Deficient monsoon జూన్ 02

ఋతుపవనాలు: ఈ యేడూ కష్టమే

ఎల్-నినో పుణ్యమాని ఈ సంవత్సరం దేశంలో వర్షపాతం సగటు కంటే చాలా తక్కువ ఉండవచ్చని భారత వాతావరణ విభాగం (ఇండియన్ మీటియొరలాజికల్ డిపార్ట్ మెంట్ -ఐ.ఎం.డి) తాజా అంచనాలో తెలియజేసింది.  93 శాతం వర్షపాతం మాత్రమే కురుస్తుందని ఏప్రిల్ నెలలో ఐ.ఎం.డి అంచనా వేసింది. అంత కూడా ఉండదని జూన్ 2 తేదీన వేసిన అంచనాలో తెలిపింది. సగటులో 88 శాతం కురిస్తే గొప్ప అని ప్రకటించింది. తాజా అంచనాలో 88 శాతం వర్షపాతం ఉండవచ్చని తెలిపిన […]

IIT Madras జూన్ 02

ఒక ఆదేశం, కొన్ని ప్రశ్నలు -ది హిందు ఎడిట్..

సామాజిక మరియు సైద్ధాంతీక సమస్యలపై ఒక విద్యార్ధి సంస్ధ చేపట్టిన చురుకైన అవగాహన ఆధారంగా ప్రభుత్వ నిధులతో, ప్రభుత్వ పాలన కింద నడిచే పేరు ప్రతిష్టలు కలిగిన ఓ సంస్ధ అధికారులు ఆ విద్యార్ధి సంస్ధ గుర్తింపును రద్దు చేయడానికి నిర్ణయిస్తే గనుక అపుడా ప్రతిష్టాత్మక సంస్ధ వైఖరిలోనే ఏదో తీవ్రమైన దోషం ఉన్నట్లే. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – మద్రాస్ లోని అంబేద్కర్-పెరియార్ స్టడీ సర్కిల్ (ఎ.పి.ఎస్.సి) ‘బ్రాహ్మణీయ పీడన’ ను తొలగించాలని పిలుపు […]

Men ride on a motorbike through a busy road. జూన్ 01

ఎల్-నినో: ఋతుపవనాలు ఆలస్యం

పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్-నినో వాతావరణ ప్రభావం ఫలితంగా ఈ యేడు భారత దేశానికి ఋతుపవనాలు ఆలస్యంగా వస్తున్నాయి. జూన్ 1 తేదీకల్లా నైరుతి ఋతుపవనాలు కేరళలో ప్రవేశించాల్సి ఉండగా ఇంతవరకు వాటి జాడలేదు. ఐదు రోజులు ఆలస్యంగా జూన్ 5,6 తేదీల్లో కేరళలోకి ఋతుపవనాలు ప్రవేశించవచ్చని వాతావరణ సంస్ధ అధికారులు ఈ రోజు (జూన్ 1) తెలిపారు. మూడింట రెండు వంతుల జనాభా వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్న భారత దేశంలో నీటి పారుదల వసతులు […]

MODI-MANMOHAN మే 31

మోడి స్నేహ హస్తం! -ది హిందు ఎడిట్..

[మే 27 నాటి ది హిందు ఎడిటోరియల్ “Modi reaches out” కు యధాతధ అనువాదం. -విశేఖర్] *************** సాధారణ ప్రజాస్వామిక పద్ధతులు నెలకొని ఉన్నప్పుడు ప్రధాని నరేంద్ర మోడి మరియు డా.మన్మోహన్ సింగ్ ల మధ్య జరిగిన లాంటి సమావేశం ఎలాంటి విమర్శలకు తావు లేకుండా జరిగిపోతుంది. ఒకసారి ఎన్నికల వేడి, శతృత్వాలు అంతరించడం అంటూ జరిగిన తర్వాత ప్రభుత్వ పాలన ఇక సహకార సంస్ధ తరహాలో మారిపోతుంది. అధికారం చేపట్టిన వ్యక్తి సలహా, సూచనల […]

