ఈశాన్య వలసలతో మండుతున్న దేశం, పట్టని ప్రభుత్వాలు -విశ్లేషణ
దాదాపు దేశంలోని అన్నీ ప్రాంతాల నుండీ ఈశాన్యీయులు పెద్ద సంఖ్యలో ఇళ్లకు తిరిగి వెళుతున్నా కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాల నుండి చర్యలు కరువయ్యాయి. ‘మీకేం భయం లేదు, ఉన్న చోటనే ఉండండి’ అంటూ ప్రభుత్వాలు ఇస్తున్న నోటి మాటల వాగ్దానాలు వారిలో ధైర్య, స్ధైర్యాలను నింపలేకపోతున్నాయి. అక్కడక్కడా పారామిలిటరీ బలగాల చేత ఒకటి రెండు సార్లు కవాతు చేయించినా, రాష్ట్రాల హోమ్ మంత్రులు పత్రికల్లో, చానెళ్లలో కనబడి హామీలు గుప్పిస్తున్నా ఈశాన్య రాష్ట్రాల ప్రజలు తమ తమ…
