స్పోర్ట్స్ లో పురుష దురహంకారం స్పష్టంగా ఉంది -దీపిక

ఆటల్లో పురుష దురహంకారం స్పష్టంగా కొనసాగుతోందని ఆసియన్ సీనియర్ స్క్వాష్ ఛాంపియన్ షిప్ సాధించిన దీపిక పల్లికల్ అభిప్రాయపడింది. సానియా మీర్జా, జ్వాలా గుత్తా ల అభిప్రాయాలకు దీపిక మద్దతు పలికింది. లండన్ ఒలింపిక్స్ లో పురుషుల టీం ఎంపికలో పురుష ఆటగాళ్ళ మధ్య తలెత్తిన వివాదాన్ని ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ (ఎ.ఐ.టి.ఎ) పరిష్కరించిన తీరు పట్ల సానియా తీవ్ర అసంతృప్తి ప్రకటించిన సంగతి విదితమే. సానియా మీర్జా అసంతృప్తికి జ్వాలా గుత్తా మద్దతు ప్రకటించిన…

టర్కీ విమానం కూల్చింది సిరియాలోనే, అందుకు రుజువులున్నాయ్ -రష్యా

టర్కీ గూఢచార విమానాన్ని కూల్చింది సిరియా గగనతలంలోనేననీ అందుకు తమ వద్ద ‘తటస్ధ రుజువు’ (ఆబ్జెక్టివ్ ప్రూఫ్) ఉందనీ రష్యా మిలిటరీ వర్గాలు ప్రకటించాయి. అంతర్జాతీయ గగన తలంలో ఉండగా తమ విమానాన్ని సిరియా కూల్చివేసిందని టర్కీ ఆరోపిస్తోంది. టర్కీకి యుద్ధ విమానం ఎఫ్-4 పయనించిన మార్గానికి సంబంధించిన వస్తుగత సమాచారం (ఆబ్జెక్టివ్ డేటా) రష్యా ఆధీనంలో ఉన్నట్లు ‘ఇంటర్ ఫాక్స్ న్యూస్ ఏజన్సీ’ ని ఉటంకిస్తూ ‘ది హిందూ’ తెలిపింది. టర్కీ విమానం కూల్చివేతను అడ్డు…

బి.జె.పి ఆట ఎవరితో? -కార్టూన్

కర్ణాటకలో సంక్షోభం ముదిరి పాకాన పడుతోందని పత్రికలు, ఛానెళ్ళు ఘోషిస్తున్నాయి. అవినీతి ఆరోపణలతో రాజీనామా చేయవలసి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప రెట్టించిన బలంతో పార్టీ అధిష్టానాన్ని ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఇతర పార్టీలకంటే ‘విభిన్నమైనది’ గా చెప్పుకున్న ఆ పార్టీ క్రమంగా ‘విభేధాలకు నిలయం’ గా మారిపోయింది. అవినీతి ఆరోపణలకు గురయిన నాయకుడు నలుగురికీ ముఖం చూపించడానికి సిగ్గుపడడానికి బదులు ప్రజల ముందు ధీమాగా తిరుగుతూ వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. ఫలితంగా బి.జె.పి ప్రత్యర్ధి పార్టీలతో తలపడడానికి…