రికార్డు స్ధాయికి ఫ్రాన్స్ నిరుద్యోగం

ఐరోపాలో జర్మనీ తర్వాత హెవీ వెయిట్ గా పేరు పొందిన ఫ్రాన్స్ లో కూడా ప్రజలు నిరుద్యోగ భూతాన్ని ఎదుర్కొంటున్నారు. గత 15 సంవత్సరాలలోనే అత్యధిక స్ధాయికి అక్కడి నిరుద్యోగం చేరుకుంది. 2013 మొదటి క్వార్టర్ (జనవరి, ఫిబ్రవరి, మార్చి) ముగిసేనాటికి ఫ్రాన్స్ లో 10.8 శాతం నిరుద్యోగం నమోదయిందని ఆ దేశ జాతీయ గణాంకాల సంస్ధ INSEE గురువారం తెలిపింది. 1998 తర్వాత ఈ స్ధాయి నిరుద్యోగం నమోదు కావడం ఫ్రాన్స్ లో ఇదే మొదటిసారి.…

రాజకీయ పార్టీలకు విరాళాలు ఇలా వస్తాయా? -కార్టూన్

“అది కేవలం ముందు జాగ్రత్త కోసమే, వారి ఎన్నికల ఖర్చు పైన ఆర్.టి.ఐ దస్త్రం పడేస్తామని వారికి తెలుసు!” సమాచార హక్కు చట్టం పోయి పోయి రాజకీయ పార్టీల మెడకు చుట్టుకుంటోంది. ఏ పార్టీలయితే ప్రజలకు ప్రభుత్వం నుండి సమాచారం పొందే హక్కు ఉన్నదని సభలపై బల్లలు గుద్ది మరీ వాదించాయో, ఆ పార్టీలే ఇప్పుడు ఆ చట్టం తమకు వర్తించదని వాదిస్తున్నాయి. ప్రభుత్వాల ఆధారిటీని ఒక ప్రత్యేక (unique) పద్ధతిలో పార్టీలు తమ గుప్పెట్లో పెట్టుకుంటాయని,…

చేపమందు అశాస్త్రీయం, ఏర్పాట్లు మీవే -లోకాయుక్త

బత్తిన సోదరులకు ఊహించని రీతిలో షాక్ లాంటిది ఎదురయింది. చేప మందు అశాస్త్రీయమని లోకాయుక్త కోర్టు చెప్పేసింది. ప్రైవేటు వ్యక్తుల కార్యకలాపాలకు ప్రభుత్వం నుండి సహాయం చేయడానికి వీలు లేదని తీర్మానించింది. బత్తిన సోదరులే చేపలు మింగడానికి వచ్చేవారికి తమ సొంత ఖర్చులతో తగిన ఏర్పాట్లు చేసుకోవాలని తేల్చి చెప్పింది. జూన్ 8, 9 తేదీల్లో నాంపల్లి గ్రౌండ్స్ లో జరిగే చేప మందు పంపిణీ కోసం మంచి నీరు, భద్రత, శుభ్రత లాంటి తగిన ఏర్పాట్లు…