అమెరికాలో అతి పెద్ద కుంభకోణం ఏది? -కార్టూన్

—*— సర్వేయర్: ఒబామా పరిపాలనను ఎక్కువగా నష్టపరుస్తున్న కుంభకోణం ఏదని మీ అభిప్రాయం? బెంఘాజి… ఎ.పి, ఫాక్స్ న్యూస్ సంస్ధల ఫోన్ రికార్డులను ప్రభుత్వం సంపాదించడమా లేక కన్సర్వేటివ్ గ్రూపులను ఐ.ఆర్.ఎస్ టార్గెట్ చెయ్యడమా? ముక్త కంఠంతో: ఆర్ధిక వ్యవస్ధ!! —*— 2008 ప్రపంచ ఆర్ధిక సంక్షోభం దరిమిలా అమెరికా ప్రజల జీవన ప్రమాణాలు ఘోరంగా దిగజారాయి. సంక్షోభ భారం అంతా ప్రజలపై మోపి చేతులు దులుపుకున్న ప్రభుత్వం సంక్షోభానికి కారణమైన వాల్ స్ట్రీట్ కంపెనీలను మాత్రం…

వూల్ విక్ హంతకుడికి ఎం.ఐ-5 జాబ్, ఒక పరిశీలన

పశ్చిమ దేశాల మిలట్రీ గూఢచార సంస్ధలు టెర్రరిస్టులతో నిత్యం సంబంధం కలిగి ఉంటాయన్న వాస్తవాన్ని వూల్ విక్ హత్యోదంతం మరొకసారి వెలుగులోకి తెచ్చింది. పశ్చిమ దేశాలకు ఇస్లామిక్ టెర్రరిజం వ్యూహాత్మక మిత్రుడే కానీ శత్రువు కాదని అంతర్జాతీయ పరిశీలకులు ఎప్పుడూ చెప్పే మాట. లండన్ వీధుల్లో జరిగిన హత్య, అనంతరం వెల్లడి అవుతున్న విషయాలు ఈ సంగతిని ధృవీకరిస్తున్నాయి. లండన్ లోని వూల్ విక్ సబర్బ్ లో ఒక మిలట్రీ డ్రమ్మర్ ను పాశవికంగా చంపాడని బ్రిటిష్…

సొంత డబ్బాకు అమ్మ, నాయనమ్మలు కావాలా?

— “…తనకు నాయకత్వ సామర్ధ్యం ఏ మాత్రం ఉందో కనిపెట్టడానికి రాహుల్ జీ ప్రయత్నిస్తున్నట్లున్నారు…” — కాంగ్రెస్ పార్టీకి ఉపాధ్యక్షుడుగా నియమితుడయ్యాక రాహుల్ గాంధీ తన మొట్టమొదటి పార్టీ అధికారిక పర్యటనకు ఢిల్లీనే ఎంచుకున్నారు. ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయాన్ని గురువారం సందర్శించిన రాహుల్ గాంధీ తాను క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించబోనని చెప్పారు. అంతవరకు సంతోషమే. కానీ అలా చెప్పడానికి తన అమ్మగారు, నాయనమ్మ గారిని అడ్డం పెట్టుకోవడమే ఎబ్బెట్టుగా కనిపిస్తోంది. తాను తన అమ్మగారు…