ఇజ్రాయెల్ జాత్యహంకారానికి దర్పణం ఈ ఫోటో

ఆ కనిపించే గోడ ఇజ్రాయెల్ తన ప్రాంతాల చుట్టూ నిర్మించిన కట్టడం. కోట కోడను తలపించే ఇలాంటి ఎత్తైన గోడలు ఇజ్రాయెల్ నిండా దర్శనమిస్తాయి. అవి ఇజ్రాయేలీయులు (యూదులు), పాలస్తీనీయులు నివసించే ప్రాంతాలను వేరు చేస్తాయి. పనులకు వచ్చే పాలస్తీనీయులను శల్య పరీక్ష చేయడానికి కూడా చెక్ పోస్టుల వద్ద ఇలాంటి ఎత్తైన గోడలను ఇజ్రాయెల్ నిర్మించింది. ఇలాంటి చెక్ పోస్టుల వద్ద ‘క్యూ’లలో ఇజ్రాయెల్ సైనికుల చేత నఖశిఖ పర్యంతం చెకింగ్ అయ్యాకనే పాలస్తీనీయులకు ఆ…

బలి పశువులు కావలెను -కార్టూన్

ఎట్టకేలకు కళంకిత మంత్రులుగా పేరుబడిన ఇద్దరు కేంద్ర మంత్రులు రాజీనామా చేశారు. అనవసర వివాదంతో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకనే రాజీనామా చేశానని అశ్వనీ కుమార్ అంటే, పవన్ కుమార్ బన్సాల్ ఆ మాట కూడా చెప్పలేదు. సి.బి.ఐ నివేదికను మంత్రి అశ్వనీ కుమార్, ఇతర బ్యూరోక్రాట్ అధికారులు మార్చడం వల్ల నివేదిక ఆత్మ మారిపోయిందని, వారి జోక్యం వలన విచారణ పక్కదారి పట్టే అవకాశం ఏర్పడిందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించినప్పటికీ తనను కోర్టు తప్పు…

పార్లమెంటుకు 4 కి.మీ దూరంలో బలవంతపు వ్యభిచారం

ఢిల్లీ మెడికల్ విద్యార్ధిని నిర్భయ సామూహిక అత్యాచారం దరిమిలా వెల్లువెత్తిన ప్రజాగ్రహానికి సమాధానం ఇస్తూ ప్రధాని మన్మోహన్ ‘మహిళల రక్షణే తమ ప్రభుత్వానికి ప్రధమ ప్రాధాన్యం’ అని ప్రకటించారు. కానీ ఆయన ఆ ప్రకటన చేసిన పార్లమెంటు భవనానికి నాలుగు కి.మీ దూరం లోపలే వివిధ రాష్ట్రాల నుండి కిడ్నాప్ చేసి తెచ్చిన బాలికల చేత బలవంతపు వ్యభిచారం చేయిస్తున్న అమానుషం వెలుగులోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్ నుండి కిడ్నాప్ చేసి తెచ్చిన టీనేజి అమ్మాయిని బంధించి…