ఫ్రాన్స్ లో లండన్ తరహా అల్లర్లు, ఆర్ధిక సామాజిక సమస్యలే కారణం

డజన్ల కొద్దీ  యువకులు రోడ్లపైకి వచ్చి రోజంతా లూటీలకూ, దహనాలకూ పాల్పడిన ఘటన ఫ్రాన్సులో చోటు చేసుకుంది. ఉత్తర ఫ్రాన్సులోని అమీన్స్ పట్టణంలో జరిగిన ఈ అల్లర్లలో 16 మంది పోలీసు అధికారులు గాయపడ్డారని పోలీసులు చెప్పగా ప్రజలు ఎంతమంది గాయపడిందీ ఏ పత్రికా చెప్పలేదు. సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయిన అల్లర్లు అదనపు బలగాల రాకతో మగళవారం తెల్లవారు ఝాము 4 గంటలకు ముగిశాయని ఎ.పి తో పాటు ఇతర వార్తా సంస్ధలు తెలిపాయి.…

పశ్చిమాసియాలో అనూహ్య పరిణామం, చర్చలకు సౌదీ చేరిన ఇరాన్ అధ్యక్షుడు

ఆయిల్ నిల్వలతో సుసంపన్నమైన పశ్చిమాసియా (మధ్య ప్రాచ్యం) ప్రాంతంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఉన్నత స్ధాయి బృందంతో సహా ఇరాన్ అధ్యక్షుడు మహ్మౌద్ అహ్మది నెజాద్ చర్చల నిమిత్తం సౌదీ అరేబియా చేరుకున్నాడు. సౌదీ రాజు ‘అబ్దుల్లా బిన్ అబ్దులాజీజ్’ వ్యక్తిగతంగా అహ్మదీ నెజాద్ ను ఆహ్వానించడం మరో ముఖ్య పరిణామం. అహ్మది నెజాద్ తో సమావేశానికి సౌదీ అరేబియా ఎంతటి ప్రాముఖ్యత ఇస్తున్నదీ ఈ అంశం తెలియజేస్తోంది. సౌదీ అరేబియా, కతార్, టర్కీ ల…