జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ

ముఖ్యమైన జాతీయ, అంతర్జాతీయ ఆర్ధిక, రాజకీయ వార్తా విశేషాలు

పెను విధ్వంసాన్ని చేతివేళ్ల కింద నిలిపిన యుద్ధోన్మాదులు -కార్టూన్

మానవ సమాజాన్ని శాసిస్తున్నది ఒక విధంగా యుద్ధాలే. శ్రామిక, దోపిడీ వర్గాల వైరుధ్యాలే మానవ సమాజ అభివృద్ధితో పాటు విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయన్నది నిజం. వైరుధ్యం అనే నాణేనికి ఒక వైపు అభివృద్ధి ఉంటే మరో వైపు విధ్వంసం ఉంటోంది. వైరుధ్యం వివిధ రూపాల్లోకి (బానిస, యజమానుల వైరుధ్యం; రైతు, భూస్వాముల వైరుధ్యం; కార్మికుడు, పెట్టుబడిదారుల వైరుధ్యం, మనిషి, ప్రకృతి వైరుధ్యం) మారేకొద్దీ అభివృద్ధీ, విధ్వంసం కూడా తమ రూపాల్ని మార్చుకుంటూ వస్తున్నాయి. విధ్వంసం అంటే యుద్ధమే అని గ్రహిస్తే దాని అభివృద్ధి రూపాలను ‘ది ఎకనమిస్ట్’ అందించిన ఈ కార్టూన్ చక్కగా ప్రతిబింబిస్తోంది.

రాతి ఆయుధాలతో ప్రకృతితో పోరాటం ప్రారంభించిన మానవుడు, తమలో తాము వైరుధ్యాన్ని రగుల్చుకుని ప్రకృతిని ధ్వంసిస్తూ స్వయం విధ్వంసానికి కూడా తెగించాడు. ఫలితంగా వేలాది అంతర్యుద్ధాలు, స్వజాతి దోపిడీలు, విజాతి హననాలు, అణచివేతలు, జైత్రయాత్రలు సాగిస్తూ అనేక దశల మీదుగా మొరటు రాతి ఆయుధాన్ని చేతి వేళ్లలో ఒదిగిపోయే నాజూకు ఎలక్ట్రానిక్ మీట స్ధాయికి అభివృద్ధి చేసుకున్నాడు. తద్వారా పెన్ను విధ్వంసాన్ని రెప్పపాటులో సృష్టించగల మీటల్ని, కంప్యూటర్ కీల ని సిద్ధం చేసుకున్నాడు. ప్రకృతితో ప్రారంభించిన పోరాటాన్ని అంతర్గత వైరుధ్యాలను ఉపశపింపజేసుకుని తిరిగి ఉన్నత స్ధాయిలో ప్రారంభించవలసిన కర్తవ్యం ఇంకా మిగిలే ఉంది.

-

-

About these ads

2 Comments on “పెను విధ్వంసాన్ని చేతివేళ్ల కింద నిలిపిన యుద్ధోన్మాదులు -కార్టూన్

  1. Venu Ch
    జూలై 01, 2012

    కార్టూన్ చాలా బాగుంది. యుద్ధోన్మాదం రూపం మార్చుకుంటోంది కానీ తగ్గటం లేదు. పైగా విధ్వంస తీవ్రత, వ్యాప్తి, ప్రమాదస్థాయి అపరిమితంగా పెరిగిపోతోంది!

  2. రాజశేఖర రాజు
    జూలై 01, 2012

    “ప్రకృతితో ప్రారంభించిన పోరాటాన్ని అంతర్గత వైరుధ్యాలను ఉపశపింపజేసుకుని తిరిగి ఉన్నత స్ధాయిలో ప్రారంభించవలసిన కర్తవ్యం ఇంకా మిగిలే ఉంది.”

