేదు. పేపర్లు, పుస్తకాలు మామూలుగా చదువుతాను. కాని రంగనాయకమ్మ గారి పుస్తకం చదివాక ఒక ఐడియా వచ్చింది. అందుకే మీకు సూచిస్తున్నాను. ఏమయినా నాచేత ఇంత రాయించినందుకు ధాంక్స్. ఇంకా మిత్రులకు ఇది ఉపయోగపడుతుంది.

 21. విశేఖర్ గారు,

  మీ వివరణ బాగుంది. నిజానికి ఏ సిద్ధంతమైనా వివరించడానికి బాగానే ఉంటుంది. ఆచరణలోకి వచ్చే సరికే సమస్యలు వస్తాయి.

  సోషలిజం పై మీరు చెప్పిన కథలాగే కాపిటలిజం పై నేనూ ఒక కథ చెప్పగలను. బహుషా మరింత అందంగా కూడా కావచ్చు. (చదవండి, Atlas Shrugged).

  మీరనవచ్చు, కాపిటలిజం ఇప్పుడు ఉన్నదేగా అని. నేను కాదంటాను. అసలైన కాపిటలిజం ఇంకా అమల్లోకి రాలేదంటాను. అది అమల్లోకి వస్తే అత్యద్భుతంగా ఉంటుందంటాను.

  మీరు చెప్పిన సొషలిజం లేదా కమ్యూనిజం రష్యాలో మీరు చెప్పినంత అందంగా ఉండేది కాదు. స్వయంగా అనుభవించిన రచయిత రాసిన పుస్తకం, నవలే, చదవడానికి బాగుంటుంది (చదవండి, We the Living).

  అలా అని నేను కాప్టలిజాన్నో, సోషలిజాన్నో సమర్థించడం లేదు. అలా అని వ్యతిరేకించడం లేదు. రెండు విధానాల్లో కూడా కొన్ని పనికి వచ్చే విషయాలున్నాయి అని గుర్తించమంటున్నాను.

  రాజ్యం బలవంతంగా ఒక జీవో తీస్తేనే ఒప్పుకోనప్పుడు, అదే రాజ్యం AK 47 గురి పెట్టి ఫ్యాక్టరీలోకి తోస్తే ఎలా భరించగలం?

  మనిషికి అన్నిటికన్నా స్వెచ్చ ముఖ్యం. దానికి గ్యారంటీ లేని సమాజం గురించి ఎన్ని కబుర్లు చెప్పినా వ్యర్థమే.

 22. ఎసి రూమ్‌లో కూర్చుని లెక్కలు చూసుకోవడం సరళ శ్రమ కిందకి వస్తుంది. దాన్ని పెద్ద కష్టమనలేము. వడ్డీ వ్యాపారి కూడా తాను కష్టపడి సంపాదించానని చెప్పుకుంటాడు. అందులో శ్రమ, ఉత్పాదన రెండూ లేకపోయినా. అంబానీలు కష్టపడి సంపాదించి పైకొచ్చారనడం అబద్దమే. మార్కెట్‌లో డిమాండ్ పెరిగితే మేదర బుట్టలు తయారు చేసేవాడు మిడిల్ క్లాస్ వాడిగా ఎదుగుతాడు. చమురు & సహజ వాయువు వ్యాపారానికి మార్కెట్‌లో ఎంత డిమాండ్ ఉందో తెలియదా?

 23. అవును హరి గారూ, సిద్దాంతంపై మీరు చెప్పింది అక్షరాలా నిజం. సోషలిజం, క్యాపిటలిజం గానీ మీకు, నాకు సంబంధం లెకుండా, మన భావాలతో సంబంధం లేకుండా నిజం ఒక్కటే ఉంటుంది.

  రష్యా, చైనాల్లో అమలయ్యింది సోషలిజానికి సంబంధించిన మొదటి అడుగు మాత్రమే. రెండో అడుగు పడే లోపు అవి వెనక్కి మళ్ళాయి. నేను నిజానికి అందం కోసం రాయలేదు. నాకు తెలిసింది, నేను నేర్చుకున్నది రాస్తున్నాను. అంతవరకే తీసుకోగలరని మనవి.

  సమాజ పరిణామం వేల సంవత్సరాల్లో విస్తరించింది. మెరుగైన సమాజం ఇంకా తయారీలోనె ఉంది. అత్యధిక ప్రజలు దరిద్రం, ఆకలి, అవిద్య లతో బాధపడుతుండడమే అందుకు రుజువు. మీరూ, నేనూ జరిపే చర్చలో అంతిమం నిర్ణయం రాక పోవచ్చు. కానీ నిజం తెలుసుకోవడానికి ఒక మార్గం ఏర్పడుతుందేమో చూద్దాం.

  సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణంలో అనేక తప్పులు దొర్లాయి. అనుమానమే లేదు. కాని అది ఇంకా ఎవల్యూషన్ లో ఉంది. ప్రజలే దాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. అది సమీప భవిష్యత్తులో లేకపోవచ్చు. కాని మారక తప్పదు. వ్యవస్ధ పరిణామం ప్రజలంతా సమాన సుఖాలు పొందే పరిస్ధితి పొందేదాకా ఈ ప్రయాణం నడుస్తుంది. అది ప్రకృతి నియమం. ప్రకృతిలో జరిగే వివిధ ప్రాసెస్ లను గమనిస్తే అది మనకు అర్ధమవుతుంది.

  సొషలిస్టు వ్యవస్ధకేం ఖర్మ. మావో గుణగణాలమీదనే (క్యారెక్టర్) పెద్ద పుస్తకాలు వచ్చాయి. నిజాలే మనకు కావాల్సింది. అలోచనలూ, జ్గ్నానం పెంపొందే కొద్దీ మనకు నిజాల స్వరూపం అర్ధమవుతుందనుకుంటా. ఈ రోజు నిజం అనుకున్నది మరికొంత తెలుసుకున్నాక నిజం కాదని రుజువు కావచ్చు. ఇట్ డిపెండ్స్.

  ధాంక్స్.

 24. అవును హరి గారూ, స్వేఛ్ఛ ముఖ్యం. నిజమైన స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం ఏమిటనేవి కూడా చర్చలు, అనుభవాల్లో తేలాల్సిన విషయాలు.

 25. విశేఖర్ గారు,

  >>>మీరూ, నేనూ జరిపే చర్చలో అంతిమం నిర్ణయం రాక పోవచ్చు. కానీ నిజం తెలుసుకోవడానికి ఒక మార్గం ఏర్పడుతుందేమో చూద్దాం.

  కానీ అలాంటి మార్గాలు ముండే ప్రిజుడిసెస్ ఏర్పరచుకుంటే గోచరించవు.

  ఒక ఉదాహరణ. “శక్తి మేరకు పని చెయ్యి, అవసరం కొద్దీ తీసుకొ”. ఇది ఎలా సాధ్యమౌతుందనుకుంటున్నారు?

  ఈ ప్రపంచంలో ఉన్న సుఖాలన్నీ అనుభవించడానికి వంద జీవిత కాలాలైనా సరిపోవు. అలాంటిది పనికి టైమెక్కడ దొరుకుతుంది?

  ప్రతి ఒక్కరూ తాము చేసే పనికన్నా ఎక్కువ సుఖాలు అనుభవిస్తే అదనపు విలువ అటుంచి రాబడిలోనే తరుగు సంభవించదా? రష్యాలో జరిగిందదే.

  వ్యవస్థమీద అసంతృప్తి లేక పోయినట్టైతే 70 సంవత్సరాలు నిర్మించిన వ్యవస్థ అలా కుప్పకూలేది కాదు.

  మనుషుల్లో పరివర్తన తీసుకు రావాలని మాత్రం చెప్పకండి. ఆ పరివర్తనే గనక తేగలిగితే ఏ వ్యవస్థ అయితేనేం చెప్పండి?

  మనిషి స్వేచ్చాజీవి. అతడికి ఒక చట్రంలో ఇమడడం తెలియని పని. ఆ చట్రంలో అతడు ఎంత సుఖంగా ఉన్నాడు అనేది కేవలం శరీర సుఖాలు నిర్ణయించవు.

  మనిషిలోని స్వార్థగుణం పుట్టుకతో వచ్చి చావుతోనే పోయే గుణం. మనిషి ఏపని చేసినా సుఖాలను వెతుక్కోవడానికి మాత్రమే చేస్తాడు. తన సుఖం కోసం, తన సంతానం అభివృద్ధి చెందడానికి చేస్తాదు. అంతే కాని సుఖాలను వదులుకొని కష్ట ఫలాలను ఇతరులకు ధారాదత్తం చేయడానికి కాదు. సరిగ్గా మనిషి ఈ గుణమే పెట్టుబడిదారీ వ్యవస్థలో మనిషిని మిగులు సృష్టించేందుకు పురికొల్పుతుంది. ఈ గుణమే సోషలిస్టు వ్యవస్థలో మనిషిని నిర్వీర్యం చేస్తుంది. ఇది గమనించి ఆర్థిక వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చిన చైనా ఇంకా మిగిలి వుంది. రష్యా మార్పుకు గురికాక తప్పలేదు.

