ట్యునీషియా, ఈజిప్టు దేశాల్లో ప్రజలు ఉద్యమించి నియంతృత్వ పాలకులను పదవీచ్యుతులను చేశాక ఆ దేశాల స్ఫూర్తితో ప్రజాందోళనలు మొదలైన అరబ్ దేశాల్లో బహ్రెయిన్ కూడా ఒకటి. బహ్రెయిన్ రాజు వెంటనే గద్దె దిగాలని బహ్రెయిన్ ప్రజలు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలని కోరుకున్నారు. మొదట మళ్లీ పోటీ చేయననీ, 2013 లో తన పదవీ కాలం ముగిశాక ఇతరులకు అధికారం అప్పగిస్తామని హామీ ఇచ్చినా ప్రజలు అంగీకరించలేదు. ప్రజలకు అనేక తాయిలాలు ప్రకటించీన లొంగలేదు.
ఆ తర్వాత మార్చి 15 నుండి బహ్రెయిన్ ప్రభుత్వం క్రూర నిర్బంధం అమలు చేయడం ప్రారంభించింది. పోలీసుల క్రూరత్వానికి అనేక మంది చనిపోయారు. విచక్షణా రహితంగా ప్రజల ఇళ్లపైబడి అనుమానితుల పేరుతో అనేక మందిని నిర్బంధంలోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన వాళ్లని ఎక్కడ ఉంచిందీ పోలీసులు నిరాకరిస్తున్నారు. వారు బతికున్నారో కూడ చెప్పడం లేదు. తమవారిని చూసుకోవాలని బతిమలాడుతున్నా బహ్రెయిన్ పాలకుల దమన నీతి ముందు అవి పని చేయడం లేదు. లిబీయా పాలకుడు గడ్డాఫీ తన పౌరులను చంపుతున్నాడంటూ మొసలి కన్నీరు కారుస్తూ ఆ దేశంపై బాంబుల వర్షం కురిపిస్తున్న అమెరికా, ఫ్రాన్సు , బ్రిటన్ లు బహ్రెయిన్ రాజు చేస్తున్న క్రూర హింస గురించి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. బహ్రెయిన్ పోలిసుల కాల్పులకూ, హింసకూ ప్రతిరోజూ పదుల సంఖ్యలో ప్రజలు చనిపోతున్నారు. అందుకు సాక్షీభూతంగా అనేక ఫోటోలు, వీడియోలు వెలువడ్డాయి. కానీ లిబియాలో పౌరులపై దాడులు జరుగుతున్నాయనడానికి ఒక్క సాక్ష్యం కూడా దొరకలేదు. అయినా పశ్చిమ దేశాలు లిబియాపై దాడులకు ఉత్సాహంగా ఉన్నాయి తప్ప బహ్రెయిన్ లో అవిరౌతున్న ప్రజల ప్రాణాలకు బాధ్యత వహించడం లేదు.
<object style=”height: 390px; width: 640px”><param name=”movie” value=”http://www.youtube.com/v/_O2nhi7iGI8?version=3″><param name=”allowFullScreen” value=”true”><param name=”allowScriptAccess” value=”always”></object>
ఇక్కడ ఉన వీడియో 32 సంవత్సరాల “హానీ జుమా” అంతిమ యాత్ర, అతనిని పోలీసులు ఎంత క్రూరంగా చంపిందీ తెలుపుతుంది. హ్యూమన్ రైట్స్ వాచ్ విడుదల చేసిన ఈ వీడియో మంత్లీ రివ్యూ పత్రిక తన వెబ్ సైట్ లో ఉంచింది. పోలీసులు బహ్రెయిన్ రాజధాని మనామా లో కూంబింగ్ జరుపుతున్నపుడు పొరపాటున ఇంటి బయటకు వచ్చిన జుమాను దారుణంగా పాయింట్ బ్లాంక్ రేంజ్ లో షాట్ గన్ తో కాల్చి చంపారు. చంపిన నాలుగు రోజులకి కుటుంబానికి చెప్పి బాడీని తీసుకుపొమ్మన్నారు. ఆందోళనల్లో అతనెప్పుడూ పాల్గొనలేదని అతని కుటుంబం తెలిపింది.