ప్రజల తిరుగుబాటుతో దేశం విడిచి పారిపోయిన పాత అధ్యక్షుడి స్ధానంలో తాత్కాలిక (ఆపద్ధర్మ) అధ్యక్షునిగా అధికారాన్ని చేపట్టిన ఫోద్ మెబజాకి ఇప్పుడు పార్లమెంటుతో సంబంధం లేకుండా డిక్రీతో పాలించే అధికారాలను సంక్రమింపజేశారు.
మెబాజా పదవీచ్యుతుడైన పాత అధ్యక్షుడు బెన్ ఆలీకి సన్నిహితుడుగా పేరు పొందిన వ్యక్తి. బెన్ ఆలీ పాలనలో దాదాపు పదకొండు సంవత్సరాలపాటు ప్రధానిగా పని చేశాడు. పార్లమెంటుతో సంబంధం లేకుండా డిక్రీ ద్వారా పాలించ వచ్చు. సెనేట్ ఓటింగ్ ద్వారా అటువంటి అధికారాలను దఖలు పరుచుకోవటం ద్వారా అనుమానాలను రేకెత్తించినట్టయ్యింది.
డిక్రీ ద్వారా పాలించే అధికారం కూడా వీలయినంత త్వరలో సంస్కరణలు పూర్తి చేయటానికేనని కొత్త అధ్యక్షుడు చెపుతున్నాడు. పార్లమెంటులో అత్యధికులు ఇంకా బెన్ ఆలీ అనుచురులేననీ ఈ అధికారం ద్వారా అధ్యక్షుటు ఇప్పుడు పాత అధ్యుక్షుడి అనుచురల మీద ఆధార పడే అవసరం తప్పిందనీ బిబిసి రాసింది. అయితే ఆ పార్లమెంటు సభ్యులే తమను పట్టించుకోవాల్సిన అవసరం లేకుండా అధికారం ఇచ్చే చట్టానికి ఎలా అంగీకరించారన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చే సమాచారం ఏదీ అందుబాటులో లేదు.
నిజానికి పాత అధ్యక్షుడికి దీర్ఘ కాలం పాటు మిత్రుడుగా ఉండి ప్రధాన మంత్రిగా ఉన్న మెబాజాని అధ్యక్షుడిగా ట్యునీషియా ప్రజలు అంగీకరించ లేదు. బెన్ ఆలీ సహచరులెవరూ కొత్త ప్రభుత్వంలో ఉండకూడదని డిమాండ్ చేస్తూ ఆయన పారిపోయాక కూడా ప్రజలు ఇంకా ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. కాని ఆందోళనల సమాచారాన్ని ప్రధాన వార్తా సంస్ధలేవీ
అందింఛడం లేదు, పొరపాటున తప్ప. ప్రజలు అనుమానించినట్టే మెబాజా కూడా సంస్కరణల పేరుతో మరిన్ని అధికారాలు చేజిక్కించు కోవటం ద్వారా తన అధికారాన్ని సుస్ధిరం చేసుకుంటున్న అనుమానం కలుగుతోంది.
ప్రజలు మార్పును చూడటానికి చాలా ఆత్రుత ఉన్నారనీ, సంస్కరణలను వేగవంతం చేయటానికి తనకు మరిన్ని అధికారాలు అవసరమనీ, కాలం చాలా విలువైననీ మెబాజా పేర్కొన్నాడు. బెన్ ఆలీ నిషేధించిన పార్టీలపై ఇంకా నిషేధం అలానీ ఉంది. త్వరాలో నిషేధాన్ని ఎత్తేస్తానని మెబాజా అంటున్నాడు. ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహిస్తానన్న హామీని అమలు చేసే వరకు ఫోద్ మెబాజా చర్యలు అనుమానాస్పదంగా కనిపించక తప్పదు.