బ్యాంక్సీ వీధి చిత్రాలు… కాదు, కాదు, పెయింటింగ్స్ -ఫొటోలు

బ్యాంక్సీ, వీధి చిత్రాలకు చిరునామా అని పాఠకులకు తెలిసిన విషయమే. కులీన వర్గాల ‘అధారిటేరినియనిజం’ పై చాచి కొట్టేలా ఉండే బ్యాంక్సీ వీధి చిత్రాలకు ప్రపంచ వ్యాపితంగా, ముఖ్యంగా పశ్చిమ దేశాల్లో, లెక్కకు మిక్కిలిగా అభిమానులు ఏర్పడ్డారు. ఈ టపాలో ఇస్తున్నవి బ్యాంక్సీ వీధి చిత్రాలు కావు గానీ, వాటికి ఏ మాత్రం తగ్గనివి. కాసిన్ని గీతల్లో, స్టెన్సిల్ టెక్నిక్ తో అధికార మదానికి  బ్యాంక్సీ ఇచ్చే షాక్ ట్రీట్ మెంట్, అపహాస్యం, సునిశిత విమర్శ ఈ…

పశ్చిమ ఆంక్షలకు ఇరాన్ ప్రతిఘటన, ‘హోర్ముజ్’ లో ఆయిల్ రవాణా నిలిపివేతకు చర్యలు

అమెరికా, యూరోపియన్ యూనియన్ లు ఇరాన్ పై విధించిన ఆయిల్ ఆంక్షలు జులై 3 నుండి అమలులోకి రావడంతో ఇరాన్ ప్రతిఘటన చర్యలను ప్రారంభించింది. ప్రపంచంలోని ఆయిల్ రవాణాలో 20 శాతం రవాణా అయ్యే ‘హోర్ముజ్ ద్వీపకల్పం’ వద్ద పశ్చిమ దేశాల అంతర్జాతీయ ఆయిల్ రవాణా ట్యాంకర్లు వెళ్లకుండా నిరోధించడానికి చర్యలు చేపట్టింది. ఆయిల్ ట్యాంకర్లను అడ్డుకోవడానికి వీలుగా ఇరాన్ పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టారు. దీనితో ప్రపంచవ్యాపితంగా క్రూడాయిల్ ధరలు మళ్ళీ కొండెక్కనున్నాయని విశ్లేషణలు ఊపందుకున్నాయి. ఇరాన్…