బ్యాంకులు కంపెనీల కోసం ఇ.సి.బి ఉదారం, వడ్డీ రేటు 0.75% కి తగ్గింపు

ప్రపంచ ఆర్ధిక సంక్షోభానికి కారకులయిన బహుళ జాతి వాల్ స్ట్రీట్ బ్యాంకులు, కంపెనీల కోసం యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు (ఇ.సి.బి) మరోసారి యధా శక్తి ఉదారతను ప్రదర్శించింది. ఇప్పటికే హీన స్ధాయిలో 1 శాతం వడ్డీ రేటును 0.25 శాతం తగ్గించి 0.75 శాతానికి చేర్చింది. 2007 ఆర్ధిక సంక్షోభం నుండి అత్యంత తక్కువ స్ధాయి 0.25 శాతం వద్ద వడ్డీ రేటు కొనసాగిస్తున్న అమెరికన్ సెంట్రల్ బ్యాంకు ‘ఫెడరల్ రిజర్వ్’ కంటే ఇది కేవలం అర…

ఫుకుషిమా విపత్తు మానవ తప్పిదమే -జపాన్ పార్లమెంటరీ కమిటీ

జపాన్ ప్రభుత్వం, న్యూక్లియర్ కంపెనీ ‘టెప్కో’ లే ఫుకుషిమా అణు ప్రమాదానికి కారకులని జపాన్ పార్లమెంటరీ కమిటీ తేల్చి చెప్పింది. ఫుకుషిమా అణు కర్మాగారం ప్రమాదానికి గురికావదానికి సునామీ ఒక్కటే కారణం కాదనీ అది వాస్తవానికి మానవ నిర్మిత వినాశనమని కమిటీ స్పష్టం చేసింది. జపాన్ పార్లమెంటు ‘డైట్’ (Diet) నియమించిన ‘ఫుకుషిమా న్యూక్లియర్ యాక్సిడెంట్ ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ కమిషన్’, తన అంతిమ నివేదికలో ఈ వాస్తవాన్ని వెల్లడించింది. ఏ ఒక్క వ్యక్తీ దీనికి కారణం కాదనీ,…

రాజకీయులను విమర్శించనిది ఇక ఎన్.సి.ఇ.ఆర్.టి పుస్తకాలే -కార్టూన్

అంబేద్కర్ కార్టూన్ పై రేగిన ‘అప్రజాస్వామిక రగడ’ చివరికి ఎన్.సి.ఇ.ఆర్.టి పాఠ్య పుస్తకాలనుండి కార్టూన్ లనూ, వివిధ పాఠ్య భాగాలనూ పూర్తిగా తొలగించాలనే దగ్గర తేలింది. ప్రభుత్వం నియమించిన ‘ఎస్.కె.ధోరట్’ ప్యానెల్ చర్చలు చేసి రాజకీయ శాస్త్ర పాఠ్య పుస్తకాల నుంది అనేక కార్టూన్ లను, పాఠ్య భాగాలనూ తొలగించాలని మెజారిటీ నిర్ణయం చేసింది. ఈ నిర్ణయాన్ని పలువురు స్కాలర్లు నిరసిస్తున్నారు. ప్రఖ్యాత చరిత్రకారుడు, జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ అయిన కె.ఎన్.ఫణిక్కర్ ప్యానెల్…