యు.పి.ఎ జవాబుదారీతనం ఇలా తగలడింది -కార్టూన్

భారత రాజకీయ వ్యవస్ధ ఎన్నడూ లేనంతగా గబ్బు పట్టిపోయింది. రాజకీయానికి, ఆరాచకానికి సరిహద్దులు చెరిగిపోయాయి. ఎన్ని పరిమితులున్నా, ఒకప్పుడు ఎంత నీతిగా ఉంటే అంత గొప్ప. ఇప్పుడు ఎంత దిగజారి అవినీతికి పాల్పడినా అంత సంపాదిస్తే అంత గొప్ప!  కాగ్ ఛీ అంటుంది. సుప్రీం కోర్టు ఛీ ఛీ అంటుంది. అయినా మంత్రులు, ప్రధాన మంత్రి దగ్గర్నుండి రాష్ట్రాల మంత్రుల వరకూ దులుపుకుని పోయేవారే తప్ప జనానికి తాము జవాబు చెప్పాల్సి ఉంటుందన్న ధ్యాసే లేదు.  జనానికి…

ఆ తెల్లోళ్ళు కాదు, వీరే అసలు అమెరికన్లు -ఫోటోలు

అమెరికన్లు అనగానే ఆ కాకసాయిడ్ రూపంలో ఉండే తెల్లవాళ్లే గుర్తుకొస్తారు. తెల్లవాళ్లు వాస్తవానికి ఐరోపా నుండి వలస వచ్చినవారు. ఇండియా కోసం బయలుదేరి ఉత్తర అమెరికా ఖండం చేరుకున్న కొలంబస్, అమెరికానే ఇండియాగా భావించి అక్కడ కనపడినవారిని ‘రెడ్ ఇండియన్లు’ అన్నాడు. స్వల్పంగా మంగోలాయిడ్ రూపంలో ఉండే ఆ రెడ్ ఇండియన్లే అసలు అమెరికన్లు. ఇప్పుడు వారి సంఖ్య చాలా స్వల్పం. నేటివ్ అమెరికన్లను పశ్చిమ తీరానానికి నెట్టుకుంటూ పోయిన యూరోపియన్లు ఆ క్రమంలో అనేక అకృత్యాలకు…