చెన్నై టీం ఓనర్లే స్పాట్ ఫిక్సర్లు, పందెందార్లు

కలుగులో ఎలుక బైటికి వచ్చేస్తోంది. పోలీసులు పెట్టిన పొగ తట్టుకోలేక పుట్టలో పాములు వరుసగా తోసుకుని బైటికొస్తున్నాయి. విందూ దారా సింగ్ ఇచ్చిన వివరాలు నిజమేనని ముంబై పోలీసులకు స్పష్టంగా అర్ధం అయింది. స్పాట్ ఫిక్సింగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ యజమాని, బి.సి.సి.ఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ అల్లుడు, ఇండియా సిమెంట్స్ కంపెనీ అధినేతల్లో ఒకరు అయిన గురునాధ్ మీయప్పన్ పాత్ర ఉన్నదని ముంబై పోలీసుల వద్ద సరిపోయినన్ని సాక్ష్యాలు ఉన్నాయట. ఈ మేరకు ముంబై జాయింట్…

పన్ను ఎగవేతకు ఆప్! -కార్టూన్

ఆమె: యాపిల్ కంపెనీ బిలియన్ల కొద్దీ పన్నులు ఎగవేయగలిగింది తెలుసా! అతడు: భలే, దాని కోసం ఆప్ ఏమన్నా ఉందా ఏమిటి? – అప్లికేషన్ అనే పదానికి ‘ఆప్’ అనే పొట్టి మాటను బహుళ ప్రచారంలోకి తెచ్చింది బహుశా మొదట యాపిల్ కంపెనీయే అనుకుంటా. యాపిల్ ఫోన్ల పైన నిలువు అడ్డ వరుసల్లో కనిపించే విధంగా స్టీవ్ జాబ్స్ కంపెనీ వివిధ అప్లికేషన్ల ఐకాన్లను డిజైన్ చేసిన తరువాత అది విపరీతంగా క్లిక్ అయింది. దానితో ఇతర…