కూతురిని నాలుగేళ్ళు హౌస్ అరెస్ట్ చేసిన తల్లిదండ్రులు?

కుటుంబ గౌరవాన్ని కాపాడే బాధ్యత ప్రధానంగా ఆడపిల్లదేనా? ‘వాడికేం మగాడు’ అనే సమాజం తల్లిదండ్రుల చేత తన కూతుళ్లపైన ఎంతటి ఘోరకలికయినా తెగించేట్లు చేస్తుందా? ఆడపిల్లలకు ఇష్టమైనవారిని ఇచ్చి పెళ్లి చేసే విషయంలో కొందరు తల్లిదండ్రులు ఎంత క్రూరంగా వ్యవహరించగలరో బెంగుళూరులోని ఈ హృదయ విదారక సంఘటన చెబుతోంది. తమకు ఇష్టం లేని వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు 31 యేళ్ళ (ఇప్పుడు 35) తమ కూతురిని నాలుగేళ్లుగా గదిలో బంధించి ఉంచిన తల్లి దండ్రులను ఎలా అర్ధం…

అద్వానీ కల తీరిది! -కార్టూన్

అద్వానీ భవిష్యత్తు ఏమిటి? భావి ప్రధాని కావడానికి తగిన ప్రయత్నాలన్నింటినీ ఆయన చేస్తున్నారు. కానీ ‘తానొకటి తలచిన దైవమొకటి తలచెను’ అన్న రీతిలో అద్వానీ కలను రాముడు పట్టించుకుంటున్నట్లు లేదు. ‘అన్నీ నేనే’ అని ఎప్పుడో చెప్పేసిన శ్రీ మహా విష్ణువు ఆయన పార్టీ చేత ‘ఇక మీరు రిటైర్మెంట్ తీసుకోండి’ అని పరోక్షంగా చెప్పిస్తున్నారు. మోడిని తీవ్ర స్ధాయిలో ప్రమోట్ చేయించడం ద్వారా ఆయనని విశ్రాంతి తీసుకొమ్మని ‘హింట్’ ఇప్పిస్తున్నారు. కానీ అద్వానీ శ్రీ మహా…

జైలులో 125 మంది నాయకులకు ఆతిధ్యం ఇచ్చిన జగన్!

సామాన్య మానవుడికి సాధ్యం కాని ఫీట్ ఇది. బహుశా గిన్నీస్ రికార్డ్ బుక్ ఎక్కడానికి కూడా అర్హత ఉందేమో కూడా. ఎంత వి.వి.ఐ.పి ఐతే మాత్రం, ప్రమాదకరమైన నేరానికి పాల్పడ్డాడని సుప్రీం కోర్టు పదే పదే వ్యాఖ్యానిస్తున్న ఒక నేరస్ధుడికి, సంవత్సర కాలంలో 125 మంది రాజకీయ నాయకులకి మూలాఖాత్ ఇచ్చే అవకాశం ఎవరికి దక్కుతుంది? ఈ సంఖ్య కేవలం రాజకీయ నాయకులదే. సినిమా నటులు, బంధువులు, పారిశ్రామికవేత్తలు తదితర పెద్దలను కూడా కలిపితే రోజుకి కనీసం…