జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ

ముఖ్యమైన జాతీయ, అంతర్జాతీయ ఆర్ధిక, రాజకీయ వార్తా విశేషాలు

రాజకీయులను విమర్శించనిది ఇక ఎన్.సి.ఇ.ఆర్.టి పుస్తకాలే -కార్టూన్

అంబేద్కర్ కార్టూన్ పై రేగిన ‘అప్రజాస్వామిక రగడ’ చివరికి ఎన్.సి.ఇ.ఆర్.టి పాఠ్య పుస్తకాలనుండి కార్టూన్ లనూ, వివిధ పాఠ్య భాగాలనూ పూర్తిగా తొలగించాలనే దగ్గర తేలింది. ప్రభుత్వం నియమించిన ‘ఎస్.కె.ధోరట్’ ప్యానెల్ చర్చలు చేసి రాజకీయ శాస్త్ర పాఠ్య పుస్తకాల నుంది అనేక కార్టూన్ లను, పాఠ్య భాగాలనూ తొలగించాలని మెజారిటీ నిర్ణయం చేసింది. ఈ నిర్ణయాన్ని పలువురు స్కాలర్లు నిరసిస్తున్నారు. ప్రఖ్యాత చరిత్రకారుడు, జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ అయిన కె.ఎన్.ఫణిక్కర్ ప్యానెల్ నిర్ణయాన్ని ‘అత్యంత దురదృష్టకరం’ అని అభివర్ణించాడు. విద్యా నిపుణులు అనేక సంవత్సరాల పాటు సాగించిన అద్భుతమైన కృషి విద్యార్ధులకు ఇంక అందుబాటులో ఉండదని వ్యాఖ్యానించాడు.

భారత దేశం లాంటి వైవిధ్య పూరితమైన ‘మల్టిపుల్ సెన్సిటివిటీస్’  ఉన్న చోట ప్రత్యామ్నాయ అవగాహనకు ఎల్లప్పుడూ అవకాశం ఉంటుందనీ, సరిగ్గా ఆ కారణం వల్లనే వివిధ పాఠ్యాంశాలు, అవగాహనలు, వ్యాఖ్యానాలు విద్యార్ధులకు అందాల్సి ఉంటుందనీ ఫణిక్కర్ వ్యాఖ్యానించాడు. కమిటీ మాత్రం అందుకు విరుద్ధంగా విద్యేతర వాదనతో వేరే నిర్ణయం తీసుకుందని అన్నాడు. మద్దతు కోల్పోతామన్న భయంతో విద్యేతర ధోరణులకు రాజకీయులు గురికావడం జరుగుతోందనీ, అకడమీషియన్లకు ఆ పరిమితులు ఉండవనీ, విద్యార్ధులకు కావలసింది కూడా పరిమితులు లేకపోవడమేననీ ఫణిక్కర్ వ్యాఖ్యానించాడు.

ఏ రంగంలో తీసుకున్నప్పటికీ ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా పోయే రాజకీయ నాయకులపై విమర్శలు సర్వసాధారణం. ప్రజాస్వామిక వ్యవస్ధలకు రాజకీయ విమర్శ ప్రాణావసరం. అలాంటి విమర్శ లేని రాజకీయ శాస్త్ర పుస్తకాలు విద్యార్ధులకు బదులు రాజకీయ నాయకులకు ఇష్టంగా మారడం ఓ అభాస.

-

“ఎన్.సి.ఇ.ఆర్.టి పాఠ్య పుస్తకాలను మోసుకెళ్లడం అంటే ఆయనకి ప్రేమ. ఎందుకంటే ఆయనపై విమర్శలు లేని చోటు అదొక్కటే మరి.”

-

About these ads

One Comment on “రాజకీయులను విమర్శించనిది ఇక ఎన్.సి.ఇ.ఆర్.టి పుస్తకాలే -కార్టూన్

  1. ashok
    జూలై 05, 2012

    చివరికి ఇలా తయారు అయ్యాం. దీనిని వ్యతిరేకించక తప్పదు. ప్రస్తుతం వ్యతిరేకించి కూడా చేసేదేమీ లేదేమో.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Connecting to %s

సమాచారం

This entry was posted on జూలై 05, 2012 by in కార్టూన్లు, రాజకీయాలు and tagged , .

మార్గదర్శిని

తెలుగులో వ్యాఖ్యలు రాయాలా?

తెలుగులో వ్యాఖ్య రాయడానికి ఈ కింద లింక్ క్లిక్ చేయండి.

lekhini.org.

వ్యాఖ్యాతలు – వ్యాఖ్యానాలు

rakesh on అవినీతిని సహించరట! -కార్ట…
Sri on పిల్ల ఫిక్సింగ్ ముఠా అణచివేతలో…
Sudhakar on అత్యాచార నేరం: రెండు వేళ్ళ పరీ…
విశేఖర్ on అత్యాచార నేరం: రెండు వేళ్ళ పరీ…
Sudhakar on అత్యాచార నేరం: రెండు వేళ్ళ పరీ…
విశేఖర్ on అత్యాచార నేరం: రెండు వేళ్ళ పరీ…
Sudhakar on అత్యాచార నేరం: రెండు వేళ్ళ పరీ…
చందుతులసి on కరుగుతున్న ఆర్కిటిక్, చమురు సం…
Thirupalu on అత్యాచార నేరం: రెండు వేళ్ళ పరీ…
Pardhasaradhi Vutuku… on అత్యాచార నేరం: రెండు వేళ్ళ పరీ…
చందుతులసి on అవినీతిని సహించరట! -కార్ట…
Thirupalu on క్రికెట్ ధన యజ్ఞంలో సమిధలు…
విశేఖర్ on సి.బి.ఐ అటానమీ -కార్టూన్
prem on సి.బి.ఐ అటానమీ -కార్టూన్
విశేఖర్ on సి.బి.ఐ అటానమీ -కార్టూన్

భాండారం

కూడలి

కేటగిరీలు

పదకోశము

document.tamilcube.term.focus();

English to Telugu Dictionary
Powered by Tamilcube.com

బ్లాగ్ గణాంకాలు

  • 395,475 సార్లు

క్యాలెండరు

జూలై 2012
సో మం బు గు శు
« జూన్   ఆగ »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

మరో 542గురు చందాదార్లతో చేరండి

బ్లాగ్మిత్రులు

అనుసరించు

Get every new post delivered to your Inbox.

మరో 542గురు చందాదార్లతో చేరండి

%d bloggers like this: