ఇంటర్నెట్ రేట్లు: కంపెనీలను వదిలి వినియోగదారులపై బాదుడు -కార్టూన్

కంపెనీలను ఏమీ చేయలేక సాధారణ వినియోగదారులకు ఇంటర్నెట్ ఛార్జీలు పెంచిన వైనం ఇది. బడా ఐ.ఎస్.పి (ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్) కంపెనీలకు అనేక లైసెన్సులు ఉంటాయి. ప్రభుత్వం, ఐ.ఎస్.పి ల ఒప్పందం ప్రకారం రెవిన్యూను పరస్పరం పంచుకోవాలి. డిఫరెన్షియల్ రెవిన్యూ షేరింగ్ గా పిలిచే ఈ పద్ధతి ప్రకారం పిండి కొద్దీ రొట్టె ముక్కను ప్రభుత్వానికి కంపెనీలు ఇవ్వాలి. ప్రభుత్వ వాటా వివిధ స్ధాయిల లైసెన్సులను బట్టి ఉంటుంది. కొన్ని లైసెన్సుల కింద వచ్చే ఆదాయంలో 6…

మాయావతి అవినీతి కేసు కొట్టివేత, సి.బి.ఐ అతి చేసిందని సుప్రీం వ్యాఖ్య

ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి పై సి.బి.ఐ దాఖలు చేసిన అవినీతి కేసును సుప్రీం కోర్టు కొట్టివేసింది. కోర్టు నుండి నిర్దిష్ట ఆదేశాలు లేకుండానే సి.బి.ఐ తనంతట తాను మాయావతి కోసమే ప్రత్యేకంగా ఎఫ్.ఐ.ఆర్ రిజిస్టర్ చేయడాన్ని తప్పు పట్టింది. తాజ్ కారిడార్ అవినీతి కేసులో అధికారుల అవినీతిని విచారించాలని కోర్టు చెపితే దాన్ని వదిలి మాయావతి పై ప్రత్యేకంగా కేసు పెట్టడం ఏమిటని ప్రశ్నించింది. సి.బి.ఐ తన అధికార పరిధిని అతిక్రమించి మాయావతి పై…

అణు కర్మాగారం తెరవడాన్ని వ్యతిరేకిస్తూ జపనీయుల ప్రదర్శనలు -ఫొటోలు

జపాన్ ప్రభుత్వం అణు కంపెనీల లాబీ తెచ్చిన తీవ్ర ఒత్తిడికి లొంగిపోయింది. రెండు నెలల పాటు అణు విద్యుత్ అనేదే లేకుండా గడిపగలిగినప్పటికీ ప్రజల ప్రయోజనాల కంటె అణు కంపెనీల ప్రయోజనానే ముఖ్యమని భావించింది. ఫుకుయి లో ‘కాన్సాయ్ ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ’ కి చెందిన ‘ఒయి న్యూక్లియర్ పవర్ ప్లాంటు’ ను ఆదివారం తిరిగి తెరిచింది. తద్వారా ఫుకుషిమా ప్రమాదం తర్వాత కూడా పాఠాలు నేర్చుకోవడానికి తిరస్కరించింది. సంవత్సర కాలంగా జపాన్ ప్రజల నిరసనలను బేఖాతరు…