Ex PM meets PM మే 31

ప్రధాని, మాజీ ప్రధాని సమావేశం -కార్టూన్

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రధాని నరేంద్ర మోడిని కలిశారు. వారి సమావేశంలోనే అంశాలు ఏమిటో ఎవరికి తెలియదు. మాజీ ప్రధాని మాట్లాడి వెళ్ళాక ప్రధాని నరేంద్ర మోడిగారే స్వయంగా వారిద్దరు చేతులు కలిపిన ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఫోటోతో పాటు కొంత మేటర్ ఆయన రాశారు గానీ, అందులో వారి సమావేశంలోని అంశం ఏమిటో చెప్పలేదు. ట్రాయ్ (టెలికాం రెగ్యులేటరీ ఆధారిటీ ఆఫ్ ఇండియా) మాజీ అధిపతి భాయిజి తన ఉద్యోగ అనుభవాలను […]

India's hunger మే 29

పోషక లోపం: ప్రపంచంలో 25% ఇండియాలోనే

ప్రపంచవ్యాపితంగా పోషకాహార లోపంతో బాధపడుతున్నవారు 100 మంది ఉంటే అందులో 25 మంది భారత దేశంలోనే ఉన్నారు. ఐక్యరాజ్యసమితి ఆహార మరియు వ్యవసాయ సంస్ధ (UNFAO) నివేదిక తెలిపింది. ఈ రోజు వెలువడిన నివేదిక ప్రకారం ప్రపంచంలో పోషకాహార లోపంతో బాధపడుతున్నవారి సంఖ్య అత్యధికంగా ఇండియాలోనే ఉన్నారు. ఇండియా తర్వాత స్ధానంలో జి.డి.పిలో అమెరికాతో పోటీ పడుతున్న చైనా నిలవడం గమనార్హం. 21వ దశాబ్దం ఆరంభంలో ఇండియా, చైనాలు సాధించిన వేగవంతమైన జి.డి.పి వృద్ధి ఆ దేశాల్లో […]

Coexist మే 28

Do anti-Modi posts qualify to be hated?

This article is the answer to a comment posted by one, ‘THE INFORMER’ under my article “నువ్వు ముస్లింవి, ఇల్లు ఖాళీ చెయ్!”. The comment and my answer are reproduced as a main post to get a broad attention. As the commenter wrote in English I too chose to respond in English. If readers want it to […]

Modi tours మే 28

మోడి ద సూపర్ హీరో -కార్టూన్

“80 రోజుల్లో ప్రపంచాన్ని చుట్టి రావడమే తేలిక…” ************* గత యేడాదిలో పార్లమెంటు సమావేశాలకు అతి తక్కువ సార్లు హాజరైన ప్రధాన మంత్రిగా విమర్శలు ఎదుర్కొన్న ప్రధాని నరేంద్ర మోడి అదే సమయంలో ఒకే సంవత్సరంలో అత్యధిక సంఖ్యలో విదేశాలు పర్యటించిన ఘనతను కూడా దక్కించుకున్నారు. సంవత్సర కాలంలో ప్రధాని నరేంద్ర మోడి 18 దేశాలు పర్యటించడం మున్నేన్నడూ ఎరగనిది. ఆయన ముఖ్యమంత్రి ఉన్న పదేళ్ళ కాలంలో ఏయే దేశాలైతే ఆయనకు వీసా ఇవ్వడానికి నిరాకరించాయో ఆ […]