  అలా అని Capitalist వ్యవస్థలో లోపాలు లేవని చెప్పడం లేదు. ఈ రెండు వ్యవస్థలు ఆచరణ యోగ్యం కావని ఇప్పటికే తెలిసి పోయింది.

  మనుషుల సామర్థ్యాల్లో సమాంత్వం రానంత వరకు, పూర్తి సమానత్వం సిద్ధించే అవకాశం లేదు. కాకపోతే ఈ అసమానతలు తగ్గించడం మాత్రం సాధ్యమే. ప్రపంచ వ్యాప్తంగా ముందున్నంత అసమానతలు ఇప్పుడులేవన్న విషయం గమనించ వచ్చు.

 26. రష్యాలో ఏంజరిగిందనేది మీతో నేను ఏకీభవించడం లేదు. నేను చదివిన పుస్తకాల్లో నేను పొందిన సమాచారం వేరు. ఏ పుస్తకాలు అనడిగితే గనక లెనిన్, స్టాలిన్, జాన్ రీడ్, చార్లెస్ బెతెల్ హాం ఇంకొన్ని.

  మన ఛుట్టూ ఉన్న నియమాలు అంతిమం కాదు. సాపేక్షికం (రెలిటివ్) మాత్రమే. ఇప్పటి సామాజిక పరిస్ధితుల వెలుగులో చూస్తే కొన్ని అసాధ్యంగా కనిపిస్తాయి. కాని ఆర్ధిక సామాజిక నియమాలు కాలంలో మార్పు చెందుతాయని అంగీకరిస్తే, ఇప్పుడు సాధ్యంగా అనిపించనివి మరో సామాజిక నియమాల నేపధ్యంలో సాధ్యంగా కనిపిస్తాయి.

  నేను ఇంకోసారి చెబుతాను. స్టాలిన్ చనిపోయాక రష్యాలో పెట్టుబడిదారి విధానం పునర్నిర్మాణం మొదలయ్యింది. గోర్బచెవ్ నాటికి ఉన్నది పెట్టుబడిదారీ వ్యవస్ధ మాత్రమే మిగిలింది. అది సోషలిస్టు వ్యవస్ధ కాదు. కాకుంటే స్టేట్ క్యాపిటలిజం ఆధిక్యంలో ఉంది. దాన్నుంచి వేగంగా ప్రవేటు క్యాపిటలిజానికి వెళ్దామని యెల్ట్సిన్ వాదన. మెల్లగా వెళ్దాం అని గోర్బచెవ్ వాదన యెల్ట్సిన్ కి మద్దతు ఎక్కువగా ఉంది. కనుక ఆయన చెప్పింది చెల్లింది. ఇపుడు రష్యాలో పూర్తిగా ప్రవేటు క్యాపిటలిజం ఇంకా నెలకొనలేదు. కాని ఆవైపుకే ప్రయాణం. అందువల్లనే దాన్ని ‘ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీ’ గా పిలుస్తున్నారు. ఇండియా, చైనాలో కూడా గతంలో స్టేట్ కెపిటలిజం ఉంది. (చైనాలో మావో మరణానంతరం డెంగ్ ఆధ్వర్యంలొ కేపిటలిజం వైపు ప్రయాణం కట్టారు) దాన్నుండి నూతన ఆర్ధిక విధానాల అమలు ద్వారా ప్రవేటు కేపిటలిజం వైపుకు అవి ప్రయాణిస్తున్నాయి. ఇంకా పూర్తికాలేదు. ప్రభుత్వ రంగం పైన ఆధారపడ్డ కేపిటలిస్టులు, రాజకీయ నాయకులు ఇంకా బలంగా ఉండడం వలన ఇండియాలో ఆ ప్రయాణం నెమ్మదిగా జరుగుతోంది. ఇలా స్టేట్ కేపిటలిజం నుండి ప్రవేటు కేపిటలిజం వైపుకు వస్తున్న దేశాలనే “ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీ’ లుగా అందరూ పిలుస్తున్నారు.

  రష్యాలో మీరు చెపుతున్నట్లు కుప్పకూలిన వ్యవస్ధ సోషలిస్టు వ్యవస్ధ కాదని అర్ధం చేసుకోవాలి. కాదు సోషలిస్టు వ్యవస్ధే అంటే అది మీ యిష్టం.

  స్వార్ధం, పరివర్తన ఇవన్నీ సాపేక్షిక గుణాలు. మనిషి తన చుట్టూ ఉండే సమాజంలో ఉన్న నియమాలను బట్టి విలువలు నిర్ణయించుకుంటాడు. అది నేను కనిపెట్టిన విషయం కాదని గ్రహించాలి. అది సామాజిక నియమంగా నేను చదువుకున్నాను. ముందు రాసినట్లు తన చుట్టూ ఉన్న సామాజిక పరిస్ధితి నేపధ్యంలో పరికించినప్పుడు కొన్ని విలువలు అసాధ్యంగా కనపడతాయి. వేరే సామాజిక నేపధ్యంలొ అవే సాధ్యంగా కనపడతాయి. మనకు పూర్వం ఉన్న సామాజిక విలువలు ఏ విధంగా మారుతూ వచ్చాయో గమనిస్తే వాటి పయనం ఏవైపు ఉందో లీలగా అర్ధం అవుతుంది.

 27. మీరు చెప్పిన దాంట్లో నాకు నచ్చింది సత్యం యొక్క సాపేక్షికత. సత్యం జడమని, అచంచలమని అనుకునే వారు దాని సాపేక్షికతని గుర్తించరు. అందుకే రకరకాల గొడవలు, కొట్లాటలు, మత కల్లోలాలు.

  మీరు సాపేక్షికత అన్న దాన్ని నేను Objective అంటున్నాను. Truth is Objective in nature. అది చూసే రిఫరెన్సు పై ఆధారపడి ఉంటుంది. మనం ఒక ప్రత్యేకమైన రిఫరెన్సు నుంది చూస్తూ అదే సత్యం అని చెప్పడం బైబిలే సత్యం, వేరేదీ కాదు అని మతగురువు చెప్పడం లాంటిదే.

  మీరు ఇంతకు ముందు చెప్పిన “చేయగలిగినంత పని, పొందగలిగినంత సుఖం” అటువంటిదే. మీరు దాన్ని రిఫరెన్సు గా వాడినంత కాలం మీకు సత్యానికి చేరువ కాలేరు.

  నిజానికి అది ఒక రిఫరెన్సుగా వాడడం నా దృష్టిలో తప్పు కాదు. కానే అదే రిఫరెన్సుగా వాడతాననడం మాత్రం సరికాదు.

  Anyway, had a nice discussion with you after a long time. Thanks for your patience. ఇది కేవలం నా ఆలోచనలు పంచుకోవడం మాత్రమే అని గమనించ గలరు.

 28. హరి గారు, మీ దృష్టిలో స్వేచ్ఛ అంటే ఏమిటి? వ్యక్తి స్వేచ్ఛా, వర్గ స్వేచ్ఛా? హిట్లర్ కూడా తాను స్వేచ్ఛకి విలువిస్తానని చెప్పుకున్నాడు. స్వేచ్ఛ అంటే ప్రతి వ్యక్తి యొక్క అవసరాలని తీర్చడం అని ఫ్రెడ్రిక్ ఎంగెల్స్ అన్నాడు. ఒక వ్యక్తికి అదనపు విలువ అందుతూ ఇంకో వ్యక్తికి శ్రమకి కనిష్ట విలువ అందని సమాజంలో స్వేచ్ఛ గురించి ఎన్ని కబుర్లు చెప్పినా అవి గాలి కబుర్లే అవుతాయి.

 29. ప్రవీణ్ గారు,

  అవసరాలు తీరని స్వేచ్చ స్వేచ్చ కాదు, ఒప్పుకుంటాను. అలాగే తన వ్యక్తిగత అవసరాలను ఇంకొకరు నిర్ణయించి తీర్చడం కూడా స్వేచ్చ కాదు. మనిషి తన బతుకు తన ఇష్టం వచ్చిన రీతిలో బతికే అవకాషాలు ఉండడం (ఎదుటివాడి స్వేచ్చను హరించనంత వరకు) స్సేచ్చ.

  నా ఉద్దేశంలొ మంచి సమాజం రావాలని 95% మంది ప్రజలు కోరుకుంటారు, వారు కాపిటలిస్టులైనా, సోషలిస్టులైనా. కాని ఆ మంచి సమాజం ఎలా సాధ్యమఔతుందో దిఫైన్ చేయడానికి ఇప్పటివరకు చాలా మంది ప్రయత్నించారు. వారిలో కారల్ మార్క్స్ ముఖ్యుడే, కాని, అతడు చెప్పిందే భగవద్గీత అని భావిస్తూ ఆలోచిస్తే మనం ఇతర కోణాలు ఆలోచించలేం.

