పి.డి.ఎస్.యు విద్యార్ధి సంఘం ప్రకాశం జిల్లా శాఖ 2010 జులై నెలలో హైస్కూల్ విద్యార్ధుల సమస్యలపై ఆందోళన నిర్వహించింది. కందుకూరు పట్టణంలోని హైస్కూల్ భవనం కూలిపోయే దశలో ఉంది. క్లాస్ రూమ్ లు చాలావాటికి పై కప్పులు లేవు. పెంకులతో నిర్మించిన పైకప్పు కొన్ని క్లాసుల్లో ఏ క్షణంలోనైనా కూలిపోయేటట్లు ఉన్నాయి. స్కూల భవనానికి మరమ్మతులు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ పి.డి.ఎస్.యు ఆధ్వర్యంలో హైస్కూల్ విద్యార్ధులు కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అప్పటి ఫోటో ఇది.