చంద్రబాబు నాయుడు గారూ! గ్యాస్ బండ మోస్తే, నిరసనా?

కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా పెంచింది. పెంచడం పరోక్షంగా జరిగినా జనంపైన మాత్రం ప్రత్యక్షంగా బాదేసింది. సంవత్సరానికి కుటుంబానికి 6 సిలిండర్లు మాత్రమే సబ్సిడీ రేట్లకు ఇస్తానని చెప్పింది. తద్వారా మిగిలిన సిలిండర్లను ఓపెన్ మార్కెట్లో 750/- ధరకి కొనక తప్పని పరిస్ధితి కల్పించింది. బి.జె.పి నాయకుడు వెంకయ్య నాయుడు ప్రకారం ప్రతి కుటుంబం పైనా సంవత్సరానికి అదనంగా 750 రూపాయల భారం పడనుంది. ఈనాడు ఎడిటోరియల్ ప్రకారం ఐదుగురు ఉన్న కుటుంబానికి…

ప్రపంచ వ్యాపితంగా విస్తరించిన అమెరికా వ్యతిరేక ప్రదర్శనలు

ఇస్లాంని అవమానిస్తూ అమెరికాలో రూపొందిన సినిమాను నిరసిస్తూ ప్రపంచ వ్యాపితంగా నిరసనలు జరుగుతున్నాయి. గత మంగళవారం బెంఘాజీ (లిబియా) లో అమెరికా రాయబారిని బలి తీసుకున్న ముస్లింల ఆగ్రహ ప్రదర్శనలు ఆసియా, ఆఫ్రికాలతో పాటు యూరోపియన్ దేశాలకు కూడా విస్తరించాయి. మహమ్మద్ ప్రవక్తను ‘స్త్రీ లోలుడు’ గా హంతకులకు నాయకుడుగా చిత్రీకరించడం పట్ల చెలరేగిన నిరసన పలు చోట్ల హింసాత్మక రూపం తీసుకున్నాయి. లిబియా, ఈజిప్టులతో పాటు ట్యునీషియా, సూడాన్ లలో కూడా అమెరికా రాయబార కార్యాలయాలపై…

అచ్చమైన ప్రజలే కూడంకుళం ఉద్యమ నిర్మాతలు -ఫోటోలు

కూడంకుళం అణు కర్మాగారం వల్ల తమ భద్రతకు, జీవనోపాధికీ ప్రమాదమని స్ధానిక ప్రజలు భయపడుతున్నారు. ఫుకుషిమా అణు ప్రమాదం జరిగాక వారి భయాలు నిజమేనని వారికి రూఢి అయింది. కూడంకుళం అణు కర్మాగారానికి వ్యతిరేకంగా, గత సంవత్సరం ఆగస్టు నుండి వారు శాంతియుత నిరసన ప్రారంభించారు. కర్మాగారానికి వ్యతిరేకంగా గ్రామ సభలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపారు. నెలల తరబడి నిరాహార దీక్ష చేశారు. వారి భయాలు పోగొట్టడానికి బదులు ప్రభుత్వం వందలమంది ప్రజలపై ‘దేశ ద్రోహం’…

అణు విద్యుత్ లేకపోయినా విద్యుత్ అవసరాలు గడిచిపోతాయి -అణు శాస్త్రవేత్త

ఇది ఈనాడులో సెప్టెంబర్ 1 తేదీన వచ్చిన ఆర్టికల్. భారత దేశానికి ఆ మాటకొస్తే ప్రపంచానికయినా అణు విద్యుత్ అవసరమా అన్న సమస్యను అణు శాస్త్రవేత్త బుద్ధికోట సుబ్బారావు గారు ఇందులో చర్చించారు. అణు విద్యుత్ విషయమై భారత దేశంలో లోతైన చర్చ జరగలేదని సుబ్బారావు గారు అభిప్రాయపడ్డారు. భారీ పెట్టుబడులు అవసరమైన అణు విద్యుత్ వల్ల ఇతర ఇంధనాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడానికి నిధులు మృగ్యం అవుతాయని తెలిపారాయన. అనేక అపోహలను తయారు చేసి…