  ఎందుకంటే పైన విశేఖర్ గారు చెప్పినట్టుగా సత్యం స్థిరమైనది కాదు, నిరంతరం మార్పు చెందేది.

 30. మీరు జీన్ పాల్ సర్ట్ర్ రచనలు కూడా చదవండి. అలాగే జీన్ పాల్ సార్ట్ర్ రచనలపై ఏటుకూరి బలరామమూర్తి గారు థీసిస్ చదవండి. Social contradiction evolves when the freedom of one person oppresses the freedom of other one.

 31. అవసరాలు తీరని స్వేచ్చ స్వేచ్చ కాదు, ఒప్పుకుంటాను. అలాగే తన వ్యక్తిగత అవసరాలను ఇంకొకరు నిర్ణయించి తీర్చడం కూడా స్వేచ్చ కాదు. మనిషి తన బతుకు తన ఇష్టం వచ్చిన రీతిలో బతికే అవకాషాలు ఉండడం (ఎదుటివాడి స్వేచ్చను హరించనంత వరకు) స్సేచ్చ.
  ————
  హరి గారూ that is beautiful.

 32. సోషలిస్టు వ్యవస్ధలో వ్యక్తిగత అవసరాలను ఇంకొకరు నిర్ణయిస్తారని హరి, లక్కరాజు గార్లు భావిస్తున్నట్లుంది. అలా భావిస్తున్నట్లయితే, అది అపోహ మాత్రమే.

  “సత్యం స్ధిరమైంది కాదు. నిరంతరం మార్పు చెందేది.” ఇక్కడ నిరంతరం అనేది సాపేక్షికమే. హరిగారు సత్యం అని దేనిని భావిస్తున్నారో గాని నా ఉద్దేశ్యంలో అది “A set of values”. ఒక్కొ సామాజిక దశకు ఒక్కో set of values నిర్ణయమవుతుంది. మార్పు చెందింది తన ముందరిదాని కంటే మరింత ప్రగతిశీలంగా ఉంటేనే అది సరైన మార్పుగా పరిగణించాలి. అలా కాకుండా ప్రగతి నిరోధకంగా ఉన్నట్లయితే అది “set back” అవుతుందిగాని “development (మార్పు)” కాదని గమనించాలి.

  హరిగారు ఇంతకుముందు “పెట్టుబడిదారీ విధానం సరిగ్గా అమలైతే ఇంకా చక్కగా ఉంటుందంటాను” అన్నారు. భూస్వామ్య వ్యవస్ధ కంటే పెట్టుబడిదారి వ్యవస్ధ ప్రగతిశీలమైనది. కాని అది అభివృద్ధి అయ్యేకొందీ, శ్రమ జీవుల ప్రగతిని అడ్డుకుంది. శ్రమ జీవులే సంపద యావత్తుని సృష్టించారని అంగీకరిస్తే ఆ శ్రమ జీవులు సృష్టించిన సంపద వారికి కనీస సుఖానికి సైతం అందుబాటులో లేకుండా పోయింది. అది పెట్టుబడిదారి వ్యవస్ధ అభివృద్ధి క్రమంలో అంతర్గతంగా అభివృద్ధి చెందుతూ వచ్చిన వైరుధ్యం. ఆ వైరుధ్యం పరిష్కారనికి సంభవించేదే సోషలిస్టు విప్లవం.

  అదనపు విలువ గురించి నేను రాసింది కధగా భావించినట్లుగా నాకు అనిపించింది. నాకనిపించింది నిజమైతే అది కధ కాదని గ్రహించాలి. అది ఆర్ధిక సిద్ధాంతం. పూర్తి సాక్ష్యాలతో మార్క్సు నిరూపించిన సిద్ధాంతం. దానికి పెట్టుబడిదారీ ఆర్ధిక వేత్తలు ఇంతవరకు సమాధానం ఇవ్వలేదు. ఇవ్వలేరు కూడా. ఎందుకంటే అదే ప్రకృతి నియమాలతో సహా తాత్వికంగా, సామాజికంగా కూడా నిరూపించబడిన సిద్ధాంతం. నేను రాస్తున్నదేదీ నా బుర్రలో పుట్టిన కధలు కావు. నేను అధ్యయనంతో నేర్చుకున్నవి.

 33. శ్రమ జీవులే సంపద యావత్తుని సృష్టించారని అంగీకరిస్తే ఆ శ్రమ జీవులు సృష్టించిన సంపద వారికి కనీస సుఖానికి సైతం అందుబాటులో లేకుండా పోయింది.
  —————-
  అంగీకరించటానికి కుదరదు. ఎందుకంటే శ్రమ జీవులు వచ్చింది పెట్టుబడి దారులు పరిశ్రమ పెట్టిన తరువాత. లేటుగా వచ్చి అన్నీ కావాలంటే ఎట్లా. అభివృద్ధిలో భాగం ఉండాలి. ఎంత భాగమనేది ప్రశ్న. అంతేకానీ పరిశ్రమ మొత్తం మాదే అంటే ఎట్లా.

  ఇంకొకటి శ్రమ అనేదానికి మీ definition ఏమిటి? పరిశ్రమ ఫ్లూర్ లో పనిచేసే వారిదే శ్రమా? బయటికి వెళ్ళి ఆర్దర్సు తెచ్చే వాళ్ళది శ్రమ కాదా? వాళ్ళు లేకపోతే పరిశ్రమే ఉండదు. ఆర్డర్స్ తెచ్చే వాళ్ళని కంట్రోల్ చేసే దెవరు? పరిశ్రమ పెట్టిన వాళ్ళు. వాళ్ళకి తమ చేతులతో కష్టమోర్చి పెట్టినవాటిని అభివృద్ది చేసుకుందామని. వాళ్ళకి vested interests ఉంటాయి ఎదుకంటే అది వాళ్ళ బేబీ.

 34. ముందు రావడం, వెనక రావడం ఇక్కడ సమస్య కాదు. పెట్టుబడి ఎలా పోగయ్యిందో ఇంతకు ముందు రాశాను. మీరు దాన్ని కధలాగా, “బాగా, అందంగా రాయడంగా” భావించి పరిగణనలోకి తీసుకున్నట్లు లేదు. అది కధ కాదు. పెట్టుబడిదారీ వ్యవస్ధను ఆమూలాగ్రం పరిశీలించి నిర్ధారించిన నిజం. రాజకీయ, సామాజిక, ఆర్ధిక నియమాలకూ, వాటి పరిణామాలకు ఒకరి అంగీకారంతో సంబంధం ఉండదు. ప్రకృతి గమనానికి కొన్ని నియామాలున్నాయి. వాటి ప్రకారమె అది నడుస్తుంది. ఆ నియమాలను గ్రహించి ప్రగతి వైపుకు జరిగే గమనాన్ని వేగవంతం చేయడమే మనిషి చేయగల పని. ప్రకృతిలో మనిషీ ఒక భాగమే. మనుషులతో కూడిన సమాజమూ దానిలో భాగమే. అందుకే ప్రకృతి పరిణామాల క్రమంలోనే సమాజ పరిణామం జరుగుతూ వచ్చింది. వీటన్నింటినీ సైద్ధాంతికంగా డీల్ చేసేది తత్వ శాస్త్రం. నేను తెలుసుకున్న తత్వ శాస్త్రం గతితార్కిక భౌతిక వాదం (Dialectical materialism). తత్వశాస్త్ర దృక్పధంలో సామాజిక పరిణామ క్రమాన్ని వివరించేది చారిత్రక భౌతిక వాదం (Historical materialism). ఆర్ధిక సంబంధాలు, వాటి పరిణామాన్ని వివరించేది పొలిటికల్ ఎకానమీ. అది ‘దాస్ కేపిటల్’ లో వివరించబడింది. వీటిని అధ్యయనం చేసి రాస్తున్నవే నేను మీతో సంభాషిస్తున్న విషయాలు.

  నేనింతకు ముందు ఒకసారి చెప్పినట్లుగా, నేను రాసిన ప్రతి అంశాన్ని చర్చించడానికి ఒక సారి ప్రయత్నించండి లక్కరాజు గారూ.

 35. Assume at a given point of time all human beings possess same capacity to work and possess same intellect. All posses equal material goods, It means that every one is working as they are required to work to meet their needs. Every one is happy. This is the ideal world. It never existed. And it will never exist.

  All people are not same. Each and every person is different. There are old people, there are children, there are pregnant women, there are handicapped persons and there are mentally unstable people. The above people can not contribute at par with others. These are dependent on others. So there is a need for welfare. The percent of welfare never exceed 10-15% of total GDP. If it exceeds that limit, then we have a Socialist welfare system in place. The next logical step is a Communist System, that steals peoples money and distribute as they (the party or oligarchy or select few individuals, who control “everything”) pleases. People outside that “party” are at mercy of those few individuals. This is worse than slavery. This is the reason why Communist System (ideology) fails.

  By nature man is a Entrepreneur. With his/her Intellect and innovation produce goods more than what his/her family consumes. Naturally those goods can not be given away to the bums who don’t work. He/she has to sell and make some profit. That profit is attacked by Socialist or Communist leaches.