Heat wave effect మే 27

వేడిగాలులకి 1100 మంది బలి -ఫోటోలు

భారత దేశాన్ని, అందునా దక్షిణ భారతాన్ని, అందులోనూ తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను వేడి గాలులు పట్టి ఊపేస్తున్నాయి. గత వారం రోజుల్లోనే వెయ్యికి పైగా ప్రజలు వడగాలులకు బలైపోగా మొత్తం మీద ఈ వేసవి కాలంలో వడదెబ్బకు గురై మరణించినవారి సంఖ్య 1100 దాటి పోయిందని జాతీయ, అంతర్జాతీయ పత్రికలు తెలిపాయి. దాదాపు ప్రతి అంతర్జాతీయ వార్తా సంస్ధ భారత దేశంలో వేడి గాలుల గురించి గత కొద్ది రోజులుగా తప్పనిసరిగా వార్తలు […]

misbah-qadri మే 27

నువ్వు ముస్లింవి, ఇల్లు ఖాళీ చెయ్!

గుజరాత్ మారణకాండ అనంతరం ముస్లిం ప్రజలు రక్షణ కోసం వెలివాడల్లో బ్రతుకులు ఈడ్చవలసిన దుర్గతి దాపురించింది. ఇటువంటి హీన పరిస్ధితుల మధ్య బతకలేక కాస్మోపాలిటన్ నగరం ముంబైలో గౌరవంగా బతకొచ్చని గంపెడు ఆశలతో తరలి వచ్చిన ముస్లింలకు ఆధునిక కాస్మోపాలిటన్ సంస్కృతికి బదులు మత విద్వేషం స్వాగతం పలికింది. ఆధునిక నగరం అని జనులు చెప్పుకునే ముంబై నగరం పైకి మాత్రమే ఆధునికం అనీ లోలోపల కుల, మత, లింగ వివక్షలతో కుళ్లిపోయిందని మిష్భా ఖాద్రి అనుభవం […]

Hamid Nazir Bhat మే 27

కాశ్మీర్ లో ఉక్కు పాదం -ది హిందు ఎడిట్..

[మే 21 తేదీన ఉత్తర కాశ్మీర్ లోని పల్హాలాన్ గ్రామంలో గ్రామ ప్రజలు మీర్వాయిజ్ మౌల్వీ ఫరూక్ 25వ వర్ధంతి సందర్భంగా ఊరేగింపు జరుపుతుండగా పోలీసులు ఊరేగింపు పైకి పంప్ గన్ పెల్లెట్లు పేల్చారు. నాన్-లెధల్ వెపన్ పేరుతో కాశ్మీర్ భద్రతా బలగాలు ప్రయోగిస్తున్న ఈ ఆయుధాల వల్ల వందలమంది తీవ్ర గాయాలపాలై కంటి చూపు కోల్పోతున్నారు. నాన్-లెధల్ అని చెప్పినప్పటికీ పదుల సంఖ్యలో వీటి బారినపడి మరణించారు. మే 21 తేదీన ట్యూషన్ కి వెళుతూ […]

07 Deaf dancers perform 'Avalokitesvara Bodhisatva' -2009 మే 26

చైనా సమూహ కళకు సరిలేరు ఎవ్వరూ! -ఫోటోలు

ప్రజా సమూహాలు అన్నీ ఒకే మాదిరిగా, ఒకే భావాన్ని కలిగించేవిగా ఉండవు. కొన్ని సమూహాలు అబ్బురపరిస్తే కొన్ని సమూహాలు చీదర  పుట్టిస్తాయి. కొన్ని సమూహాలు ఔరా! అనిపిస్తే మరికొన్ని ఇదెలా సాధ్యం అని విస్తుపోయేలా చేస్తాయి. సమూహంలో క్రమ శిక్షణ ఉంటే ఆ సమూహానికి ఎనలేని అందం వచ్చి చేరుతుంది. అది మిలటరీ క్రమ శిక్షణ అయితే చెప్పనే అవసరం లేదు. క్రమబద్ధమైన కదలికలతో మిలట్రీ సమూహాలు చేసే విన్యాసాలు చూడముచ్చట గొలుపుతూ విసుగు అనేది తెలియకుండా […]

అనుసరించు

Get every new post delivered to your Inbox.

మరో 1,920గురు చందాదార్లతో చేరండి