యూరోపియన్ పార్లమెంటు లిబియాలోని తిరుగుబాటు ప్రభుత్వాన్ని గుర్తించడాన్ని ప్రోత్సహిస్తున్న నేపధ్యంలో ఫ్రాన్సు మొదటిసారిగా అందుకు అనుగుణమైన చర్యను తీసుకొంది. లిబియా తూర్పు ప్రాంతంలోని బెంఘాజీ పట్టణం కేంద్రంగా ఏర్పడిన “లిబియా జాతీయ కౌన్సిల్” ను అధికారిక స్టేట్ బాడీగా ఫ్రాన్సు గుర్తించింది. యూరోపియన్ పార్లమెంటు దేశాల ప్రభుత్వాలను కాకుండా రాజ్యాన్ని గుర్తిస్తాయి. అందువలన అది తన సభ్య దేశాలను తిరుగుబాటు ప్రభుత్వాన్ని గుర్తించాల్సిందిగా కోరింది. తిరుగుబాటుదారులు బెంఘాజీ కేంద్రంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక కౌన్సిల్ తో సంబంధాలు పెట్టుకోవడానికి రాయబారులను నియమించడానికి ఫ్రాన్సు ఆలోచిస్తున్నది.
ఫ్రాన్సు అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ లిబియా తిరుగుబాటు ప్రభుత్వ ప్రతినిధిలిద్దరిని గురువారం కలుసుకున్నాడు. ఈ ప్రతినిధులు తమ ప్రభుత్వాన్ని గుర్తించవలసిందిగా వివిధ దేశాలను కోరడానికి నియమింపబడ్డారు. జర్మనీ ప్రభుత్వం గడ్డాఫీ, అతని కుటుంబం, సన్నిహితులకు చెందిన బాంక్ ఎకౌంట్లను స్తంభింప జేసినట్లు ప్రకటించింది. గడ్డాఫీ నేతృత్వంలోని ప్రభుత్వానికి చెందిన బ్యాంకు ఖాతాలను కూడా అది స్తంబింప జేసింది.