మాయావతి (బి.ఎస్.పి) ప్రయాణం -కార్టూన్

ఉత్తర ప్రదేశ్ లో బహుజన్ సమాజ్ పార్టీ ప్రయాణం ఒక వింత రూపాన్ని సంతరించుకుంది. ఆ పార్టీ వ్యవస్ధాపకుడు కాన్షీరామ్ బతికి ఉంటే ఎలా ఉండేదో గానీ పార్టీ స్ధాపన సమయంలో ఆయన  చెప్పిన సిద్ధాంతాలకు చెదలు పట్టాయి. ఈ చెదలకు సైద్ధాంతీక పోషకత్వం స్వయంగా కాన్షీరామ్ వారసురాలు మాయావతియే కావడం ఒక విపరిణామం. భూస్వామ్య కులాల వలలో చిక్కిన కొద్దిమంది ఉప నాయకులు పార్టీ వ్యవస్ధాపాక సిద్ధాంతాలతో విభేదించి పార్టీని చీల్చి అగ్రకుల భూస్వామ్యులతో కలిసిపోతే…

అమెరికా: తుపాకులు పట్టుకు తిరిగేవారిలో తెల్లవారే ఎక్కువ

న్యూయార్క్ నగరంలో నల్లవారి కంటే తెల్లవారే ఎక్కువగా తుపాకులు పట్టుకుని తిరుగుతున్నారని న్యూయార్క్ పోలీసుల సర్వేలో తేలింది. నేరం జరిగినప్పుడల్లా నల్లవారిని అనుమానించే న్యూయార్క్ పోలీసుల ధోరణిలో తీవ్ర తప్పిదం ఉందని దీని ద్వారా స్పష్టం అవుతోంది. న్యూయార్క్ పోలీసులు గత రెండు మూడు సంవత్సరాలుగా పాటిస్తున్న stop-and-frisk ఆపరేషన్లలో సేకరించిన డేటా ద్వారా నల్లవారి కంటే రెట్టింపు సంఖ్యలో తెల్లవారి దగ్గరే ఆయుధాలు లభ్యమయ్యాయని రష్యా టుడే తెలిపింది. న్యూయార్క్ పోలీసుల స్టాప్-అండ్-ఫ్రిస్క్ ఆపరేషన్ పలు…

హ్యాట్రిక్ ఊపులో మన్మోహన్ -కార్టూన్

వేగంగా పరుగెత్తాలని గుర్రాన్ని ఆదేశించాలంటే అశ్వికుడు ‘గిడియాప్’ అంటాడట. యు.పి.ఏ ఆస్వారూఢుడైన అశ్వికులు మన్మోహన్ సింగ్ గారు తొమ్మిదేళ్ల శ్రమతో నిర్మించిన రోడ్డు పైన తన గుర్రానికి అదే ఆదేశాలిస్తున్నారు. హ్యాట్రిక్ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఆ మధ్య విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మన్మోహన్ సింగ్, మూడోసారి ప్రధాని అయ్యే అవకాశాలని తోసి పుచ్చలేదని వార్తలు వచ్చాయి. మొన్నటితో మన్మోహన్ పాలన తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మళ్ళీ అదే చర్చ తలెత్తింది. దానినే కార్టూనిస్టు ఎత్తిచూపిస్తున్నారు. అసలు…