శుక్రవారం షేర్ మార్కెట్ బారీగా నష్తపోయింది. బోంబే స్టాక్ ఎక్చేంజ్ (సెన్సెక్స్) 441 పాయింట్లు కోల్పోయి 18008 వద్ద ముగియగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్.ఎస్.ఇ లేదా నిఫ్టీ) 131 పాయింట్లు కోల్పోయి 5395 దగ్గర క్లోసయ్యింది. ఈజిప్టు ప్రజాందోళనలతో ఆయిలు ధర కొండెక్కడం ఖాయం అన్న ఆందోళన పెరగడం, దానివలన నిత్యావసరాల ధరలు కూడా పేరిగి పోతాయన్న భయాలతో దేశీయ మదుపరులు స్టాక్ మార్కెట్ జోలికే రాక పోవటం, ఎఫ్.ఐ.ఐ లు తమ పెట్టుబడులను ఉపసంహరిచుకొవటం కారణాల వలన షేర్ మార్కెట్ అంతగా నష్టపోయినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
గత జనవరి 22తో ముగిసే సంవత్సరం నాటికి ఆహార ద్రవ్యోల్బణం 17.05 శాతం రికార్డు కాగా ఆయిల్ ద్రవ్యోల్బణం 11.61 శాతంగా నమోదయ్యినట్లు ప్రభుత్వ లెక్కలు తెలిపాయి. ప్రధాన మంత్రి మన్మోహన సింగ్ కూడా ఢిల్లీలో ఒక కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ద్రవ్యోల్బవణం దేశ జి.డి.పి పెరుగుదల రేటు పట్ల మనకున్న ఆశలపై నీళ్ళు జల్లుతున్నదని ఆందొళన వ్యక్తం చేశాడు. దేశంలోని సరఫరా వ్యవస్థ బలహీనంగా ఉండడం వలన సరఫరా సంబంధిత కారణాలు ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణమవుతున్నదని ఆయన తెలిపాడు.
దేశంలోని రిటైల్ మార్కెట్ లోకి విదేశీ కంపెనీలను అనుమతించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సరఫరా సంబంధిత ద్రవ్యోల్బణాన్ని సాకుగా చూపడానికి ప్రయత్నిస్తున్నదా అన్న అనుమానాన్ని మన్మోహన్ ప్రకటన కలిగిస్తున్నది. గత ఏడెనిమిది నెలలుగా ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియా, దేశ్ ద్రవ్యోల్బణం పెరగటానికి సరఫరా సంబంధిత అవరోధాలు ప్రధాన కారణమని అదే పనిగా చెపుతూ వస్తున్నాడు. అంటే త్వరలో దేశంలోకి విదేశే రిటైల్ సంస్ధల ప్రవేశానికి అనుమతి ఇవ్వవచ్చని అర్ధం చేసుకోవచ్చు. వాటిలో ముఖ్యమైనది వాల్ మార్ట్ ముఖ్యమైనది. అది ‘ తాను రెడీ అని ఎప్పుడో ప్రకటించింది. ఇంకా ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాల కంపేనీలు కూడా గోతి కాడ గుంట నక్కల్లా ఎదురుచూస్తున్నాయి.
అదే జరిగితే, మన వీధి చివర ఉండే బడ్డీ కొట్లు త్వరలో మూత బడడటం ఖాయం. లక్షలాది మంది బడ్డీ కొట్ల యజమానులకు ఉపాధి కరువై రోడ్డున పడతారు. ఐతే ఏం? దేశ ఆర్ధిక వృద్ధి రేటు పది శాతం చేరుకుంటుంది కదా అన్నదే మన్మోహన్ సమాధానం. ఆయన ఇండియా వృద్ధిరేటు ప్రస్తుతమున్న ౮.౫ శాతం నుండి పది శాతానికి తన హయాంలోనే చేరుకోవాలని ఎప్పటినుండో కలలు కంటున్నాడు. రూటర్స్ వార్తా సంస్థ కూడా మన్మోహన్ మాటలకు ఇలా అర్ధం తీసి చాలా ఆనందం వ్యక్తం చేసింది. ఎంతో కాలంగా విదేశీ ఎఫ్.డి.ఐలు రిటైల్ రంగ ప్రైవేటీకరణ కోసం అర్రులు చాస్తున్నారనీ, వారి ఎదురు చూపులు ఇన్నాళ్ళకు ఫలిస్తున్నాయని తానూ ఆనందపడింది. విదేశీ ప్రైవీట్ కంపెనీల సంతోషమే తమ సంతోషంగ చేసుకున్న మన పాలకులను ఏమనాలో ప్రజలే తేల్చుకోవాలి.
