త్వరలో కొత్త దేశంగా ప్రపంచ దేశాల జాబితాలో చేరనున్న దక్షిణ సూడాన్ కొత్త రాజధాని కోసం వెతుకులాటలో పడింది. 2005 లో కుదిరిన శాంతి ఒప్పందం ప్రకారం దక్షిణ్ సూడాన్ ప్రజలు తమ భవిష్యత్ గురించి తామె నిర్ణయంచుకోవటం కోసం జనవరి 9 నుండి 15 వరకు జరిగిన రెఫరండంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రాధమిక ఫలితాల ప్రకారం దాదాపు 99 శాతం మంది స్వతంత్రం దేశం కోసమే మొగ్గు చూపడంతో మరొక కొత్త దేశం ఏర్పాటు ఖాయం ఐపోయింది.
ముస్లింలు మెజారిటీగా ఉండే ఉత్తర సూడాన్ కూ, క్రిస్టియన్లు ఎక్కువగా నివసించే దక్షిణ సూడాన్ కూ మధ్య దశాబ్దాల తరబడి అంతర్యుద్ధం జరిగింది. ఐక్యరజ్య సమితి, ఈజిప్టు, సూడాన్ ల
మధ్యవర్తిత్వంతో జరిగిన శాంతి చర్చలు ఓ కొలిక్కి రావటంతో ఎట్టకేలకు 2005 లో ఒప్పందం కుదరటంతో అంతర్యుద్ధం ముగిసింది. 2011 జనవరిలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో దక్షిణ సూడాన్ ప్రజలు తమ భవిష్యత్తును నిర్ణయించుకోవటానికి రెఫరెండం నిర్వహించాలని ఒప్పందం కుదురింది. ఒప్పందం మేరకువారం పాటు జరిగిన రెఫరెండంలో 99 శాతం మంది విడిపోయి స్వతంత్రంగా ఉండటానికే నిర్ణయించారు.
సూడాన్ దేశాన్ని “రోగ్ స్టేట్స్” (దుష్ట రాజ్యాలు) లో ఒకటిగ అమెరికా తదితర పశ్చిమ రాజ్యాలు సంబోధిస్తాయి. (అమిరికా మాట వినని దేశాలను అలా పిలుస్తాయని వేరే చెప్పనవసరం లేదు.) దక్షిణ సూడాన్ లో ఆయిల్ నిక్షేపాలు ఎక్కువగా ఉన్నాయి. తన మాట వినని సూడాన్ దేశం నుండి ఒక ప్రాంతాన్ని, అదీ ఆయిల్ వనరులు ఉన్న ప్రాంతాన్ని విడదీయటానికి పశ్చిమ దేశాలు రెఫరెండం ఎత్తు వేశాయన్న మాట. అయితే అది ప్రజల నిర్ణయం కనుక అందరూ గౌరవించవలసిందే. రెఫరెండం నిర్వహించటనికి సాయం చేసింది కనుక అమెరికాకు దక్షిణ సూడాన్ కృతగ్నతగానో, విధేయం గానో ఉండవచ్చు. తద్వారా అక్కడి ఆయిల్ నిక్షేపాలపై పట్టు సాధించవచ్చు.
వైట్ నైలు నది ఒడ్డున ఉన్న జుబా పట్టణంలో ప్రధాన కార్య కలాపాలు జరుగుతున్నప్పటికీ అది చాలా చిన్న పట్టణం కనుక దేశ రాజధానిగా పనికిరాదని భావిస్తున్నారు. అయితే జుబాను విస్తరించి దానినే రాజధానిగా నిర్ణయించుకొనే అవకాసం లేకపోలేదు.
1948లో ఐక్యరాజ్య సమితికి హామీ ఇచ్చిన విధంగా కాశ్మీర్ లో ఇంత వరకు ఇండియా రెఫరెండం నిర్ణయించలేదు. అప్పటి నుంచీ కాశ్మీర్ ప్రజలు స్వతత్రం కోసం ఉద్యమిస్తూనే ఉన్నారు. వారి ఉద్యమాన్ని ఇండియా ఉక్కుపాదంతో అణిచి వేస్తూ వేలమందిని చంపి, మరెంతో మందిని అందృశ్యం చేసినా ఐక్యరాజ్య సమితి పట్టించు కోలేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 1989 నుండి ఇప్పటి వరకు 50,000 మంది భద్రతాళ చేతిలో హతులయ్యారు. అసలు సంఖ్య దానికి కొన్ని రెట్లు ఉంటుందని పౌరహక్కుల సంఘాలు చెపుతున్నాయి. కాశ్మీర్ ప్రజలు పాకిస్తాన్ లో కలవటానికి నిర్ణ్యించుకుంటారని ఇండియ భయం కాగా, అక్కడి ప్రజలు మాత్రం తమకు ఇండియా వద్దు, పాకిస్తాన్ వద్దు, స్వతంత్రం కావాలని నినదిస్తున్నారు. కాశ్మీర్ పై తమకు పట్టు ఏమీ లేకపోవటమే కాశ్మీర్ ప్రజల పోరాటం గురించి అమెరికా గదతరులు పట్టించుకోక పోవటానికి కారణమా?