  If some one posses more material goods, then the Socialist and/or Communists label those people as Bourgeois and steal those material possessions.

  With this they are killing the natural inherent capacity for innovation and incentive among people.

  To sustain Socialist and/or Communist Systems,

  a) They may have to colonize other countries
  Example: USSR colonized many countries,
  China colonized Tibet and other
  Asian countries.
  b) Implement Slavery or Bonded Labor Camps (Gulag)
  Example: USSR implemented labor camps.
  China forced 60% of its rural population to
  slavery and bonded labor. Poor Chinese
  can not produce more than one Child.
  c) State control of all National resources
  d) and more …

  Note: There is a need for welfare in any given Society or Country to support elderly, children, sick, physical and mental handicap, women during their pregnancy. But that welfare must not exceed 10-15% of GDP. If it exceed that limit, it means that the State is creating a class of lazy bums (leaches) who don’t work and dependent on others perpetually. The political class creates such groups to get votes in all the countries.

  … continued …

 36. Hi Suman,

  What you wrote is baseless. It reveals that you have no idea what Socialism and Communism are. Before assuming something about an ideology we have to study it and understand it. Then only we should say what it says and what it doesn’t.

  Social welfare system is not a part of Socialist construction. Your description of of Socialist and Communist systems are totally wrong.

  As I said, let us first study something before concluding what it is. Kindly, no hard feelings. If I sound harsh, kindly be informed that I may not express in a pleasant manner due to language barrier.

 37. ప్రకృతి గమనానికి కొన్ని నియామాలున్నాయి. వాటి ప్రకారమె అది నడుస్తుంది. ఆ నియమాలను గ్రహించి ప్రగతి వైపుకు జరిగే గమనాన్ని వేగవంతం చేయడమే మనిషి చేయగల పని.
  ————
  Very True. We agree on this. ప్రకృతి మానవునకు ఇచ్చింది స్వార్ధం. ఆ స్వార్ధం లేకపోతే ప్రగతే లేదు. కాకపోతే ఎంత స్వార్ధం ఉండాలనేదే ప్రశ్న.

  విశేఖర్ గారూ, మీరు వీటి గురించి చాలా చదివారు. నేను చదవలేదు. మనకిద్దరికీ common ground ఆలోచనా శక్తి అనుకుంటాను. ఈ క్రింద రెండు practical situations ఇస్తాను మీరు చదివిన దాన్నిబట్టి నా పరిశ్రమ అభివృద్ధికి ఏమిచెయ్యాలో చెప్పండి. పరిస్రమలుంటే గానీ ప్రగతి లేదు. అది మీరు వప్పు కుంటారని అనుకుంటాను.

  1. నేను చిన్న పరిశ్రమ పెట్టి నా పొట్టను నేను పోషించుకుంటూ పదిమందికి కూడా జీవనోపాధి కలిగించాలనే ఉద్దేశం.

  2. Situation 1: నేను చిన్న కంప్యూటర్ సెంటర్ పెట్టుకున్నాను. దానికి కావాల్సిన డబ్బు నేనే సమకూర్చు కున్నాను. వ్యాపారం అభి వృద్ది చెందటం తోటి కొందరి ఉద్యోగస్తులను నియమించి పని జరుపుతున్నాను. వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ది చెందు తోంది. నా ఉద్యోగస్తులు, మా మూలాన మీ వ్యాపారం పెరిగింది కనుక లాభాలు సమంగా పంచుకున్దామంటున్నారు. నాది స్వార్ధం నా కోసం పెట్టుకున్న వ్యాపారం. సెంటర్ మూసెయ్య మంటారా లేక వాళ్ళు చెప్పినట్లు వినమంటారా?

  3. Situation 2: స్వార్ధము లేని ప్రభుత్వమే ప్రజల సౌకర్యార్ధం పరిశ్రమ పెట్టిందనుకోండి. పరిశ్రమ నడుస్తోంది అంతా బాగానే ఉంది. శ్రామికులకి బాధగా ఉంది. పొద్దున్న నుండీ సాయంత్రం రోజూ పని చేసినా ఎదుగూ బొదుగూ లేదు ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంది. ఈ పరిశ్రమ మా మూలాన నడుస్తోంది అంటే మాదే. మేము రోజూ పనికి రావాల్సిన అవసరమేమిటి? అంటారు. ప్రభుత్వము ఏమి చెయ్యాలి? పరిశ్రమ మూసేయ్యాలా లేక వారు చెప్పినట్లు వినాలా?

 38. మీరు రాసిన రెండు సిట్యుయేషన్స్ మీరు భావించినట్లు ప్రాక్టికల్ కాదనే నాకర్ధం అవుతోంది. ఇటువంటి ఉదాహరణలు మన చర్చను సంతృప్తి పరచజాలవు. కొన్ని సంఘటనలనుండి కొంత భాగాన్ని విడదీసి దాన్ని మీరు ఊహించుకున్న పరిస్ధితికి అప్లై చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది ప్రాక్టికల్ సిట్యుయేషన్ కాదు.

  ఒక సంఘటన కానీ, పరిస్ధితి కానీ, ఒక పరిణామం కానీ తీసుకున్నపుడు, అవి గాలిలో నుండి ఊడిపడవు. దాని చుట్టూ ఒక సమాజం ఉంటుంది. ఆ సమాజానికి ఒక భావాజాలం ఉంటుంది. దాని పరిధిలోనే ఆ సంఘటన, ఆ పరిస్ధితి, ఆ పరిణామం ఉంటూ దానిమీదే ఆధారపడి ఉంటాయి.

  ఇక్కడ సమస్య ఏంటంటే, సోషలిస్టు సమాజం లో ఫలానా సూత్రాలు అమలవుతాయని ఊహించుకుని, ఆ సూత్రాలను మనం ఉన్న సమాజ నియమాలు, సూత్రాల వెలుగులో పరిశీలించడానికి మీరు ప్రయత్నిస్తున్నారు. అందుకే సాపేక్షికం అన్నాను. మీరు సోషలిస్టు వ్యవస్ధ గురించి మీరు ఊహించిన పరిస్ధితి నిజంగా సోషలిస్టు వ్యవస్ధలో జరుగుతుందాని ఆలోచించాలి. ఒట్టి ఆలోచించడం కాకుండా కరెక్టుగా ఆలోచించాలి. సోషలిస్టు వ్యవస్ధలో ఎలా ఉంటుందో కరెక్టుగా ఎలా ఆలోచించగలం? సోషలిస్టు వ్యవస్ధ ఎక్కడైనా ఏర్పడితే అక్కడ ఎలా ఉందో అధ్యయనయం చేయడం ఒక పద్ధతి. లేకుంటే సోషలిస్టు వ్యవస్ధకు సంబంధించిన సిద్ధాంతాలు ఏం చెబుతున్నాయో అధ్యయనం చేయడం మరొక పద్దతి. ఈ రెండు తప్ప మరొక మార్గం లేదు.

  పెట్టుబడిదారీ వ్యవస్ధలో ఆధిపత్య వర్గాలకు వ్యతిరేకంగా ఉండేది సోషలిస్టు సిద్ధాంతం. దాని ప్రభావంలో పడకుండా ఉండడానికి అనేక కట్టుకధలు, దుష్ప్రచారం, తప్పు అర్ధాలు, అబద్ధాలు ప్రచారంలో ఉన్నాయి. వాటి ఆధారంగా సోషలిస్టు వ్యవస్ధ గురించి తీర్పు ఇవ్వదలుచుకుంటే సరైన తీర్పు ఇవ్వలేము. మీరు చేస్తున్న వాదనలను బట్టి సోషలిస్టు వ్యవస్ధగురించిన దుష్ప్రచారమే మిమ్ములను ప్రభావితం చేశాయని చెప్పగలను. వాటినుండి బయటపడితే తప్ప సోషలిజం గురించి సరిగా ఆలోచించడం సాధ్యంకాదు.

 39. విశేఖర్ గారూ నేను పేర్కొన్న రెండు సంఘటనలూ రోజూ జరుగుతున్నవే. మీరు కాదంటే నేనేమి చెయ్యలేను. కాబట్టి ఇంక చర్చలో పాల్గొనటం నాకు సమంజసము కాదు. Thanks for the interesting computer conversations we have.

 40. మీరు చేస్తున్న వాదనలను బట్టి సోషలిస్టు వ్యవస్ధగురించిన దుష్ప్రచారమే మిమ్ములను ప్రభావితం చేశాయని చెప్పగలను.
  ______________________________________________

  By the same logic, మీరు చేస్తున్న వాదనలని బట్టీ చూస్తుంటే రంగనాయకమ్మ తప్పుడు వ్రాతలు మిమ్మల్ని ప్రభావితం చేశాయని నేననుకుంటున్నాను. దానికి మీరేమంటారు?

