అధికారాన్ని అప్పగించేందుకు వెంటనే ప్రక్రియ ప్రారంభించాలని ముబారక్ ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చిన అమెరికా గత రెండు మూడు రోజులుగా స్వరం మార్చి ముబారక్ దిగి పోవాలని డిమాండ్ చేస్తుండడంతో ఈజిప్టు విదేశాంగ మంత్రి అబౌల్ ఘీత్, అమెరికాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎమర్జెన్సీ పరిస్ధుల చట్టాన్ని ఎత్తివేయలన్న డిమాండ్ ను ప్రస్తావిస్తూ అమెరికా తన కోరికలను ఈజిప్టుపై రుద్దకూడదన్నాడు.
జనవరి 25 నుండి ముబారక్ రాజీనామా చేయాలన్న డిమాండ్ తో రాజధాని కైరోతో పాటు వివిధ పట్టణాలలో నిరసన ప్రదర్శ్నలు నిర్వహిస్తున్న ఈజిప్టు ప్రజలు బుధవారం, ఫిబ్రవరి 9 న మొదటి సారిగా పార్లమెంటు వద్ద ప్రదర్శన నిర్వహించారు. ముబారక్ దిగిపోతే తప్ప నిజమైన మార్పు సాధ్యం కాదని ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న ముస్లిం బ్రదర్ హుడ్, ఎల్ బరాదీలు భావిస్తున్నారు. అప్పటి వరకు ప్రదర్శనలు ఆగవని నిరసనకారులు చెప్తున్నారు.
గతంలో అమెరికా తమకు ద్రోహం చేసిందన్న ముబారక్ మంత్రివర్గ సహచరులు, అమెరికా జోక్యాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇన్నాళ్ళూ అమెరికా కనుసన్నలలో ఈజిప్టు ప్రజలపై ఎమర్జెన్సీ పాలనతో పెత్తనం చెలాయించి, ఈజిప్టు సంపదలను అమెరికాకు దోచిపెట్టిన ముబారక్, ఆయన సహచరులు ఇప్పుడు తాము దిగిపోక తప్పనిసరి పరిస్ధితుల్లో అకస్మాత్తుగా అమెరికా పెత్తందారీతనం, ఈజిప్టు స్వతంత్రతలు గుర్తుకు రావటం ఆశ్చర్యకరమే. తమకిక అమెరికా సాయం చేయకూడదని నిర్ణయించుకున్నదని అర్ధం అయ్యాక ముబారక్ కు దేశం గుర్తుకు వచ్చింది. అలాగే ముబారక్ ముప్ఫై సంవత్సరాల పాటు ఈజిప్టును ఎమర్జేజ్సీ గుప్పిటలో బంధించి ప్రజలకు వారి హక్కులు లేకుండా చేసినప్పటికీ కేవలం తమ మాట వింటున్నందునే ముబారక్ ను సన్నిహత మిత్రునిగా పరిగణిస్తూ వచ్చిన అమెరికా ఇప్పుడు ముబారక్ కు ప్రజల వ్యతిరేకత తీవ్రం కావడంతో ప్లేటు మార్చి ప్రజాస్వామ్యం, హక్కులు, ప్రజల కోరిక ఆంటూ నీతులు వల్లింఛటం పెద్దపులి శాకాహారంపై పాఠాలు చెప్పటం లాంటిదే.