నేనే జులియన్! అంతర్జాతీయ యోధుడి కోసం బ్రిటిషర్ల నిరసనలు -ఫోటోలు

మహా మహులుగా, తలపండిన రాజకీయ పోరాట యోధులుగా, వ్యవస్ధలను నడిపించే దేశ నాయకులుగా, ఆర్ధిక చిక్కుల పరిష్కర్తలుగా ఫోజులు కొట్టే దేశ దేశాల నాయకమ్మన్యులు సైతం అమెరికా ధూర్త రాజ్యం ముందు సాగిలపడి సలాములు కొడుతున్న పాడు కాలం ఇది. సమస్త భూగోళాన్ని క్షణమాత్రంలో భస్మీ పటలం చేసే అణ్వస్త్ర శస్త్రాల బలిమితో విరగబడుతున్న అంకుల్ శామ్ దేశ దేశాల్లో సాగించిన రహస్య వికృత క్రీడలని, ‘వికీలీక్స్’ ద్వారా ప్రపంచ ప్రజల ముందు ఆరబోసిన డిజిటల్ యోధుడికి…

ఈక్వడార్ ధిక్కారం, బ్రిటన్ బెదిరింపుల మధ్య అస్సాంజ్ కి రాజకీయ ఆశ్రయం మంజూరు

దక్షిణ అమెరికా దేశం ‘ఈక్వడార్’ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. బ్రిటన్ బెదిరింపులను ఎడమ కాలితో తన్నేస్తూ ‘జూలియన్ అస్సాంజ్’ కు ‘రాజకీయ ఆశ్రయం’ ఇస్తున్నట్లు ప్రకటించింది. స్వీడన్ లో తప్పుడు కేసులు ఎదుర్కొంటున్న జూలియన్ అస్సాంజ్ ను స్వీడన్ కూ, అక్కడి నుండి అమెరికాకు తరలించాలని అమెరికా, యూరప్ దేశాలు పన్నిన కుట్రను భగ్నం చేసే కృషిలో తన వంతు సహకారం అందించడానికి ముందుకు వచ్చింది. గొప్ప ప్రజాస్వామ్య దేశాలం అంటూ తమ జబ్బలు తామే చరుచుకునే…