 41. రంగనాయకమ్మ రాతలు మీరు చదివారా? చదివితే అమే రాసినవాటిలో ఏవి తప్పుడు రాతలు? ఆవిడ చాలా పుస్తకాలు రాశారు. ప్రారంభంలో రాసిన వాటిలో కొన్ని తప్పుడు ధోరణులు ఉన్నాయి. వాటిని తర్వాత సరిచేసుకున్నారు. ఆ విషయాన్ని గమనించారా? ఆవిడ రాసిన పుస్తకాల్లో ఏ పుస్తకాలు చదివి తప్పుడు రాతలని భావిస్తున్నారు? దాస్ కేపిటల్ పై రాసిన పరిచయం ఆమే స్వంత రచన కాదు. “దాస్ కాపిటల్” ఉన విషయాన్ని పరిచయం చేస్తూ రాసింది. దాస్ కాపిటల్లో ఒకటుంటే ఆవిడ ఇంకో విషయం రాసిందని మీరు చెప్పదలుచుకున్నారా? అదే అయితే దాస్ కేపిటల్లో ఉన్న ఏ విషయాన్ని తప్పుగా పరిచయంలో రాశారు? ఆ వివరం చెప్పగలిగితే నిర్ధిష్టంగా వివరించడానికీ, చర్చించడానికి నాకూ వీలవుతుంది.

  నేను చదివి రాశాను అని నేను చెబుతున్న విషయాన్ని మీరు నమ్మడం లేదని భావించమంటారా? నేను రాస్తున్నది లాజిక్ కాదు. అందంగా రాయడానికి ప్రయత్నించి రాస్తున్నది కాదు. నేనిదంటాను, మీరేమింటారు… ఇవి చర్చకు ఉపయోగపడేవి కావు. ఫలానా సిద్ధాంతం ఇలా చెబుతోంది. దానికీ సమాజంలో జరుగుతున్నవాటికి ఫలానా సాపత్యం ఉంది. అందువలన నేను అది కరెక్టు అని భావించాను. చరిత్రలో ఫలానా పరిణామాలు జరుతూ వచ్చాయి. ఆ పరిణామాలన్నింటిలో ఫలాన సిద్ధాంతం రుజువవుతోంది. కనుక ఆ పరిణామాల ఒరవడిలో భవిష్యత్తులో ఫలాన విధంగా మార్పులు జరగవచ్చు… ఇలా వాదించగలగితే మీనుండి నేను తెలుసుకుంటాను. దాని గురించి ఒక పద్దతిలో ఆలోచించడానికి నాకు వీలవుతుంది.

  రౌడీగారూ, చర్చనుండి మనం ఏమన్నా గ్రహించాలని భావిస్తేనే చర్చ సజావుగా, ఆరోగ్యకరంగా సాగడానికి వీలవుతుంది. ఒకరినుండి మరొకరు నేర్చుకోవడానికి వీలవుతుంది. ఆ విధంగా చర్చించడానికి ప్రయత్నిద్దాం.

 42. “నా ఉద్యోగస్తులు, మా మూలాన మీ వ్యాపారం పెరిగింది కనుక లాభాలు సమంగా పంచుకున్దామంటున్నారు” ఇలా అని ఉద్యోగులు అంటున్నారా? లాభాలు సమంగా పంచుకుందామన్న భావన ప్రస్తుత సమాజంలో వచ్చే ఆలోచన కాదు. సోషలిస్టు ఐడియాలజీ ఉన్న ఉద్యోగులు సైతం ఆ మాటలు అనే అవకాశం ఉన్నదా, ఇపుదున్న సమాజంలో? ఇంతకీ మీరు ఎక్కడ నివసిస్తున్నారు? ఇండియాలో కాదా? అమెరికాలో ఐనా అటువంటి పరిస్ధితి ఉన్నదా?

  రెండో పరిస్ధితి: “అనుకోండి”, “అంటారు” అని రాశారు. అంటే ఊహించి రాశారు. ఊహించిన విషయం జరిగే అవకాశం ఉందీ లేనిదీ గమనించాలి. “ఈ పరిశ్రమ మా మూలాన నడుస్తోంది అంటే మాదే. మేము రోజూ పనికి రావాల్సిన అవసరమేమిటి? అంటారు” ఇది మీ ఊహ కాదా? ఉద్యోగులు అలా అనే ఛాన్సే లేదు. బైట పక్క వ్యాపారం ఉన్నవారో, మరేదైనా వ్యాపకం ఉన్నవారో ఆఫీసు పని ఎగ్గొట్టి సొంత పనులు చూసుకునే అవకాశాలున్నాయి. అదీ ఎప్పుడు? వారి పై అధికారులు నియంత్రణ చేయని పరిస్ధితుల్లోనే అది సాధ్యం. జాబ్ రెగ్యులేషన్స్ అమలు చేస్తే వారలా చేయలేఫు. తమిళనాడులో జయలలిత ప్రభుత్వం కక్ష గట్టి, సమ్మె చేస్తున్నవారిని లక్షపైన ఉద్యోగులను సస్పెండ్ చేసింది. హైకోర్టు కూడా ఆమెను సమర్ధించింది. సుప్రీం కోర్టుకి వెళ్తే ” ఉద్యోగులకు సమ్మె చేసే హక్కు లేదు పొమ్మంది. వాస్తవాలు ఇలా ఉంటే “మేము రోజూ పనికి రావలసిన అవసరం ఏంటి అని ప్రభుత్వోద్యోగులు అంటున్నట్లుగా రాసి అది వాస్తవం అనంటే ఎలా సారూ? చర్చలో పాల్గొనేదీ లేనిదే పూర్తిగా మీ ఇష్టానికి సంబంధించినదే. మీ ఆసక్తి ప్రకారమే కానియ్యండి.

 43. 1. “శ్రమ జీవులే సంపద యావత్తుని సృష్టించారని అంగీకరిస్తే ఆ శ్రమ జీవులు సృష్టించిన సంపద వారికి కనీస సుఖానికి సైతం అందుబాటులో లేకుండా పోయింది.”
  ——
  ఇవి మీరన్న మాటలే.

  2. పనికిరాకుండా జీతాలిమ్మంటున్నారు. హలో జిఒ మీద గొడవ గుర్తుందా.

  మన విధానాలు వేరు కాబట్టి ఇంక మానేద్దాము.

 44. రావు గారు, ఇక్కడ టాటాలు & అంబానీల స్వార్థం వల్ల డబ్బులు ఇవ్వకుండా రైతుల భూములు లాక్కుని ఫాక్టరీలు కట్టడం తప్ప ఏమి ప్రగతి వచ్చింది? ఫాక్టరీ కట్టడానికి భూములు ఇచ్చిన రైతులకే ఆ ఫాక్టరీలలో ఉద్యోగాలు ఇవ్వనివాళ్ళు సమాజానికి ఏ విలువ ఇస్తారు?

 45. రౌడీగారూ, చర్చనుండి మనం ఏమన్నా గ్రహించాలని భావిస్తేనే చర్చ సజావుగా, ఆరోగ్యకరంగా సాగడానికి వీలవుతుంది
  _____________________________________________

  ఇది మీకు కూడా వర్తిస్తుంది. లక్కరాజుగారికి మీరెలాంటి సమాధానం ఇచ్చారో మీకు కూడానేను అలాంటి సమాధానమే ఇచ్చాను.

  సజావైన ఉదాహరణలు ఆయన రెండు చూపించేసరికీ “అవి ప్రేక్టికల్ కాదు, మీరు దుష్ప్రచారానికి లోనై అలా మాట్లాడుతున్నారు” అనేది ఎంత ఆరోగ్యకరమైన చర్చో నేనూ అన్నమాటలు కూడా అంతే అరోగ్యకరమైనవి.

  So, you better practice what you preach!

  చిన్న పిల్లలకోసం రంగనాయకమ్మ రాసిన ఆర్థిక శాస్త్రంలో ఉన్న తప్పులు చాలు ఆవిడ రాతలేపాటివో చెప్పటానికి. ఇది నేను కాదు ఆర్థిక శాస్త్రం చదివినవాళ్ళే అనే మాట.

 46. This was what you wrote to Suman

  ____________________________________________

  visekhar
  ఏప్రియల్ 19, 2011 at 11:17 సాయంత్రము
  Hi Suman,

  What you wrote is baseless. It reveals that you have no idea what Socialism and Communism are.

  ____________________________________________

  ఇది చాలా ఆరోగ్యకరమైన సమధానం కదా!

 47. రౌడీ గారూ,

  అవును నాకుకూడా వర్తిస్తుంది. లక్కరాజుగారు రాస్తున్నవిషయానికి అనుగుణంగానే నేను సమాధానం ఇచ్చాను. సహజమైన ఉదాహరణలుగా మీరు చెబుతున్నవి సహజం కాదనే నేను ఇప్పటికీ చెబుతున్నాను. అది సబ్జెక్ట్ పై నా వాదనలో భాగం. ఆ పరిస్ధితి ఎక్కడ ఉందో దయచేసి చెప్పండి ఇండియాలో లేదు. వర్కర్లు ఎక్కడైనా “మా శ్రమ ద్వారానే కంపెనీ బతుకుతోంది. కనుక కంపెనీ మాదే” అనే పరిస్ధితి ఉందా? ఉంటే, నిజంగా చాలా ఆశ్చర్యకరమే. అదెక్కడో ఉందో చెప్పండి, తెలుసుకుంటాను.

