జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ

ముఖ్యమైన జాతీయ, అంతర్జాతీయ ఆర్ధిక, రాజకీయ వార్తా విశేషాలు

కర్ణాటకలో తెగిపడిన మరో తల -కార్టూన్

తమది భిన్నమైన పార్టీ (party with a difference) గా బి.జె.పి చెప్పుకుంటుంది. ఆచరణలో మాత్రం అంతేలేని విభేదాల పార్టీగా (party with unending differences) అనేకసార్లు రుజువు చేసుకుంది. బి.ఎస్.యెడ్యూరప్ప ఆశీస్సులతో సదానంద గౌడ కర్ణాటక ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన పదకొండు నెలలకే అదే యెడ్యూరప్ప ఆగ్రహానికి గురై పదవి కోల్పోవడం అందుకు నిదర్శనం. సదానంద గౌడ పదవీ ప్రమాణ స్వీకారోత్సవాన్ని 45 మంది ఎం.ఎల్.ఎ లతో సహా ఎగ్గొట్టిన జగదీష్ షెట్టర్,  యెడ్యూరప్ప అనుగ్రహం సంపాదించి దూరమైన పదవిని చేజిక్కించుకోగలిగాడు. మరో 11 నెలలు మాత్రమే మిగిలి ఉన్న సి.ఎం పదవి కోసం మరొక బి.జె.పి తల తెగిపడింది.

అధిష్టానానికీ యెడ్యూరప్పకీ మధ్య కుదరని సయోధ్య; పదకొండు నెలలకే చెడిన సదానంద, యెడ్యూరప్పల సయోధ్య; పదకొండు నెలల్లో బాగుపడిన షట్టర్, యెడ్యూరప్పల అవగాహన… ఇన్ని విభేదాల ముందు బి.జె.పి ‘అవినీతి వ్యతిరేక ఫోజు’ వెల వెల బోయింది. అవినీతి ఆరోపణలతో పదవికి దూరమైన యెడ్యూరప్ప ఇప్పటికీ కర్ణాటక బి.జె.పిని శాసిస్తున్నపుడు బి.జె.పి ఇక అవినీతి గురించి మాట్లాడకపోవడమే ఉత్తమం.  అందుబాటులోకి వస్తుందో లేదో తెలియని ప్రధాని పీఠం కోసం అగ్రనాయకుల విభేదాలు కొనసాగుతుండగా గుజరాత్ లో మోడి ని ఓడించడానికి బి.జె.పి మాజీ ముఖ్యమంత్రులు ఇప్పటికే ఉమ్మడి ప్రచారం ప్రారంభించారు. ‘మీ ప్రధాని ఎవరు?’ అని ఒకప్పుడు కాంగ్రెస్ ని ప్రశ్నించిన బి.జె.పి ఇప్పుడు అదే ప్రశ్నకు జవాబు చెప్పలేని స్ధితిలో పడిపోయింది.

-

About these ads

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Connecting to %s

తెలుగులో వ్యాఖ్యలు రాయాలా?

తెలుగులో వ్యాఖ్య రాయడానికి ఈ కింద లింక్ క్లిక్ చేయండి.

lekhini.org.

వ్యాఖ్యాతలు – వ్యాఖ్యానాలు

విశేఖర్ on రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన…
Nivas on రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన…
mohan on ఇజ్రాయెల్ జాత్యహంకారానికి దర్ప…
Thirupalu on రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన…
విశేఖర్ on విదేశీ ఇన్వెస్టర్లకు ప్రభుత్వ…
విశేఖర్ on రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన…
prem on విదేశీ ఇన్వెస్టర్లకు ప్రభుత్వ…
Nivas on రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన…
Thirupalu on విదేశీ ఇన్వెస్టర్లకు ప్రభుత్వ…
విశేఖర్ on విదేశీ ఇన్వెస్టర్లకు ప్రభుత్వ…
Thirupalu on విదేశీ ఇన్వెస్టర్లకు ప్రభుత్వ…
prem on విదేశీ ఇన్వెస్టర్లకు ప్రభుత్వ…
prem on ద్రవ్యోల్బణం తగ్గెను, వడ్డీ రే…
suresh on అవినీతిని సహించరట! -కార్ట…
విశేఖర్ on అవినీతిని సహించరట! -కార్ట…

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

మరో 546గురు చందాదార్లతో చేరండి

కూడలి

కేటగిరీలు

బ్లాగ్ గణాంకాలు

  • 398,543 సార్లు

క్యాలెండరు

జూలై 2012
సో మం బు గు శు
« జూన్   ఆగ »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

బ్లాగ్మిత్రులు

అనుసరించు

Get every new post delivered to your Inbox.

మరో 546గురు చందాదార్లతో చేరండి

%d bloggers like this: