రెండు దేశాలు, ఒకే క్రూరత్వం

సరబ్ జిత్ సింగ్ చనిపోయాడు. పాకిస్ధాన్ లోని జిన్నా ఆసుపత్రి డాక్టర్లు ‘బతకడం కష్టమే’ అని చెప్పినట్లుగానే ఆయన చనిపోయాడు. మరణ శిక్ష ఎదుర్కొంటున్న ఇద్దరు పాకిస్ధానీ ఖైదీలు లాహోర్ లోని కోల్ లఖ్పట్ జైలులో అమానుషంగా దాడి చేయడంతో కోమాలోకి వెళ్ళిన సరబ్ జిత్ సింగ్ గురువారం తెల్లవారు ఝామున 1 గంటకు తుది శ్వాస విడిచాడని పాక్ అధికారులు ప్రకటించారు. గత శుక్రవారం దాడికి గురైన సరబ్ జిత్ సింగ్ వారం రోజులు కోమాలో…

ఎంత హింస మోసిందో, భర్తను కడతేర్చింది…

“ఎంతైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు కదా!” ఈ మాట చెప్పడం చాలా తేలిక. కష్టాన్ని మోసేవాడిని నీతి సూత్రాలు ఎందుకు పాటించలేదని నిలదీయడం అతి సులువు. ఒడ్డున నిలబడి లోతు లెక్కలు వల్లించడం మాటలతో పని. ఇక ఇరవై నాలుగ్గంటలూ హింస అనుభవిస్తున్న వారిని ‘ప్రతిఘటించొద్దు, అది నేరం’ అని చెప్పడం ఎంత అన్యాయం? పదేళ్ళు అనుమానపు భర్త చేతుల్లో హింస అనుభవించిన భార్య, ఇక సహించలేక అతన్ని కడతేరిస్తే ఆమె పైన హత్యానేరం మోపడం చట్టం…

స్త్రీల దుఃఖాన్ని రొమాంటిసైజ్ చేయలేము -POW సంధ్యతో ఓ రోజు

(రచన: రమా సుందరి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ స్పాన్సర్ షిప్ తో పంజాబ్ యూనివర్సిటీలో ఎం.టెక్ చదువుతున్న రచయిత్రి వద్దకు ‘ప్రగతిశీల మహిళా సంఘం’ అధ్యక్షురాలు సంధ్య వచ్చిన సందర్భంగా… విశేషాలు) సంధ్య వస్తుందనే సంతోషం నన్ను నిలవనీయలేదు. ఎయిర్ పోర్ట్ కు గంట ముందే వెళ్ళి కూర్చున్నాను. డిల్లీలో తెలంగాణా ధర్నా రెండు రోజులు ఉంటుందని, ముందు ఒక రోజు వచ్చి నీతో ఉంటాను అని నాకు చెప్పినప్పటి నుండి నా పరిస్థితి ఇదే.…

సి.బి.ఐ దయనీయ స్ధితి -కార్టూన్

“రాజకీయ నాయకుల నుండి సి.బి.ఐ ని విముక్తం చేయడం మా తక్షణ కర్తవ్యం” అని సుప్రీం కోర్టు నిన్న సి.బి.ఐకి తలంటుతూ వ్యాఖ్యానించింది. “రాజకీయ నాయకుల ఆదేశాలు పాటించవలసిన అవసరం మీకు లేదు” అని సుప్రీం బెంచి చెప్పాక “ఇక నుండి బుద్ధిగా నడుచుకుంటాం. బొగ్గు కుంభకోణం విచారణ పురోగతి నివేదికలన్నీ నేరుగా మీకే చూపుతాం. ప్రభుత్వానికి చూపించం” అని తలూపి కోర్టు బైటికి వచ్చిన సి.బి.ఐ అధిపతి కోర్టు ఆవరణలోనే మాట మార్చేశారు. “సి.బి.ఐ స్వతంత్ర…