  సోషలిస్టు వ్యవస్ధ గురించి పెట్టుబడీదారీ కార్పొరేట్ పత్రికలు అనేక తప్పుడు ప్రచారం చేస్తున్నాయనేది వాస్తవం. తప్పుడు ప్రచారం అని ఎలా తెలుస్తుంది? నిజంగ సోషలిస్టు వ్యవస్ధ అమలైన చోట ఏం జరిగిందో తెలుసుకొని, ప్రచారంలో ఉన్న విషయాలను వాటితొ సరిపోలిస్తే ఆ ప్రచారం నిజమో కాదో తెలుస్తుంది. అలాంటి ఉదాహరన నాకు తెలిపితే నేనూ తెలుసుకుంటాను.

  మీరు తొందరపడి నాపైన తీర్పులిస్తున్నారనిపిస్తోంది.

  చిన్నపిల్లలకొసం రంగనాయకమ్మ రాసిన రాతల్లోని తప్పులు ఏ ఆర్ధికవేత్తలు ఎత్తి చూపారో చెప్పండి. లేకుంటే మీరే ఆ తప్పులేవో చెప్పండి. తెలుసుకోడానికి నాకు వీలవుతుంది.

  మాటకు, రాతకూ ఉన్న తేడా వలన వాదన ఏ ఫీలింగ్ తో చేస్తున్నారో (కోపం, శాంతం, హాస్యం, హేళన మొ.వి) ఒకరికొకరు అర్ధం కావడం లేదని నాకనిపిస్తోంది. నా వరకు నే చేస్తున్న వాదన భాధ పెట్టడానికో, ఆధిక్యం వహించడానికో, హేళన చేస్తూనో చేయడం లెదని గ్రహించ గలరు. నేను చదువున్నదీ, తెలుసుకున్నదీ మాత్రమే నేను రాస్తున్నానని దయచేసి గమనించండి.

 48. విశేఖర్ గారు, వీళ్ళు చెప్పేవన్నీ శ్రీరంగ నీతులే, దూరేవన్నీ (ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను). వీళ్ళు నాకు వ్యతిరేకంగా http://onlyforpraveen.wordpress.com అనే బ్లాగ్ పెట్టి నన్ను బండబూతులు తిట్టారు. బ్లాగు వీక్షణం అనే బ్లాగర్ వీళ్ళని విమర్శించిన తరువాత ఆ బ్లాగ్ మూసివేశారు. భర్త చనిపోయిన స్త్రీలని ముండమోపులు అనడం లాంటి అభివృద్ధి నిరోధక నమ్మకాలని నమ్మే వీళ్ళే జాతకాలు లాంటి చిల్లర నమ్మకాలని నమ్మే ఒక బ్లాగర్‌ని హెరాస్ చేశారు. వీళ్ళకి చాలా నీచమైన చరిత్ర ఉందిలేండి. వీళ్ళ గురించి నా కంటే నీహారిక గారికి బాగా తెలుసు. వీళ్ళ గురించి రెండు ముక్కలు మాత్రం ఇక్కడ చెప్పగలను. These people are anti-progressive fundamentalists and pro-imperialists.

 49. మ. రౌడీ గారూ,

  సుమన్ గారు చేస్తున్న వాదన ఆధారరహితం అని నేను చెప్పాను. అది ఇంగ్లీషులో అలానే చెప్తారని భావిస్తూ ఆ వాక్యం రాశాను. అలా కాకుండా చర్చ ఆరోగ్యకరమే అని ధ్వనింప జేయడానికి ఇంకేమన్నా పద్దతి ఉంటే అది నాకింకా తెలియలేదని గమనించగరు.

  ఆయన సోషలిజం, కమ్యూనిజంల గురించి రాసింది తప్పు. ఆయన రాసింది ప్రచారంలో ఉన్న తప్పుడు భావాలు. సోషలిజం / కమ్యూనిజం లకు సంబంధించిన సిద్ధాంతాల గురించి లక్కరాజుగారికి ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నాను. వాటిని నేను చదివాను. చదివినదాని ఆధారంగా నేను ఈ సంబాషణలు చేస్తున్నాను. నేను చదివిన విషయాలతో సుమన్ రాసిన విషయాలకు పోలిక లేదు. ఆ సిద్ధాంతం చెప్పే ఏ అంశానికీ దగ్గరగా, అతని వాదన లేదు. అందుకనే సో.జం, క.జం లపై మీకు ఐడియా లేదు అని చెప్పగలిగాను. “మీరు చెబుతున్నది సోషలిజం, కమ్యూనిజంలు కావు” అని నేను ఆరోగ్యకరంగా చెప్పడానికి ఆంగ్లంలో ఇంకేమైనా పదాలు ఉన్నాయా? ఉంటే ఆ నాలెడ్జి నాకు లేదు. నేను చెప్పదలుచుకున్న విషయాన్ని ఇంకా ఆరోగ్యకరంగా ఎలా ధ్వనింపజేయాలో మీరు చెప్తే అందుకు కృతజ్గ్నుడను.

 50. ప్రవీణ్ గారూ,

  మై గుడ్ నెస్, మీరు చెప్పేది నిజమా? నేన్నిజంగా ప్రస్తుతం షాక్ లో ఉన్నాను. మళ్ళీ రాస్తాను.

 51. కొత్త విధానాలను పరిశీలించేటప్పుడు కంప్యూటర్ మోడల్స్ లో, అన్ని పరిస్థుతులనీ పరిశీలిస్తారు. ఉదా: మేము disaster recovery కి తయారు కావటానికి అన్ని పరిస్థుతులు, జరిగినవి జరగబోయేవి జరగటానికి possibility ఉన్నవీ అన్నీ పరిసీలిస్తాము. వచ్చినతరువాత చేసేదేమంటూ ఉండదు. అల్లాగే economic models కూడా.

  మొదటి Situation కి ఉదా: దున్నే వాడిదే భూమి అని మీరు వినలేదా. వ్యవసాయం అనేది పరిశ్రమ.
  శ్రామికులు Chrysler company లో Board members కూడా అయ్యారు కంపెనీ నడపటానికి.
  అయినా మీరు పరిశ్రమలన్నీ శ్రమ జీవులవే అన్నారు.

  రెండవ Situation ఆంద్ర ప్రదేశ్ గవర్నమెంట్ GO గుర్తుంది కదా. ఎందుకు వచ్చింది? ఉద్యోగాలకి రాకపోయినా జీతాలిమ్మంటే.

  ఈ రెండు situations practical కాదని ఎల్లా అంటారు? ఇంక వాదించటం అనవసరమని భావిస్తాను. మన కంపూటర్ సంభాషణలు చదివిన వారు ఎవరికి వారే నిజా నిజాలు నిర్ణయించు కుంటారు.

 52. http://pramaadavanam.blogspot.com/2010/09/blog-post_18.html

  శేఖర్ గారూ,

  ముందుగా – మిగతావాళ్ళవి శ్రీరంగనీతులనే ఈ మార్తాండ ఎలాంటివాడొ తెలియడానికి ముందు ఈ లింక్ చూడండి

  కన్నతల్లినే బూతులు తిట్టుకునే ఈ వెధవ ఎమంత దరిద్రుడో మీకు తెలియకపోవచ్చులెండి. వీడు మిగతావాళ్ళ తల్లుల్ని భార్యలని బూతులు తిట్టటంవల్లే ఆ గ్రూపులు పుట్టాయి. వీడూ అలాంటిఉ ఇలాంటి నీచుడు కాడు. ఇలాంటివాడిని ఎంత తిట్టినా తక్కువే. Everyone on blogs knows what kind of a rogue he is.

  Coming to your questions

  వాటిని నేను చదివాను. చదివినదాని ఆధారంగా నేను ఈ సంబాషణలు చేస్తున్నాను.
  ____________________________________________

  Do you mean to say what you have read is correct and all others are wrong?

  “మీరు చెబుతున్నది సోషలిజం, కమ్యూనిజంలు కావు” అని నేను ఆరోగ్యకరంగా చెప్పడానికి ఆంగ్లంలో ఇంకేమైనా పదాలు ఉన్నాయా?
  ____________________________________________

  నాన్నా అనటానికీ, అమ్మ మొగుడు అనడానికీ చాలా తేడా ఉంది. There is a lot of difference beween saying “You have no idea about this” and “Looks like you have some misunderstanding about this”. Dont tell me you dont know the difference.

  Of course anything goes if the guy on the other side is Praveen. He deserves any kind of abuse 🙂

  As of Ranganayakamma;s thingie – to start with .. the comparison of the value of Gold and Coal itself is based on wrong presumptions.

