9/11 వార్షికోత్సవ దినాన లిబియాలో అమెరికా రాయబారి హత్య

ఫొటో: ది హిందూ న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట టవర్ల పై దాడులు జరిగి 11 సంవత్సరాలు పూర్తయిన రోజునే లిబియాలో అమెరికా రాయబారి చావును రుచి చూశాడు. అమెరికా రాయబార కార్యాలయాన్ని చుట్టుముట్టిన ఆందోళనకారుల్లోని ముస్లిం మత ఛాందస సలాఫిస్టు గ్రూపు కార్యకర్తలు ప్రయోగించిన రాకెట్ ప్రొపెల్లర్ గ్రేనేడ్ దాడిలో రాయబారి స్టీవెన్స్ దుర్మరణం చెందాడు. పాములకి పాలు పోసి పెంచే అమెరికా దుష్ట నీతికి స్టీవెన్స్ మరణం ఒక ప్రబల సాక్ష్యం. ఒక…

కూడంకుళం: ప్రధానికి సహాయపడితే విదేశీ నిధులు ఓ.కేనా? -అణు బోర్డు మాజీ చైర్మన్

కూడంకుళం అణు విద్యుత్ కర్మాగారం వల్ల ప్రజల భద్రతకు ప్రమాదం లేదనీ, తాము అన్నివిధాలుగా భద్రతా చర్యలు తీసుకున్నామనీ ప్రధాని మన్మోహన్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం లతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్న కబుర్లు నిజం కాదని రుజువవుతోంది. భారత అణు శక్తి నియంత్రణ బోర్డు (Atomic Energy Regulatory Board -AERB) మాజీ అధిపతి గోపాల్ కృష్ణన్ స్వయంగా ఈ విషయాన్ని బట్టబయలు చేశాడు. ఫుకుషిమా అణు ప్రమాదం దరిమిలా, కూడంకుళం అణు…

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలపై కూడంకుళం ప్రజల వీరోచిత పోరాటం

పర్యావరణంతో పాటు జీవనోపాధిని కూడా దెబ్బతీసే ‘కూడంకుళం న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టు’ (కె.ఎన్.పి.పి) కి వ్యతిరేకంగా కూడంకుళం ప్రజల పోరాటం కీలక దశకు చేరుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా అమలు చేస్తున్న అణచివేత, దుష్ప్రచారం, పోలీసు నిర్బంధాలకు ఎదురోడ్డి సామాన్య ప్రజలు వీరోచిత పోరాటం సాగిస్తున్నారు. ఉద్యమ నాయకులు ఎస్.పి.ఉదయ్ కుమార్ తదితరులను పోలీసులు పట్టుకెళ్లకుండా నిరంతరం కాపలా కాస్తున్నారు. పోలీసుల తప్పుడు కేసుల్లో నిజాయితీ నిరూపించుకోవడానికి అరెస్టు అవుతానని ఎస్.పి.ఉదయ్ కుమార్ తదితరులు ప్రకటించినప్పటికీ…

పన్నులు ఎగవేయడానికి పౌరసత్వం త్యజించనున్న ఫ్రాన్సు సంపన్నుడు!

బెర్నార్డ్ ఆర్నాల్ట్. ఫ్రాన్సులో అత్యంత సంపన్నుడు. 41 బిలియన్ యూరోల (52.33 బిలియన్ డాలర్లు, 2.9 లక్షల కోట్ల రూపాయలు) ఆస్తులతో ప్రపంచంలోనే నాలుగో స్ధానంలో ఉన్న కుబేరుడు. ఈయనకి అర్జెంటుగా ఓ సమస్య వచ్చి పడింది. ఫ్రాన్సు నూతన అధ్యక్షుడు హాలండే, సూపర్ ధనవంతుల ఆదాయాలపైన 75 శాతం పన్ను వేయనున్నట్లు ప్రకటించడమే ఈయన సమస్య. అధ్యక్షుడు హాలండే, సంవత్సరానికి 1 మిలియన్ యూరోల కు మించి ఆదాయం పొందుతున్నవారిపై 75 శాతం పన్ను వేస్తానని…