అమెరికా డ్రోన్ హత్యలు అక్రమం -పాక్ కోర్టు

పాకిస్ధాన్ గిరిజన ప్రాంతాల్లో అమెరికా సైన్యం సాగిస్తున్న డ్రోన్ హత్యలు చట్ట విరుద్ధం అని ఒక పాకిస్ధాన్ కోర్టు తీర్పు ఇచ్చింది. అమెరికా డ్రోన్ దాడులకు వ్యతిరేకంగా పాక్ ప్రభుత్వం, ఐరాస జోక్యం కోరాలని కూడా కోర్టు పాక్ ప్రభుత్వాన్ని కోరింది. అమెరికా తన వీటో అధికారాన్ని వినియోగించినట్లయితే ఆ దేశంతో దౌత్య సంబంధాలను రద్దు చేసుకునే అవకాశాలు పరిశీలించాలని కోర్టు తన తీర్పులో పేర్కొంది. డ్రోన్ దాడులను అంగీకరిస్తూ పాక్ ప్రభుత్వం అమెరికాతో రహస్య ఒప్పందం…

ఇజ్రాయల్ అకడమిక్ బాయ్ కాట్ లో చేరిన స్టీఫెన్ హాకింగ్

ఐనిస్టీన్ తర్వాత అంతటి మేధావిగా మన్ననలు అందుకుంటున్న ప్రఖ్యాత బిటిష్ ఫిజిక్స్ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్, బహుశా తన జీవితంలో మొదటిసారిగా ఒక రాజకీయ నిర్ణయం తీసుకున్నారు. ఇజ్రాయల్ ను అకడమిక్ బాయ్ కాట్ చేయడానికి ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఇజ్రాయెల్ అధ్యక్షుడు షిమాన్ పెరెజ్ ఆతిధ్యం ఇవ్వనున్న అత్యున్నత స్ధాయి కాన్ఫరెన్స్ కు హాజరు కాకూడదని ఆయన నిర్ణయించాడు. తద్వారా ఇజ్రాయెల్ ను అకడమిక్ గా బాయ్ కాట్ చేస్తున్న బ్రిటిష్ ప్రముఖుల్లో ఆయన కూడా…

బి.జె.పి కుమ్ములాటలే కాంగ్రెస్ గెలుపు కిరీటం -కార్టూన్

కర్ణాటకలో బి.జె.పి సెల్ఫ్ గోల్ సంపూర్ణం అయింది. జాతీయ స్ధాయిలో కాంగ్రెస్ అవినీతిని ఎండగడుతున్నట్లు ఫోజు పెడుతున్న బి.జె.పి పార్టీకి కర్ణాటకలో సొంత నాయకుల అవినీతిని నెత్తిన పెట్టుకోలేకపోయింది. జాతీయ స్ధాయిలో పరువు ప్రతిష్టలు నిలుపుకోవాలంటే కార్ణాటకలో అవినీతి నాయకుడు యెడ్యూరప్పను దూరం పెట్టక తప్పని పరిస్ధితి. ఫలితంగా బి.జె.పి ఓటు బ్యాంకు చీలిపోవడంతో ఎన్నికలకు ముందే కాంగ్రెస్ గెలుపు ఖాయమైపోయింది. సొంత కుంపటి పెట్టుకుని తగిన సీట్లు తెచ్కుకుని ప్రభుత్వాల్ని శాసించవచ్చు అనుకున్న కర్ణాటక జనతా…

అనూహ్య పరిణామం: సిరియాపై వెనక్కి తగ్గిన అమెరికా

నిత్యం పెనం మీద కాలుతుండే మధ్యప్రాచ్యం (Middle-East) ప్రాంతంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రష్యా పర్యటనలో ఉన్న అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ జాన్ కెర్రీ, ఊహించని రీతిలో సిరియా ప్రభుత్వానికి, తిరుగుబాటుదారులకు చర్చలు జరగడానికి అంగీకరించాడు. అధ్యక్షుడు బషర్ అస్సద్ గద్దె దిగితే తప్ప చర్చలు సాధ్యం కాదని హుంకరిస్తూ వచ్చిన అమెరికా, చర్చలకు అంగీకరించడం ప్రపంచంలో బలా బలాలు మారుతున్నాయనడానికి మరో ప్రబల సంకేతం. అమెరికా, ఐరోపాల ప్రాభవ క్షీణతలో మరో అధ్యాయానికి…