 53. “దున్నేవాడిది భూమి” అనేది నినాదం మాత్రమే. కమ్యూనిష్టులు ఇచ్చే నినాదం. వారి నినాదం ఎక్కడా అమలు లో లేదు. నినాదాన్ని వాస్తవంగా భావించడం పొరబాటు. కనుక ఆ పరిస్ధితి తలెత్తదు. క్రిస్లర్ కంపెనీ ఉదాహరణ వాస్తవం వేరు, కంపెనీ ఆచరిస్తున్నది వేరు.

  ఏ.పి జీవొ పూర్వాపరాలు, ఫలితాలు ఇంతకుముందు రాశాను. ఇంకొంచెం రాస్తాను.

  తెలంగాణ కోసం ఉద్యోగులు నాన్-కోపరేషన్ ఉద్యమం చేశారు. ఆ సందర్భంగా ఆఫీసుల వద్ద ఆటలు, పాటలు తదితరాలు జరిగాయి. అప్పుడే ఆర్ధిక మంత్రి ఆనం ఆఫీసులను మీరు అగౌరవ పరుస్తున్నారని హుంకరించాడు. నాన్-కోపరేషన్ కాలానికి జీతాలు ఇవ్వకూడదని సి.ఎం అనుకున్నాడు. కాని తెలంగాణ మంత్రులు వ్యతిరేకించారు. తెలంగాణ మంత్రులు, కె.సి.ఆర్ ల లాబీయంగ్ తో ఉద్యోగులు ఉద్యమం విరమించారు.

  కానీ నాన్-కోఆపరేషన్ వలన పన్నులు వసూలు కాలేదు. రావలిసిన డబ్బు చేతికి రాకపోవడం వలన కొన్ని పనులు, పధకాలు అమలు చేయలేక ప్రతికూల వాతావరణం ప్రభుత్వానికి తలెత్తింది. ఉద్యోగులు ఉద్యమం ఇంతటితో ఆగలేదు, అవసరమైతే ఇంకోసారి ఉద్యమిస్తాం అన్నారు. ఇటువంటి పరిస్ధితి భవిష్యత్తులో తలెత్తితే ఆర్ధిక సమస్యలు ఎదురవుతాయి కనక ఆ పరిస్ధితి రాకుండా ఉండటానికి ప్రభుత్వం ఆలోచన చేసింది. సమ్మె కాలానికి జీతం ఇవ్వకుంటే ఉద్యోగులు సమ్మె (నాన్-కోఆపరేషన్) కు వెనకాడతారని ఆశించింది. ఫలితమే జీవొ.

  ఉద్యోగ సంఘాలు జీవో ప్రమాదాన్ని గుర్తించాయి. ఇటువంటి జీవోలకు ఒకసారి అంగీకరిస్తే అది ప్రభుత్వాలకు అలవాటవుతుంది. ఉద్యోగ సంఘాల హక్కుల్ని హరించి వేసే జీవోలు రావచ్చు. (అమెరికా, విస్కాన్సిన్ రాష్ట్ర గవర్నరు కలెక్టివ్ బార్గెయినింగ్ రైట్స్ రద్ధు చేశాడు. కార్మిక సంఘాలకు ఈ హక్కు గుండెకాయ. ఆ హక్కు లేనట్లయితే యూనియన్ ఉన్నా ఉపయోగం లేదు) అందువలన జీవో ని వ్యతిరేకించారు.

  దీన్ని మీరు అర్ధం చేసుకున్న విధం, లెదా మార్చిన విధం వేరు. ప్రభుత్వం ఉద్యోగుల హక్కుని హరించే విధంగా తెచ్చిన జీవోని వ్యతిరేకిస్తే, దానికి మీరు తీసిన అర్ధం, “మేము పని చేయకపోయినా మాకు జీతాలు ఇవ్వాలి” అనడిగారని. ఉద్యోగులు డిమాండ్ చేసింది, తమ సంఘాల హక్కుల్ని హరించే విధంగా ఉన్న జీవోని రద్ధు చేయమని. మేము పనిచేయకపోయినా జీతాలివ్వాల్సిందే అని ఏ క్షణంలొ కూడా అన్లేదు.

  ఒక విషయం గమనించండి. ధనికులు యంత్రాలు, డబ్బు తెచ్చుకుని పరిశ్రమ పెట్టి కూచుంటే ఉత్పత్తి దానంతట అదే రాదు. ఆ యంత్రాలపైన శ్రమ చేస్తేనే ఉత్పత్తి వస్తుంది. ఎంత పెట్టుబడైనా భోషాణాల్లో దాచుకుంటే అది గుడ్లు పెట్టదు. దాచుకుంటే కాయలు కాయదు. నిర్ధిష్ట సంఖ్యలో శ్రామికులు, నిర్ధిష్ట శ్రమ చేస్తేనే ఉత్పత్తి వస్తుంది. నిర్ధిష్ట శ్రమ అంటే? బట్ట తయారీకి నేత శ్రమ కావాలి. డ్రస్ ల తయారీకి కుట్టు శ్రమ ఇలా… ఏ ఉత్పత్తికైనా దానికి సంబంధించిన నైపుణ్యమ్ కావాలి. శ్రమనీ, నైపుణ్య శ్రమనీ ఇచ్చేది శ్రామికులే. మావో కాలంలో చైనాలో మేనేజర్లు లేకుండా పరిశ్రమలు నడిచాయి. అంటే పరిశ్రమలు నడవడానికి మేనేజింగ్ శ్రమ అవసరం లేదని. అనుభవం ఉన్న నర్సులకు మూడు నెలలు శిక్షణ ఇచ్చి డాక్టర్లుగా మార్చారు. అంటే నాలుగైదు సంవత్సరాలు చదివి, మరో రెండు సం.లు అప్రెంటీస్ చేస్తేనే డాక్టృర్లు అవ్వాలని లేదని. రష్యాలో కార్మికులే తమ అనుభవంతో అనేక యంత్రాలు తయారు చేసిన చరిత్ర ఉంది. పెట్టుబడిదారులు లేకుండా రష్యాలో 34 సం.లు చైనాలో 25 సం.లు ఉత్పత్తి జరిగింది. ప్రవీవ్ అన్నట్లు డబ్బు, బంగారం వాటికవే విలువను కలిగి ఉండవు. అవి వినియోగంలో ఉండే కొంత ఉత్పత్తికి ప్రతినిధిగా వ్యవహరిస్తుంది, అంతే.

  నేనింతకుముందు చెప్పినట్లు, చర్చ కొనసాగించడం, ఆపడం పూర్తిగా మీ యిష్టం.

 54. మావో కాలంలో చైనాలో మేనేజర్లు లేకుండా పరిశ్రమలు నడిచాయి. అంటే పరిశ్రమలు నడవడానికి మేనేజింగ్ శ్రమ అవసరం లేదని.
  ______________________________________________

  What was the productivity then?

  అనుభవం ఉన్న నర్సులకు మూడు నెలలు శిక్షణ ఇచ్చి డాక్టర్లుగా మార్చారు.
  అంటే నాలుగైదు సంవత్సరాలు చదివి, మరో రెండు సం.లు అప్రెంటీస్ చేస్తేనే డాక్టృర్లు అవ్వాలని లేదని.
  ______________________________________________

  How many of them handled critical cases? India also has so many Munna Bhais and Sankar Dadas.

  రష్యాలో కార్మికులే తమ అనుభవంతో అనేక యంత్రాలు తయారు చేసిన చరిత్ర ఉంది. పెట్టుబడిదారులు లేకుండా రష్యాలో 34 సం.లు చైనాలో 25 సం.లు ఉత్పత్తి జరిగింది.
  ______________________________________________

  Do you have any statistics to compare the productivity in those 34/25 years and the productivity int he last 10 years?

 55. ఒకప్పుడు anti-communismలో పేరు మోసిన జోసెఫ్ మెక్కర్తీలాగ కమ్యూనిజం పేరు చెపితేనే భుజాలు తడుముకుంటున్నారేమిటి? రంగనాయకమ్మ గారు వ్రాసిన కాపిటల్ పరిచయం పుస్తకం నా దగ్గర ఉంది. గుమ్మడికాయ దొంగలు అంటే భుజాలు తడుముకునే స్థితిలో మార్క్సిస్ట్‌లు లేరు.

 56. ఇంగ్లీషు భాషలో ఆరోగ్యకరంగా ధ్వనించడానికి మీరు చేసిన సూచనని నేను గ్రహించాను. దీని ద్వారా నాకు మీరు కొంత ఇంగ్లీషు నేర్పారు. కృతజ్గ్నతలు. నాకున్న ఆంగ్ల పరిజ్గ్నానం చాలా తక్కువ. సుమన్ గారికి రాసిన సమాధానంలో నే లాంగ్వేజి బారియర్ అని రాశాను. గమనించారా? అంతకన్నా సున్నితంగా రాయవచ్చా లేదా అని కొంతసేపు ఆలోచించి ఏమీ తట్టక తట్టినదాన్నే రాశాను. ఎవరినీ గాయపరిచే ఉద్దేశ్యం లేదు.