స్తాక్ మార్కెత్‌లో షేర్ల ధరలకీ, దేశ అభివృద్ధికీ సంబంధం లేదు. స్తాక్ ఎక్స్‌చేంజ్‌లలో public limited companiesని మాత్రమే లిస్త్ చేస్తారు. షేర్లు అమ్ముకోకుండా సొంత పెట్టుబడితో నడిచే private limited companies కూడా ఉన్నాయి.
రీతైల్ రంగంలో విదేశీ పెట్టుబడులని ఆహ్వానించినంతమాత్రాన ధరలు తగ్గవు. ఎందుకంటే షాపింగ్ మాల్స్ నిర్వాహకులకి సెక్యూరితీ గార్ద్‌లు, సిసి కెమెరాల ఖర్చు కూడా ఉంటుంది.
Stock marketsలోని షేర్‌ల ధరల ఆధారంగా దేశం ఎంత అభివృద్ధి చెందింది అనేది చెప్పలేము. Stock exchangesలో public limited companiesని మాత్రమే చేర్చుకుంటారు. Public limited companiesలో కూడా షేర్‌లు కాకుండా debentures మాత్రమే అమ్ముకునే కంపెనీలు ఉన్నాయి. ఆ దిబెంచర్‌ల ధరలు కూడా షేర్‌ల ధరలతో సమానంగా ఉండకపోవచ్చు.
మనం షేర్ కొన్నా, దిబెంచర్ కొన్నా కంపెనీవాళ్ళకి లాభం వస్తేనే మనకి dividend ఇస్తారు. కంపెనీ నష్టాల వల్ల మూతపడితే షేర్ హోల్దర్‌లకి డబ్బు తిరిగి రాదు కానీ దిబెంచర్ హోల్దర్‌లకి డబ్బు తిరిగి వస్తుంది. దిబెంచర్‌లలో రకాలు ఉన్నాయి. కంపెనీ మూతపడినప్పుడు secured debentures ఉన్నవాళ్ళకి మొదట డబ్బులు తిరిగి ఇస్తారు, అలా తిరిగి ఇవ్వగా డబ్బులు మిగిలితే వాటిని unsecured debentures ఉన్నవాళ్ళకి తిరిగి ఇస్తారు. మన దేశంలో 22 stock exchanges ఉన్నాయి. వాటిలో మూడు ముంబైలోనే ఉన్నాయి. హైదరాబాద్‌లో ఒకప్పుడు stock exchange ఉండేది కానీ దాని లైసెన్స్ రద్దు చెయ్యబడినది. మిగితా 22 stock exchangesలో రెండిటి నుంచే 99.7% లావాదేవీలు జరుగుతున్నాయి. అవి National Stock Exchange & Bombay Stock Exchange. ఈ రెండు తప్ప మిగితావి redundant. అవి లేకపోయినా stock market వ్యవస్థ నడుస్తుంది. కేవలం రెండు stock exchangesలో జరిగే లావాదేవీల ఆధారంగా దేశం మొత్తం అభివృద్ధి చెందిందని చెప్పలేము.
అలాగే stock market నష్టాలు కూడా మొత్తం ఆర్థిక వ్యవస్థ యొక్క నష్టాలని సూచించవు.