కరుగుతున్న ఆర్కిటిక్, చమురు సంపదలో ఇండియాకీ వాటా?

భూ గ్రహం ఉత్తర ధ్రువం అయిన ఆర్కిటిక్ ఖండం వద్ద మంచు గడ్డలు వేగంగా కరిగిపోతున్నాయి. దానితో ఆ ఖండం వద్ద దాగిన అపార ఖనిజ, చమురు వనరుల కోసం పోటీ పేరుగుతోంది. ఈ పోటీలో భారత దేశం కూడా ప్రవేశించిన పరిణామం చోటు చేసుకుంది. ‘ఆర్కిటిక్ కౌన్సిల్’ లో సభ్యత్వం కోసం ప్రయత్నిస్తూ వచ్చిన ఇండియాకు ‘పరిశీలక’ హోదా ఇస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. తాజాగా ఇండియా, చైనాలతో పాటు ఆరు దేశాలకు ఈ హోదా…

సి.బి.ఐ అటానమీ -కార్టూన్

బొగ్గు కుంభకోణం దర్యాప్తు నేపధ్యంలో సి.బి.ఐ కి స్వయం ప్రతిపత్తి గ్యారంటీ చేసేలా చట్టం చేయాలని సుప్రీం కోర్టు ప్రభుత్వానికి ప్రతిపాదించింది. బొగ్గు కుంభకోణం విషయమై జులైలో తదుపరి హియరింగ్ జరగనుంది. ఆ లోపు చట్టాన్ని తెస్తే తాము సంతోషిస్తామని సుప్రీం కోర్టు అటార్నీ జనరల్/ కేంద్ర ప్రభుత్వం ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించింది. “పంజరంలో చిలక” లాగా మారిన సి.బి.ఐ తమ యజమాని ఏమి చెప్పమంటే అదే చెబుతోందని సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బహుళ…

రష్యాలో అమెరికా రాయబారి గూఢచర్యం, బహిష్కరణ

గూఢచర్యం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఒక అమెరికా రాయబారిని రష్యా ప్రభుత్వం అరెస్టు చేసింది. తర్వాత విడుదల చేసి వెంటనే దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. అనంతరం అమెరికా రాయబార కార్యాలయం ప్రధాన రాయబారిని విదేశాంగ కార్యాలయానికి పిలిపించుకుని తన నిరసన తెలియజేసింది. ‘ప్రచ్ఛన్న యుద్ధం’ ముగిసిందని ప్రకటించినప్పటికీ అమెరికా, రష్యాల మధ్య గూఢచర్యం ఇంకా చురుకుగా కొనసాగుతోందనడానికి తాజా బహిష్కరణ మరొక సూచిక. రెండేళ్ల క్రితం అమెరికాలో గూఢచర్యం చేస్తున్నారని ఆరోపిస్తూ అరడజనుకు…