  నేను చదివింది కరెక్టా కాదా అని నేను రాయలేదు. సోషలిజం, కమ్యూనిజం లను ప్రతిపాదించింది కారల్ మార్క్స్, ఏంగెల్స్ లు. దాన్ని మరింత అభివృద్ధి చేసింది లెనిన్, మావోలు. వారి పుస్తకాలు చదివానని చెప్పాను. వారు ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని నా అనుభవాలతో, నేను చదివిన చరిత్రతో సరిపోల్చుకుని అది సరైందని నేను నమ్మాను. నేను మార్క్సిజం-లెనినిజం సిద్ధాంతాన్ని నమ్మాను. అది నమ్మకపోవడం మీ యిష్టం. నేను ఏది తప్పు అని అన్నాను? సోషలిజం, కమ్యూనిజం ల పేరుతో సుమన్ గారు రాసింది కరెక్టు కాదు అన్నాను. అంతేగాని ఇతరులు చెప్పేదంతా తప్పని నేనెప్పుడు అన్నాను. నేను అనని దాన్ని అన్నట్లు చెప్పడం భావ్యమా?

  రంగనాయకమ్మ పుస్తకం విషయం మనం వదిలేద్దాం. ‘నాకూ ఆవిడకూ’, ‘మీకూ’ దేవుడి విషయంలో వేరే భావాలున్నాయి. దేవుడి విషయం వ్యక్తిగత సున్నిత భావాలను గాయ పరుస్తాయి. అందుకని దేవుని విషయం చర్చించడానికి ఇస్టపడను. నేను స్వయంగా దేవుడ్ని నమ్మకపోయినా నమ్మే వారికి దైవ సంబంధిత కానుకలు ఇచ్చే అలవాటు ఉంది నాకు. కారణం దైవం మీద నాకున్న నమ్మకం కాదు. ఆ మనుషుల మీద నాకున్న గౌరవం.

  ప్రవీణ్ కూ, మీకు ఒక విన్నపం. మీ వైరుధ్యాల సంగతి ఇక్కడ వదిలేద్దాం. ప్లీజ్.

 57. ప్రవీణ్ కూ, మీకు ఒక విన్నపం. మీ వైరుధ్యాల సంగతి ఇక్కడ వదిలేద్దాం. ప్లీజ్.
  _______________________________________________

  Well, I was not the one who raised it. I only responded to a previous comment that you have published. Since you expressed your “shock” earlier, I was only showing his real face to you. I’m fine with it, if you chose to ignore his stuff.

 58. నేను అనని దాన్ని అన్నట్లు చెప్పడం భావ్యమా?
  _____________________________

  Nope – mine was only a question. Sorry if it sounded the other way. I was only trying to get your perspective on what you consider right or wrong.

  నేను మార్క్సిజం-లెనినిజం సిద్ధాంతాన్ని నమ్మాను. అది నమ్మకపోవడం మీ యిష్టం.
  ______________________________________________

  Precisely. You learned a lot from what you read and experienced. Similarly others learned from what they read and experienced.

 59. ఉన్నాయి. ఛార్లెస్ బెతెల్ హాం (ఫ్రెంచి దేశీయుడు) మావో కాలంలో మూడు సార్లు వివిధ దశాబ్దాల్లో సందర్శించి పుస్తకం రాశారు. దాని పేరు ‘వాట్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ చైనా’. ఆయనే రష్యా సందర్శించి “క్లాస్ స్ట్రగుల్ ఇన్ ద యు ఎస్ ఎస్ ఆర్” పేరుతో రెండు పార్టుల పుస్తకం రాశాడు. మావో, స్టాలిన్ లు సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణంలో చేస్తున్న కొన్ని తప్పులను కూడా ఎత్తి చూపాడు. వారు చర్చించుకుని ఆయన తప్పు అని చెప్పిన విషయాలను కొన్నింటిని అంగీకరించి సవరించుకున్నారు. అవన్నీ రికార్డై ఉన్నాయి. ఇవి అమెరికాలో దొరకవచ్చు.

  మరొక విషయం. ఉత్పాదకత, జిడిపి మొదలైన అంశాలను లెక్కించడంలో, పెట్టుబడిదారుల దృక్పధానికీ, సోషలిస్టుల దృక్పధానికీ తేడా ఉంది. ఉదాహరణ ఇంతకుముందు రాశాను. దేశంలొ పేదలు, దరిద్రం ఉన్నా, అభివృద్ధి ఫలాలు అందరికీ అందకపోయినా దేశం భివృద్ధి చెందుతోంది అని పెట్టుబడిదారీ ఆర్ధిక వేత్తలు పరిగణిస్తారు. సోషలిస్టులు ప్రజలందరి స్ధితిగతులు, ముఖ్యంగా శ్రమ చేసేవారి స్ధితిగతులు పరిగణనలోకి తీసుకుంటారు. అందుకనే సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం ఇప్పుడు ఏదేశంలోనూ లేదని రాశాను. ఆ పేరుతో ఉన్నవారంతా కమ్యూనిస్టులు వారు. వారి రాతలు, మాటల కంటే వారి ఆచరణన బట్టే వారెవరైందీ నిర్ణయించుకువాల్సి ఉంది.

 60. సోషలిస్టులు ప్రజలందరి స్ధితిగతులు, ముఖ్యంగా శ్రమ చేసేవారి స్ధితిగతులు పరిగణనలోకి తీసుకుంటారు.
  ______________________________________________

  Sure, for now lets go with your definition of development. But I am talking about productivity here. Can you share me the statistics from a neutral source pertaining to the period you have mentioned?

 61. Here is a problem. I think, those people who have the idea of Socialist principles can analyze the dynamics of Socialist economy, at least what Socialists say about Socialist construction. I don’t mean to say that they should believe in Socialism. They may not be the believers of Socialism but they should have an idea what socialists are telling about Socialism and its construction.

 62. Regarding neutral source. I don’t know about such sources. But I recommend Bethlehem as he also pointed out the mistakes of Stalin and Mao. Of course, not all what he pointed out may be mistakes.

  At one stage, Stalin theorized that there were no classes in the USSR. Bethlehem contradicted with that. Stalin did not agree with Bethlehem in the beginning. But later, Stalin agreed with him and wrote a book on that question.

 63. ఇక్కడ చర్చ మొత్తం చదవలేదు. నేనొక విషయం స్పష్టం చేయదలుచుకున్నాను. దేనికైనా సమాధానం లో సిద్ధాంతం మొత్తం రాద్ధాంతం చేస్తే అది ప్రయోజనం కంటే ప్రమాదాన్నే ఎక్కువ ఇస్తుంది.

  పరిశ్రమలు ప్రభుత్వమే పెట్టాలి. పని చేయకపోతే ఎలా ? అని ప్రశ్నించారు రావు గారు. పెట్టుబడిదారుడు ఏ పని చేయకుండా మరి లాభాలు పొందుతున్నాడు కదా ? అక్కడ ఏమి చెప్తారు.

  అంటే దానర్ధం లాభం లేదా ఉత్పత్తి వచ్చింది అంటే శ్రమతో మాత్రమే . శ్రమ చేసేవాడికే విలువను పొందే హక్కు ఉండాలి.

  ప్రభుత్వ ఫాక్టరీలలో పనిచేసే వాళ్లు కూడా పనిచేయకపోతే ఉద్యోగ భద్రత ఉండాల్సిన అవసరం లేదు. అది మనదేశం లో ఉంది. పని పద్ధతి ప్రకారం చేయించే మార్గం వెతకాలి తప్ప , ప్రభుత్వం ఫాక్టరీలు పెట్టడం మాని పెట్టుబడిదారులకు అవకాశం ఇవ్వకూడదు. ఇపుడున్న వ్యవస్తలో ప్రతి ఒక్కడు నాకేంటి అని చూస్తాడు తప్ప అలాంటివి చేయడు. లోపం అక్కడున్న మాట వాస్తవం వాటిని సరిచేయాలి.

  వస్తువు = ప్రకృతి పదార్ధం+ శ్రమ ( యంత్రం కూడా శ్రమతో తయారయిందే)

  ఇక్కడ పెట్టుబడి అవసరమే లేదు . ప్రకృతి పదార్ధం సహజమైనది అందరిదీ.

  కనుక సంపద అంటే శ్రమ మాత్రమే.

  శ్రమ చేసే వాడే అనుభవించాలి.

  పెట్టుబడి అనేది సహజమైనది కాదు. సంపద సృష్టికి అవసరమైనది కాదు. అది కేవలం దోపిడీ కి మార్గం గా సృష్టించబడినది.

  తెలిసి చేసినా , తెలియక చేసినా ఎవరు చేస్తున్నారని, ఏ వ్యవస్తలో చేస్తున్నారనీ పక్కన బెడితే దోపిడీ ని అరికట్టడానికి స్వతహాగా ఏ మనిషీ వ్యతిరేకిగా ఉండడు దానిద్వారా లాభం పొందుతున్నవాడు తప్ప.

  అయితే ఇది అతనికి అవగాహన కలగాల్సిన , కలిగించాల్సిన పద్ధతిని బట్టి ఉంటుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s