జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ

ముఖ్యమైన జాతీయ, అంతర్జాతీయ ఆర్ధిక, రాజకీయ వార్తా విశేషాలు

ఇండియన్ హై వే: చైనాలో భారత కళా ప్రదర్శన -ఫోటోలు

“ఇండియన్ హై వే” పేరుతో 2008 నుండి ప్రపంచ వ్యాపితంగా వివిధ నగరాల్లో కళా ప్రదర్శనలు జరుగుతున్నాయి. లండన్ (2008), ల్యోన్ (ఫ్రాన్స్, 2011), రోమ్ (2011) లలో ప్రదర్శనలు పూర్తయిన అనంతరం చైనాలోని బీజింగ్ లో ప్రస్తుతం నిర్వహించబడుతోంది. చైనాకు చెందిన ‘కాఫా’ (Central Academy of Fine Arts) వెబ్ సైట్ (ఫొటోలు అక్కడివే) ప్రకారం ‘ఆర్ధిక విజృంభణ (economic boom) ఫలితంగా సంభవిస్తున్న సామాజిక, భౌతిక, రాజకీయ ఉద్యమ వ్యాఖ్యానం మరియు విశ్లేషణ’ ను ఈ ఎగ్జిబిషన్ ప్రతిబింబిస్తోంది. ‘ఇండియన్ హై వే’ అన్న టైటిల్ అర్ధం ‘ఇన్ఫర్మేషన్ సూపర్ హై వే’ అని కాఫా తెలిపింది.  భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం చైనా ప్రేక్షకులకు ప్రజాస్వామ్య భారత దేశంలోని ప్రజాస్వామిక అభిప్రాయాల వైవిధ్యం గురించి తెలియజేయడానికి ఈ ప్రదర్శనను ఉద్దేశించారు.

భారత దేశంలోని గొప్ప సృజనాత్మక కళా ద్రష్టలు ముప్ఫై మంది వరకు ఈ ప్రదర్శనలో తమ కళను ప్రదర్శించారట. శిల్పం, వీడియో, ప్రతిష్టాపన (ఇన్‌స్టలేషన్), పెయింటింగ్ మరియు అభినయం (పెర్ఫార్మెన్స్) లు ఈ కళా ప్రదర్శనలో ఉంచారు. సమకాలీన భారతీయ పరిస్ధితులకు సంబంధించిన సామాజిక, రాజకీయ అంశాలతో పాటు ఎన్విరాన్మెంటలిజమ్, రెలిజియస్ సెక్టేరియనిజం, జెండర్, సెక్సువాలిటీ, వర్గం (క్లాస్) మున్నగు అంశాలను ఎగ్జిబిషన్ సృజించిందట. ‘అట’ అనడం ఎందుకంటే ఈ కళాకృతులు ఒకపట్టాన అర్ధం కాలేదు గనక. చైనాలో భారతీయ కళా ప్రదర్శన జరుగుతున్నదని చెప్పడానికీ, పొరుగు దేశాల మధ్య కళా సంబంధాలు పెంపొందడానికి కృషి జరుగుతోందని చెప్పడానికీ ఈ పోస్టు ఉద్దేశించబడింది. దానితో పాటు భారతీయ ఆధునిక కళ పేరుతో విదేశాలలో ప్రదర్శితమవుతున్న కళ, కళాకృతులు ఎలా ఉన్నాయో  సమాచారం ఇవ్వడం కూడా ఈ పోస్ట్ ఉద్దేశ్యం. ఇందులోని కళాకృతులు గానీ ఇతర ప్రదర్శితాలు గాని పాఠకులకు ఎవరికైనా అర్ధం అయితే తమ వ్యాఖ్యలలో వివరించినవారికి అడ్వాన్స్ కృతజ్ఞతలు.

About these ads

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Connecting to %s

మార్గదర్శిని

తెలుగులో వ్యాఖ్యలు రాయాలా?

తెలుగులో వ్యాఖ్య రాయడానికి ఈ కింద లింక్ క్లిక్ చేయండి.

lekhini.org.

వ్యాఖ్యాతలు – వ్యాఖ్యానాలు

Manohar on మాయావతి (బి.ఎస్.పి) ప్రయాణం…
Manohar on మాయావతి (బి.ఎస్.పి) ప్రయాణం…
విశేఖర్ on మాయావతి (బి.ఎస్.పి) ప్రయాణం…
చందుతులసి on మాయావతి (బి.ఎస్.పి) ప్రయాణం…
apnewscorner on మాయావతి (బి.ఎస్.పి) ప్రయాణం…
విశేఖర్ on రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన…
suresh on రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన…
suresh on రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన…
sai bhargav on రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన…
విశేఖర్ on రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన…
Nivas on రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన…
mohan on ఇజ్రాయెల్ జాత్యహంకారానికి దర్ప…
Thirupalu on రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన…
విశేఖర్ on విదేశీ ఇన్వెస్టర్లకు ప్రభుత్వ…
విశేఖర్ on రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన…

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

మరో 547గురు చందాదార్లతో చేరండి

కూడలి

కేటగిరీలు

బ్లాగ్ గణాంకాలు

  • 399,851 సార్లు

క్యాలెండరు

జూలై 2012
సో మం బు గు శు
« జూన్   ఆగ »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

బ్లాగ్మిత్రులు

అనుసరించు

Get every new post delivered to your Inbox.

మరో 547గురు చందాదార్లతో చేరండి

%d bloggers like this: