ద్రవ్యోల్బణం తగ్గెను, వడ్డీ రేటు తగ్గును… (ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల వివరణ)

రిజర్వ్ బ్యాంకు నిధుల కోసం కాచుకు కూచున్న కంపెనీల కలలు తీరే రోజు వస్తోంది. ఆర్.బి.ఐ వడ్డీ రేటు మరింత తగ్గడానికి, తద్వారా రిజర్వ్ బ్యాంకు నుండి మరిన్ని నిధులు పొందడానికి కంపెనీలు ‘వర్షపు నీటి చుక్క కోసం ఎదురు చూసే చాతక పక్షుల్లా’ చూస్తున్న ఎదురు చూపులు ఫలించే రోజు రానున్నది. కంపెనీల తరపున వడ్డీ రేట్లు తెగ్గోయాలని ఆర్.బి.ఐ వద్ద చెవినిల్లు కట్టి పోరుతున్న ఆర్ధిక మంత్రి పి.చిదంబరం కూడా కాలర్ ఎగరేయబోతున్నారు. కారణం…

పాక్ ప్రభుత్వానికి మన్మోహన్ స్నేహ హస్తం -కార్టూన్

– ఇటీవల ఎన్నికల్లో నెగ్గిన నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్ధాన్ నూతన ప్రభుత్వానికి ప్రధాని మన్మోహన్ తన స్నేహ హస్తాన్ని చాచారు.                                                        —-వార్త – పాకిస్ధాన్ లో అలా ఎన్నికలు ముగిశాయో లేదో ఇలా భారత ప్రధాని ఇంకా ఏర్పడని నూతన ప్రభుత్వానికి స్నేహ హస్తం చాచారు. ఇన్నాళ్లూ పాకిస్ధాన్ ని పాలించిన ఆసిఫ్ జర్దారీ అధ్యక్షరికంలోని పాకిస్ధాన్ పీపుల్స్ పార్టీ ప్రభుత్వంలో కొరవడిందీ, నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్ధాన్ ముస్లిం లీగ్ (నవాజ్) పార్టీ…

బంగారం దిగుమతులు పైకి, వాణిజ్య లోటు ఇంకా పైకి

భారతీయుల బంగారం దాహం దేశ ఆర్ధిక వ్యవస్ధకు ముప్పుగా పరిణమిస్తోంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో ఇండియా బంగారం దిగుమతులు 138 శాతం పెరిగాయి. దీనితో వాణిజ్య లోటు పెరిగి, విదేశీ మారక ద్రవ్య నిల్వలలో తరుగు ఏర్పడి, కరెంటు ఖాతా లోటు (Current Account Deficit) పై మరింత ఒత్తిడి పెరుగుతోంది. బంగారం దిగుమతులు పెరిగిన ఫలితంగా ఏప్రిల్ నెలలో వాణిజ్య లోటు అమాంతం 17.8 బిలియన్ డాలర్లకు పెరిగింది. ప్రపంచ…