    ఇక్కడ ప్రకృతితో పోరాటం అనే భావన నాకు అంత సరిగా అర్థం కాలేదండి. ప్రకృతిని జయించడం, ప్రకృతిని తన అవసరాలకు వినియోగించుకోవడం అనేవి రెండూ విరుద్ధ భావనలనుకుంటాను. ప్రకృతిని జయించడం అనే భావనను ప్రస్తుతం పర్యావరణవాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లుంది.

    ప్రకృతిపై ఆధిపత్యం చలాయించుకోవాలని మనిషి ప్రయత్నించిన ప్రతి సందర్భంలోనూ ప్రకృతి దానికి వ్యతిరేకంగా తన ప్రభావం చూపిందని, కసి తీర్చుకుందని ఎంగెల్స్ “వానరుడు నరుడుగా మారిన క్రమంలో శ్రమ నిర్వహించిన పాత్ర” అనే రచనలో చెప్పాడు.

    ప్రకృతితో ప్రారంభించిన పోరాటాన్ని …. తిరిగి ఉన్నతస్థాయిలో ప్రారంభించవలసిన కర్తవ్యం మిగిలే ఉందనడంలో ఏదో అపశబ్దం ధ్వనిస్తున్నట్లుంది.

    “మానవుడు, తమలో తాము వైరుధ్యాన్ని రగుల్చుకుని ప్రకృతిని ధ్వంసిస్తూ స్వయం విధ్వంసానికి కూడా తెగించాడు.”

    అర్థవంతమైన వ్యక్తీకరణ…

    కానీ, ‘తమలో తాము’ అన్నప్పుడు వాక్యం బహువచన రూపంలోనే ముగించాలనుకుంటాను. మానవులు…. తెగించారు… అని వాక్యం ఉంటే సరిపోయేది. లేదా ‘తనలో తాను’ అని మారిస్తే అలా కూడా సరిపోతుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Connecting to %s

సమాచారం

This entry was posted on జూలై 01, 2012 by in కార్టూన్లు and tagged , , .

మార్గదర్శిని

తెలుగులో వ్యాఖ్యలు రాయాలా?

తెలుగులో వ్యాఖ్య రాయడానికి ఈ కింద లింక్ క్లిక్ చేయండి.

lekhini.org.

వ్యాఖ్యాతలు – వ్యాఖ్యానాలు

Thirupalu on రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన…
విశేఖర్ on విదేశీ ఇన్వెస్టర్లకు ప్రభుత్వ…
విశేఖర్ on రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన…
prem on విదేశీ ఇన్వెస్టర్లకు ప్రభుత్వ…
Nivas on రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన…
Thirupalu on విదేశీ ఇన్వెస్టర్లకు ప్రభుత్వ…
విశేఖర్ on విదేశీ ఇన్వెస్టర్లకు ప్రభుత్వ…
Thirupalu on విదేశీ ఇన్వెస్టర్లకు ప్రభుత్వ…
prem on విదేశీ ఇన్వెస్టర్లకు ప్రభుత్వ…
prem on ద్రవ్యోల్బణం తగ్గెను, వడ్డీ రే…
suresh on అవినీతిని సహించరట! -కార్ట…
విశేఖర్ on అవినీతిని సహించరట! -కార్ట…
suresh on అవినీతిని సహించరట! -కార్ట…
Praveen Nakkavanipal… on పిల్ల ఫిక్సింగ్ ముఠా అణచివేతలో…
moola on సాంకేతిక పురోగతితో ఫోటోగ్రఫీ ప…

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

మరో 546గురు చందాదార్లతో చేరండి

కూడలి

కేటగిరీలు

బ్లాగ్ గణాంకాలు

  • 397,753 సార్లు

క్యాలెండరు

జూలై 2012
సో మం బు గు శు
« జూన్   ఆగ »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

బ్లాగ్మిత్రులు

అనుసరించు

Get every new post delivered to your Inbox.

మరో 546గురు చందాదార్లతో చేరండి

%d bloggers like this: