కుదంకుళం: అణు పరిహార చట్ట ఉల్లంఘనకు అణు విద్యుత్ శాఖ ప్రయత్నాలు?
కుదంకుళం అణు కర్మాగారం పట్ల స్ధానిక ప్రజల భయాలు ఎంత నిజమో తెలిసి వస్తోంది. విదేశీ అణు కంపెనీల ప్రయోజనాలే తప్ప భారత ప్రజల ప్రయోజనాలకు ప్రభుత్వంలో విలువలేదని తెలిపే సంఘటన వెల్లడయింది. 2010 లో భారత ప్రభుత్వం చేసిన ‘అణు ప్రమాద పరిహార’ చట్టంలోని సెక్షన్ 17 ప్రకారం సరైన అణు పరికరాలను సరఫరా చేయకపోవడం వల్ల ఏర్పడే అణు ప్రమాదాలకు నష్టపరిహారాన్ని పరికరాల సరఫరాదారు కంపెనీలు కూడా భరించవలసి ఉంటుంది. తమిళనాడులోని కుదంకుళంలో రష్యా…
