ఈజిప్టు అధ్యక్షుదు హొస్నీ ముబారక్ రాజీనామా చేయాలనంటూ ఈజిప్తు ప్రజలు గత పది రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిన విషయమే. ప్రజలు ఈ శుక్రవారం లోగ అధ్యక్ష్తుదు రాజీనామా చేయాలని అల్టిమేటం ఇచ్చిన సంగతీ తెలిసిందే. గత పది రోజులుగా వెల్లువెత్తుతున్న ప్రజాందోళనలకు ఠారెత్తిన ముబారక్ శుక్రవారం నాడు తాను రాజీనామా చేయటానికి అంగీకరిస్తూనే ఒక మెలిక పెట్టాడు. తనకు రాజీనామా చేయాలనే ఉన్నప్పటకీ తన రాజీనామా తర్వాత దేశంలో అల్లర్లు తలెత్తుతాయేమోనని భయం కలుగుగున్నదని తెలిపాడు.
ఆందోళనలతో తానూ విసిగెత్తిపోయానని చెప్తూనే ఇప్పటికిప్పుడు రాజీనామా చేస్తే దేశంలో అల్లర్లు పెద్ద ఎత్తున చెలరెగతం ఖాయం అంటున్నాడు. ఈజిప్టు సంస్కృతి గురించి ఎవరికే తెలియదనీ తాను దిగిపోతె ఏ పరిణామాలు సంభవిస్తాయో కూడా తెలియదని ఆందోళన వ్యక్తం చేసాడు. తాహిరి స్క్వేర్ లొ నిన్న జరిగిన హింసలో తన పాత్ర ఏమీ లేదన్నాడు. నిషేధించబడిన “ముస్లిం బ్రదర్ హుడ్” హింసకు కారణమని ఆరోపించాడు. ఈజిప్షియన్లు పరస్పరం దాడులు చేసుకోవడం తనను చాలా బాధించిందని తెలిపాడు. పదవినుంచి దిగిపోవాలన్న ప్రజల డిమాండును ప్రస్తావించగా ప్రజలు ఏమంటున్నదీ తనకు అనవసరమనీ ఈజిప్టుగురించే తన బాధంతా అని వాపోయాడు. ముబారక్ దృష్టిలో ఈజిప్టు అంటే ఈజిప్టు ప్రజలు కాక మరేమిటో? బహుశా అమెరికా, అది అందించే డాలర్లు అయి ఉండవచ్చు. “దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్” అన్న గురజాడ పలుకులు ఈయనకు వినిపించ వలసిందేనండోయ్!